కపిల రాంకుమార్|| యువ కవిత – శ్రీశ్రీ కవితలో||
సరిహద్దులు చెరిగిపోయిన ఈనాడు
శబ్దాన్ని నిశ్శబ్దంతో తర్జుమాచెయ్యగల
శక్తిమంతమైన యంత్రాలున్న ఈనాడు
శవత్వం పాశవత్వం పెరిగి
నవత్వం తరిగి
దానవత్వం సర్వత్రా
దంష్ట్రలు కొరుకుతున్న నేడు
యువత్వం వెనుకంజవేస్తున్న ఈ రోజున
కవిత్వం చెప్పడమంటే మజాకాలా ?
7.1.2013 రాత్రి. 8.00
- నవత పేజి. 33 జూలై -సెప్టెంబరు 1967
No comments:
Post a Comment