3 సాహిత్య వ్యాసాలు – ధోరణులు
అసలు సిసలు పోస్ట్ మోడర్న్ కథలు: “మాయలాంతరు”ఒక రోజు ఉదయాన్నే నిద్ర లేచాక ముఖం చూసుకుందామని అద్దం ముందుకు వెళితే అక్కడ మీ ముఖానికి బదులు ఓ పురుగు కనిపిస్తుందనుకోండి. మీ పరిస్థితి ఏంటి? ఫ్రాంజ్ కాఫ్కా అనే ఫ్రెంచి రచయిత “మెటామార్ఫాసిస్” అనే కథను ఇలా మొదలుపెడతాడు. మనిషి రోజురోజుకు ఒంటరివాడై పోవడం (థీమ్ ఆఫ్ ఎలియనేషన్), నాగరికత పేరుతో మానవ జీవితంలో జరుగుతున్న విధ్వంసం ఇలాంటి రచనల్ని సృష్టించింది. రచయిత చెప్పవలసిన విషయం, అందుకు ఎంచుకున్న ప్రక్రియల సారం – రూపం (కంటెంట్ – ఫార్మ్) ఇరవయ్యో శతాబ్దపు చివరి దశకాలలో ముందెన్నడూలేని ప్రాముఖ్యాన్ని సంతరించుకున్నాయి. ఆంగ్ల సాహిత్యంలో వచ్చిన ప్రతి ప్రయోగం అనతికాలంలోనే తెలుగు సాహిత్యంలో మనం గమనించవచ్చు. అలాంటి ప్రక్రియా ప్రధానమైన శిల్పంగా పోస్ట్ మోడర్నిజమ్ ను చెప్పుకోవచ్చు. చెప్పడంలో వినూతనత్వం, చెప్పే విషయం సమకాలీనం కావడం రచయిత సామాజిక బాధ్యతను ఎత్తి చూపిస్తుంది. ఇలాంటి శిల్ప విన్యాసాల్లో కథావస్తువులను ఎంచుకుంటున్న రచయితలను తెలుగులో లెక్కబెడితే మన చేతివేళ్లు చాలా మిగిలిపోతాయి. ఆ కొద్దిమంది ప్రతిభావంతులైన ప్రభావశీల రచయితల్లో డాక్టర్ వి. చంద్రశేఖర రావు ఒకరు. ఇప్పటికి ఆయన మూడు కథా సంపుటాలను వెలువరించారు. “జీవని”, “లెనిన్ ప్లేస్”, “మాయలాంతరు”. ఇవికాక “ఐదు హంసలు” అనే నవలికను కూడా రచయిత ప్రచురించారు. వీటిల్లో “మాయలాంతరు” కథాసంపుటిని ఈ వ్యాసం పరిచయం చేస్తుంది.
ఈ కథా సంపుటి ప్రత్యేక లక్షణమేమిటంటే ఇందులోని కథలను మనం ఏకబిగిన చదవలేం. కథకూ కథకూ మధ్య కొన్ని రోజుల విరామం కావాలి. జీవితంలోని విషాదమంతా ఈ కథల్లోనే పోగుపడిందా అని భయంకూడా మనకేస్తుంది. భయం, నిరాశ, విషాదం కలగలిసిన వాతావరణంలో కథలన్నీ మనల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ఒక్కో కథ చదివిన వెంటనే కొద్ది రోజులపాటు ఆ దైన్యం మనల్ని వెంటాడుతుంది. ఆ దైన్యానికి కారణమెవరో మనకు తెలిసిపోతుంది. రాజ్యాన్నో, అధికారాన్నో, ప్రకృతినో ఏమీ చేయలేని నిస్సహాయత మనల్ని వెక్కిరిస్తుంది. దాంతో మన గుండె మరింత జారిపోయి దైన్యపు ఊబిలోపడి గిలగిల్లాడిపోతాం. సాహిత్యం కొనుక్కుని చదువుకుని ఇంత శ్రమపడడం అంత అవసరమా అని అడిగితే సమాధానం చెప్పలేం కాని, శీతాకాలంలో మంట దగ్గర కూర్చుని చలి కాచుకోవడం, వేసవికాలంలో చల్లటినీడలో సేదదీరాలనుకోవడం దివ్యమైన మానవానుభవాలు. అలాంటి మానవానుభవం పొందాలని కాంక్షించే సాహితీ మిత్రులంతా ఈ “మాయలాంతరు” కథలు చదవవచ్చు. జీవితం అనుభవాల నది ఒడ్డున సేదదీరవచ్చు. అనుభవించవచ్చు. సాహిత్యం నెరవేర్చే ఈ మహత్తర ప్రక్రియనే అరిస్టాటిల్ ‘కెథార్సిస్’ అన్నాడు. గొప్ప గొప్ప విషాదాంత నాటకాలన్నీ మనిషిలో దైన్యాన్ని క్షాళన చేస్తాయని తన “పొయెటిక్స్” లో చెప్తాడు.
ఈ “మాయలాంతరు” కథాసంపుటి ‘నీటి పిట్టల కథలు’ అనే కథతో ప్రారంభమవుతుంది. కథలో మాజిక్ రియలిజం వుంటుంది. మిస్టిసిజం వుంటుంది. పల్లెటూరిలో పొలాలు అమ్ముకుని పట్నం వచ్చి వ్యాపారం సాగించలేక అప్పుల ఊబిలో కూరుకుపోయిన రైతు కథనే మనకు పూర్తిగా అపరిచితమైన కొత్త కొల్లాజ్ టెక్నిక్ తో రచయిత చెప్తారు. ఒక విధంగా సామాన్య పాఠకునికి ఇదో మానసిక వ్యాయామం. చిన్న చిన్న వ్యాపార స్తులను వడ్డీ వ్యాపారులు కప్పల్ని పాములు మింగేసినట్టుగా మింగేయడం చూస్తాం. ఇంకా వైద్య వృత్తిలో దోపిడీని చూస్తాం. సాహిత్య విద్యార్థులమై తే కథలో కథను చెప్పడమెలానో పరిశీలిస్తాం. మత ఘర్షణల నేపథ్యంలో సాగిన ‘సలీం సుందర్ ప్రేమ కథ’ చైతన్య స్రవంతి ధోరణినీ, అబ్సర్డిటీని, ఎగ్జిస్టెన్షిలియలిజాన్ని దాటుకుని సర్రియలిస్టిక్ ధోరణిలో చెప్పిన ఆధునికానంతర కథగా చెప్పుకోవచ్చు. 2001 ప్రజాతంత్ర వార్షిక సాహిత్య ప్రత్యేక సంచికలో వచ్చినప్పుడే ‘కాకుల ఇల్లు’ కథ పెద్ద దుమారం రేపింది. దళిత నాయకుడిని హత్యచేసిన హంతకులు సాక్ష్యం చెప్పడానికి సాహసించిన వారినికూడా హత్య చేయడం ఈ కథావస్తువు. ఉత్తర తండ్రి పనిచేస్తున్న ఏనిమల్ లేబరేటరీలో పెంచుతున్న ఆవు మాయ. రెండు ఏనుగులంత ఆ ఆవు చిన్నారి ఉత్తర ఇంటలెక్చువల్ ఫ్రెండ్. ఇది గుండె లోతుల్ని తట్టే కథ. దళిత ఉద్యమంలో చురుకుగా పనిచేస్తున్న తల్లిదండ్రులను ఉద్యమానికి విడిచిపెట్టేసి తమ పొట్టచేత పట్టుకుని పట్ట ణాలలో ఉద్యోగాలు చూసుకునే పిల్లల కథ ‘చరిత్ర’. ఆ పిల్లలలో గిల్టీ కాన్షస్ నెస్ ను వివరంగా చిత్రించిన ఈ కథ కూడా టెక్నికల్ గందరగోళమే. ఇంకో కథ పేరు ‘చలికాలం ఒక మేఘం అంతే కథ!’. ఈ కథలో మేఘం దేనికి ప్రతీక – చావుకా? దు:ఖానికా? వ్యథాభరిత జీవితానికా? ముందు అనుకున్నట్టు గ్లూమీనెస్ మోసుకొచ్చే దిగులుకా? కనిపించిన ప్రతివారికీ వాళ్లవాళ్ల వెబ్ సైట్లను పచ్చబొట్లలాగా పొడిచేస్తుంటారీ కథలో. వికృతంగా పెరిగిపోతున్న వినియోగ తత్వాన్ని వెటకారంగా చెప్పడమే కథారచయిత ఉద్దేశం. మోహినీ అపార్ట్ మెంటులో ఒక గదిలో మరణించిన లోకేశ్ వున్నట్టు కథకుడు భ్రమ పడడంకూడా ఈ కథలో ఒక వెంటాడే జ్ఞాపకం (హాంటింగ్ మెమరీ).
ఈ కథా సంపుటిలోకెల్లా నాకు బాగా నచ్చిన కథ ‘నిప్పు పిట్ట, ఎర్ర కుందేలు మరియు అదృశ్యమౌతున్న జాతుల కథ’. చంద్రశేఖర రావు కథన శిల్పాన్ని, శైలిని, వర్ణించగలిగే, వివరించగలిగే మాటలు మనకు దొరికేది ఈ కథలోనే. పేజీ 66లో ఈ వాక్యాలు చదవండి: ‘చావుకు భయపెట్టే గుణం పోయింది. ఇప్పుడు అందరినీ భయపెట్టేది మానవ సంబంధాల ధ్వంసం. వ్యాధికన్నా, చావుకన్నా, ఎక్కువ భయం కలిగించేవి మనుషుల్లోని ఎడారులు’. జ్ఞాపకం వుండడం వల్లనే ఈ బాధలన్నీ, అందుకని కొన్ని విషయాలు జ్ఞాపకం లేకపోతే ఎంతో బాగుంటుందనుకుంటాం. మరికొన్ని విషయాలు మరిచిపోతే మంచిదనుకుంటాం. ఇందులో కథకుడితోపాటు మోహినికూడా ఎలా స్పందిస్తున్నారో చూడండి: ‘జ్ఞాపకాల్ని పోగొట్టుకోవడమే! ఎందుకో క్షణంపాటు జలదరింపులా తోచింది’. ‘నాకీ జ్ఞాపకాన్ని పోగొట్టుకోవడం ఇష్టం లేదు. ఈ మరణం, వేదన, ఆందోళన, భయం, కోరిక, పోరాటం నాకు సైనికురాలుగా జీవించడమే ఇష్టం‘. p.68 మోహన సుందరం మాటల్ని కథకుడు ‘సుధీర్ఘమైన దు:ఖగాథ’తో పోలుస్తాడు (పేజీ 70). ఈ పదబంధాన్ని కథారచయితకు కూడా అన్వయించవచ్చు.
‘అపరిచిత భాషలు’ అనే మరో కథ వుంది. నిశ్శబ్దం కూడా ఒక పనిష్మెంట్ లాంటిదేనని ఒప్పుకుని తీరుతాము. ఊరవతల వీధి చివరి ఇల్లు, ఆఫీసు ఉద్యోగంతో అలసిసొలసి ఇంటికి చేరిన భర్త కూడా మాట్లాడడు. ఇది కూడా డొమెస్టిక్ వయొలెన్స్ గా గుర్తిస్తాం. ఐదారేళ్ల కిందట నల్గొండ జిల్లాలో పౌరహక్కుల ఉద్యమ కార్యకర్త బెల్లి లలితను ‘ఎవరో’ అతి కిరాతకంగా చంపేశారు. ఎంత దారుణమంటే శరీరాన్ని పదమూడు ముక్కలుగా కోసి లలితక్క ఊరిలోనే ఒక్కో శరీర భాగం ఒక్కోచోట పడేశారు. (ఆ తరువాత కొద్ది మాసాలకే ఎలిమినేటి మాధవరెడ్డిని అప్పటి నక్సలైట్లు ప్రతీకారంగా హతమార్చారని అప్పట్లో అంతా గొణుక్కునేవారు). ఈ కిరాతకంపై స్పందనే ‘మాయలాంతరు’ కథగా మనం భావించవచ్చు. దళిత రచయిత పాత్రను ఎంతో చక్కగా తీర్చిదిద్దారు. ఈ కథలన్నీ చదివాక మనకు అనిపించేది రచయిత ఎంతో పొదుపుగా సంభాషణలు వాడుతుంటారని. సినిమాల్లో రీళ్లమాదిరిగా, దృశ్యమాలగా సంఘటన తర్వాత సంఘటన జరిగిపోతుంటాయి. మనోఫలకంపై ఆ కథంతా ఒక రీలులాగా తిరుగుతుంది. భయంగొలిపే నిశ్శబ్దం నేపథ్య సంగీతమవుతుంది. కిందటేడాది నోబెల్ బహుమానం పొందిన హెరాల్డ్ పింటర్ ను ఈ బీభత్స రసం సృష్టించేవానిగా కీర్తిస్తారు. మెనేస్ (బీభత్సం అని తెలుగులో అనొచ్చా?) ను అద్భుతంగా ఆవిష్కరిస్తాడని పింటర్ రచనాశైలిని ‘పింటారెస్క్’ అని పిలుస్తారు. కానీ, అతడు మన చంద్రశేఖరరావు కథలను చదివితే ఏమనుకుంటాడో? ఈ కథనాల్లో కథ సాఫీగా సాగదు. సంఘటనలు కూడా ఒక క్రమంలో వుండవు. శకలాలుగా కథాంశం పాఠకుని చేరుతుంది. వాటన్నింటిని ఓపిగ్గా బ్రెయిన్ టీజర్ పజిల్ లాగా ఒక క్రమంలో పేరిస్తేనే పాఠకునికి సంపూర్ణ చిత్రం ఆవిష్కృ తమయ్యేది.
254 పేజీలు, 21 కథలతో “మాయలాంతరు” పుస్తకాన్ని 50 రూపాయలకే పొందవచ్చు. ప్రచురణకర్త వివరాలు లేని ఈ పుస్తకంలో పోస్ట్ మోడర్న్ కథలతోపాటు ”చంద్రశేఖరరావు కథలు, నేపథ్యం, నిర్మాణం” అన్న బి. తిరుపతిరావు వ్యాసాన్ని కూడా చదవొచ్చు. పూర్తిగా ప్రాచ్య సాహిత్యపు ప్రభావంతో రాసిన తెలుగు కథలు కావడం వల్ల నా ఈ వ్యాసంలో చాలా ఆంగ్ల పదాలు అనివార్యంగా దొర్లాయి. కాని కథల్లో మాత్రం రచయిత ఎంతో నిగ్రహంగా తెలుగు పదాలనే వాడడం విశేషం. మరి మీరూ వీటిని చదువుతారుగా!
2తెలుగు ఆధునికోత్తరవాదాలు- ప్రొ. ముదిగొండ శివప్రసాద్ 14/01/2013
ఆధునికోత్తరఅంటే -Post Modern అని అర్థం. దాదాపు 1975 ప్రాంతంలో ఆధునిక భావ అభ్యుదయకవిత్వోద్యమాలు ముగిసి ఆధునికోత్తర ఉద్యమాలు వాదాలు మొదలైనాయని విశే్లషకులుఅభిప్రాయపడుతున్నారు. ఉద్యమం- వాదం, ధోరణి ఈ మూడు సమానార్థకాలు కావు. సమానధర్మమూ లేదు. ఉద్యమంను ఆంగ్లంలో మూవ్‌మెంట్ అనే పదానికి సమానార్థకంగావాడుతున్నారు. వాదం అంటే ‘‘ఇజం’’ ధోరణి అంటే ట్రెండ్. ఉద్యమం దీర్ఘకాలికంగాసాగితే మహాకావ్యాలు ఖండకావ్యాలు కూడా వస్తాయి- ట్రెండ్‌లో గీతాలు, లఘుకవితలు మాత్రమే వస్తాయి. ‘ఇజం’ అనేదిఒక సిద్ధాంతం. ఇది ప్రాతిపదిక. అంటేభిన్న ఉద్యమాల వెనుక ఏదో ఒక ఇజం ఉంటుంది. అంటే మైనారిటీవాదం – ‘దళిత’వాదంస్ర్తివాదం, ప్రాంతీయవాదం, జాతీయవాదం ఉప ప్రాంతీయ వాదం, సామ్యవాదం ఇలా.. ఈవాదాలన్నీ ఉద్యమ స్థాయికి చేరకపోవచ్చు. ప్రధానంగా సామ్యవాదం, జాతీయోద్యమం, ప్రాంతీయోద్యమం, ఉప ప్రాంతీయోద్యమం రాజకీయమైనవి. అధివాస్తవికతావాదం, అనుభూతి వాదం, మాజిక్ రియలిజం వంటివి కొన్ని ధోరణులు, కొన్ని చిత్రకళ నుండిదిగుమతి చేసుకున్నవి. అంటే కొన్ని వాదాలు ధోరణులుగా మిగిలిపోయాయేకానిఉద్యమస్థాయికి చేరలేదని తాత్పర్యం. ఉదాహరణకు దిగంబర కవిత్వం చూడండి. 1960వ ఐదారుగురు యాంగ్రీ యంగ్‌మెన్ సమాజాన్ని తిడుతూ కవిత్వం వ్రాయటంమొదలుపెట్టారు. అందులో క్రమంగా తిట్ల పంచాంగం ఎక్కువైంది.జాతీయోద్యమంరాజకీయమైనది. అది లక్ష్యసాధన తర్వాత సహజ పద్ధతిలో సమాప్తమయింది. ఒక కారణంఎందుకు పుట్టిందో అది కావ్యం తర్వాత ముగుస్తుంది. దిగంబర కవిత్వానికిఅసంతృప్తియే కారణం. వారు చెప్పిన సామాజిక రుగ్మతలు నేటికీ ఉన్నాయి. ఐనాప్రొటెస్ట్ చేయటంతో తమ పని అయిపోయిందని అనుకున్నారు. ఈ సిద్ధాంతాన్నిగమనించాలి. నేడు కొన్ని ముఖ్యమైన ఉద్యమాలు నడుస్తున్నాయి.
క్రైస్తవ మత ప్రచారోద్యమం: ఇది దళితవాదం కాదు. కేవల మతవాదం. కేవలం జీసస్మాత్రమే మోక్షాన్ని ఇవ్వగలడు అనే విశ్వవ్యాప్తమైన ఒక మతం. దీని ప్రచారానికిఎన్నో గీతాలు కావ్యాలు పుట్టాయి. మహాకావ్యాలు, లఘుకావ్యాలు వస్తే ఉద్యమతీవ్రత వ్యక్తమవుతుంది. క్రీస్తు చరిత్ర వంటి గ్రంథాలను ఈ సందర్భంగాఉదహరించవచ్చు.
శాంతివాదం: ఇది మతవాదం కాదు. అంటే క్రీస్తులోని శాంతి, బుద్ధునిలోని శాంతి, గాంధీలోని అహింస వాటి భావనలను మాత్రమే తీసుకున్నవాదం.
బౌద్ధవాదం: అంబేద్కర్ చివరి దశలో బౌద్ధ మతం స్వీకరించారు. ఈ కారణం చేత నవబౌద్ధవాదం, దళిత వాదం ఒకటేననే భ్రమ కలుగుతున్నది- కాని అది సరికాదు. బౌద్ధంఒక క్షణిక వాదాన్ని ప్రతిపాదించింది. వైదిక హింసాత్మక యజ్ఞాలపై ఒకతిరుగుబాటు చేసింది. బుద్ధుని శాంతి, బుద్ధుని కుల రహిత సమాజం, బుద్ధునిసమకాలీన వైదిక సమాజ నిరసన, ఈ మూడూ మూడు వేర్వేరు అంశాలు. ఈ భేదాన్నిస్పష్టంగా గమనించాలి.
వైదిక పునరుజ్జీవనోద్యమం: ఇది నేడు తీవ్ర స్థాయిలో ఉంది. పరిపూర్ణానంద, సుందర చైతన్య, చిన జీయర్‌స్వామి వంటి వారి ప్రసంగాలకు వేల నుండి లక్షలసంఖ్యలో ప్రజలు హాజరుకావటం చూస్తున్నాము. ఈ విధంగా ఈ పునరుజ్జీవనోద్యమంసాహిత్యంపై ప్రభావాన్ని చూపుతుంది.
మైనారిటీవాదం: అంటే ఇండియాలో ముస్లిముల శ్రేయస్సు కోసం వ్రాసే కవిత్వం.కాశ్మీరులో హిందువులు మైనారిటీలు. కాని మైనారిటీ కవిత్వం అంటే ‘ముస్లింకవిత్వం’ అనే అర్థమే స్థిరపడింది.
ఇవికాకుండా ఇంకా అవకాశవాదం (ఆపర్చునిజం), శాడిజం (పాశవికానందవాదం), నిహిలిజం (నరద్వేష వాదం), దైవీకరణవాదం, అతి మానసవాదం (అరవిందుడు) ఇలాంటిఅంశాలపై కూడా విస్తృతంగా విశే్లషణం జరుగవలసి ఉంది.
కొన్ని సాహిత్య ప్రక్రియలను కొందరు ఉద్యమస్ఫూర్తితో వ్యాప్తి చేస్తున్నారు.వచన ఛందస్సు (ఫ్రీవెర్స్)ను మాదిరాజు రంగారావు, శీలావీర్రాజు, కుందుర్తివంటివారు ఉద్యమస్ఫూర్తితో ప్రచారం చేశారు. అలాగే పద్య (అక్షర- మాత్రం)గణఛందస్సును కొందరు ఉద్యమ స్ఫూర్తితో పునరుద్ధరిస్తున్నారు. అంటే ఒకసిద్ధాంతం కాక ఛందోప్రక్రియయే ఉద్యమ శీలాన్ని సంతరించుకున్నదని అర్థం. అంటేపద్య ఛందస్సులో మాడు పగిలే మూడు శతకాలు (త్రిపురనేని మహారధి) రాజకీయకవిత్వం వ్రాశారు. అదే పద్య ఛందస్సులో అక్కిరాజు సుందరరామకృష్ణ అధిక్షేపలఘుశతకాలూ వ్రాశారు. అంటే దిగంబర కవులు వచన పద్యం (ఫ్రీవెర్స్)లో చూపిన ‘యాంగ్రీ యంగ్‌మెన్’ లక్షణం అక్కిరాజు సుందరరామకృష్ణ పద్య ఛందస్సులోచూపాడు. ఇలాంటివారు మరికొందరు ఉన్నారు. అలాగే ఆనాడు మినీ కవిత, నేడు నానీకవిత రూపపరంగా వ్యాప్తి చెందింది.
భక్తి ఉద్యమం: 20వ శతాబ్దంలో మళ్లీ భక్తి ఒక ఉద్యమంగా వ్యాపించటం గమనార్హం.ఇవి హిందూ ధర్మప్రచారం అని భావించకూడదు. మానవుడు ఆర్తితో అభిలాషతోవాంఛాహితమైన దృష్టితో నిస్సహాయతలో భగవంతుణ్ణి ఆశ్రయిస్తున్నాడు. ఆ దేవుడువెంకన్న కావచ్చు, అయ్యప్ప కావచ్చు, ఏసుప్రభువూ కావచ్చు. నిర్వేదం..పారిశ్రామికీకరణ, నగర జీవనం, సంగణిక యంత్ర అంతర్జాలం (కంప్యూటర్నెట్‌వర్క్) సృష్టించిన ఒత్తిడి (డఆళఒఒ) మానవ నిర్వేదానికిదారితీస్తున్నది. సమాజంలో రాజకీయ అవినీతి, వాతావరణ కాలుష్యం వంటివి మానవమస్తిష్కాన్ని ప్రభావితం చేస్తున్నాయి. ఇవి కవిత్వంలో కథలో వ్యాసంలోప్రతిబింబిస్తున్నాయి. ఈ నిర్వేదం- నిరసన (ప్రొటెస్ట్) ఉద్యమ స్థాయికిచేరింది. ఇక్కడ మరో అంశం గమనించాలి. కవి నిరసన తెలుపుతున్నాడు, పాఠకుడుచదివి ఆనందిస్తున్నాడు. అలాంటి ఇద్దరి బాధ్యతలూ తీరిపోయినట్టుభావిస్తున్నారు. అంటే ఇక నిరసన కవిత్వం- అటు సృజనకర్తను ఇటు పాఠకుణ్ణి కూడాఆచరణ దిశగా తీసుకొనిపోతే వాపోతున్నది ఎందుకని?
‘అభివ్యక్తి అందంగా ఉంది. బలంగానూ ఉంది’ అని వ్యాఖ్యానించి వదిలేస్తున్నారు. ఎందుకని?? ఎప్పుడైనా ఆలోచించారా?
3 సాహిత్యవాదాలు.. సామాజిక వైషమ్యాలు- కొండ్రెడ్డి వెంకటేశ్వరరెడ్డి, సెల్: 9848774243
29/04/2013
…………..
నేటి సమాజంలో కాలానుక్రమంగా ఉద్భవిస్తున్న సరికొత్త సమస్యలను, అవి ఏ విధంగావర్ణాల్లో వర్గాల్లో విషాన్ని విరజిమ్ముతుంది, మనుషులు పరారుూకరణ ఏవిధంగా చెందుతుంది పసికట్టే లోతుల్లోకి కవులు, రచయితలు వెళ్లడం లేదు. వస్తువులుదర్శించే కోణాల్లో ఇసుమంత మార్పులేదు. దాని విస్ఫోటనంలో విచ్చుకుంటున్నపాపపంకిలకోణాల్ని పట్టుకోవడం లేదు. శ్రమ దోపిడిని గూర్చి ఎక్కువగా కవులు, రచయితలుమాట్లాడుతుంటారు. అన్నివర్గాల్లోకి ప్రవహించిన బూర్జువా భావజాలాన్ని, దోపిడీ తత్వాన్ని పెత్తనందారీ విధానాన్ని నిజాయితీ లేమినీ, సాహిత్యవర్గాల్లో ఈదులాడే కవులు, రచయితలు పసిగట్టలేకపోతున్నారు.
…………..
కళ ప్రజల కోసం. సాహిత్యం ప్రజల ఆయుధం. మానవీయతతో కూడిన వర్గ, వర్ణ, కుల, మతరహితమైన ధ్యేయంగా సాహిత్యం వెలువడాలనేది నేటి సాహిత్య దృక్పధం. ఇలాంటిలక్ష్యంతో మార్గాన్ని అనే్వషిస్తూ ముందుకుపోవలసిన సాహిత్యం సమాజాన్ని ‘కొత్తచూపు’తో అనే్వషిస్తున్న తరుణంలో కవిత్వంలో వివిధ వాదాలుపుట్టుకొచ్చాయి. మత, రాజకీయ కవిత్వోద్యమాల తరువాత ‘జెండర్’ ప్రాతిపదిగ్గాస్ర్తివాదం, కులాలు ప్రాతిపదిగ్గా దళితవాదం, బి.సి వాదం, మైనారిటీ వాదం, అస్తిత్వవాదం; ప్రాంతీయవాదం (ఏదైనా ఒక ప్రాంతపు నిర్లక్ష్యాన్ని వివక్షతనూఎత్తిచూపుతూ వ్యక్తీకరించే కవిత్వం)గా పురుడోసుకున్నాయి. ఈ వాదాలన్నీవారివారి మూలాలను తవ్వుకుంటూ వారి ఆవేదనలను, అనుభవాలను దోపిడీకి గురవుతున్నవైనాన్ని వ్యక్తీకరించుకుంటూ ముందుకొచ్చాయి. దోపిడీని నిలువరించే పోరాటపటిమను, ఆయావర్గాల్లో చైతన్యపరచే బంధన శక్తిగా సాహిత్యం రూపుదాల్చింది.దీని ఫలితంగా సొంత గొంతుకలతో, వో కొత్త చూపుతో, తిరుగుబాటు బావుటాఎగురవేస్తూ, ఆర్థిక రాజకీయ పురోగామి దిశగా పయనించే మార్గానే్వషణతో, ఆయావాదాలు ఎంతో విజయాన్ని సాధించాయనే చెప్పవచ్చు. దోపిడిని నిలువరించేప్రతిఘటనా కంచెలు నాటాయనే ఊహించవచ్చు. సామాజిక నూతన మలుపులకు ఈ వాదాలుదోహదపడినాయనడంలో సందేహం లేదు. తొలిదొల్తగా వాదాల్లో పుట్టిన కవుల నిబద్ధత, నిజాయితీ, సంఘటిత శక్తి, ప్రతిఘటనా పటిమ, సృజనాత్మకత, విస్తృతి, గొప్పకళాభివ్యక్తితో కూడుకొని ఎంతో నిజాయితీగా పరిఢవిల్లిందనే చెప్పొచ్చు.రానురాను ఈ స్ఫూర్తి అన్ని వాదాల్లోను మసకబారుతూ, వ్యక్తిస్వార్థం మూసలోకిజారుతూ, కుహనా మేధావి వర్గాల స్వార్థపరత్వానికి తాళంవేస్తూ, సాగిపోతున్నతీరును ఆయా వర్గాల కవులు, రచయితలు గమనించి పునర్ మూల్యాంకనం చేసుకోవలసినఅవసరం ఎంతైనావుంది. వర్ణాగ్రహాలు, జెండర్ ఆగ్రహాలు ధర్మాగ్రహంగా కనిపించడంలేదు. అరిగిపోయిన పాత రికార్డును తిరిగి తిరిగి గరగరల మధ్యవినిపించినట్లుగానే వుంటుంది. అధిక్షేప ధోరణిలో కొత్తదనం కనిపించడం లేదు.కొత్తకోణం వినిపించడం లేదు. గత 20 సంవత్సరాల ముచ్చట్లే తిప్పితిప్పిరాస్తూ, కలాలను అరగదీస్తూ కులాల పోరు రెచ్చగొట్టినట్టుగా లింగ భేదాలనుపడకటింటి సుఖాలకు ముడివెడుతూ దాడులు మొదలెడుతూ బతకమనే సూచనలే బహుళంగాకనిపిస్తున్నాయి. నేటి సమాజంలో కాలానుక్రమంగా ఉద్భవిస్తున్న సరికొత్తసమస్యలను, అవి ఏ విధంగా వర్ణాల్లో వర్గాల్లో విషాన్ని విరజిమ్ముతున్నదీ, మనుషులు పరారుూకరణ ఏవిధంగా చెందుతుంది పసికట్టే లోతుల్లోకి కవులు, రచయితలువెళ్లడం లేదు. వస్తువులు దర్శించే కోణాల్లో ఇసుమంత మార్పులేదు. దానివిస్ఫోటనంలో విచ్చుకుంటున్న పాప పంకిల కోణాల్ని పట్టుకోవడం లేదు. శ్రమదోపిడిని గూర్చి ఎక్కువగా కవులు, రచయితలు మాట్లాడుతుంటారు. ప్రపంచీకరణఫలితంగా, కార్పొరేట్ వ్యవస్థల వాణిజ్య విధానాల దోపిడికి అనుగుణ్యంగాఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియాల ప్రసారాల ఫలితంగా తరతమ భేదంలేకుండాఅన్నివర్గాల్లోకి ప్రవహించిన బూర్జువా భావజాలాన్ని, దోపిడీ తత్వాన్నిపెత్తందారీ విధానాన్ని నిజాయితీ లేమినీ, సాహిత్యవర్గాల్లో ఈదులాడే కవులు, రచయితలు పసిగట్టలేకపోతున్నారు. వీరంతా ఆయావర్గాల్లో కమిటెడ్ కవులుగానేమిగిలిపోతూ మనిషిలోకి దూరుతున్న దుష్ట్భావజాలాన్ని ఖండించలేకపోతున్నారు.కొత్త కలలు కనాలనే తెగింపుతో, పాత కలల అపోహలకు అడ్డుకట్టలువేయలేకపోతున్నారు. ఏనాటినుండో అరిగిపోయిన విరిగిపోయిన శిథిలావస్థలో వున్నభావజాలానికి తానతందాన అంటున్నారు. ఏ కవితా వాదంలో అనంతానే్వషణకు తెరలేపారు? పునర్ మూల్యాంకనం గూర్చి చర్చలు జరిపారు? నిర్ణయాలు తీసుకున్న దాఖలాలుఏవైనావున్నాయా? ఒక్కసారి కవులు, రచయితలు ఆలోచించాలి. ఈ వాదాలు పుట్టినప్పటిసామాజిక పరిస్థితులు వేరు. ఇప్పటి సామాజిక పరిస్థితులు వేరు. కుల వృత్తులునశించిపోయాయి. కులాలకు అడ్డుగా గీయబడిన లక్ష్మణరేఖలు చెరిగిపోయాయి.అంటరానితనం దాదాపు అంతరించిపోయిందనే చెప్పొచ్చు. అయితే కులాలు, మతాల మధ్యమాత్రం సజీవంగా ఆర్థికపరంగా అన్నీవున్నాయ్ అనడం సర్వసత్యం. ప్రతి మనిషిలోనూఓ వేటగాడు మాటువేసి వున్నాడు. ఆర్థిక వేటకు విల్లంబులుఎక్కుబెట్టేవున్నాడు. ఎవడి పరిధిలో ఎవడి స్తోమతను బట్టివాడు దోపిడీకిసిద్ధపడుతూనే వున్నాడు. ప్రభుత్వాలు పెట్టే ప్రలోభాలకు అనుగుణ్యంగాప్రభుత్వ నిధులను దోచుకోడానికి సంసిద్ధవౌతూనే వున్నారు. ఈ జ్ఞానంఎక్కడనుంచి ఇంపోర్టవుతుందో, పై ప్రలోభాలకు నోళ్ళు తెరచుకొని అట్టడుగువర్గాలు దోపిడీదార్ల కొమ్ము ఎందుకు కాస్తున్నారో, ఇసుమంత ఆలోచించాల్సినఅవసరం లేదంటారా? ప్రశే్న మేనిఫెస్టోగా, ధిక్కారమే ఆయుధంగా, వర్గ చైతన్యమేసాహిత్య వాహికగా నమ్మిన కవులు, రచయితలు వారు సాగిస్తున్న లోతైన కృషి ఏమిటి? వారి సరికొత్త తీర్పు ఏమిటి? కుల వృత్తుల్లో మూలాలైన వారింకామనగలుగుతున్నారా? ప్రతి కులానికీ ప్రతీకలుగా చెప్పుకునే వస్తువులు వారికులాల చేతుల్లో ఈనాటికి పదిలంగా వున్నాయా? వాదాల్లో కరగి రాస్తున్న కవులు, రచయితలు ఆలోచిస్తున్నారా? సంప్రదాయవాదాన్ని తెగడడం మొదలెట్టిన సాహిత్యంలో వివిధ వాదాల వారంతావారివారి వాదాల్ని చైతన్యవంతంచేసి జనంలో ‘‘అవేర్‌నెస్’’తెచ్చి, కొన్నిపోరాటాల్లో సామాజిక ప్రతిఘటనల్లో నెగ్గుకొచ్చిన తరువాత వారు రేకెత్తించినవాదాల్ని మరచిపోయి, వారే నయా బ్రాహ్మణవాదులుగా మారిపోవడం ఎంతటిదురదృష్టకరం. వారి అవకాశవాద ధోరణులను ఎంతవరకు ఎండగట్టడం జరుగుతుంది? సాహిత్యాన్ని వ్యాపారం చేయడం, అధికారానికి తాకట్టుపెట్టడం ధనానికిదాసోహమనడం, పాలకవర్గ రాజకీయపు వలల్లో చిక్కుకోవడమేకాకుండా సంబంధిత వాదాన్నిమోస్తున్నట్లే కవిత్వం రాయడం, జనాన్ని నమ్మించ ప్రయత్నించడం ఒక జాతికిచేస్తున్న ద్రోహంకాదా? జెండర్, కులమత ప్రాతిపదికమీద ఏర్పడ్డ సాహిత్య ముఠాలన్నీ కవిత్వపు కమతాలైవారిని వారు అభినందించుకుంటూ ప్రజలకు లేని ప్రత్యేక సంస్కృతి తమకు ఉన్నదనేగుర్తింపు పొందేందుకు ప్రయత్నిస్తుంటారు. వ్యవస్థీకృత నీతికి తిలోదకాలిచ్చిఅస్తిత్వవాదులంతా ఎవరి నీతిని వారు ఏర్పాటుచేసుకుంటూ మనిషి అసలుసారాంశాన్ని విస్మరిస్తుంటారు. నిబద్ధత లేని స్వేచ్ఛను కోరుకుంటుంటారు.అట్లే ప్రాంతీయవాదులు ప్రాంతీయంగా తలెత్తే సమస్యల పరిష్కారం కోరడంకంటేప్రాంతీయ విభజనను రాజకీయ పోరాటంగా భావిస్తుంటారు. ప్రజల ఇష్టాయష్టాలువారికి పట్టవు. ప్రాంతీయవాదాన్ని ఉద్యమరూపంలోకి తెచ్చి జనాల్లో ఆశలురగిల్చే సాహిత్యం సృష్టిస్తుంటారు. వారు కోరుకున్న ఆశించిన స్వఫలితాలుప్రభుత్వపరంగా దక్కితే ఉద్యమం నీరుగార్చి పారిపోతుంటారు. చివరిదాకా నిలబడిఉద్యమాన్ని నిలబెట్టే శ్రమ, పట్టుదల ఈ వాదాల్లో అంతగా కనిపించదు. అందుకేఅనేకసార్లు ప్రాంతీయ వాదాలు పాలపొంగులా ఎగసి అంతలోనే నీళ్ళు చల్లినట్లుచల్లారిపోతుంటాయి. ఉద్యమంలో మాత్రం అనె్నం పునె్నం ఎరుగని అమాయకులుబలైపోతుంటారు. వారికి ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా ఇచ్చి చేతులుదులుపుకుంటుంటుంది.
ఏ సాహిత్యవాదమైనా మారే కాలంతోపాటు మార్పును ఆహ్వానించాల్సిందే. వేదాల్లాగావాదాలు పూజింపబడతాయనే వాదం సరికాదు. నీరుగార్చే ఉద్యమాల్నిత్రోసిపుచ్చినట్లే నిలకడ లేని వాదాలనుకూడ త్రోసిపుచ్చే దశ వస్తుంది.సాహిత్య వాదాల్లోకి మతం, రాజకీయం ప్రవేశించి యదార్థాల కళ్ళుగప్పి వ్యక్తిస్వార్థం రాజ్యమేలడం సహించరానిదిగా భావించాలి.
No comments:
Post a Comment