Wednesday, January 9, 2013

రాంకృష్ణుడు - బూతుకవి

కపిల రాంకుమార్ || రాంకృష్ణుడు - బూతుకవి||

పొరబడకండి. సాంతం చదివి ఒక అభిప్రాయానకి రండి. రాయల వారి అస్థానంలో అశ్లీలతకు, మోటు శృంగారానికి తావులేదు. అట్టి క్విత్వానికి వారి ' భువన విజయంలో " ప్రవేశం లేదు. ఒక సారి పేరంభొట్టు అనే కవి (పిఠపురానికి చెందినవాడు) రహస్యంగా తానేవరో తెలియనీయకుండ ఆస్థానంలోకి వచ్చి, సభా ప్రారంభమైన కొద్దిసేపటికిలేచి '' రాజా! బూతు కవిత్వం చెప్పటంలో నాకునేనే సాటి, నా పాండిత్యంతో సరితూగగల్ కవులు మీ భువన విజయంలోవున్నారా! కుతూహలంగ వుంది, నా కోరిక మన్నీంచి నాకు అవకాశమివ్వండి '' అన్నప్పుడు పరదేశియైన కవిని బయటికి పంపటం భువన విజయ సంప్రదాయానికిది చిరుద్ధం. అష్టది గ్గజాల్ మధ్య సవాలుగ వచ్చడు. రాయలు వారు అతడెలా వచాడని భటులవెంక కోపంగా చూసి, కవి పట్ల విముఖత వ్యక్త పరచకుండ మౌనం వహించి, కొద్దిసేపాగి తిమ్మరుసుతో '' అప్పాజీ యీతని బూతు కవిత్వం వినేకోరిక, తీరికలేదుకాని పొరుగుదేశపు కవి యిక్కడ్కు వచ్చినందుకు పైగా కవి కనుక బహుమతి యిచ్చి పంపండి '' అన్నాడు. వచ్చిన పేరంభట్టు అహం దెబ్బ తిన్నది. వూరకే బహుమతి తీసుకెళ్ళటం యిష్టంలేక తన ధోరణిలో బిగ్గరగ పద్యం అందుకున్నాడు.

'' బూతుకవిత్వ వైఖ్రుల్ ప్రౌఢిమంజూడక పొమ్మనంగ, నీ
కే తగుగాక, యిటుల మరెవ్వరు చెప్పుదురో, నృపోత్తమా,
చాతురితోతెనాలి రామకవి సత్తముడీతడు రామకృష్ణుడీ
రీతిని యూరకుండిన విరించినైన జయించ జాలునే '' ...అని రామకృష్ణుని దెప్పిపొడిచేలా అనగానే
రాయల వారి అనుమతితో మాటల కూర్పులో అశ్లీలత ధ్వనుంచినా స్భ్యమైన అర్థం కలిగిన పద్యం చెప్పి పేరంభొట్టు నోరెలా మూయించాడో రామకృష్ణుడు చూడండి.

క.|| పూ కులము లోనంగేతకి
పూకెంత సువాసనుచుం బొలతి పలుకుచుం
పూ కడకుంగడకు రమ్మని
పూ కరమునం బట్టిం జూపెం బురుషులకెల్లన్....దీని భావము పూవులన్నిటిలో కేతకి పుష్పానికి, మొగలి పూవుకు ఎంత సువాసనో - అంటూ ఆ మగువ ఆ పూవు దగ్గరకు వాసన చ్క్షూడడానికి - రమ్మని ఆ పూవుని చేతిలో పట్టుకుని మగవారికందరకి చూపించినదని ..పూ : అనేది పుష్పమునకు సంక్షిప్త రూపం. అది తెనాలి రామకృష్ణుని ప్రతిభ. ఆ దెబ్బకు తేరుకున్న పేరంభోట్టు రామకృష్ణుని పొగడుతూ
ఉ.|| అర్ణవవేష్టీఅభీత మహామహితాత్ముడు బూతులం
బూర్ణుడు రామకృష్ణ కవి బోలు కవీశ్వరు డండు కల్గునే
నిర్ణయమెంచి చేయ మహనీయ గూణాఢ్యుడు బూతు మంచిగా
దుర్నయుడైనచో దివిరి ఢూర్తత మంచిని బూతు చేసెడిన్! అని వినమ్రంగా అందరికి ప్రణమిల్లి
నిష్క్రమించాడట.
___________________________________________________________
ముత్తేవి రవీంద్రనాథ్ - రామకృష్ణుని సాహిత్య శాస్త్రీయ పరిశీలన ..పేజి.428-431 నుండి

9-01-2013 ఉ .10.27

No comments: