కపిల రాంకుమార్|| ''కవిత్వంతో సమాజం మారదు" ||ఇంటర్వ్యూ ||
సరస్వతీ పుత్ర ''పుట్టపర్తి నారాయణాచార్యులతో'' ''శశిశ్రీ'' ఇంటర్వ్యూ 10-10-1988 కడపలో వారింట్లో ఆంగ్ల సాహిత్యంలో తనదైన ప్రత్యేక శైలి, భావ గంభీరత కల : ది ప్రాఫెట్ కర్త ఖలీల్ జీబ్రాన్ పుస్తకం పఠిస్తున్న పుటపర్తి ఇంటర్వ్యూ వివరాలు:
* ఖలీల్ జీబ్రాన్ ప్రాఫెట్ గురించి నాలుగు వివరాలు
- ది. ప్రాఫెట్ లో 'ది సిటీ ఆఫ్ ది డెడ్' లో జీబ్రాన్ సంతానం గురించి వ్రాసిన వాక్యాలు గొప్పవి, జీబ్రాన్‌ది సులభతరమైన శైలె. భావం చాల గంభీరంగా వుంటుంది.
' May you give them your love but not your thoughts
for they have their own thoughts
you may house their bodies but not their souls
for their souls dwell in house of tomorrow
which you can not visit, not even in your dreams. '
*భావ వ్యక్తీకరణకు భాషకు గల సంబంధం గురించి జీబ్రాన్‌ను దృష్టిలో పెట్టుకొని మీ అభిప్రాయం చెప్తారా?
-భాష కంటే భావం గాంభీర్యమే కోరదగినది. భాషయొక్క బరువు భావాన్ని క్లిష్టం చేస్తుంది. సాధారణంగా భావం గంభీరంగా వ్యక్తీకరింపలేని వారే భాషను ఆలంబనంగా తీసుకూంటారు. అలాగని భాషను ఇగ్నోర్ (నిర్లక్ష్యం) చేయమని నా భావం కాదు. దానికొక మితి వుందని మాత్రం చెబుతున్నారు.
* ఖలీల్ జీబ్రాన్ సాహిత్యంలో తాత్విక దృష్టి కోణం ఏమిటి?
- మార్క్సిజానికి పూర్వ స్థితే ఖలీల్ జీబ్రాన్ సాహిత్యం. అంటే మార్క్స్ రంగంలోకి ప్రవేశించి సామ్యవాదాన్ని శాస్త్రంగా చేసినాడు. ఒక పద్ధతి ప్రకారం దాన్ని పొందటానికి కావాల్సిన మార్గాలు చెబుతూ పోయాడు. దాన్నే శాస్త్రీకరణమంటారు. ఖలీల్ జీబ్రాన్‌లో అవే భావాలున్నాయి. అయితే దాన్ని శాస్త్రీయంగా చెప్పే అంతస్తుకు ఆయన యెదగలేదు. జీబ్రాన్ ముఖ్యంగా క్వి, తర్వాతనే తాత్వికుడు. మార్క్స్ కఠోరమైన మేధావి. పరమ తాత్వికుడు.
* ఆంగ్ల సాహిత్యంలో జీబ్రాన్ రాసిన మరో కవి ఎవరైన వున్నారా?
- ఆంగ్లంలో ఈ రీతిలో రాసిన వారు నా దృష్టికి రాలేదు. రవీంద్రనాథ్ ఠాగూర్ ఆ త్రోవలో పోయారే కాని, భాష కాస్త బరువే! జీబ్రాన్ సాహిత్యం చదువుతుంటే బైబిల్ చదువుతున్నట్టేవుంటుంది. జీబ్రాన్ సాహిత్యం ద్వారా ఎన్నో సంప్రదాయాలు మన దృష్టికి వస్తాయి.
*జీబ్రాన్ సాహిత్యాన్ని సమాజం ఏ విధంగా రిసీవ్ చేసుకుంది?
-'' ది ప్రాఫెట్ '' పుస్తకం వెలుగులోకి వచ్చకే జీబ్రాన్‌ను ప్రజలు గుర్తించారు, ఆదరించారు. అందమైన, స్వచ్ఛమైన స్వతంత్ర భాఆలు జీబ్రాన్ ప్రతి పేజీ నుంచి గ్రహించవచ్చు. శైలి కోసం జీబ్రాన్ పాకులాడింది లేదు. ఆ కారణంగానే ఆయన సాహిత్యం ప్రపంచంలోని ఇరవై భాషలలోనికి అనువాదమయింది. ఆయన గీసిన చిత్రాలు ప్రపంచంలోని ప్రసిద్ధ ప్రాంతాల్లో, ప్రదర్శన శాలల్లో వున్నాయి. తన కవిత్వాని తానే చిత్రాలు గీసుకునే గుణం హండి మహాదేవ వర్మకు వుంది. ఆమె హిందీలో ఛాయా వాదానికి నాయకురాలు.
*కవిత్వానికి శాశ్వతగుణం అవసరమా?
-అవసరమా, కాదా అనేది కాదు ప్రశ్న! కవి ఏదో ఒక పాలు తాత్వికుడుగా వుంటాడు. వాని తాతిక దృష్టి ఇంకొకక్రు అనుకునేదిగా ఉండకపోవచ్చు. కాని దానికే వశుడైపోడు. సౌందర్యదృష్టి ప్రధానంగా వుంటుంది. నీడలాగ తాత్విక దృష్టి వెన్నాడుతూ వుంటుంది. ఈ ప్రశ్న ఆనంద వర్థనుడు ఎన్నడో వేసుకున్నాడు (ఆయన ధ్వని వాదమును అమలులోకి తెచ్చిన గొప్ప అలంకారికుడు - కాశ్మీరీ దేశస్తుడు) అతడు ' ధ్వన్యాలోకం ' రాసిన నాటినుంచి, అలంకార శాస్త్రంలో అదే సిద్ధాంతమైపోయింది. గుడ్డిగా నీతిని చెప్పడం కవిత్వం కాదని నిక్కచ్చిగా ఖండించేశారు. కనుక తాత్వికత అనే పదం ఈ అర్థంలోకాదు వాడేది. ఇలావుంటే; ప్రపంచంలో బావుంటుందనే భావం, ప్రతీ రచయతకు ఏదో ఒక మోతాదులో వుంటుంది. దాన్నే తాత్వికతగా చెప్తాము. ఖలీల్ జీబ్రాన్ ప్రాఫెట్ లో పెళ్ళి గురించి చెబుతూ - ఇదే భావాన్ని వెప్పాడు. అరవిందులు ఊర్వశి అనే కావ్యంలో యిటువంటి భావాలే ఊర్వశినోట పలికిస్తాడు.
* కవితత్వంలో చెప్పే మాటలకు, చేతకు సామ్యం వుండాలా?
- ఒకప్పుడు ఆ విధంగా బతికేవారు. ఈ నాడు ఆ పద్ధతులు చాల మటుకు మారిఫ్యాయి. దీనికి కారణాలు సామాజికంగా, ఆర్థికంగా ఎన్నోవున్నాయి. సమాజం మటుకు యెలావున్నా మనిషి మనిషిగా నిలవవలెనని ఆదర్శవాదులు అంటారు. నేను అలా అనుకోను. మనిషి పరిస్థితులు తయారుచేసే బొమ్మ. అందుచేత తన బలహీనతలు కానీ, దౌర్బల్యాలు కానీ ఒప్పుకునే స్థితిలో వుండాలి. ఇది లేకపోతే వంచనవుతుంది. చెస్టర్న్ ఓక చోట ఓక పుస్తకంలో ఈ విధంగా అంటాడు. '' paint me as I am, with my weaknessess and virtues as they are " అదే నా భావం కూడ.
* బలహీనతలు, దౌర్బల్యాలు కలిగివున్న సాహిత్యకారుడు తాత్విక దృష్టితో ప్రవచనాలు చేస్తే - సమాజం ఎలా రిసీవ్ చేసుకుంటుందంటారు?
-అంతా మన వంటివారే. కాకపోతే సాహిత్యకారులు తమ లోపాలు విప్పి చెబుతున్నారు. 'ఇలా వుండాలనే సంకల్పం, కానీ ఈ సమాజం అలా వుండనివ్వడంలేదంటున్నారు'. ఇదంతా చివరికి మొదలుకే వస్తుంది. వ్యక్తి మారితే సమాజం మారుతుందా? సమాజాని బట్టి వ్యక్తి మారతాడా అనేది ఓ కాలం నుంచి జేరుగుతూ వుండే రగడలే? వ్యక్తి మారితే సమాజం మారుతుందని మన ప్రాచీనులే భావించారే కాని, నేడు దానికి భరత వాక్యం పలికారు. సమాజమే వ్యక్తిని మారుస్తుంది. పైగా కేవలం కవిత్వంతో సమాజం మారుతుందనే దురాశ నాకెప్పుడూ లేదు. సమాజాన్ని మార్చగలిగినీ శక్తులు ఆర్థికాలు - దానికి సంబంధించిన బలాలు.

No comments:
Post a Comment