కపిల రాంకుమార్||కలం కలకలం||
బిందువుగా మారి చిందులేస్తే
అందమైన హరివిల్లు!
తాండవ రూపమై
స్వైరవిహారం చేస్తే
అరిమూకలకెక్కుపెట్టిన విల్లు!
పద్యమై, వచనకవితై, వ్యాసమై
కొండకచో పలురూపాల్లో వ్యంగమై
సంభాషణాచాతుర్యమై,
సందర్భానుసారం దిక్కులపై గురిపెట్టి
నిప్పులనూ పూల వర్షాన్ని
కురిపిస్తుంది నా కలం
మెదళ్ళ కదిలించే కలం కలకలం!
బిందువుగా మారి చిందులేస్తే
అందమైన హరివిల్లు!
తాండవ రూపమై
స్వైరవిహారం చేస్తే
అరిమూకలకెక్కుపెట్టిన విల్లు!
పద్యమై, వచనకవితై, వ్యాసమై
కొండకచో పలురూపాల్లో వ్యంగమై
సంభాషణాచాతుర్యమై,
సందర్భానుసారం దిక్కులపై గురిపెట్టి
నిప్పులనూ పూల వర్షాన్ని
కురిపిస్తుంది నా కలం
మెదళ్ళ కదిలించే కలం కలకలం!
No comments:
Post a Comment