కపిల రాంకుమార్|| జిప్సీలు ( సంచార జాతులు)- ఎం. ఆదినారాయణ ||
పుస్తకాన్ని పరిచయ వాక్యాలు ఆదినారాయణ గారి ' ప్రయాణాల పక్షి ' పేరుతో యిలా రాశారు.
పాటలు పాడుకుంటూ, కథలు చెప్పుకుంటూ, బొమ్మలాటలు చూపుతూ, పల్లెటూళ్ళు తిరిగుతూ, పొట్టపోసుకునే జానపద కళాకారులు, భిక్షుక గాయకౌల గురించి కొద్దో గొప్పో అందరికి తెలిసేవుంటుంది. గ్రామాల్లో పుట్టి పెరిగిన వార్కీతే ఆ సంచార జీవులతోటి ఒక విధమైన అనుబంఢం కూడ యేర్పడేవుంటుంది. ప్రతి సంవత్సరం విధిగా అదేకాలంలో ఆయా ప్రాంతాలకు వస్తారు కాబట్టి.
ఊరి బయట పొలాల్లోనూ, విశాలమైన పచ్చిక మైదనాల్లోనూ పశువుల్ని, మేకల్ని, గొర్రెల్ని తిప్పుకునే కాపరులగురించి కూడ మనకి తెలుసు. పొలాల్లోకి వెళ్ళినపుడు మెడ యెత్తకుండ, తోకలు ఊపుకుంటూ గడ్డిమేస్తున్న పశువుల్ని చూసి యెంతో సరదాపడివుంటాం. పరుగెత్తే ఒక మేకపిల్ల వెంటబడి దాన్ని వాటేసుకుని ముద్దు చేసివుంటాం. గొడ్లకాడ పిల్లలు హాయిగా యెగురుతూ ఆటలాడుకుంటుంటే వారితొ పాటుగా వుండిపోవాలనిపిస్తుంది మనకి.
జానపద కళాకరుల వెంట గ్రామాలు తిరుగుదామని, పసులకాపరులతో పాటుగా ప్రకృతిలోకి ప్రయాణం చేద్దమనే ఆలోచనలు నా మంస్తత్వం వీద బాగా పనిచేశాయి. అలాంటి భావాలు నా జీవిత మార్గాన్ని మార్చివేస్తున్నా, ' నా కలలోని ప్రయాణాలను నిజం చేసుకుంటున్నాను కదా ' అనే సరదాల సెలయేతిలీ యీదులాడుతుండేవాడిని.
నిజమైన ఆనందం, సౌందర్యం తిరిగటంలోనే ఉందని తెలుసుకున్నాక, ప్రకృతి అరచేతిమీద లాబి వదిలిన బొంగరం మాదిరిగా తరగటం మొదలుపెట్టాను. అలాంటి ప్రయాణాలు, నన్ను హిమాలయ పర్వత గ్రామాల వద్దకి తీసుకొనిపోయాయి. పల్లెకారుల జీవితల్లోని మాధుర్యాన్ని రుచి చూపిస్తూ సముద్ర తీరాల వెంట తిప్పేశాయి. ప్రజలు పాటలు నెమరువేసుకుంటూ ప్రవహించే నదుల ఒడ్డున నడిపించాయి.
ఆ సంచారాలు నాకు భారతదేశంలోని గ్రామసీమలు అందించే ప్రేమని పంచిపెట్టాయి. పన్నెండువేల కిలోమీటర్ల పొడవున సాగిన ఆ పాదయాత్రల అనుభవాల్లో కొన్ని, నేను రాసిన ' భ్రమణ కాంక్ష ' లో చదివిన నా మిత్రులు, విద్యార్థులు సంతోషించి ' మీ యాత్రానుభవాలు ఇంకా కొన్ని రాయండి ' అంటూ ప్రోత్సహించారు. ............................................................అలా జిప్సీల గురించి, వారిలో పండితులగురించి, జీవిత శైలి గురించి, భారత దేశం నుండీ విశాల ప్రపంఛంలో వివిధ ప్రాంతాలలో స్థిరపడిన వారి సామాజిక, ఆర్థిక, సంప్రదాయాల గురించి, అలవాట్ల గురించి, కళాపోషణ, పశుపోషణ గురించి భాషా, పాండిత్యాల గురించి , కవిత్వం, జానపద గేయాల గురించి, ఇతర జీవన అలవాట్లు, ప్రేమ, పెళ్ళి, వివాదాలు, విడాకులు, మూఢనమ్మకాలు
సమగ్ర సమాచారం లభ్యమవుతుంది.
పైర గాలుల్లో ప్రయాణాలు చేస్తూ, పంటచేల పరిమళాన్ని ఆస్వాదిస్తూ ముందుకు సాగిపోయే సంచారులు ప్రపంచమంతా వ్యాపించివున్నారు. భారతదేశపు ' గదూలియా లోహార్ ', ఆఫ్రికా ' పశువుల కాపరులు ', అరేబియా ఎడారిలో జీవించే ' ఒంటెల కాపరులు ', మధ్య ఆసియా కొండల్లో తిరిగే ' డ్రోక్ పా పశువుల కాపరులూ', దృవప్రాంతాల్లోని ' సంచారులూ, యూరప్, అమెరికా దేశాల్లో తిరుగుతున్న జిప్సీ (రోమాలు)లాంటి అస్థిర వాసుల జీవితాలను ' తెలుగు వెలుగు ' లోనికి తీసుకురావటాని ఆదినారాయణ చేసిన ప్రేమ ప్రయత్నమే ఈ '' జిప్సీలు '' - మురళి చండూరి. అభిప్రాయవెలిబుచ్చారు.
కొసమెరుపు: సాగర తీరంలో తిరగాలని ఆరాటపడుతున్న సాహితీ మిత్రుడు స్మైల్ ( మహమ్మద్ ఇస్మాయిల్) గారికి అంకితం యీ పుస్తకం.
*** ఎం. ఆదినారాయణ.
ప్రథమ ప్రచురణ 2002
విశాలాంధ్ర - విశాఖ పట్టణం వెల:100/-
________________________
18.7.2013 సా. 4.55

No comments:
Post a Comment