కపిల రాంకుమార్|| తెలంగాణా రైతాంగ సాయుధ పోరాటం - నవలా సాహిత్యం||
తెలంగాణా రైతాంగ సాయుధ పోరాట ప్రారంభానికి ముందు పరిస్థితులు - పోరాటకాలపు
స్థితిగతులు - పోరాట మిరమణ కాలం వరకు చారిత్రిక నేథ్యంలో వచ్చిన నవలాసాహిత్య
పరామర్శించటమే ఈసమాచార ఉద్దేశం. ఆ కాలపుటుద్యమాలు, ఆటుపోటులు, జీవన
క్రమంలో జాగీరుదారుల ఆగడాలు, నైజాం నిరంకుశపాలనలో ప్రజలు పొందిన కష్టాలు,
రుచిచూచిన అవమానాలు, తెగబడి నడిపిన పోరాటాల క్రమం తెలుసుకోటానికి ఈ నవలలు
మనకు ఉపయోగపడతాయి. ఆంధ్ర మహాసభ, కమ్యూనిస్టు పార్టీ పోరాటం, ఇతర ప్రజాసంఘాల
నిర్మాణం సహాయ పడిన శక్తులు, వ్యక్తులు, మనకు అవగతమవుతాయి. అక్షరీకరించిన
సాహిత్య ప్రక్రియల్లో కవిత్వం, నవల, నాటకాలు, బుర్ర కథలు, యితర జానపద
కళారూపాలు ఆనాటి పోరాటాన్ని కళ్ళముందు సాక్షాత్కరింపచేస్తాయి.
భారత దేశంలో జరిగిన వివిధ పోరాటాలకంటే భిన్నమైనది తెలంగాణా రైతాంగ సాయుధ
పోరాటంభూమి కోసం, భుక్తి కోసం, విముక్తికోసం జరిగిన సమరమిది. ఆ కాలంలోనూ,
తరువాతి కాలంలోను వెలువడిన నవలలుగా మృత్యుంజయులు (బొల్లిముంత శివరామకృష్ణ )
సింహ గర్జన ( పమిడిముక్కల లక్ష్మీకాంతమోహన్) చెప్పుకోతగినవి. ఇవి
పోరాటకాలంలో వెలువరింపబడిన నవలలు. తరువాత (దాశరథి రంగాచార్య
నవలాత్రయం)చిల్లర దేవుళ్ళు, మోదుగుపూలు, జనపదం (వట్టికోట ఆళ్వారుస్వామి)
గంగు, ప్రజలమనిషి, (అంపశయ్య నవీన్) కాలరేఖలు (తిరునగరి రామాంజనేయులు )
సంగం పోరాటాలకు అద్దంపట్టే రచనగా ప్రసిద్ధిచెందినది. (పి.చంద్) శేషగిరి
నవల్ కేవలం కార్మిక వర్గానికి, ముఖ్యంగా సింగరేణి కార్మికుల జీవనశైలి, సంఘ
నిర్మాణం, పోరాట దశలు కలగలిపిన నవల. తెలంగాణా పోరాటం యెందరో కవులు,
కళాకారులను కదిలించి, కళారుపాలు, చిత్రాలు, కథలు, కావ్యాలు
సృష్టించబడటానికి హేతువైంది. ఎందరో పర భాషా రచయతలను ప్రేరేపించింది చిత్త
ప్రసాద్ కుంచె, సునీల్ జనా కెమెరా, హరీంధ్రనాథ్ చటోపాధ్యాయ్, కిషన్ చందర్,
ఆచార్య నాగార్జున్, అణ్ణాభావు సాఠె లాంటి మరాఠీ కళాకారునిచేతీలో మరాఠి
ఒగ్గుకథగా, ( ఇలా భారతీయ కవులను, కళాకారులను కదిలించింది). హరికథలు,
బుర్రకథలు, చలన చిత్రాలు, నాటకాలు ఎన్నో...కొన్నింటిలో వాదాలు, వివాదాలు
వుండవచ్చు. తెలుగు సాహిత్యంలో కుందుర్తి ఆంజనేయులు, ఆవంత్స సోమసుందర్,
ఆరుద్ర తెలంగాణా పోరాట నేపథ్యాన్ని తమ కవితల్లో అభివర్ణించారు. అమరవీరుడు
బందగీ సమాధి ఆరంభంగా ' మా భూమి ' నాటకం కొన్ని వందల ప్రదర్శనలకు
నోచుకున్నదంటే '' వాసిరెడ్డి -సుంకర'' జంటకవుల అద్భుత సృష్టి. దానిని
విశ్వనాథ సత్యనారాయణ లాంటి సంప్రదాయకవి యెంతగానో మెచ్చుకున్నారంటే
ఆ
రచయతలు ఉపయోగించిన జాతీయాలు, తెలుగు పలుకుబడులు, సామెతలు, పాత్రోచిత భాషా
సంభాషణం ఆయనను ముగ్ధపరిచిందని వారే స్వయంగ మెచ్చుకున్నారు.
చివరగా
చెప్పేదేమిటంటే తెలంగాణా రైతాంగ సాయుధపోరాట కాలంలో వికసించిన నవలా సాహిత్యం
- పరిచయాలు - పరిశీలన అనే పుస్తకాన్ని '' జనసాహితి , జంటనగరాల శాఖ ' మే
2011 లో ప్రచురించింది. మైత్రీ బుక్ హౌస్, దిశ్, సహచరి, విశాలాంధ్ర,
ప్రజాశక్తి మొదలగు ప్రముఖ పుస్తకాల అంగడిలో లభ్యమవుతుంది.
యితర వివరాలకు ravibabujs@yahoo.co.in / 9440167891 ను సంప్రదించ వచ్చును. 2.7.2013 / 6.00 am.
No comments:
Post a Comment