Tuesday, October 1, 2024

 స్వతంత్ర అనువాదం


ప్రతి చెడు సంఘటన 

నొప్పిని పంచుతుంది 


ప్రతి నొప్పి 

ఒక గుణ పాఠం ఇస్తుంది


ప్రతి గుణపాఠం వ్యక్తిని 

మారుస్తుంది


Every bad moment brings pain,


Every pain gives a lesson,


Every lesson changes a person!


DEMIC

 భావానుసృజన...

అనువాదం కాదు

----////------////----

తీపి కబుర్ల బుట్టలో 

పడకండి. 

తేనెలాంటి యత్నాలలో 

పడిపోండి

--------/-----

Every bad moment brings pain,


Every pain gives a lesson,


Every lesson changes a person!


DEMIC-

అనుసృజన

 తీపి కబుర్ల బుట్టలో 

పడకండి. 

తేనెలాంటి యత్నాలలో 

పడిపోండి

Don't fall for sweet words. 
Fall for sweet efforts.

Being Better

డెమిక్



ప్రతి చెడు సంఘటన 

నొప్పిని పంచుతుంది 


ప్రతి నొప్పి 

ఒక గుణ పాఠం ఇస్తుంది


ప్రతి గుణపాఠం వ్యక్తిని 

మారుస్తుంది!


 స్వతంత్ర అనుసృజన


నీ బాధను ఎవరూ 

గమనించరు, 

కానీ తప్పులను 

అందరూ గమనిస్తారు.


Nobody notices 

your pain, 

but everyone notices 

your mistakes.


Power of Thoughts

 దయ అనేది ఒక చర్య కాదు, 

అది మీ ఆత్మ యొక్క ప్రతిబింబం.


ఆలోచనల శక్తి

అనుసృజన

 "ఏడుపు నీ బలహీనతకు 

సూచన కాదు, 

పుట్టిననాటి నుండి 

జీవించే ఉన్నావని

సూచించే నిత్య సంకేతం"


షార్లెట్ బ్రోంటే, జేన్ ఐర్ ద్వారా


www.facebook.com/English Literature

మిని

 వరద రాజకీయాలెందుకు

బాడ్ కావులైతరు...

బురదలో కొట్టుకుపోతారు

మినీ

 పొట్ట చూపించోనిడికి

పొట్లం విసిరాడు పంచేటోడు

కిందపడింది పొట్లం

కిందపడింది పొట్ట

వరద సహాయం

బురద పాలైంది....


మినీ

 పొట్ట చూపించోనిడికి

పొట్లం విసిరాడు పంచేటోడు

కిందపడింది పొట్లం

కిందపడింది పొట్ట

వరద సహాయం

బురద పాలైంది....


మినీ

 వరద ప్రాంతాలలో

ఆకొన్నవారికి

ఆహారపొట్లాలందిస్తుంటే

ఆపన్నహస్తాల సేవలను

అందుకుని ఆస్వాదించక

బురదపాలు చేసేవాళ్ళ

చేష్టలనేమనాలి.


కరుణ లేని వరుణుడు

 కరుణ లేని వరుణుడు


బంగాళాఖాతంలో

అరేబియా సముద్రంలో

జలవాహకులు చేస్తున్న

అట్టహాసం ప్రభావం

రెండు తెలుగు రాష్ట్ర జనజీవనం

ఇలా అతలాకుతలమై

వాయుగుండపు గండమొకవెంపు

తుఫాను రూపంలో గాలివాన

విశ్వరూపం చూపుతోంది

కరుణే లేని వరుణుని కరాళ నృత్యపు

తడాఖా చూపుతోందిలా

మరి 

ప్రకృతి కన్నెర్ర చేస్తే

పల్లపు ప్రాంతాల్లో అల్లకల్లోలమే కదా

నాలాల ఆక్రమణాఫలితాలు

కాలనీల గొంతుకకు యమపాశమైంది

పర్యావరణ సోయి లేకపోతే

ఇంతే.....

అజాగ్రత్తగా ముందుకు పోతే

మునిగిపోయేది మనమే

ఎవరినో నిందించడం కాదు

ముందుచూపు లోపిస్తే ఇంతే.

మన చెంపలు మనమే వాయించుకోవాలి

కూడు గూడు గుడ్డలకోసం,

ప్రాణాలరచేతిలో పెట్టుకుని

కొట్టుమిట్టాడుతున్న హృదయ విదారక

దృశ్యాలు ఎన్నో..

మనుషులు పశువులు 

శవాలై సవాలు విసురుతున్న సందర్భం

ఆస్తులు వాహనాలు ధ్వంసమై కనుమరుగౌతున్న సందర్భం

రహదార్ల దిగ్భంధం

సమాచార వ్యవస్థ విధ్వంసం

ఆర్థిక, వ్యవసాయ, ఆరోగ్య, రవాణా లాంటి

ఎన్నింటిపైనో... చావుదెబ్బ...

నష్టం పూడ్చలేనిదే కాని

నివారణ మన చేతిలోనే...

అని గ్రహించేదెపుడో...

చేతులు కాలాక ఆకులు పట్టుకోడం కాదు

రాబోయే విపత్తును పసీగట్టే జాగిలాలు లోపం సరిచేయాలి

ఉత్తిష్టత జాగ్రత...

ఇది మన మెదడుకే మేత.

రాజకీయం చేయడంకాదు

ఆపన్నహస్తం అందించడమే

తక్షణ కర్తవ్యం.

అనుసృజన

 keep fight going  on

justice will be served


అను నిత్యం పోరు కొనసాగనివ్వు

న్యాయం తనంతటదే వరిస్తుంది

అనుసృజన

 Joyce Kilmer, an American poet became famous when he wrote the poem TREES in 1914.


I think that I shall never see

A poem lovely as a tree.


A tree whose hungry mouth is prest

Against the earth’s sweet flowing breast;


A tree that looks at God all day,

And lifts her leafy arms to pray;


A tree that may in Summer wear

A nest of robins in her hair;


Upon whose bosom snow has lain;

Who intimately lives with rain.


Poems are made by fools like me,

But only God can make a tree.



The following photos were taken at the Joyce Kilmer National Memorial Forest dedicated  in 1936.  It is the last intact old growth forest left in the Appalachian Mountains.



జాయిస్ కిల్మెర్ అనే అమెరికన్ కవి 1914లో ట్రీస్ అనే పద్యం రాయడం వలననే ప్రసిద్ధి చెందాడు.


నేను ఎప్పటికీ చూడలేనని అనుకుంటున్నాను

మనోహరమైన  కవితా వృక్షాన్ని


ఏ చెట్టు ఆకలి  అణచబడ్డ నోటివల్ల 

భూమి స్రవించే పాలిండ్ల ధారల్ని

అందుకోలేకపోతున్నది


రోజంతా దేవుడిని చూసే చెట్టు, 

ప్రార్థన చేయడానికి 

ఆకులను ఎత్తిపట్టుతుంది


బహుశః వేసవిలో ఆ చెట్టు

 గోరింకల గూళ్ళతో నిండివుంటుంది


ఎవరి వక్షస్థలం మీదైతే మంచు పడుతుందో

వారు వర్షంతో సన్నిహితంగా జీవిస్తారు.


నాలాంటి మూర్ఖులు కవితలు రాస్తారు.

కానీ దేవుడు మాత్రమే 

చెట్టును స్థిరంగా నిలుప గలడు.



కింది ఫోటోలు 1936లో అంకితం చేయబడిన జాయిస్ కిల్మర్ నేషనల్ మెమోరియల్ ఫారెస్ట్‌లో తీయబడ్డాయి. ఇది అప్పలాచియన్ పర్వతాలలో

చివరి చెక్కుచెదరకుండా మిగిలి ఉన్న

ఉన్న పాత అరణ్యం

వేళ్ళ రహస్యం.. సమీక్ష

 మీకూ నాకూ మధ్య...

పుట తెరిచి...

నా వేళ్ళు మీటిన రహస్యాల్లోకి ప్రవేశిస్తే... మీకూ నాకూ మధ్య ప్రవహించునది నా కవిత్వమే... ఇంక మన మధ్య వేరే భాష్యాలు ఎందుకు?

భరోసాతో...

మీరు నా అక్షరావరణంలోకి అడుగేయండి... నా అంతరాత్మతో మనసు విప్పి మాట్లాడుకోండి...

మోహాల్లేవ్.. మొహమాటాల్లేవ్

దడుల్లేవు...దాపరికాల్లేవు మౌనాన్ని బద్దలు కొట్టి చెప్పుకున్నా... అంతా బహిరంగమే..ఖుల్లం ఖుల్లా...

ఇక మనది

అనుభవ భూమిలో ఆత్మీయ సమావేశం...

- వఝల శివకుమార్


2.పేగుతీపి కవిత మెలిపెట్టిన తీరు అమ్మను ఆవిష్కరించడంలో శివకుమార్ తన సత్తా చాటారు. తొలి చూపులోనే ప్రేమ కలిగింది. సందేహం లేదు. చదవండి మీరు.

"కలబడినప్పుడు కన్న పేగులు మెలిపడ్డట్టు

విలవిలాడే వింత అనుభవం

బతికినంత కాలం తన బతుకును

వడ్డించిన విస్తరిలా పరిచిన ఆత్మ గల్ల

చేతి స్పర్శ

తోడు దూరమైనా కన్నబిడ్డ తోడు వదలలేని

బలహీన జీవిక "  (బలమైన మమకారం)

ఆర్ద్రత చెందక చస్తామా....కంట తడి బుగ్గలు కనిపెట్టేస్తాయి.


3. వేళ్ళరహస్యం పేర సుమారు డెబ్భై పైచిలుకు కవితలు వదలకుండా చదివించాయి. రహస్యపు దారి చాల పొడుగు. ఎలాగో కష్టపడి కొన్ని మాత్రమే చదివాను. కొన్ని అలా అలా  శీర్షికలు తడిమానని నిజమే చెప్పాలి కాబట్టి. నిజం యిదే.బాగా హత్తుకుని కదిపి కుదిపినవి ప్రవేశపెడతా.


4 .రెండోకవితలో  లోయతో మాట్లాడుకోవచ్చట, తదుపరి మట్టి ప్రేమల ఆలయంలోకి తీసుకెళ్ళాడు శివకుమార్.

మనసు మగ్గమవ్వగానే, చీకటికంచె అడ్డు వచ్చింది. ఎందుకంటే ఇల్లొక యుద్ధ శిబరం కాబట్టి. అది చెట్లకు పుట్టిల్లు కూడ. అంతేకాదు పుస్తకాలు భాండాగారం నవ్వులనదిని పరిచయం చేస్తుందంటాడు.

డ్యూటీకాల్ మిషలోనే మనకు వేళ్ళ రహస్యం కనబడుతుంది.ఆరోప్రాణమైన అక్షరాన్ని దిద్ది చరాచర విశ్వానికి నిరంతర

సందేశమిస్తుందని, రాగాలను శృతి చేసుకునే ప్రాణం ప్రణవమౌతుందని బట్టబయలు చేసాడు కవి. పక్కనే వున్న నైఋతిగదిలో అక్షరం ఒక నీడై గోడచాటుకు చేర్చబడింది. ఆ పూనికతో గదంతా అక్షరాలే. రాగాలై మాండోలిన్ పై వినిపిస్తున్నాయి. ఇక తొండాటాడుతూనే ఉంటుంది ఆశ. ఆశ కదా ఊగిసలాట దానికి సహజం. ఒకానొక చేటుకాలం పూర్తికాగానే ఎదురుగా కనపడే మల్లమ్మంటే చెప్పలేని మమకారం కురిపించారు కవి. ఏవేవో సంభాషణలు సంవాదాలు వినబడుతున్నాయి అక్కడేవున్ ఓట్ల మెట్లముందుర. ఎన్నో జెండాలు.ఎన్నో గుర్తులు. విజేతలు...పరాజితులు దర్శనమిస్తారు. ఒక పక్క ప్రమాదాల చావునగారా ఇంకో పక్క ప్రమోదాల ఆంబారీ సవారీ. అబ్బ మనోహంసకెన్ని ఊహలో కదా, మొన్నటి దొంగల భాగోతం

వానాకాలపు మేఘాల స్వైరవిహారం తిలకించే రెప్పలకు రెక్కలిస్తారు కవి.

ఎందుకంటే మనిషిని బతికించుకోవాలికదా,

పాలక వర్గాల ధ్వంసరచననుండి, బడ్జెట్ పగటికలలనుండి అరచేతిలో వైకుంఠంలా పగలే వెన్నెలనే మోసంనుండి, బతికించుకోవాలి. 

ఇలా రాసుకుంటూ పోతే ఇదేదో కొల్లేటి చాంతాడయ్యే ప్రమాదంలా వుంది. అందుకే ముక్తాయింపునిస్తాను.


ఇంక లెక్కతేలాలి, ఎందుకంటే

నేనెక్కడైనా దాటిన చాళ్ళల్ల

తిరగేసిన కవితల్ల

ఈ పేజీలమధ్య

(పేచీలేని) పంక్తుల నడుమంటూ

నడకలు, నడకల పరమార్థాలు

లెక్కతేలాలి

నాలో అవిటితనం పాలు

పాలకు పాలు, నీళ్ళకు నీళ్ళులా 

సరిచూసుకోవాలి...

ఇది కవికి అత్యవసరం కదా.ఆత్మ విమర్శకు నిలబడాలి. బేరీజు వేసుకోవాలి. ఇది శివకుమార్ నిబద్ధత.

అప్పుడే ఒక స్థానాన్ని సుసంపన్నం. చేసుకోవచ్చు.. ఆ రహదారి ఆయనకు దొరికింది. పయనిస్తున్నాడు. గమ్యం చేరుతాడు.


ఏవో నాలుగు మాటలు రాసే అవకాశం వేళ్ళరహస్యం లో ఉందని భావిస్తూ.


ఏడుకోలల బాయి...

 ఏడుకోలల బాయి ...ఒక పరామర్శ


దాదాపు పద్నాలుగు గజాల లోతు బాయి నుంచి ఎన్నికల శతకం చదవాను.


ఈ లోకపు కాలపు ఓటర్ల వెర్రిబాగులతనం ఎత్తి చూపుతూ చైతన్య పరిచే పద్యాలివి.


కవి, పరిశోధకులు, కాలమిస్ట్, ఉన్నతాధికారి ఆత్మీయ సాహితీ మిత్రుడు, ఏనుగు నరసింహారెడ్డి ఎంతో అభిమానంతో ఈ శతకాన్ని చదివి నాలుగు మాటలు అందించమన్నారు.


అదిరిపోయే మకుటంచూసి...

అబ్బురనడ్డాను


" మాయమాటల హామీల మర్మమెరిగి

గుర్తులేకుండ ఓటెట్ల గుద్దుతావు

ఓరి వెంకన్న! దోస్తుగా!  ఒర్లబోతు

ఒక్కమాటన్న వినవారా! తిక్కలోడ! "


ఇది ఒక్కటే చాలు వారి ఆశయమేమిటో.

ఇన్నేళ్ళుగా ఓటరేవిధంగా మోసపోతున్నాడో, అనర్హులనెలా అందలమెక్కస్తున్నాడో, ఏమి చేయాలో,  తన మిత్రుడు వెంకన్ననుద్దేశించి మాట విను ఓ తిక్కలోడా  అని ఎంతో చనువుగా, మొట్టికాయలు వేస్తూ, చెప్పిన తీరు ప్రశంసనీయం.


స్వతహాగా ఉన్నతాధికారిగా ఉన్నత విలువలు పాటిస్తూనే సమాజం యెడల బాధ్యత కవిగా నిర్వహించడంలో సఫలమయినట్లే.


ప్రజా స్వామ్యం, ప్రజా క్షేమం ,చైతన్యం పట్ల నిబద్ధతతో శతకం ప్రకాశిస్తోంది.

మొద్దునిద్రపోతున్నవారిని బడితపూజ చేయగల సున్నితమైన మాటలు కొండొకచో

కొరడా ఝళిపించేలా, చురకలు వేసేలా అలతి పదాలతో శతకం నడుస్తుంది.


ప్రజాస్వామ్యం బతికి బట్టకట్టాలనే

గట్టి కోరిక ఏడుకండేల బావిలో 

కూలిపోకూడదనే శతకకర్తగా పడిన

తపన, పాఠకులకు కొట్టవచ్చినట్టు అవగతం అవుతుంది. అందులో సందేహం లేదు.


ఆత్మీయసాహితీ మిత్రులు నరసింహ రెడ్డి గారి అభినందనలు.


వారణాసి

 పుష్కరస్నానాలైనా

వారణాసి బాబాల దర్శనాలైనా

ఆకాశయానాలైనా

రైలుప్రయాణాలైనా

ఎన్నికల బూతులైనా

జనం తొక్కసిలాటలైనా

ప్రకృతి ప్రకోపించినా

క్షతగాత్రులవటమో

మరణాలు సంభవించడమో

షరా మామూలేనా.

ప్రసేన్ కవిత చదివి

 కోట్ల చెట్లు నాటిన వ్యక్తి

వనజీవి రామయ్య

దిగులుగా తిరుగుతుంటే!

రహదారి విస్తరణ పేర

కొట్టివేస్తున్న సర్కారు

పచ్చదనం హరిస్తున్న వైనం!



వెంకటేష్ కవితకు భిన్నంగా వుండే స్థితి....)

 తరిగిపోతున్న తరువులకు 

విచారంగా కలవరపడుతోంది కొండ! 


కండలను తొలిచేసస్తూంటే 

రోదిస్తోంది కూడ.!


(

మినీ

 యంత్రాలకే

పడని ఓట్లు

మంత్రాలకు

పడతాయా...


అయ్యో...ధ్య

రామా...?

అనుసృజన

 చుక్క నీరడిగిన ప్రతీసారీ...

వారికి సముద్రాన్నిచ్చేంత 

భీకర అలవాటు నాది !!


లూయిస్ కౌఫ్మాన్


i have a terrible habit 

of giving an ocean 

whenever someone 

asks for a single drop.


louise kaufmann


అనుసృజన

 



ప్రతీసారీ

'కళ'లో పరిపూర్ణతని కోరుకొంటే

దానికి నీవు శత్రువవుతావు!


లూయిస్ కౌఫ్మాన్


every time you crave perfection, 

you become an enemy of art.


louise kaufmann

మినీ

 అచేతనాలు సైతం

చేతనాలౌతాయి 

మన నేతల చేతలబట్టి

ఓటు ఓటిపోకుండా

పోటుపొడిస్తే చాలు

అనుసృజన

 నేనో భావోద్వేగాల 

సముద్రాన్ని

కానీ 

అందులో ఈదటం మాత్రం 

నాకు నేనే నేర్పించుకున్నాను.


అనంతం

 గిట్టని వాళ్లు

కట్టకట్టుకుని

గిట్టినవానిపై

గిట్టలు దువ్వితే

దుమ్మురేగు కాని

దమ్ములేని

కులమత వాదనలేల?

గట్టిపడును

గిట్టినవాని

కైతలగూడు!

ఎందరికో

ఊతమిస్తూ

తప్పొప్పుల పట్టికలో

దాచుకోని నిజాలన్నో

"అనంతం" చెబుతోంది

చదవండి

చెదలు వదల్చుకోండి


మినీ

 ఘర్జించిన సమూహ పిడికెళ్ళే....

ఎలుగెత్తే కొడవళ్ళవ్వాలి

అరాచక చేష్టలకు

గుణపాఠం చెప్పాలి

అనుసృజన

 ఆంగ్లం నుండి తెలుగులోకి స్వేచ్ఛానుసరణ)


ఈ భూమిపై నేను

ద్వేషించతగిన వారెవరూ లేరు!


కానీ నాకెలాంటి సంబంధం

లేనివారు చాల మంది ఉన్నారు!


మినీ

 సుడి ఉన్నోడికి

ఎన్ని పార్టీలు

మారినా ఎర్ర తివాసి

పరుస్తారు


మరొకడికి

సొంత పార్టీలోనే

తడిగుడ్డతో నొక్కేసి

చరుస్తారు


మినీ

 కాయలు కాస్తే

చేతుల శ్రమ

కాయలు కాస్తే

కళ్ళలో ప్రేమ

కోపం మంచిదే

 కోపం....మంచిదే!

వ్యక్తి కోపం తనకే శత్రువు

వ్యవస్థ కోపం  ఓ పోరాట క్రతువు

దున్నపోతు బలం

సమాజపు నడక కోసం

శునకపు విశ్వాసం

సకల జనావళి ప్రమోదం కోసం

మా తీవ్రమైన కోపం

రాజ్యహింస రాజేసే 

దమన నీతిపై

జనాలను పీడిస్తున్న 

అవినీతిపై 

ఇప్పుడిక తిరుగుబాటు 

తప్పనిసరి తక్షణ కర్తవ్యమని చెప్పవే

ఓ ముప్పై ఎనిమిదేళ్ళ 

క్రోధినామ వత్సరమా,

అలాగైతేనే నీకు సాదరాహ్వానం

ఎన్నికల కలలు

కలలుకాకుండ

కల్లలు కాకుండా

ఆరు రుచులే కాదు

శాంతి సామరస్యం

కలకాలం వెల్లివిరిసేలా

నిలబడనివ్వు

కాకి గూటిలో పొదగబడ్డా

కోకిలవైలోక కళ్యాణగీతమే 

ఆలపించు

లేదా

నీ జట్టు కటీఫ్

నీ జుట్టూ కట్టీఫే


నీ కంటకతత్వ సవాలుకు

ఇక మా క్రోధత్వమే జవాబు

అర్థమైందనుకుంటా

నువ్వే కాదు

మేమూ క్రోధులమౌతాం

విప్లవ యోధులౌతాం.

ఐ డ్రీమ్ ఎ వరల్డ్

 లాంగ్‌స్టన్ హ్యూస్ రచించిన ఐ డ్రీమ్ ఎ వరల్డ్

(తెలుగు లో స్వేచ్ఛ అనుసరణ

కపిల రాంకుమార్)


మనిషన్నవాడెవ్వడు 

ఎగతాళి చేయని ప్రపంచాన్ని 

నేను కల కంటున్నాను, 

అక్కడ ప్రేమ భూమిని ఆశీర్వదిస్తుంది 

శాంతియు దారులందరికి  

స్వేచ్ఛా మార్గాన్ని తెలుసుకోగల 

మధురమైన ప్రపంచాన్ని 

నేను కల కంటున్నాను, 

ఇక్కడ దురాశ ఆత్మను 

లేదా దురాశ మన రోజును 

నాశనం చేయదు. 

మీరు నలుపు లేదా తెలుపు రంగుల 

 ఏ జాతి వారైనా, భూమి వరాలను పంచుకునే ప్రపంచాన్ని 

నేను కలకంటున్నాను

 ప్రతి మనిషి స్వేచ్ఛగా ఉంటాడు, 

అక్కడ దౌర్భాగ్యం దాని తలపై వేలాడదీయబడుతుంది

ఆనందం, ఒక ముత్యం వలె, 

మానవాళి అవసరాలను తీరుస్తుంది- అలాంటి దానికోసం 

నేను కల కంటున్నాను. 

నా ప్రపంచమలా వుండాలని

నిత్యం కలకంటున్నాను

మినీ

 చేలో ముళ్ళు రాళ్ళు తొలగించి

మడులుకట్టిన సేద్యగాళ్ళకు

రహదారి నిర్బంధాల ముళ్ళకంచె

ఏపాటిది సంఘటిత పోరాటాలకు

మినీ

 వాడు మడి కట్టకున్నాడు

భూమిని పూజిస్తాడు

ఆమె మడి కట్టుకున్నది

దేవుడ్ని పూజిస్తుంది

భుక్తి దొరుకుతుంది కాని

ముక్తి దొరుకుందా.

మినీ

 తిరుగుబాటు

విప్లవం కాదు

విప్లవం మాత్రమే

తిరుగుబాటు

మినీ

 మొక్క బడికి వెళ్ళింది

మొక్కుబడికి గుడి పిలిచింది

బడిలో చెట్టు పెరిగింది

గుడిలో జుట్టు తరిగింది


మినీ

 భక్షణకు

దక్షిణం మూలం

ఏ ఉత్తరమూ

సరిపోదేమూలకు.

మినీ

 కథలు 

కంచికి వెడతాయో లేదో 

కాని

వ్యధలు మాత్రం 

కాటికెళ్ళడం ఖాయం

మినీ

 అన్నమో రామచంద్రా అన్నా

నమో రామచంద్రా అన్నా

ఫలితం శూన్యమే

మినీ

 రాజయాధికార పొగరుకు

ధిక్కార స్వరమే విరుగుడు

జెండా.. అజెండా

 ఒక జెండాను

అజెండాగా నిలిపి

భుజాన మోయటమేకాదు

కొండొకచో రాజ్యపు ఒత్తిడిని

తట్టుకుంటూ

నీ శ్వాసాగిపోయె దాక

నీతో అంతిమయాత్ర చేయాలి సుమా

అంతేకాని 

అర్ధంతరంగా ప్రలోభాలకు లొంగి 

జెండాను అవమానించకు.

మినీ

 బరువు మోయలేక

కిందపడేస్తాం

ధరల బరువు మోయలేక

కిందపడతాం

మినీ

 మద్యం తాగి ఖజానా 

నింపమనేది నేనే

తాగి వాహనం నడిపితే 

ఆపి పట్టుకునేది నేనే

నేను మాత్రం ఇద్దరిని.


వర్మ యాదిలో....

ఖాళీ బొక్కసం

 ఖాళీ బొక్కసం వెక్కిరింత

పూడ్చడానికి దేవురింత

ఉచితాలకు హామీలకు

రొక్కమెక్కడిదని చింతన

మెక్కినోళ్ళనుండి రాబట్టాలా

కొత్త అప్పుచేయాలా

తర్జనభర్జనల మధ్య

తలమునకలైన కొత్త సర్కారు

గెలిచి మెప్పుపొందటంకాదు

నిలకడగా నడపడమే కర్తవ్యం

మినీ

 నెలలో పదిరోజులు

ఢిల్లీకి పయనం

ఎక్కే గుమ్మం దిగే గుమ్మం

అలకల నేతల తీర్చగ

అధినేతకు తలనొప్పులు


ఓటు ఓటిపోకుండా

 ఓటు ఓటిపోకుండా


మనోచాంచల్య స్వభావులు

కొంతమంది రాజకీయులు

మగువపై మనసుపడ్డట్టు

నమ్మినదాన్ని నట్టేటముంచి

గోడదూకేస్తారు

పక్కలోకి దూరేసి కొత్తదానికి అతుక్కుపోతారు

కుంటిసాకులు చెప్పి

చొక్కా మార్చినట్టు

జెండామార్చేస్తారు

అప్పటిదాకా తిట్టిన నోరు

పొగడ్తలు మొదలుపెట్టుతుంది

ఓటేసిన జనాలకు సమాధానం చెప్పకుండానే

నెపం జనంమీదనెట్టి 

వారికోరికమీదే

పార్టీ మారామంటారు

మూడునాలుగు కొంపలు మార్చేస్తారు

రాజకీయ అధికార దాహానికి 

వ్యభిచారం యావకంటే

బలమైన కుతి 

ఊతంగా వుంటుంది

సిగ్గు శరం లేని నేతలు

పెడతారు యిలా వాతలు

సైంద్ధాంతిక నిబద్ధతుండదు

నైతికత అసలే శూన్యం

పదవే పరమావధిగా

పరస్త్రీ పొందే పావనమంటూ

ప్రవచనాలు వల్లిస్తారు.

బంధుత్వాలను బొందపెడతారు

రకరకాల వాగ్దానాలు కురిపించి

పదవులు దొరకబుచ్చుఠుంటారు

శతకోటీ మార్గాల మభ్యపెట్టడంలో

దిట్టలు....

గిట్టలు దువ్వి వాళ్ళనోడించడానికి

అమ్ముడుపోని ఓటర్లు లేవండి చూపుడువేలుతోనో

బొటనవేలుతోను

స్వస్తిక్ ముద్ర వేయడానికి...

శాశ్వతంగా పాతరేయడానికి

కదలిరండి ఎన్నికల వేళ

ఎన్నోకలలు నెరవేర్చుకుందుకు

ఓటు ఓటిపోకుండా

ఉత్తిష్టత జాగ్రత్త.


మినీ

 రాజకీయ గురువిందలు

నలుపెరుగని పందులు

తమ తప్పులు కప్పిపుచ్చగ

కుప్పిగంతులు నేర్చారు.

ఎర్ర కుర్రాళ్లు

 రెండు ఎర్ర కుర్రాళ్ళు 

చెరో రెండు బిస్కెట్లకు

సర్దుకుంటే

మొత్తం రాష్ట్ర సమస్యలను

ఎంత గట్టిగా అరిస్తే

చెవిటి సర్కారునులిక్కిపడేలా చేయగలరు?

ఒకరి దయకేడ్చేబదులు

ఇద్దరూ ఐక్యంగా పోరుచేస్తే  పాతిక గొంతులైనా వినిపించలేరా ?

గుండెదడ పుట్టించలేరా..

ఓంకార్ నాగిరెడ్డి సుందరయ్య లాంటి

మార్గదర్శులు కార్యదక్షులేరి

గత గుణపాఠాలు నెమరువేయండి

అజేయమైన మార్క్సిజానికి

పట్టంకట్టండి

మోజేతినీళ్ళకాశపడితే

ప్రజాఉద్యమాలఠు చులకనౌతారు

తెలంగాణ రైతాంగసాయుధపోరుకు

మచ్చతెచ్చినట్లే

జనంమెచ్చని సైద్ధాంతిక సొల్లుతో

నిరాశకలిగించక 

ఉభయులూ సమరానికి ఐక్యం కండి

కాలమే న్యాయనిర్ణేత

అరుణారుణ కేతన విజేత

జర జాగో కామ్రేడ్స్


యుద్ధం నివారించలేమా

 యుద్ధం నివారించలేమా!


దొంగలు పడితే దౌర్జన్యం చేసైనా

ఇల్లు దోస్తారు

ఎదురు తిరిగిన యజమానిపై

కత్తి దూస్తారు. ప్రాణాలు తీస్తారు

అది వ్యక్తిగత నష్టం


వరదలొస్తే

ఊళ్ళకు ఊళ్ళను తడిపేస్తుంది

పంటపొలాల తుడిపేస్తుంది

రైతులను దిగాలు పరుస్తుంది

జీవనాన్ని కుదేలు చేస్తుంది

అది ప్రకృతి వైపరీత్యం


మరి యుద్ధమే వస్తే

అది రాజ్యాల  మధ్య ప్రాణమానాలతో ముడిపడ్డ ఆర్థిక వినాశకారి


దాని ధాటికి

కరువు కాటకాలమించి

దేశంమొత్తాన్ని విధ్వంసం చేస్తుంది

క్షతగాత్రులను

శవాలగుట్టలను

భవన  శిథిలాలలను

బహుమతిగా యిస్తుంది

చెట్టుకొకరు పుట్టకొకరు చెల్లాచెదరౌతారు

ఇళ్ళు గుళ్ళూ సర్వం తగలబడతాయ్

ఎవరు చనిపోయారో

ఎవరు బతికున్నారో

ఏ శిధిలాల కింద ఏ శిశువులు 

ఏ పశువులు చిక్కుకున్నాయో


కూటికి గూటికి లోటుతెచ్చి

బతికుండగానే జనాలను

జీవచ్ఛవాలను చేస్తుంది

ఆ ఆకటికేకలనాదుకోవాలి

గాయపడ్డవారికి వైద్యమందించాలి


మారణహోమపు కీలలేకాదు

మానవతుల శీలాలు మంటకలిపే

దగుల్బాజీ వెధవలకు హక్కు

ఎవడిచ్చాడు


ఎవరి మీదకోపమో

ఇలా అమాయకులు బలికావలసిందేనా

యుద్ధకాంక్షతో బలసిన దేశాలు

మతోన్మాద వంకతో

బలహీనదేశాల నాశనానికి

కంకణం కట్టుకుంటే ఎలా


మతాలనో దేశపు ఆదాయం మీదో

కుళ్ళెందుకు

ఈ దౌష్ట్యాన్ని మీ దేవుడు సమర్థిస్తాడా

మనిషి తనం నుండి అమానవీయ

దుడుకుదనం మీ రక్తంలోనే వుందా

సభ్యసమాజం

వారిస్తున్నా బుద్ధిరాదా


ఈసమయంలోనే

సంయమనం కావాలి

ఆపన్నులకు సకాలంలో

చేయూతనివ్వాలి...

బతికి బట్టకట్టేలా

సహాయం అందించి మానవత్వం చాటుకోవాలి

యుద్ధ రహిత శాంతి సమాజం

నెలకొల్పాలి.


సామ్రాజ్య వాద వ్యతిరేక శక్తుల

ఐక్యతకు కృషి సల్పాలి

శాంతి సామరస్యవ్యవస్థను

పునరుద్ధరణకు చేయూత నివ్వాలి


ఈ విధ్వంసం ధ్వంసం కావాలి

 ఈ విధ్వంసం ధ్వంసం కావాలి!

శ్మశాన వైరాగ్యం పొంది

బౌద్ధం స్వికరించే

చక్రవర్తుల కాలంకాదు

రక్తదాహం తలకెక్కిన

ఉన్మాదుల కాలం ఇది

అన్నార్తుల ఆక్రందనలతో

రుధిరధారల ప్రవాహంలో

ఆనందంగా గంతులేసే

ఛాందసమతవాదుల,

సామ్రాజ్య వాదుల

కరాళనృత్యంలా

పేట్రేగిపోతూండే కాలమిది

పడమటి ముసాంబరంలా

నిత్యం రావణకాష్టంలా

ప్రపంచం ఓలలాడాలనే కండూతి వారిది

ఇక ఇప్పుడు 

ఆ తలకెక్కిన ఆ అకృత్యపు దాష్టీకం

సమూలంగా నశించాలనే ఘోష 

నలు దిక్కులా మార్మోగాలి

వారి కర్ణభేరులు పగిలి

మూసుకుపోయిన నేత్రాలు తెరవబడేలా

శాంతి హోరు ఝంఝా మా‌రుతమవ్వాలి

సౌహార్ద్ర భరోసా అందేలా

శాంతి కాముకులు నడుము బిగించాలి.



దీపావళి 2022

 దీపావళి

పండుగ బులబాటం

లంగావోణి బుజ్జమ్మ

తమ్ముడితో టపాసుల

కేరింతలెడుతుంటే

ఆ రెండంతస్తుల మేడలో

ముందస్తు వెలుగులు

జిగేలుమంటుంటే

దానికానుకుని ఉన్న

గువ్వంత గుడెసలో

గోపి కళ్ళు 

గుండె అలసిన

వెక్కిళ్ళ ఏడుపుగా 

ఉబుకుతున్నాయ్

తనెపుడు టపాసులెపుడు కాల్చాలా అని!

ంంంంంం

గుడికెళ్ళిన గురవమ్మ

కన్నేదో అదిరిందని కలవరపడి

కీడేదో తిష్టవేసుకుందని

బిరాన గుడెస దారి పట్టింది 

ముక్కు చీదుకుంటూ

ంంంంంం

పొలంలో పుల్లయ్య

చేతిపార జారి 

జానెడు ఎత్తులో

పాదానికి ముద్దెట్టుకుంటే

మట్టిరంగు బురదనీరు

ఎర్రతామరలా మెరుస్తున్నప్పుడు

అతడిని దుగంపై మేను వాల్చమంది

స్పృహతప్పిన శ్రమపై

జాలిపడింది కామోసు

చినుకులు పెరిగి ముఖాన్ని తడిపింది

తేరుకున్నదే తడవుగా

గోధూళివేళైందని

అరకెడ్లని తోలుకెళ్ళె గుడిసె వైపు

ంంంం

గోపి గోస ఆగలేదు

సముదాయించగ గురువమ్మకు

తోచడంలేదు

గుడెసచేరి నివ్వెరపోవడం

పుల్లయ్య వంతైతే

కాలిగాయానికి పసుపులేపనమద్ది

గోపిగాడిని చంకనెత్తుకుని

మేడలో కురుస్తున్న వెలుగుల్ని చూపెడుతోంది

సంబరంలో నోరెళ్ళబెట్టిన గోపి

కళ్ళప్పగిస్తూ తల తుడుచుకుంటూ పుల్లయ్య

బుగ్గమీదవేలేసుకున్న గురవమ్మ

తమ బతుకుకు దిగాలొందక

మేడవెలుగులు పంచుకొంటూ

పండుగ సంబడాలందుకోవడం

ఎంత విచిత్రంగా, సర్దుబాటు తత్వంగా

ఎంత సంయమనం..

తమకు లేకపోతేనేం

పొరుగువారి ఆనందాన్నైనా

ఆస్వాదించడం...


24.10.2022.దీపావళి శుభాకాంక్షలు...

మినీ

 కలిసి పనిచేసినపుడు

ఆత్మబంధువు

పార్టీ మారినాక

ఆగర్భ శత్రువు

పదవి కోసం

 పదవికోసం

పార్టీ మారిన నేతకు సిగ్గులేదు

సైద్ధాంతిక నిబద్ధతలేదు

ఇన్నాళ్లు కొమ్ముకాసి

జెండాలు మోసి దెబ్బలు తిన్న

కార్యకర్తలకేమైందని

జనాలైనా ప్రశ్నించి నిలదీయరా ?

ఓటడగవచ్చిన అభ్యర్థిని కడిగేయరా

ఎన్నికల నగారా

 ఎన్నికల నగారా మ్రోగింది

జర భద్రం జనులారా

వరాల జల్లులు మొదలౌతాయి

వానాకాలం వెళ్ళి శరత్కాలారంభంలో

లెక్క, ముక్క,చుక్క అంపకాలు

దళారీలకు దండుకున్నంత

ఓటర్లకు చేరేది చాల తక్కువగా వడ్డన జరుగుతుంది

ప్రలోభాలకు లొంగారో

ఐదేళ్ళు కష్టాలు పక్కన చేరినట్టే

అమ్ముడుపోమని కరాఖండిగా చెప్పటానికి

సిద్ధంకండి

ఎవరెవరు ఏ పార్టీలు మారారో

వేసిన ముసుగులు తెలుసుకోని మసలండి

గతంలో వారేమి చేసారో నిలదీయండి

ప్రజలకొరకు పనిచేసే వారినే గెలిపించండి

నిర్లక్ష్యం చేస్తే మీకే నష్టం.

పైత్యం

 స్వాతంత్ర్య దినోత్సవ సంబారాలా...

అత్యుత్సాహపు పైత్యమా..

.శబ్దకాలుష్యం...విన్యాసాలు....

 ఆహా....ఏమి సంబడం 

జనాలకు ఇబ్బంది కలిగించడమే లక్ష్యమా.

ఖండించండి అంగాన్ని

 ఖండించండి అంగాన్ని

వాడో అంధుడైవుంటాడు

మదాంధుడై కూడ ఐ వుంటాడు

మూత్రాన్ని ఏదో మొక్కకు నీళ్ళెట్టినట్టనుకున్నాడా

లేదా నిస్సిగ్గుగా తన కర్కశత్వం 

చూపించాలనుకున్నాడా

మనిషో మానో తెలియలేదంటే

కుక్కబుద్ధి ఆవహించిందేమో

మతిచెలించనవాడైతే తప్ప 

సామాన్యుడు చేయడీ నీచపు పని

వాడికి వావివరుసలు మృగ్యం 

వాడు మృగం కాబట్టి

వాడొకవేళ తారసపడితే

మొహమాటం లేకుండా అంగాన్ని కోసిపడేయండి.

ఎమర్జెన్సీ

 కొన్నేళ్ళ క్రితం చీకటి కొట్లో

ఆత్యవవసర దండనలో

జైలు ఊసలతో ఎన్ని చేతులు

ఊసులాడి ఊపిరాగిపోయాయో

ఎంతమంది నేతలకారణంగా

నిర్బంధాల మధ్య జీవితపు చేదుననుభవించారో

మాట్లాడాలన్నా సమాచారందచేయాలన్నా

లాఠీల విన్యాసాలు తుపాకి మొనల బెదిరింపులు, ఆంక్షలెన్నో

కుహనా ప్రజాస్వామ్య వ్యవస్థ

నిరంకుశావతా‌రమెత్తి ఎన్ని నిజాలని ఎన్కౌంటర్ చేసిందో

అనుభవాలు పంచుదామనే

ఆశలు ఎన్ని నిరాశకు గురైనాయో

ఎన్నో జైలు గోడలపై  నినాదాలు రచించిన

కవులెన్ని  ఉద్యమాలకూపిరి పోసారో

రాక్షస చట్టాలను ఎదిరించిన యోధులు

రక్షకభటుల చేతిలో హతులయ్యారో....


నాలుగు దారుల కూడలి

 ఓ నాలుగు దారుల కూడలి

ఏ దారెటుపోతుందో 

తెలిపే దిక్సూచి విరిచేసారెవరో

రాజకీయాలు నాట్యమాడే రోజులు కదా

తూర్పు ముఖంగా వెడదామా

సూరీడెదురొచ్చి పంబరేపుతాడు

పడమర దారి పడితే

చీకటి పాలవటమేతప్ప గమ్యం చేరం

ఉత్తరం నడక సాగిద్దామా అంటే

మనకి సిఫార్సు చేసేవారు లేరు

హిమాలయాల మంచు నిలువరిస్తుంది

దక్షిణ వెంపు సాగుదామంటే

డబ్బు దస్కం లేదాయె.

కన్యాకుమారి కాడ మూడు సముద్రాల సంగమంలో నిమజ్జనమే

ఏది దారి ..

రహదారి చీటీ యిచ్చేదెవరు

నిజాలకి ఇజాలకీ చోటులేని ఇలాకాలో

కక్కుర్తిపడే జనాలకు భోజనాలు భజనలుంటే చాలు

సామాన్య ప్రజలు చస్తేనేం

బతికితే నేం

ఐదేళ్ళ ఓట్ల జాతరలో చుక్క, ముక్క లెక్క కిక్కురుమనకుండా పుచ్చుకుని

అచ్చేస్తేచాలు

ఏ దిక్సూచి ఏమి చెప్పినా

పట్టించుకునేదెవరు

అమ్ముడుపోయే జాతంటే

నేతలకు నేతిమిఠాయేకదా.

నిజాయితీ నిలువెత్తు లోతులో

సమాధైతే అదే. పదివేలు

మళ్ళీ ఎన్నికల దాకా

ఎన్నో రంగులకలలు.


ఊరెళ్ళాలంటే

 ఒకప్పుడు ఊరెళ్ళాలంటే ఉర్కుంటా పోయేటోళ్ళం, 

ఇప్పుడేమో ఊసురోమనే ఊర్ని చూస్తంటే కళ్ళెంట నీరొస్తాంది.

ఊరందరికి అవసరాలకు ఆపత్తులకు ఆధారమైన మా తాతయ్య గారిల్లు

సాయతకి సిద్ధంగుండేది

ఊరి మధ్యలో మర్రిచెట్టు 

దాని కైవారం చుట్టూ రాతి అరుగు పంచాయతీలకు నెలవు

వానాకాలం చెర్ల వరద వాగును ముద్దాడుతుంటే

వాగులోని చేపలు చెర్లోకి ఎదురొస్తవుంటే

ఒడిసిపట్టి మా మోటబాయిలో ఏసినరోజులమరవలేదు

వాగొడ్డు పరికపళ్ళు ఏరుకున్నపుడు ముళ్ళుగీరుకున్నది ఎరుకే

దుబ్బపాడు తాళ్ళలో తిరుగుతూ 

తీపికల్లు తాగి, 

తాటిముంజెలు కొట్టించుకుని తిన్నగుర్తులు ఇంకా యాదున్నాయి

ఆరుదూలాలు నాలుగు దిక్కులా వసారా

పోస్ట్ డబ్బాతో మా యిల్లు 

జనాలతో కళకళలాడేది

ఇప్పుడది కూలిపోయి 

నాలుగు కొబ్బరి చెట్లకు 

మూడు మామిడి చెట్లకు 

రెండు పనస చెట్లకు ఊసులు చెప్పలేక ఉసూరంటూ మట్టిని ముద్దాడుతోంది

శారద రాత్రుళ్ళు చిడుతల రామాయణం వినిపించే మట్టికట్డడం రాములోరి దేవళం

అవన్నీ శిథిలావస్థకు చేరి

పాత రోజుల తలచుకుని వెక్కి వెక్కి  ఏడ్చే ఓపిక లేనందున

ఊరిని చూడబుద్దయితలేదు

ఉన్న చెలక వదలలేను

చెట్లకోసం వూర్ల వుండలేను

ఊరొదిలి ముప్పై ఏండ్లాయి పలకరించే సోపతులు తక్కువే.

చుట్టపు చూపుగా వెళ్ళి రావడంతప్ప

అమ్మని ఆలింగనం చేయలేకపోతున్నాను

ఆ మట్టిలో కలసిపోయిందని మనేది వల్ల

తెరలుతెరలుగా దుఃఖం ఆపుకోలేక

ఊరువెళ్ళలేకపోతున్నా

ఈ కష్టమెవరికీ వద్దు..రావద్దు.

ఊరి ఊసెత్తితే

ఎన్ని పాత తీపి గుర్తులో 

సౌకర్యాలు లేని రోజుల్లో గడిపిన ఎన్ని దుఃఖపు మబ్బు తెరలో

ఒక్కొక్కటిగా సన్నని చిరుజల్లులవుతున్నాయ్

ఊరుమ్మడి మంచినీళ్ళ బావి ఒకటి గంగాజలంలా తీయగా వుండేవి...

ఆ రుచి  అరవైఏళ్ళైనా మధురజలం రుచి చెడలేదంటే అతిశయోక్తి కాదు.

మట్టిరోడ్లు. ఎడ్లబండి పయనాలు...

అటు తూర్పు దిశగా....పోతే కిష్టారం పోయే అడవి దారిన

పన్నెండు మైళ్ళపోతే  కిష్టారం చేరితేనే బస్సెక్కి రాజమండ్రి కి తారురోడ్డు

ఇటు పదహారు మైళ్ళు పోతే 

వంగాముత్యాల బంజర చేరిఖమ్మం హైదరాబాద్ వెళ్ళేదారి

మరోవెంపు ఇరవై మైళ్ళు అడవిబాటలో బండిమీద వెడితే... కొత్తగూడెం

సరుకులు కొనుగోలుకు, పంట అమ్మకాలకు

ఊరి అవసరాలకు ఇంకోటి జిల్లా పరిషత్ వాళ్ళు తవ్వించిన వాడకం నీటి బావి..

మా వూరికి రెండు మైళ్ళ దూరంలో అన్నపురెడ్డిపల్లి...అక్కడ కాకతీయుల కాలంనాటి బాలాజి వెంకన్న గుడి

***

డెబ్బై య్యో దశకంలో.... కచ్చా రోడ్లు 

తారు నింపుకున్నాయి

కిరోసిన్ దీపస్తంభాలు కరెంట్ దీపాలయ్యాయి.

కృష్ణ జిల్లా తిరువూరు నుండి మొదట్లో ప్రయివేటు బస్సులు తిరిగాయ్

క్రమేపి ఆర్.టి.సి. రోజుకు నాలుగు ట్రిప్పులతో నైట్ హాల్ట్ అన్నపురెడ్డిపల్లి..

***





సంబరాలు

 సంబరాలు అంబరాన్ని అందుకున్నా

ఎన్నో విజయాలమధ్య అపజయాలు గమనిద్దాం...ఎదురవుతున్న సవాళ్ళను

సహృదయంతో మొక్కవోని పట్టుదలతో

గతాన్ని మూల్యాంకనం చేసుకుంటూ

పూర్తి చేయాల్సిన పనులను త్వరితగతిన నెరవేర్చుదాం 

పదేళ్ల సర్కారు జవాబుదారీతనం

ఇప్పుడు మరింత పెరిగింది 

విద్య, వైద్యం, విద్యుత్, వ్యవసాయం రవాణా రంగం,సాగునీరు, తాగునీరు జలాశయాలు పటిష్ట పరచాలి

వసతులు పెంచుకోవాలి

సంక్షేమ పథకాల ఫలాల పంపకాలలో

లొసుగులు రానీయకుండా 

అవినీతికి పాల్పడితే అరదండాలు వేస్తూ

నిజాయితీ కేతనం ఎగరాలి

రోజువారీ కూలీల భద్రత

మహిళలు రక్షణ

బాలికలకు భరోసా

వేతనాలు  ఫించన్లు పొందే

జీవులకొకటో తారీకు బట్వాడా 

స్వచ్ఛమైన సేవలకు అద్దంపట్టేలా

కొట్లాడితెచ్చుకున్న సంబరాలలో

అపశ్రుతి రాకుండా 

కొలువులు పూరించి, నీటి నిల్వలు పెంచి

స్వయం సమృద్ధి దిశగా అడుగు వేయడానికి

సంసిద్ధత కలిగి సంశయాలకు తావులేకుండా అభివృద్ధి చేతల్లో చూపితేనే

బంగారు తెలంగాణ

ఎట్టిపరిస్థితుల్లోనూ ఆశయాలు దెబ్బతినకుండా

ఆచరణలో నిబద్ధత నిలుకోవాలని

శపథం చేయడం అనివార్యం.

కేంద్రంతో రాజీలేని పోరుచేస్తూ

నిధులు రాబట్టుకోవాలి

ఏ ఆశయంతో రాష్ట్రం సాధించుకున్నామో

అమరుల త్యాగం మరువకుండా

మనం స్వార్థపు దారి పట్టకుండా

తెలంగాణ రాష్ట్ర వికాసానికి

పునరంకితమౌదాం.

పదేళ్ళొచ్చనా

 పదేళ్ళొచ్చినా

పదోఎక్కంరాని కుర్రాడిలా

దిక్కులుచూచే సర్కారు జాగిలాల

ఆగమెక్కవౌతుంటే

జవాబుదారీతనం తుంగలో తొక్కుతుంటే

చీమకుట్టినట్టు లేని నేతలెందుకు

పంపకాల సంచీ బొడ్లో దోపుకుందుకా

ప్రశ్నించేవారికి. అరదండాలు వేస్తూ

సభల్లో వారికి గులాబీ దండలేందిరా

రోజువారీ కూలీలనుండి

ప్రతీవాడీ కంట్ల కారంకొట్టుడేందిరా

వేతనాలు  ఫించన్లు పొందే

జీవులకొకటో తారీకు

ఎదురుచూచే ఎండమావులౌతున్నయేందిరా

స్వచ్ఛమైన సేవకులకు

ఆశ నిరాశచేసే పరీక్షలెందుకురా

రైతుకంట కన్నీరేందిరా

ఆడకూతుళ్ళ కలవరాలేందిరా

డబ్బున్నరాష్ట్రమని డప్పుకొట్టి 

దరువులాగలేదురా

ఖజానాకు మాత్రం పెద్ద బొక్కేయెపుడు

చూపుతున్నరేందిరా

కొట్లాడితెచ్చుకున్న సంబరమేది

చంకనాకినోళ్ళు కొలువుల్లో

జైలుకెళ్ళి దెబ్బలుతిన్నోళ్ళు పస్తుల్లో

మనతోటలోని పండ్లెవనిపాలాయెరా

సోపతుల విడగొట్టి సోపానాలెవడెక్కె

కానకుంటే కటిక చీకటేరా

రోడ్లెక్కి మరల ఉద్యమం నడపాలిరా

దోచుకుని దాచుకునేటోడ్ని

ఈడ్చికొట్టి ఊడ్చేయడానికీ 

సకలజనం బిగించాలిక పిడికిళ్ళు

గళమెత్తె జనతెలంగాణ

సాధించుకోవాలిరా


రహదారి కూడలిలో

 రహదారి కూడలిలో

ట్రాఫిక్ వ్యవస్థ సరిగా లేకపోతే

రోడ్డు ప్రమాదం జరిగితేనే

మనసు చివుక్కుమంటుంది

సాంకేతికంగా అభివృద్ధి చెందిన

రైల్వే సిగ్నల్ వ్యవస్థ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే

ఒకే వరుసలోకి రెండు మూడు రైళ్ళు 

ఢీకొనడంతో జరిగే నష్టం ....వ్యధ. బాధ

మరణాలు క్షతగాత్రులు....ఎంత కలచివేసింది.....

ఎవరిని నిందించినా ఏమిలాభం

వందల శవాలు సవాలే కాని బతికి రారు

వేలాది బాధితులు కోల్పోయిన మనో ధైర్యం

రైలు ప్రయాణపు భరోసా ఇవ్వగలదా

మీన మేషాలు లెక్కించడం మాని

సత్వర సహాయక చర్యలు చేపట్టండి


ఆటల అడుగులు

 ఆటల అడుగులు

పతకాలు తెచ్చాయి

వేటాడే అడుగులు

విజేతలను హింసించాయి.

పొగడిన రాజ్యమే

దాష్టీకం చేస్తే

విజేతల అడుగులు

విప్లవకేతనాలయ్యాయ్

నిజం నిగ్గు తేల్చండి

 రాజ్యాంగ సౌలతులు పొందుతూ,

మేమేదో పొగరుగా

కాలర్ ఎగరేస్తున్నామనే ఈర్ష్య పొందుతున్న వారికి,

వాస్తవ పరిస్థితులను కళ్ళద్దాలు తీసి చూడండి

డప్పు మూయలేని మా బతుకులకు

మా చర్మాన్ని తాపించాలని చూసే 

కామందులింకా మీసాలు మెలేస్తున్నారు

అరాకొరా ఉద్యోగాల సాకు చూపి

ఓట్లు దండుకునే యంత్రాంగం మా నెత్తిన

పెట్టి....చోద్యం చూడడం కాదు

పొలంలో, పని బిలంలో  గడ్డపారలు ఒదేసిన

యోని రంధ్రాల రక్తస్రాల మరకల కనపడవా

వేటినో వీటినో కొన్నింటినో...రంగులతెరపై

బయస్కోపు చేయబూనుతూ

పచ్చినిజాలు చూడడానికి కళ్ళుతెరవండి

మాకు తలెత్తినా కనపడదు పట్టణంలో

ఈ మధ్యనే కట్టిన క్రీస్తు దేవాలయం

ఎవరూ చూడకూడదనుకున్నా

కూలిపోతున్న దళిత గుడెసలెన్నో

పెద్ద తెరమీద సైన్మా బొమ్మైనపుడు

మరియమ్మలు, అబ్రహాములు

మల్లమ్మలు సోమయ్యలు

వ్యత్యాసాల వాసాలమధ్య

వేలాడుతూ వున్నారు.

క్రైస్తవం వచ్చి ఎవరిని మెరుగుపరిచిందోలేదో

ఎంతమందకి చదువు పంచిందో లేదో

ఎంతమంది అంలలాలెక్కారో

ఎక్కలేక కుదేలయ్యారో కాని

ఆరోగ్య విషయంలోనే  వున్నది తేడా

అమెరికా దింపిన ఆస్పత్రిలో

మందులు ఇచ్చి రోగాలు తగ్గుతున్నాయా

స్వస్థత ప్రార్థన వల్లనా....

అర్థం కాదు కాని గాలిలో కలసిన 

శవాలు పూడ్చడానికి

చోటేలేని శ్మశానాలవిగో.....

 శవాలగుట్టలనుండి

సవాలు విసురుతున్నా

దూరపు క్రైస్తవం తెచ్చింది లేదు

పుట్టుకతో హిందుత్వం ఇచ్చిందిలేదు

నిజం నిగ్గు తేల్చండని.



జాగోం సబ్ లోగోం

 జాగో సబ్ లోగోం


ఎందుకండీ ఆచరణకు నోచుకోని

ప్రతిజ్ఞ రోజూ  వల్లెవేయిస్తారు బడిలో

అన్నదమ్ములనే బోధనచేస్తుంటారు

కాని దేశంలో భాషలు జాతులు  

భిన్నత్వంలో ఏకత్వం అనేది

ఒక కుహనా భావనే తప్ప నిజంకాదు

ఎందుకో కొంతమంది 

పాలకుల పుణ్యమా అని

వాస్తవానికి దానికి విలోమంగా ఉన్నాయన్నది నగ్న సత్యం

చెప్పేవి శ్రీరంగనీతులు 

దూరేవి...గుడెసలన్న చందాన రాజ్యమేలే

కమలనాథుల ప్రభుత్వ పాలనలో

రాజ్యాంగానికి చిల్లులు పెడుతు

కాలంచెల్లని మనుస్మృతిని అంటుపెడుతుంటే

లౌకిక ప్రజాస్వామ్య వ్యవస్థ ఉరేసుకోబోతుంటే

స్తోత్రాలు వల్లిస్తూ గమ్మునుండటం కాదు

అనివార్యంగా

పిడికిలి బిగించి ప్రజాపోరుకు సిద్ధపడాలి...


 నాన్న చేయి కాయలుకాసి

పిల్లలకి ఫలాలనందించె

కల్పవృక్షం

1818 సమీక్ష శ్రీ రాం దీర్ఘ కవిత

 ఆశ్చర్యార్ధకాలేవీ లేవు 

కనుబొమ్మలెగరేయ వద్దు 

అందంగా చెప్పదలుచుకోలేదు 

అతిశయమేమీ లేదు..


అది వేటకెళ్ళిన రాజుగారి కధ కాదు. రాజును వేటాడిన సైనికుల కథ 

కటిక చీకటిలోంచి 

కడగండ్ల దారులమీంచి

జవగల గుర్రంలా పరుగెత్తిన కథ


పేగు తెంపిన మంత్రసాని చనుబాలు తాగనివ్వని పసివాడి నోట్లోంచి బొటనవేలునై బయటకొస్తున్నాను 

నేను భీమా నదిని...అంటూ

1818  - 2018  మధ్య నేపథ్యంలో ఓ దీర్ఘ కవిత భీమానదిచేత శ్రీరాం చెప్పించటం ఒక ప్రత్యేకత. 

సాహిత్యం తో పాటు చరిత్ర, అర్థశాస్త్రం అధ్యయనం చేసినపుడు నేటి సమకాలీన జనజీవన ఇక్కట్లకు ఒక సాహితీ సార్థకత నెరపడమే కవి లక్ష్యం అని నా నమ్మకం. 

అట్టి కవనానికి దీర్ఘ కవిత గా రూపొందించిన 

కవికి అభినందనలు.

మరికొన్ని నాకు రుచించిన భీమానది నీటి తుంపరలు జల్లుతాను.


పేగు తెంపిన మంత్రసాని 

చనుబాలు తాగనివ్వని పసివాడి నోట్లోంచి

బొటనవేలునై బయటకొస్తున్నాను 

నేను భీమా నదిని...


కాళ్ళకి చెప్పుల్లేని నేల సిగ్గు కప్పుకునేందుకు గుడ్డ పీలిక లేని నేల

 ప్రేమ తీరని నేల, 

చేతులెత్తి రాత్రింబగళ్ళని కావులించుకునే వేళ ఆకాశం నుంచి వివక్షల వాన కురిసేది.


కాబట్టే

రెండు శతాబ్దాలుగా

నొప్పెడుతున్న అవయవాల్లోంచి

వొళ్ళు విరుస్తున్నాను

కప్పెట్టిన అవశేషాల్లోంచి

కళ్ళుతెరుస్తున్నాను

...

ఈ మౌనాన్ని బద్దలుకొట్టాలి

ఈ వేటని వ్యతిరేకించాలి

ఏ దేశమైనా దేవుళ్ళది కాదు

కష్టజీవులదని చెప్పాలి.


చరిత్ర రాసినవాడు అంతఃపురంలో వున్న రాణుల పాదాలకు పారాణి పూస్తాడు

సామ్రాజ్యాలు చుట్టి వచ్చిన రాజుగారి గుర్రపు డెక్కల కచేరీ చేస్తాడు.


ఇది పత్రహరితాన్ని వేటాడ్డం, ఇది సాల్వాజుడుం, అన్నల్ని చంపమని తమ్ముళ్ళని ఎగదోయడం అక్కల పాలిండ్లలో తల్లితనాన్ని నలపడం ఇది అరాచకం, ఈ యుద్ధం అంతం కావాలి


నేను భీమా నదిని, ప్రాధేయ పడుతున్నాను ఇసుక మేటలు వేస్తున్న చట్ట సభలనుంచి

ఈ దేశపు నత్తగుల్లల్ని ఎవరన్నా కాపాడండి


నేను భీమా నదిని ! మార్చురీ గదుల్లాంటి ఈ దేశపు జైళ్ళ ముందు సహచరుల కోసం గడ్డగట్టుకుపోతున్నాను


నేను భీమా నదిని ఈ దేశపు శ్రీకృష్ణ జనన గర్భానికి తల ఆన్చి దేశవాళీ పదాలతో లొల్లాయిగడుతున్నాను జైల్లోపల ఎవరో శూద్ర సంతతి తల్లి పేడనీళ్ళతో కళ్ళాపి జల్లి

బియ్యప్పిండి ముగ్గులు వేస్తోంది దాని చుట్టూ నల్లటి చీమలు బారులు తీరుతున్నాయి-

ధర్నాలు చేస్తారు, కవుకు దెబ్బలు తింటారు,

మీరీ దేశాన్ని ప్రేమిస్తారు, దగాపడుతున్న మనుషులంటే పడీ పడిచస్తారు మీకు ఎన్కౌంటర్లంటే భయం లేదు, మరణాన్ని లెక్క చేయరు


ఇండియా ! నీవు శ్రీకృష్ణదేవరాయుని వజ్రపు రాశివి కాదు రోజు కూలీ ( అడ్డాలో )కూడళ్ళలో నిలబడ్డ కాలే కడుపువి


నేను భీమా నదిని ! ఆఖరి సారి హెచ్చరిస్తున్నాను ఇండియా ! సాయిబాబాని విడిచిపెట్టు నా ప్రియాతి ప్రియమైన కవి వరవర రావును కూడా


నీ గుండెలవిసిపోయే లోపు నా ధర్మాగ్రహంతో దాహం తీర్చుకోవే ఇండియా ! కాస్త తెరిపిన పడు...



Friday, April 26, 2019

||కపిల రామ్‌కుమార్‌||మనసేమీ బాగోలేదు||
మనసేమీ బాగోలేదు
ప్రతీనోట ఇదేమాట!
జెండర్ తేడాలేదు
ధనిక బీద వ్యత్యాసమసలే లేదు!
ప్రతీ నోట అదే పాట!
సర్కార్ల నిర్వాకం వల్లనే ఈ గతి!
జనాలకేదో మేలు చేస్తారనే దురాశతో
అమ్ముడుబోయి వోట్లు వేశాంకదా!
దాని పర్యవసానమే ఇది.!
''చౌపట్ రాజా అంథేరీ నగర్'' తీరు!
బ్యాంకులు కొల్లగొట్టుకెళ్ళినవారు
నిక్షేపంగానే వున్నారు
విదేశాల్లో విహారం చేస్తూ!
ఇక్కడే ఫణం దొరకక
పడిగాపులుకాస్తూ
తద్దినాలు పెడుతున్న సంగతి మాత్రం పట్టదెవరికి!
మబ్బులు కురవవు –
పంటలూ పండవు -
ఇక కైలూ కాదు –
ఆ పైన ధరా రాదు!
చదువులు సాగవు - కొలువులు రావు –
నెలవులు నిలవవు
శీలాలపై ఎక్కడో అక్కడ ప్రతీ క్షణం
శీలలు దిగబడ్డ ఆర్తనాదాలూ ఆగవు
సవాలు చేదామనుకున్న
ప్రతీ పురోగమన ఉద్యమాలని
శవాలుగా మార్చడమే
రాజ్యహింస ధ్యేయం కదా!
ఎవడు తలెత్తుకుని తిరగలేడు
ఎవడు ఎదిరించి బతకలేడు
చావుని చంకనబెట్టుకోకలిగితేనే ధైర్యమున్నట్లు
లేదా అందరూ పిరికివాళ్ళే
మనలో మనకు పరాయివాళ్ళే
మహోధృతంగా బహుజన వామపక్ష ఐక్యతే
ఈ రాబోయే వడగాలులకెదురు తిరిగేది!
కాబోయే కాలం కలిసొస్తుందని
గుర్తించి అడుగేయందే
బడుగుల బతుకుల్లో వెలుగు రాబోదు!
మనసున్న మనుషులుగా మనగలగాలంటే
ఆ దారి దొరకబుచ్చుకోవాల్సిందే
అప్పటిదాక
ఎవరి మనసు బాగోదు
మన మనసు బాగుకోసం
మన మనుగడకోసం
ఇకనైనా ఎత్తరా నీ కలాన్ని, గళాన్ని,
ఎగిరే అరుణపతాకం దారిలో
నీ అడుగు కదపరా!
ఆ గమ్యం చేరేలా కదలిరా!
//కపిల రాంకుమార్..//చెట్టు//
ఎన్నాళ్ళు పెంచుతావో చూస్తనంది
పండ్లనివ్వలేదని విసుక్కోకంది
నీళ్ళు పోయలేక సాకులు వెతక్కంది
ఆకులు రాలిపోతుంటే...
వయసైపోయిందేమోనని అనుమానపడకంది
కాలానికి తగ్గట్టు చిగురెడతానని ఆశించమంది
కాకులు చేరి గోల చేస్తున్నాయని కోపంగా చూడకంది
కిలకిలరావాల పక్షులు చేరినపుడానందించమంది.
కాదు కూడదంటే నీ మనుగడేవుండదంది
***
కాలం మారటం కాదు
మనుషుల మనసే మారిపోతున్నకాలమిది
పచ్చదనం సహించలేరు
కాయలున్నచెట్టుపై రాళ్ళేస్తారు
కొమ్మలునరికి నిప్పు రాజేస్తారు
పొరుగువాడి మనసు చెడగొట్టి
చెట్టును పడగొట్టాలని తొడగొట్టుతారు
***
చెట్టునేమిచేదాం....
ఆలోచించు నేస్తం.
సాకుతావా
చావుకు సాగిలపడతావా.
ఆలోచించు. నేస్తం.
అవలోకించు.
కపిల రాంకుమార్‌ || అస్పష్ట జ్ఞాపకం||
అట్లతద్ది ఆటల్లో
చెట్టుకొమ్మన ఊయల్లో
బాల్యపు ఊసూలెన్నో కలబోసుకుంటూ
మగ ఆడ తేడలేకుండాచెట్లమ్మటి గుట్లెమ్మటి
తోసుకుంటూ గిచ్చుకుంటు
ఊహతెలియని జతకట్టుకుంటూ
వాగులెమ్మటి ఇసుకలో దుదుంపుల్లలాడుకుంటూ
అమ్మా నాన్నలాడుకుంటూ
గువ్వలమై ఎగిరిన రోజులు
గునగునమంటూ యాదిచేస్తుంన్నాయి!
**
పండుగలకు పబ్బాలకు
కలసికట్టుగ సామాగ్రితెచ్చిన రోజులు
తొక్కుడు బిళ్ళ, గుడుగుడు కుంచం గుండేరాగాలాడిన రోజులు
ముక్కుడు గిల్లులాట, చేలగట్ల పరుగులెత్తిన రోజులు
కలువపూలకోసం ఒక గుంపు
తామరపూల కోసం ఒక గుంపు
పోటీపడి ఈదులాడిన రోజులు
**
దీపావళి ఉప్పు పొట్లాలు
గోగుకాడ దివిటీలు
నాగులచవితికి దాచుకున్న రోజులు
కార్తీకపున్నమికి ఎగరేసిన తారాజువ్వలు
పోటీపడి కాల్చిన రోజులు
**
పరీక్షల హడావుడికి
కొత్త కలాలకోసం దెబ్బలాడుకున్న రోజులు
ఉదయాన్నే చద్దన్నంలో ఆవకాయతో వెన్నముద్దలేదని
గడ్డ పెరుగు పోయలేదని మారాము చేసిన రోజులు
పుస్తకాలు ముందేసుకుని
ఒకరికొకరం వల్లెవేయించుకున్న రోజులు
**
మాయదారి వయసులొచ్చి
లంగావోణీల్లో ముద్దబంతి పూవులైన నేస్తగాళ్ళతో
ఆ ఆటలు బందయినా
స్నేహ బంధం నిలుపున్న రోజులు
ప్రేమలు దోమలు అంటూ చదువు చెడకొట్టకండంటూ
పెదనాన్న మందలింపులు
చిన్నత్త సలహాలు, చెవి మెలిపెట్టి తీయించిన గుంజీలు
**
ఇక ఉద్యోగాల్లో కొందరు
ఇతరేతర వ్యాపకాల్లో కొందరు
చెల్లా చెదరైనా
వయసు పక్వానికొచ్చి అత్తారింటికి కొందరు
పిల్లలతో కుటుంబాలతో బిగించబడినా
సంవత్సరానికొకసారైనా కలసి నెమరేసుకున్న రోజులు
ఉత్తరాలు రాసుకునేవాళ్ళం
తరువాత ఫోనులు చేసుకునేవాళ్ళం
ఇక యిపుడైతే మెసేజీల పాలై
ఆనాటి అనుబంధాలు దూరమైనట్లనిస్తుందని
సరోజ, సుజాత, వెంకటీ, కృష్ణమూర్తి
ఫేసుబుక్కులో మొత్తుకున్నారు
**
ఆ రోజుల్లో జాజిపందిరికింద కందిరీగ కుట్టి
ఒక కన్ను పోయిగోలపెట్టిన గౌరి
పొలంగట్టున చెట్లకింద ముంజెలు తింటూ గట్టుజారిపడి
విరిగిన కాలుతో వెంకటి
కళ్ళముందు మెదిలే ఎల్లని, నల్లని మబ్బుదొంతరల రోజులు
గుర్తుకొస్తుంటే మసక కళ్ళను కన్నీరు కడుగుతున్నది
మనవళ్ళతో పాత అస్పష్ట జ్ఞాపకాల తెర!
కపిల రామ్‌కుమార్ || మట్టి మనిషి మట్టిలోనే కలవాలా?||
మట్టి మనిషి మట్టిలోనే కలవాలా?
'' అన్నదాతా సుఖీభవ ''
కంచం ముందు చేయికడిగినప్పుడల్లా
యాది చేసుకుంటున్నది సత్యం!
సుఖ జీవనమన్నది మృగ్యముతున్నదీ నగ్న సత్యం!!
**
వరైనా, మరేదైనా
దినదినగండం నూరేళ్ళాయుసులా
పంట కొరకెన్ని తంటాలో
పెంట వేస్తే పంటొస్తాది
అది సాగు ధర్మం
ఎరువులు బరువులై విత్తులకు
ఎత్తుల చిత్తులలో
మిత్తి మీదేసుకుంటే
చివరకు నెత్తి మీద గుడ్డకూడ మిగలదేమి?
పుట్టుదలకొరకు కాళ్ళరిగినా
పుట్టినదానికి చెలక తనఖాపెట్టితేకాని
సాలిరవాలు దుక్కులు
అదును పదునుకోసం దిక్కులు చూడక తప్పదు
మడినారు వడలిపోవుండా
ఆకుల ఆశ్రమం కట్టి సాదుకుంటేనే
తరుణ వయసులో మొక్కనాటితేనే
పూత, పింది కాయలొచ్చేది
ఆకు ముడత రాకుండా సశ్యరక్షణ్ చేసి
కైలు చేయ కూలీల వెతుకులాట
మండే ఎండలు, ధరలు పోటీలో
తనూ కుటుంబంతో చేయి వేస్తేనే
ఎర్రబంగారం గంపల చేరి
కళ్ళంలో తివాసీగా మారేది.
రంగు పోకుండా పెళపెళ మన్నపుడే
మంచుపదునులో గోనెలోకి చేర్చాఅలి
మొదటి కాత కొచ్చేది నాణ్యమైనదే అయినా
మార్కెట్‌ మాయాజాలంలో రవాణా మోతతో
గిట్టేదెంతో, చేతిలో పడేదెంతో
గుమ్మంకాడే కాసుక్కూచున్న షావుకారి వాటాపోటే
మిగిలేనో లేక
మడిసి మాత్రమే కుమిలేనో ?
ప్రపంచంలో ఉత్పత్తీ అయ్యే సరుకులన్నీ
తయారీ దారుడే ధర నిర్ణయిస్తే
ఈ ధరలో మాత్రం రైతు ఉత్పత్తికికి మాత్రం
ధర నిర్ణయ హక్కెందుకు లేదో
ఆ పెరుమ్మాళకెరుక!
తులనాత్మక ఆదాయం రాక
తులాభారంలో మొగ్గలేక
తలాపున దీపమెట్టించుకునే
గతికి కారణమెవరు?
శ్మశానాలలో ఖాళి లేక పెరటిలోనే
భస్మమయ్యే వ్యవసాయ కమురు కంపు
ముక్కుకు సోకలేదా?
రైతు నిష్క్రమణలకు ఎవరిని శిక్షించాలో
పంట అనుభవదారులూ తేల్చి చెప్పండి
అన్నం తిన్నపుడె కాదు
నిత్యం సుఖీజీవుడుగా రైతును బతికించండి!
ఎర్ర బంగారం/ తెల్ల బంగారం
కళ్ళార చూడలేక కళ్ళు మూసేసుకుంటున్న
కల్లం యజమాని గోడు పట్టించుకోండి!
పశ్చాత్తాపానికి పాతికేళ్ళు
ఔను
ప్రేమలో ఐదేళ్లు మునిగి
అసాధ్యపు కోరిక వలన
అలిగింది తను
ప్రేమించడం నా వల్లకాదు
చూసుకుంటా వల్లకాడు.
అంటూ మరలిపోయింది మరులు వదిలేసి
**
దాదాపు పాతికేళ్ళ అనంతరం
అనుకోకుండా కలసి
నేనలా కోరుకోవడం తప్పనుకుంటానంది
ఔను
నిజమేనేమో..
మారుమాటలేకుండా మాయమైంది తనేకద..
ఆలోచనలో పడ్డాను
ఉంటాను...అంటూ ఈయన తప్పిపోయిన
మీ తాతయ్యలే..
ఆయన లేడు ఈయనవున్నాడు
కేవలం స్నేహితుడుగా
..అని తన మనుమరాలుతో చెప్పి..మళ్ళీ మాయమైంది అప్పటిలాగే ...
ఎప్పటికీ అర్థంగా ప్రేమతత్వంలా.......4/2019
||కళ్ళు తెరు కవీ||
కొందరు అనధికార శాసనకర్తలిపుడు
అయోమయంలో పడ్డారు
స్వీయభద్రత కోల్పోయి
కులమతాల ఉన్మాదాల దెబ్బకు
దిక్కుతోచక కూడలిలో కూలబడ్డారు
కుదేలైపోయిన చందాన
ఆ బురద వరదలో కొట్టుకుపోవాలా?
సొంత గొతు పెగల్చుకుని సర్కారుపై శంఖమూదాలా?
జనాలకోసం కలాలు ఝళిపించాలా?
లేక కులాల మతాల మతలబులను యెలా మట్టుబెట్టాలా
అనే సందేహంలో తమ దేహాలను తాకట్టు పెట్టారు!
**
నరంలేని నాలుక విసిరే
అమ్మనా బూతులకు
అంగాలకు తొడుగులేసుకుని
కనబడ్డ యోనులపై అక్కసు కక్కుతున్న
భహిర్భూమి వ్యభిచారులమధ్య
మెదళ్ళు మొద్దుబారి, అకృత్యాల దృశ్యాలు చూడలేక
కళ్ళు మూసుకునే పళ్ళుకొరుకుతున్నారు!
కవీ కళ్ళు తెరు - కుళ్ళు కడుగ
మెతకబడి లొంగిపోవడం కంటే
తిరగబడి ముందుకుపోవడమెలా అని
తేల్చుకోవాల్సిన అగత్యమేర్పడినదన్నది నగ్న సత్యం కదా!
**
ఎటు నీ పయనం కవీ
గాలికి కొట్టుకుపోవడమా
ఎదురీది ..
సహితయోర్భావ: సాహిత్యమని
జనహితమై అడుగేయటమా యోచించు!
ఆలస్యం చేస్తే నువ్వే మట్టికొట్టుకు పోతావ్‌!
సూర్యుడు చూడలేనిది సైతం
కవి చూడగలడన్నది నిజమైతే
మౌనం వీడు బాణమై కదులు...1.4.2019
ఎప్పుడు ఆశ్చర్యపడాలంటే....
ఏరోజైతే...ఏ మొగ్గనలపబడనపుడు,
ఏ శ్వాస నొక్కబడనపుడు,
ఎక్కడా ఆర్తనాదం వినబడనపుడు...
విశ్వకవీ...నీ కోరిక..
ఈ భువిలో. నెరవేరనిదే.....
క్షమించు...
కపిల రాంకుమార్||తస్మాత్‌ జాగ్రత||
నమ్మకాలు అమ్మకంపెట్టిన
దగాకోరు నాయకుల చేష్టలకు
దిక్కుతోచని కోయిల మావిచివుళ్ళు దొరకక
మౌన విషాద రాగమాలపిస్తోంది!
ఎవడెప్పుడు యే పార్టీలో వుంటాడో తెలవదు
యే రోటికాడ యే పాట పాడతాడో,
యే రోత నింపుతాడో తెలియదు!
నిన్నటిదాక తిట్టిన నోటితోనే
నేటినుంచి పొగడాల్సిన దౌర్భాగ్యానికి
అడ్డ నామాలు చెరిపి, పంగనామాలు ధరించి
పచ్చి వ్యభిచార రాజకీయానికి అలవాటుపడ్డ
నేతల చెడ కారు కూతలకు వంతపాడాలేక
మౌనం వహించిందేమో!
నోటుకు ఓటు యేమైందో?
గోడదూకే పిల్లులపై వేటేమైందో?
మరుగునపడిందో, మురుగులో పడిందో!
పాత గుర్తు మరువలేక, కొత్త గుర్తు పలుకలేక
ఇబ్బంది పడే ఊచరైవెల్లులెందరో
నాలుక కరుచుకుంటూనే వున్నారు!
ప్రజా సమస్యలు పట్టవు
స్వలాభమే ముఖ్యంగా తిమ్మిని బొమ్మినిచేయడంలో
ప్రపంచ రికార్డ్‌ మన నాయకులది!
పెంటమీది ఈగలకైనా యింగితముంటదేమో కాని,
ఫిరాయింపు కంపునేతలకు ఫినాయిలే యింపైన ఔషధం!
చేసే వాగ్దానాలు పేలపిండి తీరు
గెలిచిన మర్నాడు పదవి మత్తులో బేజారు!
**
కక్కుర్తిపడి అమ్ముకుంటె
ఐదేళ్ళు అనుభవించాల్సిందే
అడిగే హక్కుండదు
కడిగే దిక్కుండదు
నీ విజ్ఞతకే వదిలేస్తా
నీ చేతిలోనే నీ భవిత! నిలుపుకుంటావో
బతుకు మలుపుకుంటావో!
వికారి నామ వత్సరంలో
కోయిల మౌనం వహించింది!
ఎన్నికలలో కోయిలలు మాత్రం
అపశృతులే మీటుతున్నాయ్‌!
తస్మాత్‌ జాగ్రత ! జాగ్రత!
6.4.2019 ఉదయం 11.45 కవి సమ్మేళనంలో చదివినది
కపిల రాంకుమార్‌|| ఓ సాయంత్రం ||
ఓ సాయంత్రాన్ని
భుజాన వేసుకుని,
పంజాగుట్టా చౌరస్తా దాటి, మైత్రీవనం దగ్గరకు రాగానే,
''వాలిపోతున్న సూర్యుడు చీకటిపడుతుంటే
ఏ మెహంది బజారుకుకు నీ పయనం!?
అని ప్రశ్నించినట్టు
సాయంత్రం నా భుజాన్ని గోకుతోంది!
మాటాడకుండానే
అడుగువేస్తుండగానే
ఫ్లైఓవర్‌ పక్క కిషన్‌ చాంద్ పాన్‌ షాపు
రమ్మని సైగ చేస్తున్నట్టుగా
మెరిసే కలర్‌ లైట్లు కన్నుగొట్టిన చందాన
నా కాళ్ళను లాగేసాయి
అలవాటుగానే ' బగర్‌ కత్తా, ఆర్కె కిమామ్‌ ' ఆర్డర్‌ చెప్పడం
అలవోకగానే పాన్‌ నా చేతికి అందటం జరిగింది
**
రెండు అడుగులు వేసానో లేదో
ఎవరిదో తీయటి స్వరం పేరుపెట్టి ఆపింది!
దగ్గరకు వస్తున్న గుర్తుగా
ఒంటి పెర్ఫ్యూమ్‌ నా ముక్కుపుటాలను గిలిగిలిగింతలు పెడుతోంది!
రూప నా ఎదురుబడి, మారుమాటనే సందివ్వకుండానే
'' నాతో వస్తున్నావంతే - తాతా'' అంటూ
చేతులుపట్టుకుని లాక్కెళ్ళుతోంది
ఇపుడు మాత్రం భుజం మీద సాయంత్రం సైలెంటయింది!
రికార్డ్‌ చేయాలేమోనని!
రూపా బ్యూటీ పార్లర్‌లోకి నా అడుగులు లాగబడుతున్నాయ్‌
ఎలర్ట్‌ అయ్యాను!
ఆగాను!
అనుమానమూ వచ్చింది!
అడుగు వెనక్కి వేదామంటే ఏదో అవరోధం
ఓ రెండు గుండేలు నా వీపును నొక్కేస్తూ నిలువరిస్తున్నాయ్‌!
చేతులు విదిలించుకునే వీలులేకుండా
ఆ పిల్ల చంకల్లో యిరుక్కుపోయి నడుముకు నాగాభరణమైనాయి!
ఇప్పుడు నేను త్రిశంకుణ్ణేమో?
'' తాతా - కంగారుపడకు పదినిముషాల్లో పంపిస్తాంలే!
పెద్దవాడివి కదా! మర్యాద చేదామని '' అదేశంలా ఆ పిల్ల
గొలుసులతో కట్టిన బందీనినేను!
అంతే
ఆసాంతం నన్నిద్దరు ఒక్కుదుటున ఎత్తుకుని
రివాల్వింగ్‌ కుర్చీలో ప్రతిష్ఠించి
పిల్ల నా కాళ్ళకు దండం పెట్టగా
మరో మగువ నా బుగ్గ ముద్దిచ్చింది
ఆశ్చర్యపడటం నా వంతు!
ఆబందించడం వారివంతు!
వారిరువురి చేష్టలకర్థం అగమ్యం!
చల్లని చిన్న టిన్‌ బీరు ఇస్తూ
'' తాతా ఆ మాత్రం మర్యాద చేయాలి కదా'' అంది
చేతులుపట్టుకుని లాక్కొచ్చిన కానిస్టేబులులాంటి పిల్ల
'' నిన్ను చూడగానే
ఎన్నడో నన్నిడిచివెళ్ళిపోయిన
నా మావ గుర్తుకొచ్చాడంటూ''
తనివితీర ఆలింగనం చేసుకుకుని ముద్దాడినానంతే
భయం వద్దు !
ఏ సాయంత్రమైనా ఇటురావాలనిపిస్తే మాకు ఆనందం,
నీకు ఇలా సేద తీరుస్తాం '' అంది రెండో మగువ!
**
కొన్ని సందర్భాలలో ఊహించేది ఒకటి!
జరిగేది మరొకటి!
మసిపూసి మారేడు కాయ మరింకొకటి!
మాధ్యమాల మహత్తులిలాకూడ వుంటాయేమో అనిపించి
సెలవు తీసుకున్నాను అక్కడనుండి
'' చీకటి నల్లదుప్పటి విసిరితే - నీ సేవకు రాత్రిని అప్పగించి నే వెడుతున్నా
నీ గమ్యం చేరే క్యాబ్‌వచ్చింది - బై '' అంటూ
తుర్రున ఎగిరెళ్ళిపోయింది
నా భుజం మీది సాయంత్రం!
-------------------------
హైదరాబాద్‌ ఫెస్ట్‌ 2018 - శనివారం 21.4.2018 న చదివిన కవిత
కపిల రాంకుమార్‌|| ఓ సాయంత్రం ||
ఓ సాయంత్రాన్ని
భుజాన వేసుకుని,
పంజాగుట్టా చౌరస్తా దాటి, మైత్రీవనం దగ్గరకు రాగానే,
''వాలిపోతున్న సూర్యుడు చీకటిపడుతుంటే
ఏ మెహంది బజారుకుకు నీ పయనం!?
అని ప్రశ్నించినట్టు
సాయంత్రం నా భుజాన్ని గోకుతోంది!
మాటాడకుండానే
అడుగువేస్తుండగానే
ఫ్లైఓవర్‌ పక్క కిషన్‌ చాంద్ పాన్‌ షాపు
రమ్మని సైగ చేస్తున్నట్టుగా
మెరిసే కలర్‌ లైట్లు కన్నుగొట్టిన చందాన
నా కాళ్ళను లాగేసాయి
అలవాటుగానే ' బగర్‌ కత్తా, ఆర్కె కిమామ్‌ ' ఆర్డర్‌ చెప్పడం
అలవోకగానే పాన్‌ నా చేతికి అందటం జరిగింది
**
రెండు అడుగులు వేసానో లేదో
ఎవరిదో తీయటి స్వరం పేరుపెట్టి ఆపింది!
దగ్గరకు వస్తున్న గుర్తుగా
ఒంటి పెర్ఫ్యూమ్‌ నా ముక్కుపుటాలను గిలిగిలిగింతలు పెడుతోంది!
రూప నా ఎదురుబడి, మారుమాటనే సందివ్వకుండానే
'' నాతో వస్తున్నావంతే - తాతా'' అంటూ
చేతులుపట్టుకుని లాక్కెళ్ళుతోంది
ఇపుడు మాత్రం భుజం మీద సాయంత్రం సైలెంటయింది!
రికార్డ్‌ చేయాలేమోనని!
రూపా బ్యూటీ పార్లర్‌లోకి నా అడుగులు లాగబడుతున్నాయ్‌
ఎలర్ట్‌ అయ్యాను!
ఆగాను!
అనుమానమూ వచ్చింది!
అడుగు వెనక్కి వేదామంటే ఏదో అవరోధం
ఓ రెండు గుండేలు నా వీపును నొక్కేస్తూ నిలువరిస్తున్నాయ్‌!
చేతులు విదిలించుకునే వీలులేకుండా
ఆ పిల్ల చంకల్లో యిరుక్కుపోయి నడుముకు నాగాభరణమైనాయి!
ఇప్పుడు నేను త్రిశంకుణ్ణేమో?
'' తాతా - కంగారుపడకు పదినిముషాల్లో పంపిస్తాంలే!
పెద్దవాడివి కదా! మర్యాద చేదామని '' అదేశంలా ఆ పిల్ల
గొలుసులతో కట్టిన బందీనినేను!
అంతే
ఆసాంతం నన్నిద్దరు ఒక్కుదుటున ఎత్తుకుని
రివాల్వింగ్‌ కుర్చీలో ప్రతిష్ఠించి
పిల్ల నా కాళ్ళకు దండం పెట్టగా
మరో మగువ నా బుగ్గ ముద్దిచ్చింది
ఆశ్చర్యపడటం నా వంతు!
ఆబందించడం వారివంతు!
వారిరువురి చేష్టలకర్థం అగమ్యం!
చల్లని చిన్న టిన్‌ బీరు ఇస్తూ
'' తాతా ఆ మాత్రం మర్యాద చేయాలి కదా'' అంది
చేతులుపట్టుకుని లాక్కొచ్చిన కానిస్టేబులులాంటి పిల్ల
'' నిన్ను చూడగానే
ఎన్నడో నన్నిడిచివెళ్ళిపోయిన
నా మావ గుర్తుకొచ్చాడంటూ''
తనివితీర ఆలింగనం చేసుకుకుని ముద్దాడినానంతే
భయం వద్దు !
ఏ సాయంత్రమైనా ఇటురావాలనిపిస్తే మాకు ఆనందం,
నీకు ఇలా సేద తీరుస్తాం '' అంది రెండో మగువ!
**
కొన్ని సందర్భాలలో ఊహించేది ఒకటి!
జరిగేది మరొకటి!
మసిపూసి మారేడు కాయ మరింకొకటి!
మాధ్యమాల మహత్తులిలాకూడ వుంటాయేమో అనిపించి
సెలవు తీసుకున్నాను అక్కడనుండి
'' చీకటి నల్లదుప్పటి విసిరితే - నీ సేవకు రాత్రిని అప్పగించి నే వెడుతున్నా
నీ గమ్యం చేరే క్యాబ్‌వచ్చింది - బై '' అంటూ
తుర్రున ఎగిరెళ్ళిపోయింది
నా భుజం మీది సాయంత్రం!
-------------------------
హైదరాబాద్‌ ఫెస్ట్‌ 2018 - శనివారం 21.4.2018 న చదివిన కవిత
किताबें कुछ कहना चाहती हैं.. ...
किताबें करती हैं बातें
बीते जमानों की,
दुनिया की, इंसानों की,
आज की, कल की,
एक-एक पल की, गमों की,
फूलों की, बमों की, गनों की,
जीत की, हार की,
प्यार की, मार की।
क्या तुम नहीं सुनोगे
इन किताबों की बातें ?
किताबें कुछ कहना चाहती हैं
तुम्हारे पास रहना चाहती हैं
किताबों में चिड़िया चहचहाती हैं
किताबों में झरने गुनगुनाते हैं
परियों के किस्से सुनाते हैं
किताबों में रॉकेट का राज है
किताबों में साईंस की आवाज है
किताबों में ज्ञान की भरमार है
क्या तुम इस संसार में नहीं जाना चाहोगे?
किताबें कुछ कहना चाहती हैं..
तुम्हारे पास रहना चाहती हैं।
किताबें कुछ कहना चाहती हैं..
किताबें करती हैं बातें
बीते जमानों की,
दुनिया की, इंसानों की,
आज की, कल की, एक-एक पल की,
गमों की, फूलों की, बमों की, गनों की,
जीत की, हार की, प्यार की, मार की।
क्या तुम नहीं सुनोगे इन किताबों की बातें ?
किताबें कुछ कहना चाहती हैं
तुम्हारे पास रहना चाहती हैं
किताबों में चिड़िया चहचहाती हैं
किताबों में झरने गुनगुनाते हैं
परियों के किस्से सुनाते हैं
किताबों में रॉकेट का राज है
किताबों में साईंस की आवाज है
किताबों में ज्ञान की भरमार है
क्या तुम इस संसार में नहीं जाना चाहोगे?
किताबें कुछ कहना चाहती हैं..
तुम्हारे पास रहना चाहती हैं।
------------------------------------------------------
సఫ్దర్‌ హష్మీ కవిత కితాబేఁ కుచ్‌ కహనా చాహతీ హైఁ.... కి స్వేచ్ఛానుసరణ - కవిసంగమం ఆర్చివ్‌స్ నుండి.
కపిల రాంకుమార్// అంతేగా//
ఆవేశం
ఆలోచనని చంపుతుంది
ఆలోచనే
వివేకాన్ని పెంచుతుంది
ఈ రెంటి నిరంతర ఘర్షణ లోనే
జీవనపయనం
ఒడుదుడుగుల అలలపై
అడగుల తడబాటును
సరిచేసుకుంటూ!
26.4.2019

Wednesday, March 20, 2019

జోహార్‌ కాళోజీ|| నేడు కాళోజి వర్థంతి:||కపిల రాంకుమార్ ||తెలంగాణా దూర్జటి కాళోజీ||
మొహమాటంలేకుండా
ఏకిపారేసుడులో పెద్దన్న
తప్పుడు పాలకులెవరైనా
తన మాటల వేటుకు తప్పించుకోలేరన్న!
రాజుల్ మత్తులు వారిసేవ నరక ప్రాయమన్న,
దూర్జటికి కంటే నాలుగాకులు మస్తుగ సదివిండు!
పోతనకుమల్లే రాచరికపు భజన కాదని
ప్రజాస్వామ్యమే వంటపట్టించుకున్నోడు గనుకే
ప్రజా కైతల సేద్యం చేసిండు!
శిశుపాలుని తప్పులలెక్కపెట్టి
సర్కారుచెవుల సిల్లువడాల్సిందే కాని
గిసుమంత కూడ వెనుకడుగేయలేదు!
సప్పుడు ఎక్కువే - ఘాటైన మాటలతో
ముక్కు సూటిదనం చూపుకూడా సూదంటిరాయే!
ప్రజల సోయి యాదమరిస్తే
బొందపెట్టేది నిక్కమన్నాడు
కౌన్సిల్లో సర్కారుకు చాకిరేవు పెట్టిండు
బొక్కసానికి చిల్లుపెడితే
డొక్క చించుతానన్నాడు
కాళమునకు ఖలేజా అద్దినట్టుండే
కైతల రైతుబిడ్డ కాళోజి!
నోరెత్తటం ఏ సర్కారుకీ యిష్టముండదు
నోరెత్తకపోతే కాళోజి కలం నడువదు!
రెంటికెపుడూ గొడవే
పోరాటంచేయకతప్పదు
పోయేవి బానిస సంకెళ్ళు అన్నట్టు
రాష్ట్ర, దేశ పాలకవర్గాలపై
పదునెక్కన పాటలా
అదునుచూచి పేలే తూటాలా
ఎందరికో స్ఫూర్తినిచ్చిండు!
బడుల యిజ్జతు, దవఖాన్ల తీరు,
చట్టసభల తగువులాట
నీటికాడ, కూటికాడ
బతుకుతెరువు పాకులాట
పెత్తనాల తగాదాల గొడవెలెన్నో
నీ, నా గొడవగా చేదీపమందించి
దోపిడి చేస్తే దోస్తానాలుండవు
తోటోడైనా సంజోతాలుండవ్
ఏ పార్టీ వాడైనా వాడు ఏ పాటివాడో
తీరుమానం చేయాలంటాడు!
మంచి సబ్బరిలేకుండా
పాలన చేసేటోడు
మావోడైనా, మీవోడైనా
మావో చెప్పినా మార్క్స్ చెప్పినా
మంచి మంచే, చెడు చెడే
బేరీజువేసుకోమన్నాడు!
గసుమంటోడు కాబట్టే
తాను బతికున్నన్నాళ్ళు
మూడోనేత్రంతోనే లోకాన్ని చూసాడు!
మనలనీ చూడమన్నాడు!

 ప్రజల పక్షం వహించమన్నాడు!.
|కపిల రాంకుమార్‌|| మెడపై కత్తి ||
ఇక్కడ
ఏదో ఒకచోట
ప్రతీ రోజు
ధిక్కారస్వరపు నాలుకను కత్తిరిస్తారు
నిఘానేత్రాల చిత్రాలు
నలుదిదెసలా ప్రసరించకుండా
తెరలకు నల్లరంగేస్తారు
విచక్షణ కోల్పోయే లక్షణం
నరనరాన జీర్ణించుకున్నారు కాబట్టే
మానవత్వాన్ని మట్టిలో పాతిపెట్టేస్తారు
సమాజశ్రేయోవాదులను చీకటి కారాగారాల్లో బంధిస్తారు
బయటి ప్రపంచంతో బంధాలు తెంపేస్తారు
లేదా
తీవ్రవాదముద్రేసి రాజ్యహింసకు పాల్పడతారు.
మృతకళేబరమైన పిదప
హత్యను ఆత్మహత్యగా చిత్రీకరిస్తారు
ఏ పరీక్షకు అవకాశమివ్వకుండా
నిజాలు పాతిపెట్టే సంస్కారమున్నవాళ్ళు కాబట్టి
ఆనవాలు, ఆచూకి ఐనవాళ్ళకు దొరక్కుండా కాల్చేస్తారు
బూడిద పట్టికెళ్ళి వాసన చూడమంటారు!
నరమాంసం మెక్కే మెకాల్లా
కాషాయవర్ణపు నాలుకను పతాకంలా రెపరెపలాడిస్తారు
ఇప్పటికి కాకపుట్టని బద్ధకస్తుల్లారా
రోజూ పొడిచే పొద్దు పొడుపుతో ఎరుపెక్కండి!
నాశనమౌతున్న ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు తిరగబడండి
సింధూరపు బందూకులై తలెత్తుకునేలా మొలవండి!
ఈ నేలా గర్వపడేలా అరుణకేతనమై ఎగరండి!
కపిల రామ్‌కుమార్‌ || పంచాగం బద్దలు కావాలి||
అద్దం మీద వాలి
ముక్కుతో పొడుస్తున్న చందంగా
అతివల కుచాలపై కీచక గోళ్ళు
వికారంగా గాట్లు పెడుతున్నచప్పుడు
పాడే విషాదరాగమెవరికీ వినిపించదు
ఎత్తి కుదేసి బలంగా ఒదేసిన గునపపు రాపిడికి
నరాల స్వరాలు చిట్లిపోయి
గుంతలోంచి పైకి చిందిన బురదలా
లావాలారక్తస్రావమౌతున్నా
ఎవరి మనసూ చలించదు
వశమై, వివశమై పోరాడి శవమై
కళ్ళు తేలేసినపుడు మాత్రం
కామగర్వంతో వికటాట్టహాసం చేస్తూ
రవంత భయపు పొరకమ్మకపోగా
మగాడిననే కాలపుకౌర్యపుకేతనం ఎగరేస్తుంటే
పొగరు దించడానికి
అపరకాళిక కావాలి, లొంగి ఒరిగిపోవటం కాదు,
ఒంగి పంచాగాన్ని బద్దలుచేయడమే నేర్వాలి
పిరికితనపు మేలిముసుగు తొలగించి
చురుకైన శౌర్యాన్ని చూపడమే నేటి నారీ కర్తవ్యం
కపిల రాంకుమార్.||ఎన్నికలలో ఎన్ని కలలో మరెన్ని కల్లలో||
రాష్ట్రానికేదో గత్తరొచ్చినట్టు
జనాల గుండెలు అవిసేలా
అలసిపోయేలా ఒకటే రణగొణ ధ్వని
ముందస్తు ఎన్నికలంటూ ముసళ్ళ పండగలా
ఇద్దరో ముగ్గురో ఐతే పరవాలేదు
అంతకుమించి పోటీచేస్తు పలురకాల ముసుగులు తగిలించుకుని
వాళ్ళ తాతలు నెయ్యి తాగారు మా మూతులు వాసన చూడమనే వారొకరు
గతంలోని పాలకులు పొడిచిందేమిలేదంటూ
చారిత్రిక అంకెలు తారుమారు చేస్తూ
గారడీవిద్యలలో ఆరితేరిన వాగాడంబరాలతో చెవుల్లో కాబేజీ పూవులెడుతున్నారు
ఎన్నికల ప్రణాళిక సాకు చూపి మాదెంత పొడుగో చూడమంటూ
మేమెంత సాధించామో చెప్పే అబద్ధాలకు అంతేలేదు
ఇప్పటి పాలక పార్టీయైనా,
గతంలో చచ్చుబడిన పార్టీయైనా
సామాన్యుని ఆశలు కుప్పకూల్చిన వారే తప్ప
నిజాయితీగా ఈ మేలు చేసామనేవి మచ్చుకు కూడ లేవు.
ఒకటో రెండో అరకొరగా చేసినవి
కొన్ని దాదాపు శిథిలావస్థకు చేరుకున్నవే
మొండిగోడలతో వెక్కిరిస్తున్నాయ్‌
నిలిచివున్నవిమాత్రం వారి అనునాయీలకు కట్టబెట్టినవే!
రోడ్ల అధ్వాన్నం జిల్లా కేంద్రాల్లోనే
కాదు రాజధాని నడిబొడ్డులోనే వానొస్తే
చెరువులను తలపిస్తూంటాయ్‌
ఓట్లు పడవనే నెపంతో తొలగించిన మోసాలెన్నో
మన నగరంలో ఋజువుగా ఎన్‌.ఎస్‌.పి. కాలనీ వాసుల
పేర్లెన్నో మాయమైనాయ్‌!

ఇప్పుడు ఏ వర్గం తృప్తిగాలేదు
తాబేదార్ల అనుకూల వర్గం తప్ప
పొత్తులపై అనవసర రాద్ధాంత చేస్తూనే,
గతంలో తామూ అలాంటి
మురికి గుంటల్లో పొర్లింది మరచినట్టు నాటకాలాడుతున్నారు
ఓటమి భయాలు పట్టుకుందేమే వ్యక్తిగత దాడులు, బెదిరింపులు,
కిడ్నాపు డ్రామాలకు వెనుకాడటంలేదు
నిస్సిగ్గుగా పోలీసుల పహారాలోనే జనాలకు పైకం పంచే అవినీతి పనిని
ప్రచారం మాటున జెండా చాటున పంపకాల జరుపుతూనే
కళ్ళు మూసుకున్న పిల్లి మాదిరి ఎవరూ చూడరనుకుంటున్నారు
ఎర్ర పార్టీలు సైతం తక్కువ తినలేదు
పక్కరాష్ట్రంలో జాతీయ ప్రత్యామ్నాయమంటూ ఫోజులు కొడుతూ
ఈ రాష్ట్రంలో మాత్రం వేరుకుంపటి పెట్టుకుని
వామ పక్ష ఐక్యతను నీరుకారిస్తూ తమ రంగు వెలిసిపోయేలా
ప్రధాన శత్రువులతో జతకట్టారు, గత బంధాలను వీడలేక కామోసు
సామాన్యుడు ముక్కు మీద వేలేసుకొని
ముందుకు రాబోయే రెడ్డెవరో రాజెవరో
ఎవరెక్కువ ముట్టచెబితే వారికే ఓటును అమ్మేసుకుంటున్నారు
గతంలో ఓటేసినా గెలవని వారికంటే
గెలిచే గుర్రాలే నయమనుకుంటూ
అమ్ముడుపోయి మరో ఐదేళ్ళు బానిసలవుతున్నామని
తెలుసుకోలేక మత్తులో జోగుతున్నారు!
హెచ్చరించబోయేవారిని పిచ్చోళ్ళంటూ!.
నిజాయితీగా ఓటేయమనటం పిచ్చితనమా!
ఆలోచించండి … ఇదిలాగే కొనసాగాలా!
సమయం మించిపోలేదు - వారం రోజులుంది
మార్పు తేవటానికి -
ప్రజలకొరకు పోరాడేవారికి గెలిపించుకుని
రాజ్యం, భోజ్యం బహుజనులకే
ఆ దిశగా చూపుడువేలుపై సిరా చుక్క
వేసుకునేలా జనాన్ని నడిపించాల్సిందే
కవులే......కష్టజీవులకిరువెంపులా నిలబడాల్సింది మనమే!
మునాసు వెంకట్...కవితాసంపుటి పరిచయం...యెదను దోచే మెద కవితల సంపుటి
.......................
మెదలోని కవితలు యెదలోతుల్లోకి జొరబడ్డాయనేదన్నది పచ్చినిజం. సత్తెపెమానకంగా
సెప్పుతున్నానన్నట్టు. నల్గొండ జిల్లాలోని అచ్చమైన పల్లెటూరు కవి మునాసు వెంకట్‌ కైతల బొక్కు నిన్ననే సదివినా. పుస్తకం మొగదలలోనే ''అ.సు.ర'' యెల్లబెట్టినట్టే ఉన్నదన్నట్టు. సోచాయించేపనిలేదు. మంచి దావత్‌ పొందినట్టు, తాడి తోపులకెల్లి అప్పుడే దింపిన లొట్టిలోని నికార్సైన వెచ్చటికల్లు తావినట్టున్నది. తియ్యగా, జర కొంత మత్తుగ మట్టివాసంతో. దోస్తులందరు సదివితీరాల్సిందే. దక్షిణ తెలంగాణా నల్గొండ జిల్లా బేస్తల యింట బుట్టిన మునాసు వెంకట్‌ చేతిలోని కవితాచేతన చందమామగా రూపెత్తి, యింటి భాషలో ముచ్చట్లు పెడ్తవుంటె సెవులకు సమ్మగుంటయన్నమాట ఆచార సత్తెం అందుకు అంబటి సురేంద్ర రాజు సరిగానే జోకిండన్నట్టు. ఈ కితాబుకిట్టి కితాబిచ్చినాయనకు, అత్తొత్తించిన వెంకటికి అభినందనలు. నెనరులు. శెనార్తులు.
ఇగ కైతల ఫలారం పంచుతా రండ్రి.
'' నిజమె ముందుగాల చెబుతున్నాం
అన్నింటికి ముందునుండి ఆగమైనోళ్ళం
కొడుకుని పోగొట్టుకొని,
కొరివిపెట్టి - మనసు కోదసండమేసుకున్నోల్లం'' అని మొదలిడి తెలంగాణ అస్థిత్వ పోరాటం యెన్నటికీ కొనసాగాలనే తీవ్రకాంక్షతో
'' మళ్ళీ యెలక సచ్చిన వాసన రాకముందే
అణగారిన ఆటపాటలతో ఈ నేలంతా అలుకుతూనే వుంటం!
యేకమై ఏలికైన దాకా'' - సామాజిక తెలంగాణ పీఠం పొందేవరకు అనే మర్మగర్భపు భావన ప్రస్ఫుటం ఐతన్నది యీ కవితలో 6చలిని వర్ణించే కవితలో ''ఇగం'' నింపి
వణికిపోతున్న చెట్లన్ని
మంచు దులుపుకుని
యెండపొడకొచ్చి నిలబడ్డై'' యెంత సునిశిత పరిశీలనో చలికి గజగజలాడే చెట్లు, జీవాలు, వాటి స్థితి అచ్చమైన యింటి భాషలో ఎరుకపరిచాడీకవి.
''నీటి పుట్టుక సాచ్చిగా
కాసేపు నిజమే మాట్లాడుకుందాం''
ఎరుకలో అనే కవితలో '' తెల్లారింది లేస్తే అసత్యాలే పలికే
మనమిప్పుడు నిజాలే చెప్పుకోవాలంటాడు.
టపటపా రాలిపోతున్న పిట్టల్లా రైతు చావుల్ని నిరసిస్తూ '' కాలం కాలం చేసిందన్న ''
కవిత యెగసాయం పట్ల వకల్తా తీసుకున్నాడన్నట్టుంది
గుండే తడిసిస్పోయే మరో కవిత '' కయాలు''లో
''యాదికి అంతెక్కడున్నది/ యెంతెతికినా
పాతాళ గరిగెకు పానమె తగుల్తది,
బాసిగం గట్టి గీ మట్టిని అర్నాలొచ్చినట్టాయె
గుక్క బువ్వకు అయ్య తిరగని మడుగులేదు
అమ్మ పడని బాధ లేదు ''....అంటూనే
'' కానీ బిడ్డా కానీ కరువు కడుపుల బడ్డది
సొర గుంజుతుంది కాష్టందాకా కష్టం దప్పదు '' కరువు బరువును కవితలో మోసాడు మన మునాసు చాకటి, చిక్కటి యింటి పదాలాతో
కరువుకు కయాల్‌ దప్పలేదు బిడ్డా
మగనకి మండ కొట్టుకున్న ముండను
యెవరున్నారు జెప్పసెప్పుకోను
పుట్టెడు దు:ఖం, పురిటి పేగు నువ్వు దప్ప!'' అంటూ మన గుండెను మరింత తడిచేసాడు.
'' తలపైకెత్తి చూస్తే
తాటికమ్మల నెమలి
గొలపారుతుంటె
లోన పురి యిప్పిందీ''
అంటూ వొంపులతాడు మనకందించాడిలా, ముస్తాద కట్టుకుని, కత్తుల నుర్కుంటా
దినదినగండపు కల్లుగితవృత్తిని యాదిచేసిండు.అందుకే
'' గౌండ్ల సాయిలు మామ సల్లగుండాల
సిన్ననాటి నీ తోడు గుడికాడ వొంపుల తాడు ''
ఇక కైతలన్నిటి తలపాగ '' మెద'' లో
'' ఎలుమాడింది
ఎద్దు గుంజింది
పొద్దు గుంకింది
వలపొలిగిన
మట్టి మల్లేసిన
పరకలేదు
పరిగలేదు.... అంటూ లయ్బద్ధంగా కవితను మడిపిస్తాడు.
ఇలా ఎన్నో కవితలున్నాయి, అన్నింటిని తడిమితే పాఠకుల ఆనందాన్ని అడ్డుకున్నట్టవుతుంది. కొన్నింటినే నుచ్చటించాను, నాకు వంటబట్టిన తీరు.
అనుబంధంగా వున్న '' నీలి '' ఒక దీర్ఘ కవిత. 8 కవితా ఖందికలుగా వున్నా ఆరంభిస్తే కడకంటా సదివిస్తది. దీని గురించి కొద్దిగా సెప్పక తప్పదు.
మచ్చుకి వివరించినా... మిగతావి మీరు సదువుకోవాల్సిందే సుమా!
నీలి .. ఆశ్రయించే భావ కవితలో యెన్నో పద, శబ్ద చిత్రాలు
1.
'' గిక్కడే చెరువు వొద్దనే
చెవిలో గుసగుసల సంగీతాన్ని
వొంపిన ఒక లయ దాగి వుండేది '' ..శబ్ద చిత్రం
2.
నీటిమీద తెప్పలా
నీకాపిష్క కండ్లల్లో
తేలిపోతున్ననే
తెగినపతంగిలా
తెల్లారేసరికి
తేరుకుందునా! నీలి!.
నీలిని సంఓధించీ గొప్ప పదచిత్రాలెన్నో
3,
కాలం యీనిన
కర్మలెన్నివున్నా
మర్మం యిప్పి
మాటలెన్నైనా పడతా
కాని కండ్లనుంచి అలుగెల్లకే... భావచిత్రం
4.
నువ్వొస్తావని చెరువార
పండుగలావుంది
పక్షులుకూడ చేపల్ని
పలకరిస్తున్నాయి ప్రేమగా...
5.
తాలంపడ్డ తలని
పక్షి యీక తెరిపింది
లోన యీదిన గడియ
తలపై కిరీటంయేకాంత యేలికకు ....
6.
రెక్కలాడని చెరువు
రెక్కలాడే చెరువు
మధ్యలో కట్టబోసిందెవరో
నీటెంట నీటేంట
అడుగుల పాదులు
సంచార వనం
పొద్దుపొదిఉగ్న కొద్ది
పుక్కిలించిన కాల
పూనకాల గడియ
పానం వంచిన దీపం
నిగ్రహంగా ఓ విగ్రహశ్వాస
ఓ నగ్న ఆత్మ తప్ప...
యిలా బహు విధాల భావ, శబ్ద చిత్రాలను రాయడం చేయీ తిరిగిన మునాసకే సాధ్యం
7.నీట మునిగి తేలిన
పాత గుడి ఒకటి పలకరిస్తుంది
లింగమయ్యే గుండు
నంది అయ్యే గుండు
తరాలనించి నీతోనే తానమాడే
మడిలేని, ముడిలేని
తడిగుండె కదా నాది ''... అంటూ కొనసాగింపులో
'' ఒడ్డు మీద
అడ్డంగా పడుకున్న
నిద్రపూల చెట్టు
నిద్రలేవలే
నీటిని మీటే
యే చేపో
మార్మికలోకపు తాళం తీసింది
అంతరమంతా అంజనకేళి.... అంటాడు.
8.
ముక్తాయింపు ఖండికలో
'' బుడుగు బుంగ మొగుడు
చెరువుకుంటల మిండెడు
కలదిరిగొస్తున్నడె నీలి!
కడుపునింప కళ్ళమూట నిప్పి '' అంటూనే
చివరగా '' కుదురు తిరుగుతోంది
ఎలుమాడుతుంద్సి
గంగబోనమెత్తె నీలి!
కడుపు పండుతుంది!
గలమలేని యింట్లకి
గంగమ్మ పిలుస్తుంది
నీళ్ళ తిరునాళ్ళలోనే! నీలి!
నీకు సారె సంబరమాయె!'' అంటూ ముగింపు హృద్యంగమంగా వుంది.
నీలి - దీర్ఘ కవితలో నేను ఎంపిక చేసుకున్నవి మాత్రమే మచ్చుకు ఉదహరించాను.
కొన్ని పదాలు ( మాటలు ) మనమెన్నడు సదవనివీ, సూడనివి కండ్లబడ్తయిందులొ.
అసుమంటివి ఒక అనుబంధంగా చేర్చి అర్థాలు తెలిపే పదకోశం పెడితే బావుండేది.
అందునా తెలంగాణ భాషా సౌందర్యమందరికి అందుబాటులోకి వచ్చివుండేది. ఈ సంకలనం భాషా పరంగా మరీ వివరణాత్మక పరిశోధనకు అర్హమైనదిగా భావిస్తూ
పరిశోధకులు దీనిని ఒక చూపు చూస్తే యెంతో మేలు చేసినవారవుతారు.
మంచి సరుకున్న కితాబిది.'' నాగుండె నింపిండి!
గుండే పిండింది!
గుండె తడిపింది!
మరింత స్పందన కలిగించింది! అందుకే నిండైన మనసుతో అభినందనలు తెలుపుతున్నాను, ఒక సూచన తప్పనైసరి అనిపించింది,, అక్కడక్కడ గ్రాంధిక పదాలను
రానీయకుండక్వుంటే బావుండేది. యింటి భాషలోనే రాయడానికి అవకాసం వుంది.
అచ్చమైన మట్టి భాషలోనే '' మెద '' ను అందించిన మొనాసు వెంకట్‌ తెలంగాణాకే గర్వకారణమైన కవి. సందేహంలేదు.
||కపిల రామ్‌కుమార్ ||'రాకీయులారా పూనకాలొద్దు!''
మీసాలు మెలేసినంత మాత్రాన
మీ తాతల సాలొస్తదా!
సాలు సాలుకు బుద్ధులు మారక
వంకరటింకరలు పోతుంటే
సాలిరవాలు సాధనచేయకపోతే
యెగసాయం సంకనాకి,
కుంటువడ్డట్టేనన్నారు మన పెద్దలు!
గతంలోని చేదు అనుభవాలను
యాదుంచుకోకుండా
గుడ్డెద్దు చేలోవడ్డట్టు దిక్కు విడిచి పౌఅనమైతే
అన్నీ ఎదురు దెబ్బలే
తగిలినవి గుర్తులేదా, మేకపోతు గాంభీర్యాలు వీడండికనైనా!
ప్రయోగాలపేరుతో
జనాలకిష్టంలేని జట్లుకట్టి
అయోమయంలో పడేసి
కూటముల పేరుతో పాతాలలోతుల్లో బొక్క బోర్లపడిన
పార్టీలెన్ని చూడలేదు!
కనుమరుగైనవారెందరు లేరు!
ఇగ
కొత్త సాలులోనైనా
జనాలకేమికావల్నో నాడితెలుసుకుని నడుచుకోకపోతే
జెండాల రంగులు వెలిసిపోటం ఖాయం!
అజెండాల రాతలన్ని ఆనవాయితీ మొక్కుబడులే ఐతే
పెట్టుబడులూ దండగే కదా!
అపహాస్యం పాలు కాక గతకాలపు సాలింక రాదు కదా!
నిన్నో జెండా, ఇవాళో అజెండా
రేపో లాభసాటి చొక్కా తొడిగేవారు,
తాత్కాలిక లాభాలతో హీరోలు కావొచ్చేమో కాని,
భవిష్యత్తులో జీరోలవటం నిక్కం!
పట్టిన జెండాను
కట్టె కాలేవరకు నిలపగల నిబద్ధత వుంటేనే
రాజకీయాలలో రాణింపు!
లేదా జనం నోట్లోనాని
ఎప్పటికైనా ఏవగింపు పొందడమే ముగింపు!
మీ వర్తమాన నిర్ణయాలు
భవిష్యత్తులో సత్ఫలితాలు పొందాలనే ప్రతిన పూనండి!
పాలకవర్గ ప్రలోభాల పూనకాలు పొందకండి!
జనాలని నట్టేట ముంచకండి!
No photo description available.
telugu : Sri Kapila Ramkumar
kannada translation :S.D.Kumar
ತೆಲುಗು : ಶ್ರೀ ಕಪಿಲ ರಾಮ್ ಕುಮಾರ್
ಕನ್ನಡಕ್ಕೆ : ಎಸ್ ಡಿ ಕುಮಾರ್
ಆ ದಿನಗಳು
ಲೋ ಸ್ವಲ್ಪ ದೂರ ಇರು
ಅದನ್ನು ಮುಟ್ಟಬೇಡ
ನಾಯಿ ಮುಟ್ಟುಬಿಟ್ಟಿದೆ ಅದನ್ನು
ಅಕ್ಕ ಹೊರಗಾದಾಗ ಅಜ್ಜಿಯ ವ್ಯಾಖ್ಯೆಪ್
******
ಲೇ ಮಗೂ... ನಿನ್ನ ತಟ್ಟೆ.. ಗ್ಲಾಸು ತೊಳೆದು
ಬಾತ್ ರೂಮಿನಲ್ಲಿಡು
ಎಲ್ಲದರ ಜೊತೆ ಸೇರಿಸಿಬಿಡಬೇಡ
ಚಾಪೆ ಚೊಂಬು ದುಪ್ಪಟಿ ಜೋಪಾನ
ಯಾರಿಗೂ ಮುಟ್ಟಿಸಬೇಡ
******
ಲೋ ಮಗಾ...
ನೀನು ಶಾಲೆಯಿಂದ ಬಂದಕ್ಷಣ
ಬಟ್ಟೆ ಬದಲಾಯಿಸಿ ಬೇರೆ ಇಡು
ಅವಳಿಗೆ ಸ್ನಾನ ಆಗೋವರೆಗೆ ನೀನು
ದೂರಾನೇ ಇರಬೇಕು ...
ಅಂದ್ರೆ ಅರ್ಥವಾಗುವ ವಯಸ್ಸಲ್ಲ ನಂದು
******
ಅಜ್ಜಿ ಪೂಜೆ ಮಾಡುವಾಗ
ಅಡಿಗೆ ಕೆಲ್ಸ ಮಾಡುವಾಗ
ಎದುರಿಗೆ ಬರಬಾರದು : ಬಂದರೆ ಹಿಡಿ ಶಾಪವೇ
ಆಚಾರ ಗೊತ್ತಿಲ್ಲ ವಿಚಾರ ಗೊತ್ತಿಲ್ಲ ಸಂಪ್ರದಾಯ ಗೊತ್ತಿಲ್ಲ
ಮನೆ ಮಠ ಮೋರಿ ಎಲ್ಲಾ ಏಕಮಾಡಿಬಿಟ್ರು
ಈ ಹುಡುಗ್ರು...
ಹೀಗಾದ್ರೆ ನಾಳೆ ಹೇಗೆ ಸಂಭಾಳಿಸ್ತೀರಿ
ಗಂಡನ ಮನೇಲ್ಲಿ
ಅಂತ ಹಿಡಿ ಶಾಪ ಹಾಕ್ತಾ... ಅಜ್ಜಿ...
ಮತ್ತೆ... ಮತ್ತೆ ಸ್ನಾನ ಮಾಡ್ತಿದ್ಲು...
******
ಆ ಮೂರು ದಿನಗಳು
ಅಕ್ಕನಿಗೆ ನರಕವೇ..
ಅಕ್ಕನ ಜೊತೆ ನಂಗೂ ಪರೀಕ್ಷೇನೆ
ಹೊಟ್ಟೆ ನೋವು ಅಂದ್ರೆ
ಯಾವುದೋ ಕಷಾಯ ಕೊಡ್ತಿದ್ಲು
ಅದನ್ನು ಅಳ್ತಲೇ... ಕುಡೀತಿದ್ಲು ಅಕ್ಕ
ನೆಲವೇ ಹಾಸಿಗೆ... ಸೊಳ್ಳೆಗಳ ರಾವುಗೆ
******
ಆ ದಿನಗಳು ಇರ್ತಿದ್ದದ್ದೇ ಹಾಗೆ
ಅಷ್ಟೇ...
ಆರೋಗ್ಯಕ್ಕೆ ಸವಾಲೇ ಆದರೂ
ಹಾಗೇ.... ಹಾಗೇ... ಸುಸೂತ್ರವಾಗಿ ಸಾಗುತ್ತಿತ್ತು ಕಾಲ...
TELUGU ORIGINAL :
కపిల రాంకుమార్ || ఆ రోజులు ||
ఒరే దూరం
దాన్ని ముట్టుకోకు
దాన్ని కుక్క ముట్టుకుంది
అక్క బహిష్టయితే అమ్మమ్మ వ్యాఖ్య
**
పిల్లా నీ కంచం గ్లాసు కడిగి
బాత్‌ రూమ్‌లో పేట్టు
అన్నింటిలో కలుపకు
చాప, చెంబు దుప్పటి జాగ్రత్త
ఎవరికీ తగలనీకు
**
ఒరే అబ్బీ
నువ్వూ స్కూలునుండి రాగానే
బట్టలు మార్చి వేరే పెట్టు
దానికి నీళ్ళయ్యేదాక నువ్వు దూరమే
అంటే అర్థంకాని వయసు నాది
**
అమ్మమ్మ పూజ చేసుకునేటప్పుడు
కాని
వంటపని అయ్యేవరకు
ఎదురు రాకూడదు
కనపడిందా శాపనార్థాలే
ఆచారం లేదు, సంప్రదాయాం తెలీదంటూ
ఇల్లూ బజారు ఏకం చేస్తారీ కుర్రకుంకలంటూ
ఇలా ఐతే రేపెలా నెగ్గుకొస్తారాఓ అత్తారింట్లో అని
తిట్టుకుంటూ ఆవిడ మళ్ళి స్నానం చేసేది
**
గుడ్డలు జాగ్రత్త!
ఎక్కడపడితే అక్కడ పడేయకు
ఉతికి జాగ్రత్త పెట్టుకో
ప్రతీ సారి నా చీరలెన్ని చింపి యివ్వాలి
( నాప్కిన్‌/ వానిటీ షీట్లు ఆ రోజులకు రాలేదు )
**
ఆ మూడు రోజులు
అక్కకు నరకమే
అక్కతొ పాటూ నాకు పరీక్షే
కడుపునొప్పి అంటే
ఏదో కషాయం యిచ్చేది
అది ఏడుస్తునే తాగేది
నేల పడక
దోమల వేట !
**
అలా గడిచింది అక్క బాల్యం- యవ్వనం
కొన్నాళ్ళకు అమ్మమ్మ తెలుసుకుంది
లోకంతో పాటూ మారాలని అనుకుంది
లేకపోతేనా...
అక్క ఆరోగ్యం ఏమైయ్యేదో
బతికిపోయింది చైతన్యం పొందిన అమ్మమ్మం వల్ల
**
అందుకే ఇప్పటికి
అన్ని యిబ్బందులు అప్పుడు పడినా
అక్క పెళ్ళికి అమ్మమ్మ చేసిన
సాయం అంతా ఇంతా కాదు
అమ్మమ్మ అంటే అక్కకూ ప్రాణం.
**
ఆ రోజుల్లో అలా వుండేవి
అంతే...
ఆరోగ్యానికి సవాలుగానే
గడిచినా
దరిమిల్లా సాఫీగా సాగిపోయింది కాలం...
కపిల రాంకుమార్|| మీకిది తగునా?||
నా ఊసెందుకు మీ తిట్ల పురాణంలో
నేను మోసే బరువు అంత సులువనా!
జాగ్రత రేవు పెట్టేస్తాను!
నా పేర రెట్టిస్తారెందుకు?
నమ్మకద్రోహులకు నాకు పోలికా?
ప్రాణాలకు తెగించే విశ్వాసం మీకుందా?
నాతో పోలికేంటి? బద్ధకస్తులకి
పొలందున్నినా, బండిలాగినా
పోటికి రాలేరు!
కాకి ముక్కుకు దొండపండని
మూతి విరుపెందుకు?
నే ముట్టితే కదా
మీ పితృ దేవతలకి ఆత్మతృప్తి?
ఇక నుండి మిమ్మల్ని మీరే పోల్చుకోండి
మాటలతో కాల్చుకోండి
మంచిచెడులుయెంచుకోండి
కలుపు మొక్కలనేరితేనే
స్వార్థ పరుల ఆటకట్టు!
ఉపమానాలతో మావూసులెత్తకండి
ఎంతసేపు యెదుటివారినెంచటం కాదు
మీ వీపుపై మరకల్ని చూసుకోండి
మాలావెనుకచూపుండదుగా!
మాకు కినుక తెప్పించకండి!
తరువాతి పరిణామాలకు
బాధ్యత మాత్రం మీదే!
తస్మాత్ జాగ్రత!
హహ. అనిముషుల్లా దూరిపోయిన సెల్లులోంచి..బయటకు రాని వాళ్ళకు అని(యుద్ధం) అంటే తల్లుల ఆత్మఘోష అని తెలిసే విషయం కాదుగహహ. అనిముషుల్లా దూరిపోయిన సెల్లులోంచి..బయటకు రాని వాళ్ళకు అని(యుద్ధం) అంటే తల్లుల ఆత్మఘోష అని తెలిసే విషయం కాదుగ
పూటకో మాటను పార్టీని మార్చే 
రాజకీయ వ్యభిచారులను తరిమికొట్టాలి...
గెలిచినోడినైనా ఓడి గోడ దూకినోడినైనా.....

హహ. అనిముషుల్లా దూరిపోయిన సెల్లులోంచి..బయటకు రాని వాళ్ళకు అని(యుద్ధం) అంటే తల్లుల ఆత్మఘోష అని తెలిసే విషయం కాదుగ
కులాల కమురు వాసనలకు
కలాలు కదలలేని స్థితి
మౌనంగా ఉండలేము అదే సమయంలో
అక్షరమూ సమ్మెకడుతోంది
ఇలా విడిపోతే ఎలా
క్షరంకాని అక్షర యోధులు..
నిరక్షరాస్యత ఆవహించిందా
అయోమయంలో పడేస్తుందేమో
స్పందనలే మృగ్యమౌతున్నాయ్
ముళ్ళను రాళ్ళను దాటలేక..

....వ్యధతో...నాలుగు మాటలు.

Thursday, November 30, 2017

కపిల రామ్‌కుమార్‌ || పంచాగం బద్దలు కావాలి||

కపిల రామ్‌కుమార్‌ || పంచాగం బద్దలు కావాలి||
అద్దం మీద వాలి
ముక్కుతో పొడుస్తున్న చందంగా
అతివల కుచాలపై కీచక గోళ్ళు
వికారంగా గాట్లు పెడుతున్నచప్పుడు
పాడే విషాదరాగమెవరికీ వినిపించదు
ఎత్తి కుదేసి బలంగా ఒదేసిన గునపపు రాపిడికి
నరాల స్వరాలు చిట్లిపోయి
గుంతలోంచి పైకి చిందిన బురదలా
లావాలారక్తస్రావమౌతున్నా
ఎవరి మనసూ చలించదు
వశమై, వివశమై పోరాడి శవమై
కళ్ళు తేలేసినపుడు మాత్రం
కామగర్వంతో వికటాట్టహాసం చేస్తూ
రవంత భయపు పొరకమ్మకపోగా
మగాడిననే కాలపుకౌర్యపుకేతనం ఎగరేస్తుంటే
పొగరు దించడానికి
అపరకాళిక కావాలి, లొంగి ఒరిగిపోవటం కాదు,
ఒంగి పంచాగాన్ని బద్దలుచేయడమే నేర్వాలి
పిరికితనపు మేలిముసుగు తొలగించి
చురుకైన శౌర్యాన్ని చూపడమే నేటి నారీ కర్తవ్యం
30.11.2017

Tuesday, November 28, 2017

కపిల రామ్‌కుమార్ || ప్రేయసి అలక ||

కపిల రామ్‌కుమార్ || ప్రేయసి అలక ||
దగ్గరకు రా అన్నప్పుడల్లా
ససేమిరా కాదంటూనే
ఆమడదూరం పరిగెత్తేది తను
ముద్దపెడతానంటే పరుగన వచ్చేది
ముద్దిస్తానంటే మాత్రం
ఏమైంది అంటే
పెదవులు ఎంగిలైనా పర్వాలేదు కాని
యెదపొంగులు నలిగితే
శరీరం ఎంగిలైతే ఒప్పుకోనుగా అంది
ఇన్నాళ్ళ ప్రయాణం
ప్రణయంకాదా
కావొచ్చు - మరో ప్రళయం కాకూడదంటూ
గాలిలోనే ఓ ముద్దిచ్చి తుర్రుమంది
అమలిన శృంగారదేవతగానే
మనో ఫలకంపై నాట్యమాడే
కవితా చెలి.
గ్లోబలీకరణ ప్రభావంతో శీలం చెడగొట్టుతావేమో
లోభాలకు లొంగి ప్రజావ్యతిరేకుడవౌతావేమో
సవాలక్ష సవాళ్ళను నా మెదడులో జొనిపి
ఎగిరిపోయింది ఊహాలకు, ఉద్దేశాలకు
ఆశయాలకు
ఆచరణకు
వైవిధ్యం, వైరుధ్యం లేని నాడు
నీ ఒడిలో వాలిపోతానంటూ
28.11.2017

Saturday, July 15, 2017

కపిల రాంకుమార్ || నిప్పురవ్వ ||

కపిల రాంకుమార్ || నిప్పురవ్వ ||
పలకే
జై్లు గోడ
బొగ్గు ముక్కే
అగ్గిరవ్వ
రుద్రవీణలు లిఖించి
పలికిన
తెలంగాణ
నవ వైణికుడు దాశరథి!
కొత్తపుంత తొక్కించిన వైతాళికుడు
ధిక్కార స్వరంలో
ధూర్జటిలా
రాజును లోకానికి బూజులా
నిర్భీతిగా దులిపిన
అభ్యుదయ పథగామి దాశరథి!
శాస్త్ర, సాంకేతిక, సామాజిక పరిణామ క్రమాన్ని 
విశ్వరహస్యాలను
నేటికీ సాగే కులదురహంకార అకృత్యాలను
గాయపడిన హృదయంగా
గేయమయం చేసిన వాడు
రాయబడని  కావ్యాలుగా
కోటి రతనాను  వీణమీటిన వాడు
యాత్రస్మృతి అందించినవాడు
ఆధునిక దాశరథి శతకంలో
బడుగుల ఆకలి కేక వినిపించిన వాడు
బలిసిన డబ్బున్నవాళ్ళ కొట్టుకుచచ్చే జబ్బును
విదితంచేసిన వాడు దాశరథి!
ముందు తరాలకు
రాజ్యానికి వ్యతిరేకంగా నినదించవలసిన
ఆవశ్యకతను గుర్తుచేసిన వాడు
కలాలు గర్జించే గళాలై
అనధికార శాసనకర్తలు కావాలని
దారిచూపిన వాడు  దాశరథి!



కపిల రాంకుమార్‌ ||గరగపర్రు ||

కపిల రాంకుమార్‌ ||గరగపర్రు ||
గొంతులో గరగర
గరగపర్రు కషాయం!
కళ్ళలో మిరమిర
గళాల శబ్ద ధూళి !

కపిల రాంకుమార్ || ఆ రోజులు ||

కపిల రాంకుమార్ || ఆ రోజులు ||
ఒరే దూరం
దాన్ని ముట్టుకోకు
దాన్ని కుక్క ముట్టుకుంది
అక్క బహిష్టయితే అమ్మమ్మ  వ్యాఖ్య
**
పిల్లా నీ కంచం గ్లాసు కడిగి
బాత్‌ రూమ్‌లో పేట్టు
అన్నింటిలో కలుపకు
చాప, చెంబు దుప్పటి జాగ్రత్త
ఎవరికీ తగలనీకు
**
ఒరే అబ్బీ
నువ్వూ స్కూలునుండి రాగానే
బట్టలు మార్చి వేరే పెట్టు
దానికి నీళ్ళయ్యేదాక నువ్వు దూరమే
అంటే అర్థంకాని వయసు నాది
**
అమ్మమ్మ  పూజ చేసుకునేటప్పుడు
కాని
వంటపని అయ్యేవరకు
ఎదురు రాకూడదు
కనపడిందా శాపనార్థాలే
ఆచారం లేదు, సంప్రదాయాం తెలీదంటూ
ఇల్లూ బజారు ఏకం చేస్తారీ కుర్రకుంకలంటూ
ఇలా ఐతే రేపెలా నెగ్గుకొస్తారాఓ అత్తారింట్లో అని
తిట్టుకుంటూ ఆవిడ మళ్ళి స్నానం చేసేది
**
గుడ్డలు జాగ్రత్త!
ఎక్కడపడితే అక్కడ పడేయకు
ఉతికి జాగ్రత్త పెట్టుకో
ప్రతీ సారి నా చీరలెన్ని చింపి యివ్వాలి
( నాప్కిన్‌/ వానిటీ షీట్లు ఆ రోజులకు రాలేదు )
**
ఆ మూడు రోజులు
అక్కకు నరకమే
అక్కతొ పాటూ నాకు పరీక్షే
కడుపునొప్పి అంటే
ఏదో కషాయం యిచ్చేది
అది ఏడుస్తునే తాగేది
నేల పడక
దోమల వేట !
**
అలా గడిచింది అక్క బాల్యం- యవ్వనం
కొన్నాళ్ళకు అమ్మమ్మ తెలుసుకుంది
లోకంతో పాటూ మారాలని అనుకుంది
లేకపోతేనా...
అక్క ఆరోగ్యం ఏమైయ్యేదో
బతికిపోయింది  చైతన్యం పొందిన అమ్మమ్మం వల్ల
**
అందుకే ఇప్పటికి
అన్ని యిబ్బందులు అప్పుడు పడినా
అక్క పెళ్ళికి అమ్మమ్మ చేసిన
సాయం అంతా ఇంతా కాదు
అమ్మమ్మ అంటే అక్కకూ ప్రాణం.
**
ఆ రోజుల్లో అలా వుండేవి
అంతే...
ఆరోగ్యానికి సవాలుగానే
గడిచినా
దరిమిల్లా సాఫీగా సాగిపోయింది కాలం
**
కపిల రామ్‌కుమార్‌ \\ ఎంత తేడా జెండా మోతలో \\
వాడు
భుజాన జెండా
కడదాకా మోయాలనుకున్నాడు
భుజం మీద దెబ్బలు పడినా
జెండా కర్ర విరిగినా
కొసను పట్టుదలగా నొక్కిపట్టి
ప్రాణం పోయినా వదలనన్నాడు
పార్థివ శరీరం మీద కప్పేవరకు
>>
వీడు
భుజాన జెండా
అజెండా కొత్తగా మారినపుడల్లా
చొక్కా మార్చేస్తాడు
జనాలను ఏమార్చేస్తాడు
జెండాలను మార్చేస్తాడు
పొట్ట గడవటం కాదు
మార్పిడిలో సొంత కట్టడం
కట్టుకోడానికి
>>..5.7.2017
రోటిలో తలదూర్చాక
ఎన్ని పోటులైనా
జి.యస్‌.టి పన్నులైనా
భరించాల్సిందే!
...
ఆలోచించడానికి
లోచనాలున్నాయి.
ఆచరించడానికి
చరణాలు కదలాలి కదా!

...
ఐ లవ్యూ చెప్పినంత
తేలిక కాదు
ఐ ఓవ్యూ అని
కొనసాగటం!

...

1.కపిల రాంకుమార్ || శత్రువెవరు ? ||

1.కపిల రాంకుమార్ || శత్రువెవరు ? ||
ఏ జనమైనా
ప్రభంజనమై
బహుజనమై
గర్జించాలసిందే
ఏవరిమీద!
కనబడే దాష్టికంపైనా?
కనబడని దుష్టుడిపైనా?
ఆ దాక్కునివున్న
శత్రువెవరో కనిపెట్టండి
వాని ఆట కట్టించగ
ఒక్క తాటి సమకట్టండి
ఐక్యతగా ఉద్యమించండి
2.కపిల రాంకుమార్ || ఆత్మీయం||
సంతానం
మన సొంతం లేదా
సామర్థ్యం అనే భ్రమలు వద్దు
సాధించిన
ఫలితాలే
మనకు ముద్దు
గురువుగా ఎందరినో
ఎదిగేలా చేసానని ఉబ్బిపోకు!
ఉన్నతంగా ఎదిగినా
ఆ కొందరిలో
నీ ముందు ఒదిగిన
విద్యార్థి అధికారైనా, రాజకీయనేతైనా
నీ బిడ్డే అని గర్వపడు!
అపుడే తల్లి దండ్రులకైనా
గురువు కైనా
గర్వ కారణం!
అత్మీయమైనా
పదిలపరుచుకునే
జ్ఞాపకమైనా
ఆ క్షణాలే ఉద్విగ్నమైనవి!

కపిల రాంకుమార్ || మినీలు వానా కాలం ||

 కపిల రాంకుమార్ || మినీలు వానా కాలం ||

1.కథ కాటికి
వ్యథ కంటికి
భావం ముద్రై
కాలనాళికైంది -
**
- కథకుని స్మృతిలో
2.ఎత్తి చూపటం
ఇష్టముండదు
బూజు దులిపితే
కష్టముండదు
3.నా తలపులలోనుండి
తొలిగిపోయాక
నీ తలుపులు తెరిచి వుంచి
ఫలితంలేదు నేస్తమా!
మనసు మలుపు తిరిగి పోయాక
అన్నీ మరుపులేగా
గతాన్ని విసిరేసిన
మాయని మరకలేగా!!
4.గుబురుల్లో
కబుర్లు
ముసురుకు
తడిసాక
మొలకెత్తిన
అంకురం
ప్రేమెనా!
5.ముషాయిరాలో
మురిపాలున్నా
వాయిదాల్లో
ఫాయిదా వుండదు!
6.గడుసరి
ప్రేమకి
డాబుసరి
ముగింపా?
7.సంసారమైనా
సంగీతమైనా
సంగతులు
తప్పనంతవరకే
గమకాలు పలికినా
గమనాలపైనే ఆధారం!
8.పదవిలో వున్నాడని
పొదివిపట్టుకున్నావు
పెదవి కొరికినపుడు
కాండ్రించి వుమ్మావు

--- జర పైలం బిడ్డా
మగాడు మృగాడు కదా!

||కపిల రామ్‌కుమార్ ||నిశ్శబ్దం బద్దలవ్వాలి||

||కపిల రామ్‌కుమార్ ||నిశ్శబ్దం బద్దలవ్వాలి||
అవును
మౌనాన్ని మూలకి నెట్టి
మూలాన్ని వెలికితీసి
మూలకాన్ని మించిన
క్షిపణి ఒకటి
పేల్చాల్సిన సమయం వచ్చింది
చాప కింద నీరులా
మౌఢ్యపు భావాల్ని వ్యాపింపచేసే
అదృశ్య యంత్రాంగాన్ని కనిపెట్టాం
అది విశ్వరూపం చూపేలోపే
జాఢ్యం మూలవాసులను నాశనం చేసేలోగా
మూలాలతో సహా పెరికివేసి
విధ్వంశం చేయాల్సిన అవసరమేర్పడింది
తినేతిండిని నియంత్రిస్తూ
ఉండే గూటిని కూల్చేస్తూ
గుమిగూడి సమాలోచనచేయనీకుండా అడ్డుకునే
కుతంత్రపు శక్తుల యుక్తులను
బట్టబయలు చేసి బట్టలూడదీసి తన్ని తరిమే
పని ఒక్కటే మిగిలింది!
ఎన్నో భ్రమల మాయాజాలంతో
ముచుకొస్తున్న ఉపద్రవాన్నాపాలంటే
కలాలు గళాలెత్తాలి
ఉక్కు పిడికిళ్ళై నిబద్ధతా కొడవళ్ళై
సమూలంగా మట్టుపట్టె తరుణ ఆసన్నమైంది!
అవును
చిన్న పెద్ద మగ ఆడ తేడాలేక
సమరానికి సిద్ధం కావాలి!
అదుగో నగారా మోగుతోంది!
మౌనాన్ని బద్దలు కొట్టండి!
సకల జనుల ఐక్య ఉద్యమం ఉప్పెనవ్వాలి!
ఆధిపత్య వర్గాలకు భరత వాక్యం పలకాలి!
తక్షణమే ఒక విస్ఫోటనం
ఒక విప్లవం జమిలిగా
పురాతన పన్నాగాలు పునరుద్భవించే అవకాశంలేని
మార్పు రావాలి!
సామాజిక రాజ్యం కొరకు
నిత్యకృత్య అకృత్యాలకంతం పలికే దిశగా
మదాంధుల గురుతులు తెగిపడేలా
మరో దక్ష యజ్ఞం జరగాలి!
అవును
అందుకే మౌనం బద్దలవ్వాలి

కపిల రాంకుమార్ || నిప్పురవ్వ ||

కపిల రాంకుమార్ || నిప్పురవ్వ ||
పలకే
జై్లు గోడ
బొగ్గు ముక్కే
అగ్గిరవ్వ
రుద్రవీణలు లిఖించి
పలికిన
తెలంగాణ
నవ వైణికుడు దాశరథి!
కొత్తపుంత తొక్కించిన వైతాళికుడు
ధిక్కార స్వరంలో
ధూర్జటిలా
రాజును లోకానికి బూజులా
నిర్భీతిగా దులిపిన
అభ్యుదయ పథగామి దాశరథి!
శాస్త్ర, సాంకేతిక, సామాజిక పరిణామ క్రమాన్ని 
విశ్వరహస్యాలను
నేటికీ సాగే కులదురహంకార అకృత్యాలను
గాయపడిన హృదయంగా
గేయమయం చేసిన వాడు
రాయబడని  కావ్యాలుగా
కోటి రతనాను  వీణమీటిన వాడు
యాత్రస్మృతి అందించినవాడు
ఆధునిక దాశరథి శతకంలో
బడుగుల ఆకలి కేక వినిపించిన వాడు
బలిసిన డబ్బున్నవాళ్ళ కొట్టుకుచచ్చే జబ్బును
విదితంచేసిన వాడు దాశరథి!
ముందు తరాలకు
రాజ్యానికి వ్యతిరేకంగా నినదించవలసిన
ఆవశ్యకతను గుర్తుచేసిన వాడు
కలాలు గర్జించే గళాలై
అనధికార శాసనకర్తలు కావాలని
దారిచూపిన వాడు  దాశరథి!



కపిల రాంకుమార్‌ || అస్పష్ట జ్ఞాపకం||

కపిల రాంకుమార్‌ || అస్పష్ట జ్ఞాపకం||
అట్లతద్ది ఆటల్లో
చెట్టుకొమ్మన ఊయల్లో
బాల్యపు ఊసూలెన్నో కలబోసుకుంటూ
మగ ఆడ తేడలేకుండాచెట్లమ్మటి గుట్లెమ్మటి
తోసుకుంటూ గిచ్చుకుంటు
ఊహతెలియని జతకట్టుకుంటూ
వాగులెమ్మటి ఇసుకలో దుదుంపుల్లలాడుకుంటూ
అమ్మా నాన్నలాడుకుంటూ
గువ్వలమై ఎగిరిన రోజులు
గునగునమంటూ యాదిచేస్తుంన్నాయి!
**
పండుగలకు పబ్బాలకు
కలసికట్టుగ సామాగ్రితెచ్చిన రోజులు
తొక్కుడు బిళ్ళ, గుడుగుడు కుంచం గుండేరాగాలాడిన రోజులు
ముక్కుడు గిల్లులాట, చేలగట్ల పరుగులెత్తిన రోజులు
కలువపూలకోసం ఒక గుంపు
తామరపూల కోసం ఒక గుంపు
పోటీపడి ఈదులాడిన రోజులు
**
దీపావళి ఉప్పు పొట్లాలు
గోగుకాడ దివిటీలు
నాగులచవితికి దాచుకున్న రోజులు
కార్తీకపున్నమికి ఎగరేసిన తారాజువ్వలు
పోటీపడి కాల్చిన రోజులు
**
పరీక్షల హడావుడికి
కొత్త కలాలకోసం దెబ్బలాడుకున్న రోజులు
ఉదయాన్నే చద్దన్నంలో ఆవకాయతో వెన్నముద్దలేదని
గడ్డ పెరుగు పోయలేదని మారాము చేసిన రోజులు
పుస్తకాలు ముందేసుకుని
ఒకరికొకరం వల్లెవేయించుకున్న రోజులు
**
మాయదారి వయసులొచ్చి
లంగావోణీల్లో ముద్దబంతి పూవులైన నేస్తగాళ్ళతో
ఆ ఆటలు బందయినా
స్నేహ బంధం నిలుపున్న రోజులు 
ప్రేమలు దోమలు అంటూ చదువు చెడకొట్టకండంటూ
పెదనాన్న మందలింపులు
చిన్నత్త సలహాలు, చెవి మెలిపెట్టి తీయించిన గుంజీలు
**
ఇక ఉద్యోగాల్లో కొందరు
ఇతరేతర వ్యాపకాల్లో కొందరు
చెల్లా చెదరైనా
వయసు పక్వానికొచ్చి అత్తారింటికి కొందరు
పిల్లలతో కుటుంబాలతో బిగించబడినా
సంవత్సరానికొకసారైనా కలసి నెమరేసుకున్న రోజులు
ఉత్తరాలు రాసుకునేవాళ్ళం
తరువాత ఫోనులు చేసుకునేవాళ్ళం
ఇక యిపుడైతే మెసేజీల పాలై
ఆనాటి అనుబంధాలు దూరమైనట్లనిస్తుందని
సరోజ, సుజాత, వెంకటీ, కృష్ణమూర్తి
ఫేసుబుక్కులో మొత్తుకున్నారు
**
ఆ రోజుల్లో జాజిపందిరికింద కందిరీగ కుట్టి
ఒక కన్ను పోయిగోలపెట్టిన  గౌరి
పొలంగట్టున చెట్లకింద ముంజెలు తింటూ గట్టుజారిపడి
విరిగిన కాలుతో  వెంకటి
కళ్ళముందు మెదిలే ఎల్లని, నల్లని మబ్బుదొంతరల రోజులు
గుర్తుకొస్తుంటే మసక కళ్ళను కన్నీరు కడుగుతున్నది
మనవళ్ళతో పాత అస్పష్ట జ్ఞాపకాల తెర!

Sunday, April 2, 2017

l5.(.ఆ) టుమ్రీలు

l5.(.ఆ)   టుమ్రీలు
1. మనసు రాయైతే......
మాటలు కాదు...
తాటలు తీసే
తూటాలౌతాయ్‌
2. తలలు బోడులైన.
తలపులు బోడులౌనా..
తలుపులు మూసినా
తలపులు ఆగునా
3.మనసు చైతన్యంగా
వుండాలే గాని
ఎన్ని భావాలైనా పలికిస్తుంది,
ఒలికిస్తుంది
4.మరచిపోయినవారికి
గుర్తుచేయగలం
కాని
గుర్తించటం మానేస్తే
మరలించటం ఎలా
5.నగవులే
ఎదురొస్తే
తగవులన్నవి
పారిపోవా!
6.పెదవులే
మరులైన
పృధివిలో
ఆనందమే!

||కపిల రాంకుమార్|||హేళనెందుకు హేవిళంబి ||

||కపిల రాంకుమార్|||హేళనెందుకు హేవిళంబి ||
దుర్ముకి ఏం వెలగబెట్టలేదని
వెక్కిరించకు –
చిట్టా విప్పుతున్నా కాసుకో
జనాల్ని ముప్పు తిప్పలు పెట్టి
ఒక్క నోటు రద్దుతో
అంతా అతలాకుతం చేసి
ఎందరినో పొట్ట పెట్టుకుంది!
ఎందరినో అనర్హుల్ని అందలమెక్కించింది
దీనమ్మ జీవితమని విసుగుపుట్టించింది
జనాల అంచనాలను తలకిందులు చేసి
తాను మాత్రం రయ్యిమని
ఆకాశాన విహరిస్తోందని ఉడుక్కోటం కాదు
నువ్వేమైన పెద్ద తోపువా చెప్పు !
పైకెళ్ళిన ధరల్ని దింపుతావా!
20 నిముషాలకొక సారి నిత్య కృత్యంగా
జరుగుతున్న మాన భంగాలని ఆపుతావా!
బడుగు జీవులకు బతుకులో
మెతుకు భరోసా యిస్తావా!
రాజకీయ అవినీతి కుంభకోణాలు
వరుస మరచిన సంబంధాల ఎన్నికల వివాహాల్ని
గాడితప్పిన ఆర్థిక వ్యవస్థని
ఏమైనా సరిచేయగల దమ్ముంటే
హేళన చేసేందుకు అర్హత వుంది
..
ఉత్తరాన జెండా ఎగరేసిందిగా
అని సంబరపడకు
ఉత్తర చూసి ఎత్తర గంప –
జొన్న పంటకు నానుడైతే
గత్తర బిత్తర రాజకీయ ప్రక్షాళనకు
జనం జెండలెత్తి తిరుగడతారు
ఎన్నాళ్ళైనా, ఎన్నేళ్ళైనా మీరందరు ప్రభవ మొదలుకొని
ఒక తాను ముక్కలే-ఒక గూటి పాటే పాడుతారు
కోయిలను స్వేచ్ఛగా గానం చేయనీరు
బాధలను చెప్పుకునేందుకు
జనాలకు అవకాశాం యివ్వరు
ఎందుకమ్మా పండుగలా వచ్చి
దండగమారి వరాలు కుమ్మరించి
అరచేతి వైకుంఠాలు చూపిస్తారు
ఇక్కడ ఎవరి చెవుల్లో కాబేజీలు లేవు
నీ దారి చూసుకొని గడువు కాగానే వెళ్ళు చాలు
నువ్వొచ్చి ఒరగ పెట్టేది లేదు
మా చింకి సొరుగులు నిండేది లేదు
ఏ పూటకాపూట శ్రమ చేయందే
కూలోడికి కడుపు నిండదు
మా వాడే అనుకున్న ప్రధానే
మన నెత్తిన
సరళను నెత్తిమీద పెట్టాను
ఒకరి తరువాత ఒకరు కొనసాగించారే కాని
గ్లోబలిని తరుమలేదు కదా
మరింత దానికి గాఢ పరిష్వంగంలో దూరిపోయి
సార్వభుమాధికారాన్నే తాకట్టుపెట్టి
ఒట్లేసిన జనాల సంక్షేమం గాలికొదిలి
గాలి గాళ్ళ దారిలో గాలిపటాలెగరేస్తూ
అంబారీలూగుతూ,
రియల్గా చెప్పాలంటే ఊడిగం చేస్తూ
పబ్బం గడుపుతున్నారుగా
ఏవరెట్ట చస్తే మాకెందుకు
రైతైనా, మగువైనా, చదువైనా
మా కుర్చీలు కదలకుంటే చాలనుకునే వాళ్ళే కదా
మీ అరవై మంది
వెళ్ళవమ్మా వెళ్ళు
ఎటకారాలు మాని నీ పని చేసుకో
జనాలకు కాక రాకముందే
జన నేతలకు కళ్ళు తెరిపించు సంతోషిస్తాం
పందుగ రోజు కషాయం ఉగాది నాడే కాదు
యుగాదిగా రోజూ సేవిస్తూనేవున్నాం
చాలు నాకు నీతో మాట్లాడే మక్కువలేదు
కలం కాండ్రించి ఉమ్మే ముందే
నీతులు చెప్పడం మాని వెళ్ళూ!
---------------------------------
29 మార్చి 2017 ఉగాది కవిత

వారసత్వం

ఈ లెక్కన బ్రొటన వేలే కాదు
ఏ అంగమైనా బలి ఔతుంది!
దక్షిణగానో,
అశాస్త్రీయ శిక్షాస్మృతిగానో
--
(ఆధిపత్యాలే మనువు వారసత్వం!)

|| కపిల రాంకుమార్‌ ||మట్టి మనిషి మట్టిలోనే కలవాలా?||

మట్టి మనిషి మట్టిలోనే కలవాలా?
'' అన్నదాతా సుఖీభవ ''
కంచం ముందు చేయికడిగినప్పుడల్లా
యాది చేసుకుంటున్నది సత్యం!
సుఖ జీవనమన్నది మృగ్యముతున్నదీ నగ్న సత్యం!!
**
వరైనా, మరేదైనా
దినదినగండం నూరేళ్ళాయుసులా
పంట కొరకెన్ని తంటాలో
పెంట వేస్తే పంటొస్తాది
అది సాగు ధర్మం
ఎరువులు బరువులై విత్తులకు
ఎత్తుల చిత్తులలో
మిత్తి మీదేసుకుంటే
చివరకు  నెత్తి మీద గుడ్డకూడ మిగలదేమి?
పుట్టుదలకొరకు కాళ్ళరిగినా
పుట్టినదానికి చెలక తనఖాపెట్టితేకాని
సాలిరవాలు దుక్కులు
అదును పదునుకోసం దిక్కులు చూడక తప్పదు
మడినారు వడలిపోవుండా
ఆకుల ఆశ్రమం కట్టి సాదుకుంటేనే
తరుణ వయసులో మొక్కనాటితేనే
పూత, పింది కాయలొచ్చేది
ఆకు ముడత రాకుండా సశ్యరక్షణ్ చేసి
కైలు చేయ కూలీల వెతుకులాట
మండే ఎండలు, ధరలు పోటీలో
తనూ కుటుంబంతో చేయి వేస్తేనే
ఎర్రబంగారం గంపల చేరి
కళ్ళంలో తివాసీగా మారేది.
రంగు పోకుండా పెళపెళ మన్నపుడే
మంచుపదునులో గోనెలోకి చేర్చాఅలి
మొదటి కాత కొచ్చేది నాణ్యమైనదే అయినా
మార్కెట్‌ మాయాజాలంలో రవాణా మోతతో
గిట్టేదెంతో, చేతిలో పడేదెంతో
గుమ్మంకాడే కాసుక్కూచున్న షావుకారి వాటాపోటే
మిగిలేనో లేక
మడిసి మాత్రమే కుమిలేనో ?
ప్రపంచంలో ఉత్పత్తీ అయ్యే సరుకులన్నీ
తయారీ దారుడే ధర నిర్ణయిస్తే
ఈ ధరలో మాత్రం రైతు ఉత్పత్తికికి మాత్రం
ధర నిర్ణయ హక్కెందుకు లేదో
ఆ పెరుమ్మాళకెరుక!
తులనాత్మక ఆదాయం రాక
తులాభారంలో మొగ్గలేక
తలాపున దీపమెట్టించుకునే
గతికి కారణమెవరు?
శ్మశానాలలో ఖాళి లేక పెరటిలోనే
భస్మమయ్యే వ్యవసాయ కమురు కంపు
ముక్కుకు సోకలేదా?
రైతు నిష్క్రమణలకు ఎవరిని శిక్షించాలో
పంట అనుభవదారులూ తేల్చి చెప్పండి
అన్నం తిన్నపుడె కాదు
నిత్యం సుఖీజీవుడుగా రైతును బతికించండి!
ఎర్ర బంగారం/ తెల్ల బంగారం
కళ్ళార చూడలేక కళ్ళు మూసేసుకుంటున్న
కల్లం యజమాని గోడు పట్టించుకోండి!

కపిల రాంకుమార్‌