Sunday, January 6, 2013

దిక్ ‘లు ఆరు

కపిల రాం కుమార్ || ‘ దిక్ ‘లు ఆరు
1. సత్యం శివం సుందరం
జీవితం మాసింది, తిరగేసి తొడుక్కో!
– మహాస్వప్న
2. ఆణు యజ్ఞానంతరం
యాగఫలం నాదోసిట మూగ శ్వాసల బూడిద
– భైరవయ్య
3.అజాత ఇరవై శతాబ్దాలనుండి
జీవిస్తున్నా- యింకా బయటపడని కశ్మలం
-జ్వాలాముఖి
4.నమ్మను ఫో!
నుదురుకార్చిన కన్నీటి కలలపై కాలూని
ఈ శవాలు ప్రవచించే నీతుల్ గోలను నమ్మను ఫో!
– నిఖిలేశ్వర్
5. అంటున్నాను పేగుల్ని తెగనరికి
ఆకల్ని చల్లార్చుదామనే మేధావుల్ని
హంతకులు అంటాను.
– చెరబండరాజు
6. బీహార్
ఎవరో ఆకలిని ఆరవేశారు.
-నగ్నముని.
__________________
నవత పే.25 జూలై 1967.
ఉ.11.44

No comments: