జంట కవుల పరిచయం: వేంకట పార్వతీశ్వరులు
ముద్దుకృష్ణ సంకలనం - వైతాళికులు --(మొదటి ముద్రణ 1935)విశాలాంధ్ర
పబ్లిషింగ్ హౌస్ -విజయవాడ ఏడవ ముద్రణ్ 1969 నుండి - కవులు - కవితా పరిచయం:
వేంకట పార్వతీశ్వరులు .) పేజి -186:
ఆశ - నిరాశ
పెరటిలోనున్న యేడాకులరటి చెంత
బెద్ద బావి జలంబుల బెంచికొన్న
మావిమోకకు గనవయ్యె గావిచిగుర
కావిచిగురున కాసించి గళమునెత్తి
గండుకోయిల పాడె రాగంబు లొలయ !
చివురు వెట్టని కొమ్మల జిన్నిపూలు
తావులింపార వికసించె; దానజేసి
మేలుకొలుపుల్ బాడ్చు నాలితేటి
యొక్కరీతినె చిందులు ద్రొక్కదొడగె!
కాంచుచుండగ నాకస్మికంబుగాగ
నెట్టిపాటుననొ మరేమొకాని
చిగురు నశియించె, బూవులు చిందిపోయె
జిన్నికోకిల యంతలో జిన్నవోయె
దుమ్మెదకుగూడ నేమియు దోచదాయె
విషమవిశ్వంబునకు నిది వింత పనియె!
>>>>21.01.2013 ఉ.9.39
__________________________________+
వేంకట పార్వతీశ్వరులు : వీరు ఒక విధంగా యుగ సంధిలోనివారు. భక్తీ పట్టున
మహాపరవశులు. వీరి వాణీ కొండయేరువలె మంజుగానంతో అతిత్వరితంగా ప్రవహిస్తుంది.
వైష్ణవగీతాలలోని ప్రేమోన్మాదం వీరి భావోద్రేకాన్ని ఎక్కువగా రగిల్చింది.
భాష కూర్పులొ, పలుకు విధానంలో నూఝ్తనత్వాన్ని కల్పించారు.
ఓలేటి పార్వతీశం 1882 -1956 బాలంత్రఒఉ వేంకటరావు 1881 -
కృతులు 1. కావ్యకుసుమావళి, 2.ఏకాంత సేవ. 3. రత్నహారము
No comments:
Post a Comment