3, మే 2014, శనివారం

కపిల రాంకుమార్ ||నమోబాబుకళ్యాణం||


కపిల రాంకుమార్ ||నమోబాబుకళ్యాణం||
**
కంచు మోగునట్లు కనకంబు మోగదని
వేమన మాట అక్షరాలా నిజమని తెలుస్తుంది
న.మో. రాజకీయ రంకెలు ఆలకిస్తే.
దేశానికే కళంకమంటించిన హత్యాకాండలో
తడిసిన చేతులు రుద్రాక్షలతో
జతగటితే పవిత్రమైనట్టు
కాల్పనిక ఉదాహరణలే అభివృద్ధంటూ
ఎన్నికల ప్రచారాలపై ఊరేగుతున్నారు.
తిరుగులేని నాయకుడైనట్టు
స్వార్థపరుల అండతో
అస్తిత్వాన్ని కాపాడుకోగలమనుకోవడం,
వీరోక్తుల గాలి భజనలో పరవశించి పోవడం
అంతా ప్రహసన ప్రాయం.
పర్యటనా ప్రసంగాలలో
ఊకదంపుడుపన్యాసాలలో,
ఇదే వైరుధ్యం ప్రత్యక్షమవుతుంది.
రాష్ట్ర విభజన తమ వల్లనేనని చెప్పుకునే
ఈయన '' తల్లిని చంపి బిడ్డను బతికించాల '' ని
మాటలు చెప్పడం ఎవరిని నమ్మించడానికి?
మతాల మంటలు పెట్టడంలో ఆరితేరిన నేత
పదేపదే విభజన రాజకీయాలు తగవని
చేసే హితబోధ పుర్రెలతో భగవన్నామస్మరణ
చేసే కుహనా సాధువులా బహిరంగ రంగ ప్రదర్శన
చేస్తూ '' కోడలికి బుద్ధిచెప్పి అత్త తెడ్డు నాకిన చందమే ( చంద్రమే) '' కాదా?
**
అధికారం కోసం తహతహలాడుతూ
కాంగ్రెస్‌పై విమర్శించటం అర్థమైనదే కాని
ఆ సాకుతో మతతత్వాన్ని
బాబు నెత్తినెత్తుకోవడం ఎలా సమంజసం?
తెలుగువారి ఆత్మగౌరవం సంగతి
అటుంచి దేశం ఆత్మగౌరవానికే
ఇది తప్పనిసరిగా భంగకరం.
తనను విస్మరించినా పట్టుకు వేళ్లాడే దుస్థితి
అవకాశవాదమే కాదు
తప్పిదపు స్వయం కృతాపరాధం కూడ
ప్రభంజనం ఇక్కడ ఎంత ప్రహసన ప్రాయంగా
ముగిసేదీ త్వరలోనే విదితమవుతుంది.
**
25.4.2014 **/ 3.5.2014 ( ఒకానొక విశ్లేషణకు స్పందన)

23, ఏప్రిల్ 2014, బుధవారం

కపిల రాంకుమార్|| దీనికి సమాధానం ఏది? |

కపిల రాంకుమార్|| దీనికి సమాధానం ఏది? ||
ఊళ్ళో పెళ్ళైతే
కుక్కలకు హడవుడని
ఎందుకన్నారో కాని
కాట్లాడుకుంటున్నప్పుడు
కుప్పతొట్టి రణరంగమైంది
అయినా అది
నాకు ఆశ్చర్యమనిపించలేదు!
పక్కనేవున్న సర్కారీ హాస్టలు పోరగాళ్ళు
ఫంక్షన్‌హాలు గేటువద్ద
పడిగాపులు కాస్తూ బతిమాలుకుంటుంటే
వాచ్‌మన్‌ పొండిరా పొండని అరుస్తుంటే
ముక్కున వేలుపడింది!
సర్కారు వాళ్ళ కడుపులను
అర్థాకలి గురిచేసి
మిగిలిన దానిని అర్థంగా మార్చి
బొక్కసానికి బొక్కపెట్టి
తమ బొక్కసం నింపుకుంటున్నపుడు
ఆశ్చర్యమేసింది!
అందుకేనేమో
ఆ పోరళ్ళప్పుడప్పుడు
బడికెళ్ళే దారిలో వంకర చూపులతో
ఇండ్ల దొడ్లో కొబ్బరికాయలకో
జామకాయలకో గోడలు దూకి
రాళ్ళు రువ్వుతుంటే గమనించాను
కొండకచో గద్దించే వాడిని!
పల్లెటూళ్ళో అమ్మ అయ్య
వీరి బాగుకోసం తాపత్రయంతో
హాస్టల్‌కు తోలితే
అజమాయిషీ లేని వీళ్ళు
యిలా అర్థాకలితోనో
బాల్య చాపల్యంతోనో
పొరుగువాడి వస్తువులపై
కన్నేస్తున్నారంటే.... ఏమటర్థం?
సంక్షేమం ఇలా
సంక్షోభాల్ని
సంక్లిష్టతలని
పురుడుపోసుకుంటుంటే
సమాధానం ఎక్కడ దొరుకుతుంది!
రేపు బాల నేరస్తులగానో,
కరుడుగట్టిన నేరగాళ్ళైతే
సమాధానం ఏది?
23.04.2014

20, ఏప్రిల్ 2014, ఆదివారం

వినూత్నరీతిలో ఖమ్మం సాహితీ స్రవంతి జయ ఉగాది కవి సమ్మేళనం|

కపిల రాంకుమార్|| వినూత్నరీతిలో ఖమ్మం సాహితీ స్రవంతి జయ ఉగాది కవి సమ్మేళనం||

ఆమని '' ఉగాది కవితా సంపుటాన్ని ప్రముఖ కవి, నాటక రచయిత, దర్శకుడు బాణాల కృష్ణమచారి చేతుల మీదుగా ఆవిష్కరించిన పిదప సంపాదకత్వం వహించిన బి.వి.కె. గ్రంథాలయ నిర్వాహకుడు కపిల రాంకుమార్ మాట్లాడారు. . జయనామ వత్సరానికి స్వాగతం పలుకుతూ '' మన తెలుగువారికి ప్రధానమైన సంస్కృతీ సంప్రదాయాలలో భాగంగా కుటుంబ యావత్తు ఆనందంగా కోటి ఆశలతో, కొత్తపథకాల రూపకల్పనతో కొంగ్రొత్త ఆలోచనలతో నూతన నిర్ణయాలతో జరుపుకునే పర్వదినం ' ఉగాది ' కి విశిష్ట స్థానం వుంది అని '' తదనంతరం, కపిల రాంకుమార్ తన సంపాదకీయాన్ని కొనసాగిస్తూ '' మన భాషా సంస్కృతులు, మానవ సంబంధాలు ప్రస్తుతం పడమటిగాలి వడదెబ్బ కు సోలిపోకుండా, ప్రపంచం మొత్తం ఆవహించిన మత ఛాందస వాదానికి, ఉగ్రవాదానికి,ప్రపంచీకరణ ముసుగులో ముంచుకొస్తున్న గ్లోబలీకరణకి తట్టుకుని నిలబడాలనే తలంపుతోనే భావ సారూప్యం కల కవులు, కళాకారులు 1999 జనవరి 26 తేదీన ఖమ్మం పట్టణంలో సాహితీ స్రవంతిని ఒక వేదికగా ఏర్పాటుచేసుకుని గత 15 సంవత్సరాలు అనుబంధాన్ని పెంచుకుంటూ,కేవలం ఖమ్మంలో ఆవిర్భవించి నా, రాష్ట్ర షాయి సంస్థగా ఏర్పడటానికి, అంతేకాక, దాని ఆధ్వర్యంలో సాహిత్య ప్రస్థానం అనే సాహిత్య మాస పత్రికగా జనాదరణ పొందటానికి కొద్దో గొప్పో ఖమ్మం పాత్ర గణనీయమైనదేనని చెప్పుకునేందుకు నయంగానే గర్వపడుతున్నామని, సాహితీ సాంస్కృతిక కార్యక్రమాలు, నిర్వహిస్తూనే ఒక గుర్తింపు పొందామని, దానిని నిలబెట్టుకోవాలని, అందుకు నిబద్ధత, నిమగ్నత కలిగిన సాహితీ కార్యకర్తల కృషి అవసరం ఎంతైనావుందని, కొత్త వారిని ప్రోత్సహించటం. మెలుకువలు నేర్పటం సదస్సులు, శిక్షణాతరగతులు నిర్వహించటంలాంటి కార్యక్రమాలు చేస్తూనేవున్నామని,. ఇంకా మరిన్ని అలాంటివి కొనసాగించాలనే కృత నిశ్చయంతో వున్నామని, అందులో భాగంగానే గత సంవత్సరం జూలై నెల నుండి మూడవ ఆదివారంలో ప్రతి నెల సాహితీ స్రవంతి అధ్యయన వేదిక నిర్వహిస్తూ, దాదాపు 20 నుండి 35 మంది దాక హాజరవుతున్నారని పేర్కొన్నారు. అంతేకాక, కవిత్వ పఠనం, చర్చ, సాహిత్య ప్రసంగములు నిర్వహిస్తున్నామని, ఇది ఒక అపూర్వ ప్రయోగంగానూ, ఉపయుక్తంగానూ, వుందని తెలిపారు.ఈ సంవత్సరం సాహితీ స్రవంతి 15 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భాన్ని పురస్కరించుకుని ఒక సాహితీ సంచిక ప్రత్యేకంగా తేవాలని అనుకుంటున్నామన్నారు . ఆప్రయత్నంలో భాగంగానే ఈ జయనామ ఉగాదికి ఎంపిక చేసిన కవితలను మీ ముందుంచుతున్నానని, సలహాలు, సూచనలు కోరారు. ఇందులో సమకాలీన, సామాజిక రాజకీయ అంశాలతో పాటు పండుగ నేపథ్యాన్ని మిళితం చేసి, షడ్రుచుల సమ్మిశ్రితంగా కవితలు, పద్యాలు, గేయాలు, మీకు దర్శనమిస్తాయని, వీటిని ఒక చోటికి తేవటం సంకలనపరచడం కత్తిమీద సామైనా సాహితీ స్రవంతి కార్యకర్తల తోడ్పాటుతో ఈ చిన్న రూపం తేవడంలో యేమాత్రం సాఫల్యం చెందామో కాని, ఒక చిన్న సంతృప్తి మాత్రం కలుగుతోంది. ఆదరించి, అహ్వానించిన వెంటనే స్పందించి కవితలు పంపినవారికి, సహకరించిన కార్యకర్తలకి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ముందుముందు కూడ ఇలానే ఇదే స్ఫూర్తితో తోడ్పడాలని వేడుకుంటూ, పేరుకే సంకలనకర్తనే కాని యిది అందరి సమిష్టి కృషి అనిమాత్రం చెప్పక తప్పదు. మరొక్కమారు అందరికి నూతన సంవత్సర అభినందనలు తెలియచేసారు.ఈ సమావేశానికి సాహితీ స్రవంతి జిల్లా అధ్యక్షుడు కె. ఆనందాచారి అధ్యక్షత వహించగా, సాహితీ స్రవంతి జిల్లాకార్యదర్శి రౌతు రవి, అతిథులను వేదికపకి అహ్వానించి తన నివేదిక సమర్పించచారు
ఈ కార్యక్రమంలో భాగంగా ఖమ్మానికి చెందిన సీనియర్ కవులను, సాహిత్యాభిమానులను సన్మానించారు. బాణాల కృష్ణమాచారి, కోటీ శశిశ్రీ, కపిల రాంకుమార్, వురిమళ్ళ సునంద, టి.ఎల్. లక్ష్మీనరసయ్య, డా. పొత్తూరి సుబ్బారావు, డా.కావూరి పాపయ్య శాస్త్రి, డా.కవితాంజనేయులు, మొదలగు వారు సన్మానంపొందిన వారిలోవున్నారు. తదుపరి కన్నెగంటి వెంకటయ్య, సునంద, కపిల రాంకుమార్, నిర్వహణలో కవి సమ్మేళనం కొనసాగింది. ఇరవైరెండు మంది కవితలను పుస్తకరూపంలో సంకలనం కావించగా, వీరు కాక, మరో పదిహేనుమంది తమ కవితలను చదివి వినిపించారు. మాజీ మునిపల్ చైర్ పర్సన్‌ అఫ్రోజ్‌ సమీనా, సి.ఐ.టి.యు నాయకులు ఎర్రా శ్రీకాంత్, ప్రముఖ రంగస్థల కళాకారుడు అద్దంకి కృష్ణప్రసాద్, బి.వి.కె. డిప్యూటి జనరల్ మేనేజర్ కందాడై శ్రీనివాసులు మొదలగు వారు సందేశమిచ్చారు.

పండుగ బలహీనతని రాజకీయ నాయకులు ఎలా అవకాశంగా తీసుకుని సామాన్యుని అవసరాలపై ఎలా వల వేస్తారో, ఆశపడి, బోర్లపడిం సామాన్యుని వేదన తన కవితలో రాంకుమార్, ఆరు ఋతువులు సమ్మేళనం ఈ ఉగాది అంటూ సునంద, మానవాళి మేలుకొరకు మరింత వెలుగులు నింపాలని ఆశతో శైలజ, ఏది ఏమైనా కోయిలా ఒట్ల పండుగని వెంటేసుకుని వొచ్చావులే అంటూ కన్నెగంటి చమత్కరించగా, కాలాన్ని నిర్వ్చిస్తూ చక్కటి చమత్కార కవిత గిరి నరసింహారావు, శిసిరంలో రాలిన పండుటాకుల్ని లెక్కిస్తూ, తొక్కేస్తూ ఋతువుల క్రమాన్ని తన కవితలో బంధించిన వనం తేజశ్రీ, ఎన్ని ఉగాదులొస్తేనేం, మనిషి మనసుని మార్చగలవా అని ప్రశ్నిస్తూ పోట్ల సుధారాణి, '' జయాలనిచ్చే ఉషోదయానికై '' అంటూ గేయ రూపంలో ఉగాదిని స్వాగతించిన సంపటం దుర్గా ప్రసాదరావు, పండుగ సంబరమొకరోజే కాని సాలు పొడుగునా వైఫల్యాలెన్నో ఇన్నేళ్ళ ఉగాదుల వెంట వస్తూనే వున్నాయంటూ చావా జయప్రద, ఇది ఖచ్చితంగా రాజకీయ రంగు పులుమంకున్న ఉగాదే అంటూ చతుర్తలు కూడిన కవితతో మేడగాని శేషగిరి, కలవరపడకే కోయిలా అంటూ హెచ్చరిస్తూ కంచర్ల శ్రీనివాస్, కోకొఇల స్వరాలకు బదులు కాకుర స్వరాలు.. పల్లెల్లోనూ, గల్లీల్లోనూ వినిపిస్తున్నాయంటూ కవితాంజనేయులు, స్వాగతం కవితతో బూడిద అరుణ గౌడ్, షడ్రుచులతో కృష్ణవేణి, కొత్త ఆశలతో సీతారామారావు, పాడవే కోయిలా గొంతెత్తి యుగగీతి గేయంతో రౌతురవి, జయ ఉగాది పై చక్కటి సంప్రదాయ వృత్తాలతో డా.పొత్త్రి సుబ్బారావు, డా. పాపయ్య శాస్త్రి, తాగుబోతోడి శ్రీమతి తంటాలను చమత్కారంగా పావే రావు, పండుగ హడావుడి - హాస్య రూపకాన్ని రౌతు కడలి, ఎన్నికల వేళ మతంరంగు పులుముకుని దాడిచేయబోయే వాడిని గుర్తుపట్టానంటూ బండారు రమేష్, ప్రతీ దానినీ నిశితంగా, నిజాయితీగా చూడటం నేర్చుకోవాలని కె. ఆనందాచారి, బతికేవున్నామని ఓ ఐదేళ్ళకోసారి గుర్తుచేసుకోవటమేనా - ఎన్నీకలంటే అంటూ తీవ్ర స్వరం వినిపించిన పోతగాని, పర్వదిన్నం పేరుతో నైనా మనల్ని మనం ప్రక్షాళన చేసుకోవటం యెంతో అవసరమని గజేంద్ర సైదులు. ఇచేఏ పైసలకు ఆశపడితే పడ్డావు కాని, ఓటు మాత్రం అర్హత కలిగిన వాడికే వెయ్యాలి సుమా అంటూ ఆలేటి పరంజ్యోతి కవితలు అందర్ని అలరించాయి. వివిధ ప్రజా సంఘాల నాయకులు, విశ్రాంత ఉద్యోగ సంఘనాయకులు, పట్టణంలోని ప్రముఖ న్యాయవాదులు, వ్యాపారస్తులు , మహిళాసంఘ నాయకులు, ఆదివారం మీ కోసం అధ్యక్ష, కార్యదర్శులు మొదలగువారు పాల్గొన్నారు. బోడేపూడి విజ్ఞానకేంద్రం నిర్వాహకులు ఉగాది పచ్చడి, చక్కెర పొంగలి, పులిహార వచ్చిన వారందరికి పండుగ ఆతిథ్యాన్ని అందించారు. ఎం.శేషగిరి , కన్నెగంటి వెంకటయ్య, మరియు కళానిలయం బృందం వారు తమ గీతాలాతో అలరించారు.
**
--కపిల రాంకుమార్ 9849535033 (4.4.2014/19-4-2014)

సుత్తి కొడవలి చుక్క -దారిచూపు వేగు చుక్క|


కపిల రాంకుమార్ || సుత్తి కొడవలి చుక్క -దారిచూపు వేగు చుక్క||

అనునిత్యం పోరుబాట వెన్నుదట్టు అమ్మమాట
ఆశయాల పెనుకోట త్యాగధనుల పూదోట
ఎరుపంటే వెలుగె ఎరుపంటే జయమే
ఎరుపంటే పతాకం విజయానికి సంకేతం

సుందరయ్య ఆచరించి బంధుత్వం కలిపాడు -
కూలిరైతు సంఘాలకు ఒక మార్గం నెరిపాడు

బెదిరే జింకలను కుమిలే జనాలను -
ఆపదల ఆగడాల తట్టుకోను బలమిచ్చి
ప్రశ్నించే తత్వాన్ని కొనసాగే ధైర్యాన్ని -
చీకటిని పారదోలే ఎర్రజెండా మనకిచ్చి

అరకపట్టి చెమెటోద్చే పనివాడిదే పొలమంటూ -
చాకిరిలి సరిపోయే రూకలు పొందాలంటూ
ఆరుగాలపు కష్టాన్నీ బుర్ర మీసం దోచుకునే -
పాతకాల దొరతనం కలకాలం సాగదని

అతివలు అనాథలు బడుగులు బలహీనులు -
హక్కులకై ఉద్యమించ ఎలుగెతే గళమిచ్చి!
కదం కలిపి నడిచేలా ముందువరుస తానుండి -
లాఠీలకు తూటాలకు వెరవులేక ఎదురొడ్డగ

జనం తెరువు కొరకు బతుకు వెలుగు కొరకు -
పొద్దు పొడిచిన సూరీడై ఆదరించు చెలికాడై
సుత్తికొడవలి చుక్కరా దారిచూపు వేగు చుక్కరా! -
వేలు పట్టి నడిపించే కన్నతల్లి చేయిరా!

కపిల రాంకుమార్ - 20.4.2014

11, ఏప్రిల్ 2014, శుక్రవారం

ఓటుబద్ధ హెచ్చరిక

కపిల రాంకుమార్|\ ఓటుబద్ధ హెచ్చరిక ||

పార్టీ మారిన నేతకెన్ని కష్టాలో
దుమ్మెత్తిపోసేటప్పుడు జాగ్రతలెన్నో
తీసుకోక పాత పాటే పాడితే
ఓట్లు రాలకపోగా తాటతీసి తన్ని తగలేయగలరు
యింటికి పంపుతారు జనాలు
మారేటప్పుడు వళ్ళు దగ్గరపెట్టకున్నా
ఇప్పుడుమాత్రం జర భద్రం!
సీటు గెలవాలంటే!
**
గుర్తు తప్పు చెప్పినా
అధినాయకుడి పేరు మర్చిపోయినా
ప్రస్తుతాన్ని స్తుతించిక పోయినా
ఏ యెండకా గొడుగు పట్టకున్నా
సమావేశాల్లో, ప్రెస్ మీట్లో నోరు పారేసుకున్నా
జోరువాన పడ్డట్టు
చెప్పులు పడొచ్చు
కుర్చీలు మీద పడొచ్చు
అలో లక్ష్మణా అని
తప్పించుకోలేక
యే సోదరి కోక కట్టుకోక తప్పదు!
ఆకట్టుకోక తప్పదు!
**
ఇన్నాళ్ళు నమ్మిన జనాన్ని
మోసగించడానికి
సిగ్గు తీసి ఇంట్లోపెట్టి
మనస్సాక్షిని హత్యచేసిన రక్తపు చేతితో
రెండు వేళ్ళూపుతూండాలి
అవలక్షణాలన్నీ వంటబట్టకున్నా
మనుగడకే తిప్పలొస్తాయి
మళ్ళీ కొత్త గెంతు వేయాలి !
**
తెలివైన కుందేలు ముతరాసోని వలలో పడ్డట్టు
మతతత్వమంటూ రంకెలేసి
మఠాధిపతుల ఒళ్ళో వాలాలి కదా
కాలు విరగ్గొడతానన్నవాడివి
వాని కాళ్ళకాడికే చేరాలికదా
యేమొ
జనం తెలివితో
ఓటిది కాని ఓటుతో
బలంగా ఓ పోటు పొడిస్తే
కాటుకు తట్టుకోలేకపోతే
గోచి సర్దుకుని గోడ దూకటానికి సిద్ధపడాలి కదా!
**
దాదాపు పార్టీలన్ని
బారులు తెరిచి బార్లా తెరిచి
అహ్వానిస్తాయని యెల్లపుడు కలగనకు!
ఒక్కొక చోట గడీలమించిన
అడ్డుగోడలు లోపలిలి రానీవు
అప్పుడు నీగతి అధోగతి
పేడకళ్ళు, చీపురు దెబ్బలు
తప్పించుకోకలగాలి
మద్దతిచ్చే పర్టీలు
ముద్దకుడుములు పెడతాయనుకోకు
బూడిదలో పన్నిన కుక్క వైరాగ్యంలా
పాతవి గుర్తుకొస్తే
మడత పేచీలు పెట్టి
నీ బతుకు సంకరం చేసి
శంకరగిరిమాన్యాలు పట్టిస్తాయి!
**
పదవే పరమావధికాదు
ప్రజలకొరకు పనిచేయ
నియమబద్ధ, నిబద్ధత కలిగి
నాయకత్వం వహిస్తే చాలు
గౌరవాలు పొందటానికి
అంతే కాని వంకలేనమ్మ డొంకట్టుకు
యేడ్చినట్లు కబుర్లు చెప్పకు!
అజెండాలకు నీళ్ళొదిలి
జెండాలట్టుకు తిరుగకు!
ఇది ఓటుబద్ధ హెచ్చరిక!
**
11.4.2014 సాయంత్రం 5.55

10, ఏప్రిల్ 2014, గురువారం

కపిల రాంకుమార్|| మినీలు|\

కపిల రాంకుమార్|| మినీలు|\
1. ఆపదలో - ఆదుకునేందుకు
బురద బాధించదు!
అపవాదు మీదపడ్డపుడు
మనసు దేనిని భరించదు!

2. పుట్టుకతో వచ్చిన బుద్ధులు
పుడకలతో కాని పోవు!
వ్యక్తిత్వానికి పడ్డ మచ్చలు
గతించినా తొలగవు!
10.4.2014 సాయంత్రం 6.30

3, ఏప్రిల్ 2014, గురువారం

|ఎన్నికల కన్నెర్ర పూల గుసగుసలు

కపిల రాంకుమార్ ||ఎన్నికల కన్నెర్ర పూల గుసగుసలు||
**
అభ్యర్థుల ఎంపికలో పార్టీలకు గుబులెన్నో
అంతులేని నేతల గొంతెమ్మ కోరికలెన్నో!
**
పనితనం బేరీజులో నూటికినూరు సున్నాలే
ఎవరి పుస్తకం తెరిచినా మసిబారిన పేజీలే!
**
లాభ సాటి స్థానం శక్తికి మించినదే
గెలుపు మేతకు యుక్తిలెన్ని పన్నాలో!
**
గతచరిత్ర విలువ మచ్చుకైనా లేకపోయె
చీకటి కోణపు కతలన్నీ చూస్తే తన్నులే!
**
ధనం మద్యం ముందు ఉద్రేకం ఆవేశం పనిచేస్తాయా?
ఉపాయం అలోచన శూన్యం కుర్ర, కర్ర పెత్తనం గెలిస్తుందా?
**
జుట్టు రంగు మారిస్తే జట్టుకు హంగులొస్తాయా?
బట్టతల ఎత్తుగడలకు పుట్టగతులున్నాయా?
**

తిట్టిన వాని పక్కనె చేరి జైకొట్టాలన్నా!
పెంచినవాణ్ణి నెట్టగ గోడలెన్నో దూకాలి
**
సిగ్గులెగ్గులొదిలేయాల్సిందే సీటుకై
తొడుగు విముఖమైనా చేరాల్సిందే!
**
వంటలు చేసో బట్టలుతుకో
కాళ్ళు పిసికో కాయం శ్రమించాల్సిందే!
**
చేరిన వాడి అవినీతి మచ్చ గోప్యమవుతుంది
వాడుకొట్టిన దెబ్బ మానుతున్న మచ్చవుతుంది!
**
వచ్చినవాడి నాలుక (నోరు) నరంలేనిదైనా
ఇచ్చవచ్చినట్లు మాట కుట్టేయాల్సిందే!
**
పార్టీ చెక్‌లలో బొక్కపెట్టి చక్కగ చెక్కులు ఫోర్జరీ భోజ్యం
కోటావాటా చాటుమాటైనా సూటుకేసులు సర్దే లౌక్యం!
**
నిలబడతానని మాటిచ్చి రాబట్టాల్సినదంతా నొక్కేసి
చివరిక్షణంలో వెధవ్వేషం త్రేంచుకుంటూ పలాయనం!
**
బతిమాలితే బిర్ర బిగుస్తారు
అర్థణాకి చెల్లనోడు బోషాణం కోరుతాడు!
**
రాష్ట్రం బ్రష్టు పడ్డా నాకేమి కేంద్రం చేరితే చాలు
వక్రమార్గం నడవాలంటే చక్రం తిప్పేది అక్కడే!
**
అమ్మకు అన్నంపెట్టనోడు అత్తకు మంచం వేస్తాడు
ఆలికి అన్యాయం చేసైనా అంగడిబొమ్మ చేరతాడు!
**
పార్టీలు మారేటోడికి జాతి లేదు! నీతి లేదు!
గెలిచామా లేదా అంతే ఎవరేమనుకుంటే ఏమి?
**
కట్టి పడేస్తే వెట్టి చాకిరి
మెతకవహిస్తే అసరుకెసరు!
అసలు సరుకే కొసరు మోసం!
పిల్లి పెసరతో పాల ఫాక్టరి!
**
ఐకమత్యం అందమైన నినాదం!
రంగులోరంగు ఆనదని
(రం) గులతో ఆరంగ్రేటం!
ఓటేసేటోళ్ళు ఓటి వెధవలా?
నోటాతో నోటుని, నోటిని సాగనంపరా!
**
3.04.2014 11.06 am

|| గాదికింది పందికొక్కు ||

|| గాదికింది పందికొక్కు ||

సుప్రభాతవేళ కోకిల పాట కోసం
మావిడిచెట్టుకేసి చూసా!
కర్ణకఠోరంగా ప్రహరీగోడమీద
కాకి గోల మాత్రం చికాకు పెడుతోంది!
కిటికీ భళ్ళున మూసిన శబ్దం విని
'' కాకి అరుపు విన్నారుగా -
ఇక ఎవరో కొంపకు దిగేటట్టున్నారు!''
మా ఇంటావిడ శరసంధానానికి
'' అదొక్కటే తక్కూవైంది మనకి,
నా మొహాన కాస్త టీ నీళ్ళు పోస్తావూ ''
అన్నమాట వినిపించుకోకుండా
'' పండుగ నెత్తిమీద పడింది దాని సంగతి
దేవుల్లాడరా? '' ఎదురు దాడి టీ తోనే!
'' అందుకోలేనంత ఎత్తులో ధరలున్నపుడు
కొన్నింటిని పక్క వారినుండి అడుక్కోక తప్పదు గాని -
సంచి యిటు యివ్వు '' అన్నా
అడుగునబడ్డ బడుగు జాతి వాళ్ళం కదా
అడుక్కోటానికి సిగ్గులొదిలేసిన వాళ్ళం కూడ!
ముక్తసరిగా ముగించి టీ చప్పరించి
రోడ్డెక్కాను కొనేవి యేమిటి, అడుక్కునేవేమిటి
నెమరువేసుకుంటూ
'' వేప పూవు, మామిడాకు, మామిడిపింది
బెల్లం ముక్క, చింతపండు '' ఉగాది ప్రసాదానికి!
''ఈ మాయదారి పండుగలు
నెలాఖరునే రావాలా? వేతన జీవుల వెతలు మాటటుంచితే
బోడి విశ్రాంత బడుగుజీవి గతేమిటీ '' అనుకుంటు
మోహనరావు అంగడి చేరాను
అడగలేక చేతులు నలుపుకుంటుంటే
'' పాత బాకీ ఎప్పుడు చెల్లుబాటు
పండగ సరుకులకు పొద్దున్నే దాపురించారు?''
మునిసిపాలిటీ వారి ఇంటిపన్ను నోటీసులా!
లేని నవ్వు తెచ్చుకుని '' నిజమే దండగే అదే పండగ ''
నా సంజాయిషి పూర్తికాకుండా, నా మీద జాలో,
నానుండి అతను వసూలు పెరుగుతందనే ఆశో! నాకు తెలీదు కాని
'' పట్టండి తప్పుతుందా. .’’ విసుక్కుంటూ యిస్తుండగా
నా దృష్టి మాత్రం ఇంకెక్కడో..... అటు పక్కో జీపు యిటుపక్కో జీపు
''మాతో వస్తే 100 రూపాయలు, క్వార్టర్ బాటిల్, బిర్యాని పొట్లం ''
చెరో పక్కనుంచి నన్ను లాగుతున్నటనిపించింది!
'' ఆఁ...మాతో వస్తే 100 రూపాయలు, రెండు
బిర్యాని పొట్లాలు ''
ఎన్నికల ప్రచారానికి కూలివాళ్ళ వేటలో నా దగ్గరకే వచ్చినట్టుంది!
'' ఇటు చూస్తే బాదం హల్వా అటు చూస్తే ఇడ్లీ సాంబారు ''
ఎదో అవే మాటలు శ్రీశ్రీ అన్నట్లు గుర్తుకొచ్చి,
సంచి అందుకుంటూండగా
'' ఈ బాకీ, పాత బాకీ చెల్లింపు ఎప్పుడు.''
వెంటనే జవాబు చెప్పలేను......ఎదురుగావున్న అహ్వానాన్ని
అందుకుని, మౌనంగానే ఇంటి ముఖం పట్టాను!
చలపతి దొడ్లోంచి మామిడాకులు, మామిడిపిందెలు,
వెంకట్రావు దొడ్లో వేపపూవు సేకరించి
హడవుడిగా అడుగుపెట్టానో లేదో
ఇల్లు కడిగిన బురదలో జారి బొక్క బోర్లపడ్డాను
సరుకులన్నీ బురద, రెండు బిర్యాని పొట్లాలు వెక్కిరిస్తూ!
దులుపుకుని లేచాను, హతవిధీ అనుకుంటూ,
పండుగ సంబరం మాట అటుంచి
అటు వెతికి, యిటు వెతికి (పోపుల డబ్బా, చెక్కా బీరువా వెతకగా)
యాభై జమకూడితే సరితా క్లినిక్‌కు వెళ్ళి
ఇంజెక్షన్‌ చేయించుకుని
మంచం మీద విశ్రాంతి తీసుకుని
నిద్రలోకి ఎప్పుడు జారుకున్నానో కాని
'' నాన్నా! పండుగపూట దెబ్బలు తగిలాయా? ''
అంటూ మా అమ్మాయి పలుకరింపుతో
నా బాధలు, నొప్పులు మటుమాయమైనాయంటే నమ్మండి
అలా పలకరించిన మా అమ్మాయి అభిమానానికి
అన్నీ చికాకులు మటుమాయమయ్యాయి!
''పరామర్శలు ఆపితే ఉగాది పచ్చడి తీసుకొని
అన్నం తిందురుగాని రండి '' హోం మినిస్టర్ కేకతో
ఒక్కొక్కప్పుడు గాదికింది పందికొక్కు శబ్దాలు కూడ
సుమధుర కోకిల స్వరాలవుతాయని నన్ను నేను
సముదాయించుకున్నాను! **

కపిల రాంకుమార్ 9849535033

27, మార్చి 2014, గురువారం

కపిల రాంకుమార్ || రంకుల రాట్నం||

కపిల రాంకుమార్ || రంకుల రాట్నం||

పదవి రాదని - పరువు కోసం 
ప్రజల సైతం- మభ్యపెట్టి
లాభ నష్టపు - లెక్కలేస్తూ
గోతికాడి - నక్కలాగ
అదునుకోసం - ఎదురుచూసే
దొంగచూపులు - పట్టుకుని
చేరేదీసే - బుజ్జగింపులు .1

ఇంతకాలం - అంటకాగి
కొంతమూల్యం - వెనకవేసి
కంటకాలను - తాళలేక
సొంత గూటిని - కూల్చివేయ
పరుల పంచకు పరుగులిడుతు
గొర్రె దాటు సాకుల వెన్నుపోట్లు! .2

తెలిసి తెలిసి బూదిలోనె
పడుకొనే కుక్కవోలె
ముక్కచూసి తోకవూపులు
మొక్కవోని నమ్మకాలతో
చొంగకార్చె కేతిగాళ్ళు
ఎన్నికల కలలలోనే
పగటివేషగాళ్ళు
ఎన్నికలవేళలోనే
మన్నికైన నృత్యాలు
ఖర్చులేని వినోదంనీలి చలన చిత్రం!
కొత్తబిచ్చగాడు
పొద్దెరుగని చందాన
ఎక్కే గుమ్మం - దిగే గుమ్మం!
ఎక్కడో పడతాడు
తాతీసిన గోతిలో
కోలుకోలేని మచ్చలా!
మిగిలిపోతాడు! 3.

ప్రమాణాలు పాటించడు
ప్రణామాలు పెడుతుంటడు!
పరిణామాలూహించడు
పరిమాణమే హద్దంటడు! .4
నే చెప్పింది వేదంనన్ను అనుకరిస్తే పాపం!
మీరెట్టపోతే నాకెందుకు
అడ్డదారైనా సిగ్గువదిలైనా
గద్దెక్కటమే నా గురి!
తెగ బొక్కటమే తదుపరి! .5

చొక్కా మార్చటం
చక్కగా యేమార్చటం
చెక్కభజన చేయటం
తార్చైనా కుర్చీ ఎక్కటం!
రానివాడికి చోటులేదు
రాక్షసత్వం అబ్బనోడికి
రాజకీయ మనుగడుండదు! .6

27.3.2014

21, మార్చి 2014, శుక్రవారం

ఎవరు? అమ్మ కొడుకు||

కపిల రాంకుమార్|| ఎవరు? అమ్మ కొడుకు||

మానవ జన్మ మహత్తరమైనదని
వచిస్తూనే తోటి మానవులకు
ద్రోహం చేయడమేమిటి?


అక్షరాలను నేర్చిన పాఠశాలనే
పాంథశాలగానో, పానశాలగానో మార్చటమేమిటీ?
గురువులకే వంగి నమస్కరించిన వాడే
పంగనామాలెట్టడమేమిటి?

ప్రజల మద్దతుతో పదవులందుకొని
ప్రజలను నట్టేట ముంచడమేమిటీ?
అమ్మ పాలు కమ్మగా తాగి
రొమ్ములు కోసే నైజమేమిటీ?
గ్రామస్థాయి నుండి పార్లమెంటు మెట్లెక్కి
గ్రామసింహ స్థాయికి దిగజారుడేమిటి?
అంటే వాడు ఒక అమ్మకు అబ్బకు పుట్టినోడేనా?

సైద్ధాంతిక నిబద్ధత కలిగిన పక్షాన అత్యున్నత స్థాయికెదిగి
చొక్కా మార్చిన చందాన పార్టీలు మార్చి
నిన్న పొగిడి,
నేడు తెగనాడు వాడు
లం........కొడుకు కంటె హీనమగుటేమిటి?

చెట్టుపేరు చెప్పుకొని,
తాతల ప్రవరలు చెప్పుకొని
పబ్బం గడపటానికి ఈ వేదికే దొరొకిందా!
నిత్య కృత్య రాజకీయ వ్యభిచారమాచరిస్తూ
నికృష్ట బతుకులో
పందిలాగ బురదలో పొర్లుతూ
నీతి సూత్రాలు వల్లించుటేమిటి?

ఓటేసే ప్రజలు దేవుళ్ళంటూ దేవురించి
గట్టేక్కిన పిదప గద్దెక్కి వాళ్ళ
కూడు, గూడు, గుడ్డ గుంజుకుని
వివస్త్రులుగా, నిర్వాసితులుగా, ఆకటి కేకలకెరచేయుటేమిటి?

ఎత్తిన జెండా కడకంటా
మోయండం గొప్ప!
చచ్చిన పిదప కప్పించుకునే
గౌరవం పోగొట్టుకుంటే ఎలా?

ఇది రాజకీయమా?
అరాచకీయమా
''రా''క్షసంగా ''జ''నాలకు ''కీ''డుచేయు ''యం''త్రాంగ నైపుణ్యంతో
పదవీ కామ ప్రకోపాన
ప్రతాపాలు చూపువారు లం............కొడుకులు!

21.3.2014

|\అక్షర క్షిపణి|\

కపిల రాంకుమార్|\అక్షర క్షిపణి|\
ఓ అక్షరానికి మరో అక్షరం పేర్చటం కాదు
అది క్షిపణిలా పేలినపుడే కవిత్వం!
పళ్ళగొర్రుతో దమ్ము చేసిన చేలో వరినాట్లు
చదరంగపు గళ్ళున్నట్టుండాలి!
గాలికి వూగే జొన్నకంకులమీద వాలిన పిట్టలాగుండాలి
మబ్బులను అహ్వానిస్తూ ఆకాశంలో విన్యాసం చేసే తూనీగల్లాగుండాలి!
కొండరాళ్ళ మధ్య సెలయేటి సవ్వడిలా
నాట్యమయూరి సిరిమువ్వల ఝరిలా
యుద్ధభేరీ నినాదంలా వుండాలి కవిత్వం!
నైపుణ్యం సంతరించుకున్న శిల్పంలా
విప్లవ శంఖంలా
వసంతకాలపు వెచ్చని సూర్యోదయంలా
శారద రాత్రుల మలయ మారుతంలా
కొబ్బరిచెట్టునీడలో వాల్చిన పడకుర్చీలా
గండుతుమ్మెద రెక్కల సవ్వడిలా
పొగరెక్కి పొలంగట్టుమీద రంకేలేసే ఒంగోలు గిత్తలా!
ఎలకోయిల మధుర గానంలా!




జామాకు వగరులా!
వేపాకు చిగురు అనుపానంలా!
చెరుకుపానకంలో అద్దుకునే మినప రొట్టెలా!
రోమాంచిత సాహితీ స్పర్శలా!
వీర తిలకం దిద్దే పత్నిలా!
ధైర్యపు  భుజంమీది సంధించిన ఆయుధంలా!
శత్రు స్వప్న  సింహంలా !
జతగూడే అక్షరమే జతగాడౌతుంది!
పదాలతో పదాతిదళానికి మొనగాడైన అధిపతౌతుంది!
అసమర్థిని ఎంపికకు విరోధి అవుతుంది!
సమర్థునికి జయకేతనమౌతుంది!
నిత్య ప్రకాశ సత్యమై
నిబద్ధత కలిగివుంటుంది!
జన చైతన్య వికాసమై
ఎగిరే ఎర్రజెండాలా
భూతకాలపు జల్లెడై
వర్తమానాన్ని విశ్లేషించుకుంటూ

భవిష్యత్తరుణ పతాకమౌతుంది.!

సాహితీ స్రవంతి అధ్యయన వేదిక 16.3.2014 నివేదిక |

కపిల రాంకుమార్|| సాహితీ స్రవంతి అధ్యయన వేదిక 16.3.2014 నివేదిక ||
ప్రతినెల మూడవ ఆదివారం సాహితీ స్రవంతి అధ్యయన వేదిక సమావేశం బి.వి.కె.  గ్రంథాలయంలో కపిల రాంకుమార్ మాట్లాడుతూ కవిత్వం - శిల్పం అధ్యయనంలో భాగంగా సుధామ వ్రాసిన  చిత్రగ్రంథి సంకలనం నుండి వివరన అనే కవితను  వినిపించారు. ఈ సమావేశం కపిల రాంకుమార్ అధ్యక్షత వహించగా డా.పొత్తూరు వేంకట సుబ్బారావు అతిథిగా విశ్లేషణ చేయటానికి, చర్చను కొనసాగించటానికి కన్నెగంటి వెంకటయ్య, రౌతు రవి వేదిక అలంకరించారు. చర్చను ప్రారంభిస్తూ డా.సుబ్బారావు గారు సుధామ కవిత్వం చిత్రగ్రంథి అనేపేరే శిల్పానికి సంబంధించినదని, శ్రీహర్షుడు  తన హర్ష నైషధంలో గ్రంథిస్ అనే పదాన్ని ఉపయోగించాడని, అది యోగవిద్యకు సంబంధించదని తెలిపారు. కవికి ప్రతిభ, ఉత్పత్తి పుష్కలంగా వున్నపుడు అద్భుతమైన కవిత్వాన్ని సృష్టిస్తాడని, లోక దృష్టి, లోక స్వభావం తెలుసుకోటం ద్వారానే అటువంటి అసమాన సృజన జరుగుతుందని తెలిపారు. పఠన, పాఠనం  ద్వారానే  సాహిత్యాన్ని సృష్టించకలుగుతాడని తెలుసుకోవాలన్నారు. సంవిధానం(శిల్పం)లో శ్రీశ్రీ దిట్ట. 
పద లక్షణాలు సుష్టుగా ఉపయోగించగలనేర్పరి కాబట్టి ఆయన పఠన, పాఠనాన్ని బాగా అల్లగలిగాడు. బ్రహ్మ గ్రంఠి, విష్ణు గ్రంథి, రుద్ర గ్రంథి  అనేవి మూడు యోగానికి చెందినవి. ఒక కవి యొక్క పూర్వాపరాలు తెలుసుకుంటే ఆ కవి హృదయలోకి మనం వెళ్ళవచ్చు, రూపం, బాహ్యం రసం అంతర లక్ష్యణం. రూపం అనేది భావాన్ని బట్టి వస్తుంది. కవిత్వం లోకానికి అద్దం వంటిది. అందుకే లోకాన్ని కవి నిశితంగా పరిశీలించాలి. అప్పుడే వస్తువుకు తగ్గ సరియైన 
రూపాన్ని ఇచ్చినపుడే మంచి కవిగా రాణిస్తాడు. ఆశ్చర్య చకితులను చేసేదే చిత్రం అంటాము ( రూపమే శిల్పం కదా) నీది కాని విషాదం లేదా ఆనందాలను నీలో ప్రేరేపింపకలిగించడమే కవిత్వం, లేదా కవిత్వ గొప్పదనం.  ప్రతిభ కవికి, చిత్రకారుడికి, గాయకుడికి వుండాలి. Imaginations are two  అందులో ఒకటి primary రెండోది secondary .  ఆకారమును చూసి మోసపోకూడదని  అని మనం గుర్తించాలి. అందుకే కవి అనధికార శాసనకర్త అని
 కూడా నిర్వచించారు. జీవితం మీద ప్రేమను పెంచాలి కవిత్వం.   స్వాంతనమైన సాంత్వనము కలిగించాలి ( ఓదార్చే హృదయాన్ని) అంటూ చక్కటి సోదాహరణలతో వారి విశ్లేషణ ముగిసింది. కన్నెగంటి వెంకటయ్య మాట్లాడుతూ చిత్రగ్రంథి పై చక్కటి విశ్లేషణ చేసారు. మాకు తెలియని విషయాన్ని విడమర్చి చెప్పారు. చాల కొత్త విషయాలను కూడా సుబ్బారావు గారి ద్వారా తెలుసుకోగలుగుతున్నామని అంటూ కవి లక్షణాలు, కవిత్వ లక్షణాలు వివరించిన ర్తీరు బావుందని శిల్పంపైనే ఇవాళ చర్చ బాగ జరిగిందని అభిప్రాయం తెలిపారు.చర్చలో పాల్గొన్న సాహితీ స్ర్వంతి జిల్లా అధ్యక్షుడు కె. ఆనందాచారి '' చిత్ర గ్రంథి ' పై చక్కటి విశ్లేషణ చాల బావుంది అంటూ '' మాక్సిమ్‌ గోర్కీ '' చెప్పినట్లు అవబోధనా శక్తి, బోధనాశక్తి ప్రతి మనిషిలో వుంటాయని, అవి మనిషి తనను తాను కాపాడుకోటానికి, పరిశీలనకు, మరింత లోతైన అవగాహనకు దోహదపడటాయని చెప్పాడన్నారు.   ఊహించటం,  అనుభూతిగా మార్చుకోటం, సత్యంగా ఆవిష్కరించడం ఎవరు నేర్పుగా చేస్తారో వారు తమ కవిత్వం ద్వారా లోకాన్ని ప్రభావితం చేస్తారని, జీవితం నవనవోన్మేషaగావుండే రీతిలోనే శిల్పానికి వుండే ప్రధాన్యత తెలుసుకొని బాగా అభ్యాసం చేయాలని, నిత్యం మారుతున్న సమాజాన్ని నిశితంగా పరిశీలించనిదే సజీవ సాహిత్యం రాదని తన చర్చను ముగించారు.  చర్చపై  సునంద,  సంపటం దుర్గా ప్రసాద్, బండారు రమేష్, డా. ఆంజనేయులుం ఎం. శేషగిరి,  శైలజ, బషీర్ మొదలగు వారు తమ తమ అభిప్రాయాలు చెప్పారు.  సంపటం దుర్గా ప్రసాదు వందన సమర్పణ చేస్తూ 31.1.2014 ఉగాది కవి సమ్మేళనం ఉదయం 10 గంటలకు నిర్వహించాలని అనుకుంటున్నామని. సమాచారాన్ని త్వరలో తెలియపరుస్తామని, సాహితీ అధ్యయన వేదిక ఈ సమావేశం తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు ప్రకటన తరువాత జరుపుకుంటున్న మొదటి సమావేశమని అందరికి శుభాకాంక్షలు తెలిపారు.

5, మార్చి 2014, బుధవారం

జన విజయం: ఆయువు తరగని ఆకలి బూచి!

జన విజయం: ఆయువు తరగని ఆకలి బూచి!: బూచి..! పుట్ట్టల్లో,పిట్టల్లో,పువ్వుల్లో,నవ్వుల్లో కలిసిపోయి ఆడుకుంటూ..., గాలిలో,దూళిలో కలతిరుగుతూ, పావురంలా,పాలపిట్టలా ,గా...

|| కవిత్వంద్వారా శివాలెత్తించిన శివుడు! ||

కపిల రాంకుమార్|| కవిత్వంద్వారా శివాలెత్తించిన శివుడు! ||
రక్తం సూర్యుడ్ని ఆవిష్కరించి, చర్యల ప్రతిచర్యల పరిష్వంగంలో నేత్ర ధనుష్ఠంకారం చేసి, భారమితి తో తులనాత్మకం చేసి, మోహనమైన కవిత్వాన్ని భూనభోంతరాలు దద్దరిల్లచేసిన కవిత్వ సంపుటిని తన మాటలతో సంజాయిషి తనకు తానే యిచ్చి, కవి ప్రపంచాన్ని మెప్పించి, ఎందరో నూతన కలాలకు చక్కటి ఒరవడ్డి దిద్దే ఆంగ్లోపాధ్యాయుని తెలుగు కవితా విశ్వరూపం అలా ఓ చిన్న నేతిబొట్టులా కవితా భోజన ప్రియులకు అందిస్తున్నాను......
'' రక్తం /చుక్క
వీగిపోయి / చెమట
చుక్కగా రూపందింది
చెమట చుక్క్క తకెత్తదు!
ప్రశ్నించదు!
నమ్మకంగా పంజేస్తుంది ''
**
'' కాని
సిరా చుక్కవుంది చూశావ్
విద్యుదాగారంవిప్లవా వాసం!
సిరా చుక్క స్పర్శ
చెమట చుక్కని రక్తం చేస్తుంది
కల్తీ లేని కణకణలేని / నిప్పులాంటి రక్తాన్ని చేస్తుంది! '' అందుకే / రక్తం సూర్యుడు! రక్తం ప్రతిచర్య!
**
శివారెడ్డి ఎప్పుడు ఎవరిని సంతోషపెట్టడం కోసమో, లేదా మెప్పు సంపాదించటానికో కవిత్వ రాయలేదు. తనని తాని చీల్చుకుని, మధించి, మదించి, విశ్లేషించి, దహించికొని, పుటం పెట్టుకొని, నికార్సయిన సమాధానంలా, ఒక నిజాయితీ నింపుకొన్న, ధర్మంగానే రాసానన్నారు. తాను నమ్మకుండా, ఆసాంతం దాని లోతు తెలుసుకోకుండా, ప్రలోభాలతోనో, ఊసుపోకో మాత్రం రాయలేదంటారు. తరిచి, శోధించి, పరీక్షించి, ఫలితం వస్తుందన్న నమ్మకం కలిగిన తరువాత కవిత్వంతో అడుగుల పిడుగులు కురిపించారు. తన చిన్నతనంలో పడిన జీవన వాస్తవాల ఒడుదుడుకులను, బాల్యంలోని అన్ని అవస్థలను మరిచిపోలేదు కాబట్టే, ఆ ప్రభావం తన కవిత్వంలో పారదర్శకంగా చూపించకలిగారు. అమ్మ గతించిన బాధకాని, పల్లెటూరి పిల్లగాడి సహజ భయాలు, ఆందోళనలు జ్ఞప్తికి తెచ్చుకుని, జానపదులు పాడిన కీర్తనలు, తత్వాలు, బుడబుక్కలవాని ఆటపాట, గారడీవాని జిమిక్కులు, తొలకరి వానజల్లుల్లో తడిసి జలుబు చేసిన రోజులు, పశులకొట్టంలోని పేద, గొడ్లు తొక్కిన గడ్డి, రొచ్చు, అక్కడక్కడ తాను చూచిన ఎత్తు అరుగుల వాకిళ్ళు, కిచకిచమని సవ్వడిచేసే పిచుకలు, తాడిచెట్ల విహారం, వాగుల్లోని యిసుకతిన్నెలపై కట్టుకున్న గుజ్జగూళ్ళు, బడికి వెళ్ళేరోజుల్లో చేసిన అల్లరి, పడ్డ వేదనలు, రాత్రుల్లో గుడిసెలో కిటికి వద్ద ఎగిరే మిణుగురుల వెలుగు, వెన్నెల రాత్రులు, ఉక్కపోతల మండువేసవి, కాలువల్లో ఈతలు, అనాధ బాల్యాలు పరిశీలనలు, ఏకాకితనాలు, కేరింతలు, ఏడుపులు, ఫిర్యాదులు, యెన్నో అంతర్లోకాన్ని గుర్తుతెచ్చుకుంటూ, వాటి తాలూక శకలాలు వెంటాడాయి కాబట్టే మనకు ఇలాంటి కవిత్వాన్ని అందించాడేమోననిపిస్తుంది. ఒక దశలో ఆంగ్ల కవులను చదివినా, అప్పకవీయం ఔపోసన పట్టినా, ఆంగ్ల, ఆంధ్ర సాహిత్యాలను సమాంతరంగా సవసాచిలా నడిపినవారు శివారెడ్డి.అందులో అతిశయోక్తిలేదు. '' చర్య - ఇన్నాళనుండి చావిట్లోనేవుందట! పుట్టిన దగ్గరనుండి మేకుకు కట్టేయబడేవుండట!
కోడేదూడ!
బయట కట్టేద్దామని తీసుకొస్తుంటే ఓక గుద్దు గుద్ది ఎత్తిపడేసి దేశాలమీద పాడిందట!....
స్వేచ్చలో స్వేచ్ఛగా స్వేచ్చకై ....
కట్టెయటమంటే - తెంపుకుపొమ్మనే....
అణిచిపెట్టటమంటే ఎదురుతిరిగమనే ....
అసంకల్పిత ప్రకార చర్యని చాల హృద్యంగా చెప్తారు '' చర్య '' లో.
పరిశీలనం, జ్ఞాన సముపార్జనం, తులనాత్మకం కవనానికి అవసరం ప్రపంచపు పోకడేమిటి? ఎటుపోతోంది? మానవుడి స్థితి గతేమిటీ? రష్యా యేమిటి, చైనా యేమిటి, రాజకీయాలమేటీ, అన్యాయాలేమీటి, నిజాయితీ యేమిటీ. ఆర్థిక సంక్షోభాలేమిటి, ధంస్వామ్యం యేమిటీ, భూస్వామ్యం యేమిటీ, చరిత్ర, రాజులు, రాజ్యాలు, యుద్ధాలు, నష్టాలు, మతాలు, కులాలు, హిందూ, బౌద్ధ, జైన, శంకరాచార్య, రామానుజాచార్య, మధ్వాచార్య బోధనలేమిటీ. రాహుల్ సాంకృత్యాయం ఎవరు? యిలాంటి ప్రశ్నలు, సందేహాలు తీర్చుకోలేకపోతే కవిత్వానికి సరుకెక్కెడిది? అందుకేనేమో అధ్యయనం అవసరమని నొక్కి చెబుతారు. ఆర్థిక విధానాలు మిశ్రమ ఆర్థిక విధానాలు, స్వాతంత్ర్యం ఎందుకు, దాని లక్ష్యం యేమిటీ ఇలాంటి పెక్కు చిక్కు ప్రశ్నలకు సమాధానం దొరకబుచ్చుకోవాలి కదా కవి అన్నవాడు. క్రాంతి దర్శకుడు కావాలి కదా! సాహిత్యంలో వస్తున్న విభిన్న ధోరణులెందుకు ఉత్పన్నం అయ్యాయి. ఒక దానిని మించి యింకొకటా? ప్రత్యామ్నాయమా? వక్రధోరణా, అరసం యేమిటీ, విరసం యేమిటీ, కవిత్వాభివృద్ధికి యేది దోహదపడుతుంది. యిలా తర్జమ భర్జన పడితేనే నికార్సయిన సాధన ద్వారానే కలకాలం నిల్చేకవిత్వం తిక్కన లాగ గురజాడలాగ, వేమన లాగ శ్రీశ్రీ లాగ, ఆరుద్రలాగ, కుందుర్తిలాగ, సృజనచేసే ప్రజ్ఞాపాటవం అలవడాలంటే నిరంతర అధ్యయనం, అనుసరణ, అవగాహన యెంతో అవసరం అంటారు శివారెడ్డి.
భారమితి - కొలమానం కావొచ్చు - మరేదయినా కావొచ్చు కాని - '' కవిత్వానికి కాలం చెల్లిందనో, ఇది కవిత్వానికి కాలం కాదనో, అంతా స్థబ్దత యేర్పడిందనో.....చాలా మంది చేతులెస్తేసారట..... కాని శివారెడ్డి ఒప్పుకోరు కాబట్టే చేత్తో తలుపుమీద గుద్దటం కవిత్వం అంటారు. బోర్లా పడుకుని భూమిని వాటేసుకుంటే కవిత్వం, ముక్కుతో గాలిని వలేసి పట్టడం కవిత్వం, అప్రయత్నంగా చేయి మీసం మీదకి వెళ్ళి, గడ్డాన్ని సవరించుకోటం కవిత్వం, లేదా ఎర్రబడిన ఉదయం, శ్రీకాకుళ పోరాటం, జగిత్యాల జముకల కథ, శిర్సెత్తిన ధర్మపురి, అర్కాటి జిల్లాల్లో నినదించిన వాహకం కవిత్వం.... ముడి యినుము నల్లని రేయిని ఎర్రగా కాల్చి సాగ్గొట్టిన ఆయుధం చేస్తున్న అరణ్యమూ కవిత్వమే అంటూ చేతులన్నీ ఒక్కసారి లేచి ' ఇంక్విలాబ్ ' అంటే ఆకాశమంతా కవిత్వమే, ఈ విశ్వంలోని గాలి, భూమి కవిత్వమే! అంటారు శివారెడ్డి. ఏ విషయాన్నైనా కుండ బద్దలకొట్టి నిర్భయంగా చెప్పటం శివారెడ్డికి అలవాటు. తాను ఏ వామపక్ష పార్టీ సభ్యుడు కాకపోయినా శ్రీశ్రీ మాటల్లోంచి మంచి కమ్యూనిస్టుగాను, మార్క్సిస్టుగాను ఒప్పుకుంటారు. కమ్యూనిజం పట్ల యితర సభ్యులకంటే అపారమైన అవ్యాజ ప్రేమ, గౌరవం వుందని చెబుతారు.. తాను నమ్మాడు కాబట్టి ఒకరి మెప్పుకోసమో, ప్రేరేపించడానికో సంతోషపెట్టడానికో కాకూండా, అధ్యయన మాత్రాన మాత్రమే ప్రపంచ రాజకీయాల్ని లోతుగా పరిశీలించిన ఫలితంగానే తన వాజ్ఙ్మూలం ఇచ్చారు శివారెడ్డి.
మోహనరాగం ఆలపించన శివారెడ్డి
'' నాకింద పక్కలాగో / నావకింద నీళ్ళలాగో / కళ్ళకీంద నీడలాగో / ఆకాశంకింద పక్షి లాగో/ ఆకు సందుల్లో నర్తించే కిరణపుంజంలాగో / ఎండాకాల గాలి నుండి పైకి లేచినప్పుడు నువ్వుకనబడతావు/ వీధిలో ఎర్రటి సూర్యుడు రాయి నెత్తిమీద పడ్డప్పుడు నువ్వు వినబడతావు ''.....అంటూ తనకవితలో /'' చేదైనా వేపచెట్టు చిగురించిన వసంత కాలంలా నువ్వు అద్భుతంగా సంగీతించిన నిచ్చెనల వెదురు వనంలా నువ్వు '' అంతకుముందు కవితలలో నిప్పులు కురిపించిన శివారెడ్డి లాలిత్యమైన పదాలను మోహనా! మోహనా! అంటూ కొత్త కోణం ఆవిష్కరించారు. '' దయలేని విధి నిర్వహణలో / రోజుకో అంగం తర్పణ గావించాలికదా /బతుకు మోహనా బతుకు! /బతకటాన్ని ఓ పెద్ద పాపకార్యం చేసిన / బతకటాన్ని ఓ పెద్ద బండ బరువు చేసిన / బతకటాన్ని ఓ బడా వ్యాపారం చేసిన ఈ సుందరమయ వ్యవస్థలో బతుకు మోహనా! బతుకు!........తన ఆశంసను వ్యక్తపరచటంలో సఫలీకృతుడైనారు. తన పరిమితులకు లోబడి ఉద్యమాలలో తన కున్న సంబంధాల పరిమితులకు లోబడి తన శక్త్యానుసారం, సమాజ సందర్భంగా తాను తనను వ్యక్తీకరించుకుంటానంటూ, చేసే ప్రయత్నమే శివారెడ్డి కవిత్వం! ప్రజలకేనిటో చెప్పేప్రయత్నమే తన కవిత్వం! తన జీవితం నుండి తనను విడదీసినా, ఈ సమాజం నుండి కాని కాలాన్నుండి కాని విడదీసినట్లైతే తన కవిత్వమే మిగలదని, తనకవిత్వమే కాదు అసలు యే సాహిత్యమూ మనజాలదు, మిగలదు. అందుకే వారి మాటల్లోనే
'' నా సోదరులకి కళ్ళిచ్చాను
నా కామ్రేడ్స్‌కి చేతులిచ్చాను
నా దేశానికి నా దేహానిచ్చాను
కాదు నాదేశమే నాదేహం ''
నేను తుడుం తయారు చేసే వాణ్ణి, నేను ఆయుధాలు తయారుచేసే వాణ్ణి, నేను పాటలు కట్టేఏ వాణ్ణి. మీ అనేకానేక కాంక్షలకి, ఆశలకి, ఊహలకి తగినట్టుగా పాటలు కట్టే వాణ్ణి
- నేను పాటలు కట్టే వాణ్ణి...కె. శివారెడ్డి. ''

ఇది శివమెత్తిన కె. శివారెడ్డి గురించిన స్వల్ప పరిచయం
4.3.2014

16, ఫిబ్రవరి 2014, ఆదివారం

కపిల రాంకుమార్ || సాహితీ స్రవంతి ||

కపిల రాంకుమార్ || సాహితీ స్రవంతి ||

సారస్వత స్రవంతి - కవి గాయక విపంచి
వచన పద్య కవితల - గేయ వ్యాస కళాకేళి!

అదును పదును కల్పించి
అంకురాలుమొలకెత్త
సాహిత్యపువన సొబగులు
గుబాళించు పూదోట!

మత తత్వం - కుల తత్వం
ఉగ్రవాద విధ్వంసాలను
నిలువరించు సంకల్పం
నిలుపుకున్న దీరత్వం!

చిరుజల్లులా, వానలా
వాగులా, జీవ నదిలా
అనునిత్యం పారేందుకు
పచ్చదపు గీతంలా!

కవిత్రయ కరచాలన స్పర్శతో
గురజాడ శ్రీరంగం కాళోజిల
ఆదుగుజాడలలో బడుగులకై
మా నడకలు సాగిస్తూ!

కొత్త కొత్త వాదాలకు
వైరుధ్యపు భావాలకు
సమతుల్యం పాటిస్తూ
సంయమనం నెరపుతూ!

సహకారం పొందుతూ
సహజీవన సాగిస్తూ
'' సాహితీ స్రవంతి'' గా
ప్రస్థానం చేరేలా!

అంతరంగ విస్తరణతో
అంతర్జాల వ్యాప్తితో
కొనసాగుట మా లక్ష్యం
నూతన అరుణోదయం!

( ఖమ్మం జిల్లా సాహితీ స్రవంతి - ఆవిర్భవించి 15 వ వార్షికోత్సవానికి
సన్నిద్ధం అవుతున్న సందర్భంగా జయప్రదమైన 16.2.2014 నాటి విస్తృత
సమావేశానికి నా కవితాశంస ) సా.6.30

14, ఫిబ్రవరి 2014, శుక్రవారం

కపిల రాంకుమార్ |"MY MUM"||

కపిల రాంకుమార్ |"MY MUM"||

Where did it go?
My mother once asked
As the clock tick-tucked
And her life flew past
In the race against time
She led for most of the way
But the track was endless
Unlike her last day
(Take care of your father
Promise you will
As she passed on the baton
She would never spill)
So polish the stars
And fire up the sun
And put out some slippers
To welcome my mum
Find a new galaxy
And light up her name
Because life on planet Earth
Just won't be the same
--- |Michael Ashby|
(స్వేచ్చ్హనువానువాదం)
నా తల్లి ఒకసారి
గడియారం టిక్ టిక్‌ సవ్వడి ఆగినపుడు
అది ఎక్కడికెళ్ళిందని ప్రశ్నించి
ఆమె జీవితం గతించటానికి వెళ్లింది
కాలానికి వ్యతిరేకంగా పరుగుల దిశలో
ఆమె విధంగా అత్యంత చివరి కాలం కోసం దారితీసింది
కానీ మార్గం అంతులేని ఉంది
ఆమె చివరి రోజు కాకుండా
(మీ తండ్రి సంరక్షణ తీసుకుంటానని
వాగ్దానం చేయాలంది
ఆమె రంగంనుడి నిష్క్రమిస్తుండగా )
కాబట్టి నక్షత్రాలు మెరుగును
సూర్యకాంతి తేజస్సును ఆర్పేందుకు
మా అమ్మకు స్వాగతం పలుకుతున్నట్లు
ఒక కొత్త పాలపుంత
ఆమె పేరు దేదీప్యమానంగా వెలగించటం కోసం
ఎందుకంటే భూమిపై అన్ని జీవితాలు
కేవలం ఒకేలా ఉండవని తెలియచెప్పినట్లుంది.
14.2.2014

10, ఫిబ్రవరి 2014, సోమవారం

|| సాహిత్యంలో ఇజాలు-నిజాలు ||

కపిల రాంకుమార్ || సాహిత్యంలో ఇజాలు-నిజాలు ||
'' అధునికత '' పదనిర్వచనానికి , '' సమకాలిక '' పద నిర్వచనానికి తేడా వుంది. ఆధుని క కాలవాచికా చెప్పుకునే అర్థం. ఒక కాలానికి ' ఆముక్త మాల్యద ఒక ఆధునిక గ్రంథం అని చిన్నయసూరి అంటారు. కొన్ని విలువల సంప్రదాయం, చారిత్రికనేపథ్యం మార్పులతొ మరికొన్నింటిని అభ్యుదయ కావ్యాలు అంటాము. సమకాలిక అంటే ఏక కాలంలోవచ్చిన కావ్యాలకు విశ్వనాథ, చలం,శ్రీశ్రీల రచనలను సమకాలిక సాహిత్యం అంటాం. రెండూ భిన్న ధోరణులను,వాదాలను, ప్రతిబింబిస్తూ సాహిత్య సృజనతో ముందుకొస్తాయి. సాహిత్య దృక్పథం దృష్ట్యా విశ్వనాథ ఆధునికుడు కాదు.
సమకాలీనత:- ఈ దృష్టితో చూస్తే ఆ కాలంలో వచ్చిన ఏ సాహిత్యమైనా సంప్రదాయం
గానీ, నవీనంకాని ఆధినికతే అనిపించుకుంటుంది.
ఆధినికత:- కాలంలో వచ్చే ఆర్థిక, సామాజిక, రాజకీయ మార్పులను గమనిస్తూ,
కాస్త దృక్కోణంలో కవితసృజనలో కావించడమే ప్రత్యేకతను సంతరించుకోవటంద్వారా
ఆఢునికతగా గుర్తింపబడుతుంది. కొన్ని విలువలు, తత్త్వాలు కలిగివుంటుంది. సామాజిక
ప్రయోజనం, హేతుబద్ధ శాస్త్రీయ దృక్పథం వాస్తవికతలపైఆధారపడటం అనే అంశాలను
ముడివేసుకుని సహిత్య దృక్పథం కలిగిన తాత్త్వికతతో నిలడేదే ఆధునికత.
***
అభ్యుదయవాదం, విప్లవ వాదం వాస్తవికతావాదాలు కొంతవరకు హేతు వాదాలు ఈ
కోవలోకే వస్తాయి.ఆధినికతాతత్త్వం పరకాష్ట చేరిన దశలో సింబాలిజం, ఇమేజిజం,
ఇంప్రెషనిజం, ఫ్యూచరిజం, డాడాయిజం, సర్రియలిజం, నేచురలిజం అనే ధోరణల
సమూహమే '' ఆధునికతకు '' మారుపేరులయ్యాయి.ప్రపంచంలో 1748 లో వచ్చిన వైజ్ఞానిక పారిశ్రామిక విప్లవం, 1780 లో వచ్చిన రాజకీయ ఫ్రెంచ్ విప్లవం 1914-18 మధ్య జరిగిన మొదటి ప్రపంచయుద్ధ నేపథ్యాలలో ఈ సాహిత్య ప్రపంచంలో కవిత్వం కొత్తపుంతలు తొక్కింది. కాల్పనిక వాదం, సాంప్రదాయికతా వాదం, హేతువాదం లాంటివి 18, 19 శతాబ్దంలో మానవుడికీ ప్రకృతికి మధ్యగల సంబంధాలు, వైరుధ్యాల నేపథ్యంలోనే ఉద్భవించాయి. తదుపరి స్వేచ్ఛావాదం, ఫ్రాంస్‌ లోను, ఆదర్శవాదం జర్మనీలోనూ, సౌందర్యవాదం బ్రిటన్‌లోనూ పుట్టాయని తెలుస్తోంది.
***
మన తెలుగునాట కాల్పనిక వాదానికి ఆర్థిక పునాదులు లేవు. అర్థ ధనస్వామ్య, అర్థ భూస్వామ్య విధానాలు కొనసాగి భావ కవిత్వం పురుడుపోసుకుంది. పై పాశ్చాత్య ధోరణులు ప్రభావంతో, భిన్న ధోరణులతో భావ కవిత్వంలో చోటుచేసుకున్నాయి. స్వీయ నియంత్రణ ద్వారా అమలిన శృంగారం, విషాదం,నిరాశ, పునరుద్ధరణ, జాతీయోద్యమం, దేశభక్తిలాంటివి భావ కవిత్వంలో మార్పులు మనం గమనించవచ్చును.అలాగే సామ్యవాద వాస్తవికతకు, కాల్పనంకతను జోడించినపుడే సాహిత్యం ప్రజలకు చేరువౌతుంది అని విప్లవవాదుల భావన. తాత్వికంగా ఆధునికతలో భాగంగా తెలుగు సాహిత్యంలో కనిపిస్తున్న ధోరణి వాస్తవికతావాదం సహజవాదం(నేచురలిజం)పేర అమెరికా రష్యాలలో 19 వ శతాబ్దం చివరిలో విరివిగా కనిపించింది. వాస్తవికతా వాదంలో (క్రిటికల్ రియలిజం) సవిమర్శక వాస్తవికత(సోషలిస్టు రియలిజం) సామ్యవాద వాస్తవికత ప్రధాన అంశాలుగా పేర్కొనవచ్చును. వాస్తవికతను ప్రతిబింబించడంతోపాటు సామాజిక జీవిత సమస్యలకూ పరిష్కారం సూచించడం ఒక భాగమని తెలుస్తుంది. సమాజ చరిత్ర దృష్టితో చిత్రీకరించడం కూడ వాస్తవికతలోని భాగమే. '' కమ్యూనిస్టు అన్విక్షకి విషయంలో అచంచల నిష్ట, ప్రజాసేవానిరతి, పాక్షికత,శ్రామికజన సమరశీల పోరాటాల సంబంధం, మానవీయ
సోషలిజం'' సామ్యవాద వాస్తవికతకి అద్దం. ఈ పరిస్థితిని వివరించేది మాత్రం గతితార్కిక
భౌతిక వాద సిద్ధాంతమే. ఆ సిద్ధాంతమే అభ్యుదయ సాహిత్యానికి పునాది. త్రిపురనేని రామస్వామి చౌదరి రచనల్లు రేషనలిజం ఆధారంగా వుంటాయి. పాశ్చాత్య దేశాలలో

17 వ శతాబ్దంలో ఆరంభమై మనదేశానికి 20 శతాబ్దానికి మాత్రమే యిది మొగ్గతొడిగింది. కాల్పనిక వాదానికి సమాంతరంగా హేతువాదం ఆరంభమైంది. ముద్దుకృష్ణ '' అశోకుడు ''- చలంగారి '' సావిత్రి ''- పెండ్యాల వెంకటసుబ్రహ్మణ్య శాస్త్రి '' మహాభారత విమర్శనం'' - నార్ల వారి '' జాబాలి '' - త్రిపురనేనివారి '' ఖూని. భగవద్గీత, '' లాంటివి ఉదహరించుకోవచ్చు.
***
తరువాతి పరిణామాలు అధివాస్తవికత, అస్తిత్వవాదం, అనుభూతివాదం, చైతన్య స్రవంతి, విప్లవ వాదం సంప్రయదాయవాదం, రూపవాదం, జనామోద వాదంలాంటీ ధోరణులు శాఖోపశాఖలుగా వాదాలు, వివాదాలు నినాదాలు ఉద్ధానకతనాలతో సాగింది. సాహిత్యోద్యమం దిగంబరకవిత్వం, దళిత వాదం, స్త్రీవాదం, అంటూ ఎన్నో రకాలుగానూ సాగింది. అరసం, విరసం, సరసం..ప్రరసం...అంటూ సంఘాలూ వచ్చాయి.సాహితీకృషి విరివిగా జరిగింది.
ఉపసంహారం:
దేవీప్రియ ఒక వ్యాసంలో '' రచయితలకేమైనా చెబితే లెక్చరిచ్చినట్టుంటుంది. జనామోదం కోసం యేదిపడితే అది రాయకండి. జనానికేమి అవరమో? ఎటువంటి జాగృతి అవసరమో? అది రాయటానికి మాత్రమే ప్రయత్నించండి! కె.వి.రమణారెడ్డి చెప్పినట్లు '' మార్క్సిజమే '' వల్లెవేయాల్సిన పనిలేదు. కాని, కావలసింది జీవిత వాస్తవాన్ని కాస్త చైతన్యవంతంగా అర్థంచేసుకుని, స్పష్టమైన అవగాహనతో సాహిత్య రూపంగా ( కథ/కవిత/పద్యం.గేయం/వ్యాసం/రూపకం)రూపమేదైనా దాన్ని లోకానికి చేరేలా చేయగలిగితే - ఆ సాహిత్యానికి అసలు సిసలు జనామోదం లభించి తీరుతుంది ''
Betrot Bretcht అభిప్రాయం ప్రకారం '' Popular means intelligible to broad
maasses, taking over their own forms of expression and enriching them (by adopting and consolidating their stand point) representing most progressive section of the people in such a way than it can take over to leadership.''

***
ఇవాళ కొత్త ధోరణి ప్రబలింది. మార్క్సిస్టు సిద్ధాంత నినాదాలు, విప్లవ అలంకారికత వాడే
రచయితల తెగ యింకొకటి పుట్టుకొచ్చి, '' కవిత్వ పదార్థం '' యెక్కడున్నా అస్వాద యోగ్యమే! మార్క్సిస్టు సిద్ధాంతం పోరాట ప్రవచనాలు తమకీ తెలుసు. అచరణకీ సిద్ధాంతనికీవున్న మార్క్సిస్టు నిబంధనని విస్తృతం చేయడమే వారి లక్ష్యం. ఆంధ్ర దేశంలో యీనాడు వెలువడుతున్న సాహిత్యాన్నీ పలాయనవాద సాహిత్యం, బూర్జువా సిద్ధాంత పునాది అధారంగా వున్న సాహిత్యం అతి '' వామ '' పక్ష సిద్ధాంత ప్రేరిత సాహిత్యంగా స్థూల విభజన చేసుకోవచ్చు.పై తరహాలన్నీ కూడ ప్రయోజనపుష్టమైన సాంస్కృతిక రంగాన్ని యేర్పాటు చేయవు. ఫెడ్రిక్ ఎంగిల్స్చెప్పినట్టు '' Freedom is recognition of necessity '' ఇదే అంశం మీద క్రిస్ట్‌ఫర్‌ కాడ్వెల్‌ అన్నమాట గుర్తు
తెచ్చుకుందాం '' Art is the expression of man's freedom in the world of feeling, just as science is the expression of freedom in the world of sensory perception, because both are conscious of the necessities of their worlds and can change them-art the world of feeling of inner reality, science the world of phenomena of outer reality'' (Illusion and reality - Christfer Caudwel)

(ఆర్వీఆర్ వ్యాాసాల నుండి సేకరణ )

10.2.2014 ఉ.7.30

1, ఫిబ్రవరి 2014, శనివారం

కపిల రాంకుమార్|| మచ్చ ||

కపిల రాంకుమార్|| మచ్చ ||

ఒంటరి గది, చిన్న కిటికి
రెండో మనిషికి నిలబడె చోటులేని
ఇరుగు గది...
ఆ గదిలో దాదాపు ఐదేళ్ళు బందీని!
అదీ పెళ్ళయ్యే వరకు!
తలచుకుంటేనే భయం! భయం!
రజస్వలైన 12 ఏటనుండి
తిండికి స్నానానికి తప్ప - బయటిలోకం తెలియకుండా
నిర్బంధానికి గురిచేసిన - సంప్రదాయపు సంకెళ్ళు!
మరువలేని కరాళ నృత్ర్యం! కళ్ళల్లో శూలాల్లా గుచ్చుకుంటూ
కంటి నిండా నిద్రలేని రోజులెన్నో
కన్నీటి చారికలతో చెంపలు - బిగిసిన విషాదపు ఘాతాలెన్నొ!
చదువు చంకనాకి - గుణింతాలు మరిచిపోయే
మైమరుపు ఆవహించినట్లు - అక్షరాలు తడుముకుంటూ
పనికిరాని కాగితాలపై - కాటుకలో ముంచిన చీపురుపుల్లతో
రాసుకున్న పిచ్చి భావనాగీతాలెన్నో!
***
ముక్కు మొహం యెరుగని
కొత్త వ్యక్తితో ముడిపడేవరకు లభించని విముక్తి
అది స్వేచ్చ మాత్రం కాదు
మరో బందిఖానాకు బదిలీ మాత్రమే
అక్కడా ఎన్నో నిబంధనలు,
నియమాలు కట్టుబాట్లు ....
చదువుకు మాత్రం పుల్‌స్టాప్‌ పెట్టిన వైనం!
కోరిక కొంత కాలనాళికలో స్థాపితం కాబడిన కొత్త కారాగారం
అత్తవారిల్లు!
***
ఒక రోజు పెద్ద ఉరుము మీద పడ్డట్టు మా వారి గొంతు
ఎవరో చెప్పితే, విని ముక్కోపంతో
రాక్షసుడిలా ఘర్జన...
'' చదువురాదను కుంటే
కవితలు, కథలు కూడానా....అదీ
పురుషాహంకారాన్ని సవాలు చేసేలానా? ''
అంటూ తన నడుము బెల్టుతో
విశ్వరూపం నా వీపుమీద!
కళ్యాణమైన తదుపరి సుఖపడింది లేదు
పైపెచ్చు ఆంక్షలు! పాబందీలు!
పెళ్ళికాకముందు చిత్తుకాగితాలపై రాసిన భావనలు
మా తమ్ముడు జాగ్రతగా వివిధ పత్రికలు పంపినట్టున్నాడు
నా కర్మకాలి అచ్చవటం - మా యముడి దృష్టికి రావడం!
ఈ రసాభాసకు ఆజ్యం అయింది!
మళ్ళీ నాలుగేళ్ళు మౌనం!
మా యమునిలో మార్పు వస్తుందేమోనని
అదీ ఒక కొడుకుపుట్టిన తరువాతనైనా
అడియాసే మిగిలింది.....
ఆంక్షలు యథాస్థితే కొనసాగింది!
రెండో సంతానం ఆడపిల్ల కలగగానే
నాలో పట్టుదల ఎక్కువైంది!
నాలా నా బిడ్డ నిర్బంధాలకు గురికాకూడదనుకున్నా!
గట్టి నిర్ణయం తీసుకున్నా
యముడ్ని సమధానపరచాలని చూశా! -
ఊహూఁ . ససేమిరా అన్నాడు!
నా అత్త మామలు అదే దారి
తీవ్ర సంఘర్షణానంతరం విడాకుల వరకువెళ్ళింది!
కొంత కాలానిలి మా ఆమ్మ, నాన్న గతించారు,
ఇక నాకు పెద్ద దిక్కుగా ఒకే ఒక వితంతు సోదరి,
తను మాత్రం నా భావాలకు విలువిచ్చి
ప్రోత్సహించింది కాబట్టి
మీ ముందు ఓ రచయిత్రిగా, కవయిత్రిగా, కాలమిస్టుగా
ఒక తల్లిగా, ఒక ఉద్యమ కార్యకర్తగా ...నిలబడ్డాను.!
అందుకు నా లాగే మచ్చలనుభవించిన మా అక్క
నన్ను ఇంత దానిని చేసింది....ఆమెకు ఎల్లపుడూ
ఋణపడివుంటా నేనెల్లపుడూ.....
నా బిడ్డ, నాకొడుకు ఇద్దరు చదువుకుంటున్నందుకు
ఆనందం, సంతోషం,
నేపుట్టిన 33 సంవత్సరాలనంతరం
నాలో కొత్త సమరోత్సాహం !
వంటి మీద మచ్చలుగా మిగిలినా,
మనసుమీది మచ్చను తొలగించాలని
మచ్చరాలిక రాకుండా నిలువరించాలని!

***.....
ఒకానొక దృశ్యం దీనికి ప్రేరణ .....
1.2.2014 సాయంత్రం 4.10

28, జనవరి 2014, మంగళవారం

కపిల రాంకుమార్|| సర్దార్ పటేల్ మత తత్వవాది - ఎ.జీ.నూరాని ||

కపిల రాంకుమార్|| సర్దార్ పటేల్ మత తత్వవాది - ఎ.జీ.నూరాని ||
'' మెజారిటీ మతానికి చెందిన మత తత్వాన్ని, జాతీయవాదంగా భావించే ప్రమాదం నిరంతరం పొంచి
వుంటుంది ''  - నెహ్రూ - 1961 జనవరి 5న చెప్పిన మాటలు.

'' ఒకేసారి కేంద్రంలో అధికారాన్ని రుచి చూసిన హిందూత్వ శక్తులు యిప్పుడు మరోసారి ఎలాగైనా,
అవసమైతే మోడీ వాచాలతను ఉపయోగించుకునైనా, లేక గుజరాత్ అల్లర్లలో అతని పాత్రను చూపించైనా
లేక ఆర్.ఎస్.ఎస్. హిందూత్వకు ఆయన తిరుగులేని మద్దతును చూపించైనా అధికారంలోకి
రావటానికి ప్రయత్నిసుతున్నారు. వారి ఈ స్కీములో వల్లబ్‌భాయ్‌పటేల్ వ్యక్తిత్వం వారికి సరిగ సరిపోతుంది.''

'' హిందూ జాతీయవాదిగా పేరుపొందిన పటేల్‌కు  అర్.ఎస్.ఎస్. తో రహస్య, వ్యక్తిగత సంబంధాలూ.
ఏర్పాట్లు వుండేవి. భారత్‌, బ్రిటిష్‌ వ్యాపాద ప్రపంచంతో మంచి సంబంధాలుండేవి. ఆయనకు విజ్ఞాపనలు
చేసుకుంటుండేవారు.  సనాతన హిందువుగా ఆయన తన మత తత్వ సానుభూతులను కప్పిపుచ్చుకునేవారు దాదు ''

'' కేవలం హిందువులకు మాత్రమే ప్రవేశం కల్పించే ' పాన్‌సుఖ్‌లాల్‌ మఫత్‌లాల్‌ ' ఈతకొలను ముంబాయిలోని
మెరేన్‌డ్రైవ్ వద్ద ఇప్పటికీవుంది. దానిని సర్దార్‌ పటేల్‌ ప్రారంభించారు. ''

'' మహాత్మా గాంధీ హత్యకు జరిగిన కుట్రపై '' విచారణ కమిటీ నివేదిక '' సమర్పించిన జస్టిస్‌ జె.ఎల్‌.కపూర్ ..
మహాత్ముని ప్రాణం తీసిన ఈ హత్యపై విచారణ జరగాల్సిన రీతిలో జరుగలేదనీ, అడుగడుగున అధికారుల
నిర్లక్ష్యం కనిపించిందని చెబుతూ '' విచారణకు ఇంచార్జి మంత్రిగావున్న హోమ్‌ మంత్రి వల్లభ్‌భాయ్‌ పటేళ్
కూడ దీనిపై ఆసక్తి చూపించినట్లు కనిపించలేదు '' అని చెప్పారు కపూర్.

'' భారత తొలి గవర్నర్  జనరల్ రాజాజీ లౌకిక వాది కనుక అతనిని రాష్ట్రపతి కాకుండ పటేల్ అడ్డుపడ్డాడని తెలుస్తుంది.''

'' 1848 జనవరి 6న పటేల్‌ ఒకవైపు అబ్దుల్ కలామ్‌ అజాద్‌  దేశభక్తిని ప్రశ్నిస్తూ హిందూ మహాసభ, ఆర్.ఎస్.ఎస్.
వాళ్ళను కాంగ్రెస్‌లో చేరాలని అహ్వానించారు. పచ్చి మతతత్వ వాదులు మాత్రమే ఆ పనిచేయగలరు

'' నేను భారతీయ ముస్లిమ్‌లను  ఒకేఒక ప్రశ్న వేస్తున్నాను. ఇటీవల జారిగిన అఖిల భారత ముస్లిమ్‌ కాంఫెరెన్స్ లో
మీరు కాశ్మీరుపై ఎందుకు నోరు మెదపలేదు? పాకిస్థాన్‌ చర్యలను ఎందుకు ఖండించలేదు? ఇవన్నీ ప్రజలమనసులో
సందేహాలు లేవనెత్తుతున్నాయి. దేశభక్తిలేనివారు పాకిస్థాన్‌ వెళ్ళిపోవచ్చు '' - పటేల్

'' పటేల్‌ కాంగ్రెస్ పార్టీలోని తన సహచరులైన  రఫి అహ్మద్‌ కిద్వాయ్ వంటివారిపైనా, కాంగ్రెస్ సోషలిస్టు పార్టీమీద
గూఢచారి శాఖ యిచిన ' రహస్య నివేదికకాపీ 'ని 1948 ఫిబ్రవరి 6న నెహ్రూకు పటేల్‌ పంపారు. తనను మంత్రి
వర్గం నుండి తొలగించడానికి కాంగ్రెస్‌ సోషలిస్ట్ పార్టీ కుట్ర పన్నినట్లు సృష్టించిన నివేదిక అది ''

' ఉప ప్రధాన మంత్రిగా, హోమ్‌ మంత్రిగా పటేల్ కాశ్మీర్ మహారాజును సమర్థించేవారు. మహారాజుకు వ్యతిరేకంగా
పోరాడే ప్రజానాయకుడైన షేక్ అబ్దుల్లాను, ప్రజా ట్రిబ్యునళ్ళను పటేల్ వ్యతిరేకించేవారు. భారత్ యూనియన్‌లో
కలసిపోడానికి కాశ్మీర్ మహారాజును ఒప్పించేందుకు ప్రయత్నించే వారు. చివరికి 1948 జనవరి 31 న
కాశ్మీర్ రాజు తాను స్వతంత్ర దేశంగా విడిపోతానని బెదిరించినప్పటికీ, ఆయనపట్ల సానుకూలంగానే వ్యవహరించాడు. ''
__________________________________________
22.1.2014 సాయంత్రం 4.10
__________________________________________
పేజి 9 నుండి 15 జనవరి నెల 2014 మార్క్సిస్టు పత్రికలో ఎ.జి.సూరానీ వ్యాసంలో ముఖ్య అంశాలు.


కపిల రాంకుమార్|| సాహితీ స్రవంతి అధ్యయన వేదిక 6వ సమావేశం|| 19.1.2014-మూడవ ఆదివారం||

కపిల రాంకుమార్|| సాహితీ స్రవంతి అధ్యయన వేదిక 6వ సమావేశం|| 19.1.2014-మూడవ ఆదివారం||

దండలో దారంగా ఉండి, నేర్పరితనం కలిగివుండటమే శిల్ఫం అని కన్నేగంటీ వెంకటయ్య సాహితీ స్రవంతి 6వ అధ్యయనవేదిక ప్రతీనెల మూడవఅదివారంలో భాగంగా ది.19.1.2014 సమావేశానికి తన అధ్యక్షోపన్యాసంలో అన్నారు. తొలుత ఇటీవల మరణించిన  ప్రముఖ కళాకారులు, చలన చిత్ర  ప్రముఖలకు సంతాప తెలుపుతూ ఒక నిముషం మౌనం పాటించారు. బి.వి.కె. విద్యార్థి ఆసు ప్రసాద్ గీతాలాపనతో కార్యక్రమం ఆరంభమయింది. ముఖ్యాంశం  '' కవిత్వం - శిల్పం '' - వాస్తవంగా ఆనందాచారి ప్రసంగించవలసివుంది. కారణాంతరాలవల్ల వారు హాజరు్కాలేకపోయారు. అదే అంశంపై డా.పి. సుబ్బారావు గారిని ప్రసంగించవలసినదిగా కన్నెగంటి వెంకటయ్య కోరారు. మరొక కవి జీవన్‌, కపిల రాంకుమార్ గార్లను కూడ  దానిపై మాట్లాడవలసినదిగా వేదికపైకి పిలిచారు. శిల్పంపై పట్టు సాధించిన వారు అద్భుత కవితా సృష్టికర్తలుగా పేర్కొంబడతారని, ప్రతిభా, వ్యుత్పత్తి, అభ్యాసములు ఎంతో సహకరిస్తాయని వివరించారు.డా.పి. సుబ్బారావు గారు మాట్లాడుతు కవిత్వ భాష ఒక ప్రత్యేక భాష అని, మన 20 శతాబ్ద కవులు అభిభాషించారని తెలిపారు. కవిత్వం శిల్పం పరస్పరాధారితాలని, పద్యం రాసేటప్పుడు కవి తన భాషనుంచి పక్కకు తొలుగుతాడని, దానికొక ప్రత్యేక శైలిలో నేర్పుగా సృజనచేస్తాడని అన్నారు. ,వ్యాకరణం మొదట సంస్కృతలో మొదట వ్రాయబడి, తదనంతరం తెలుగులోకి వచ్చింది. నన్నయ వ్యాకరణం అందుకుదాహరణ.  బాల వ్యాకరణం
ప్రౌఢ వ్యాకరణం, అప్పకవీయం, ఇలా పరిణామ క్రమం.  కాకువు - నిత్య జీవితంలో ఉపయోగించే భాషలోవాడబడేదని అన్నారు. ధని, రసం ప్రధానంగా కవిత్వం సాగాలని దానికి తోడుగా అలంకారాలు సొగసునిస్తాయని చెబుతూ ధ్వని ప్రధానంగా 1. డినొటేషన్‌ 2. కనొటేషన్‌ 3. సజెషన్‌ లపై అధారపదివుంటుందని,  దీనికి అదనంగా ఉక్తి వైచిత్యం , సర్వకాలీనత (విశ్వజనీనత)....ఇప్పటికి చెప్పకోతగిన మంచి ఉదాహరణ యెండ్లూరి సుధాకర్  కొత్త గబ్బిలం .  ఛందస్సు -అంటే  (అంద చందాలకు దగ్గర సంబంధం) అందం అని అర్థం. సమాజం లేక పోతే (ప్రపంచం) కవిత్వం లేదు. ఒక్క అడుగు ముందుకు వేయించేదే కవిత్వం. లోక పరిశీలన లేక కవిత్వం మనజాలదు. కవితలో ఓక మెరుపు, ఒక ఉరుము, ఒక స్వాంతనం, ఒక వేదన, అలోచన మిళితమైవుండాలి. - '' బాలపు బస్తాలను మోస్తున్న ఆ స్త్రీలు - గ్లోబును  ఎత్తుకున్న  అట్లాసు '' అని సుధాకర్ అన్నారు తన కొత్త గబ్బిలంలో సందర్భానికి తగ్గ పద ప్రయోగం, చేసి శ్రోతను/ పఠితను ఆకట్టుకునేదే శిల్పం అది నింపునున్నదే కవిత్వం.ఓ తిక్కన, ఓ వేమన ఓ గురజాడ అంటే నాకిష్టం ఆధునిక కవిత్రయం అని శ్రీశ్రీ అన్నారని చెపారు. కవిత్వం ఒక ఆల్కెమీ అంటాడు ' తిలక్ ' నిజమే కదా! ..ఫిలాసఫీ ఆఫ్ కాంపొజిషన్‌ అనే గ్రంథం తప్పక చదవండి అని సలహా యిచ్చారు. భాస, పదజాలం, ఊహ కలిగివుండాలి.  పప్రబంధ, ఆశు, బంధ, చాటు కవిత్వాలు కవిత్వంలో వచ్చిన పరిణమాలనే తెలుసుకోండి. కావ్య పఠన పునాది కావాలి. అదే అధ్యయనం,అభ్యసనం, సృజనం గా మార్పుచెందాలి.  పురాణ, ఇతిహాస, చారిత్రిక, సాంఘిక, పద్య, వచన కవిత్వం పరిచయం చేసుకుంటేనే కొత్త పోకడలు కవిత్వంలో చూపించగలం. కొన్ని సోదాహరణలుగా పద్యాలు, కవితలు చదివివినిపించారు. సమావేశానికి హాజరయిన వారి కోరికపై ఇదే అంశం వచ్చే మూడవ ఆదివారం కొనసగించాలని తీర్మానించారు.
మరొక ప్రముఖ కవి జీవన్‌ దీర్ఘ ఉపన్యాసం జోలికి వెళ్ళక కొన్ని కవితలను ఉదహరిస్తూ ఆయా కవుల కవిత్వ శిల్ప చాతుర్యాన్నివివరించారు. తెలంగాణా రైతంగ సాయుధపోరాట కాలంలో ఎంతో అభ్యుదయ సాహిత్యం వచ్చింది కుందుర్తి ' తెలంగణా 'సోమసుందర్ ' వజ్రాయుధం ' ఆరుద్ర  ' త్వమేవహం' గంగినేని ఎర్రజెండాలు, అవేకాక వాటినేపథ్యంలో నవలా సాహిత్యంకూడ వచ్చింది. దాశరథి, వట్టికోట ఆళ్వారుస్వామి లాటి వారు ప్రసిద్ధులు.వాటిలో కవిత్వం, శిల్పం, శబ్దం, ధ్వని, రసం,చక్కగా అలరించాయి.  దర్మిలా నేటి  తెలంగాణ ఉద్యమకాలంలో కూడ చక్కటి కవిత్వం ప్రపంచంలో ఎప్పుడూ రానంతవిరివిగానూ వచ్చింది. కవిత్వం ఒక హృదయంనుండు మరొక హృదయంలోకి ప్రవేశిస్తేనే - అది కవిత్వమై తీరుతుంది అని చలం అంటూండేవారని చెప్పారు అంటూ సమయాన్ని దృష్టిలో పెట్టుకొని కొద్ది కొద్ది కవితలు, విశ్లేషణలు క్లుప్తంగా తనప్రసంగాన్ని ముగించారు జీవన్‌.
గ్రంథాలయ నిర్వాహకుడు, కవి కపిల రాంకుమార్ మాట్లాడుతూ కాలాన్ని హరించ కుండా, కొన్ని ముఖ్యమైన అధ్యయన చేయవలసిన పుస్తకాలుగా  హరగోపాల్ -''రూపం సారం '',  కె.కె.రంగనాథాచార్యులు ''సాహిత్యంలో విభిన్న ధోరణలు ''  సాహిత్య  శిల్ప సమీక్ష లాంటివి బాగా ఉపయోగపడతాయన్నారు. శ్రీశ్రీ కవితలను ఉదహరించినంతగా విమర్శకులు ఉదహరించే కవి అలిశెట్టి ప్రభాకర్, తెలంగాణకు చెందినవాడవటం గర్వించతగిన విషయమని తెలిపారు.హాజరైన కవులలో సునంద, శైలజ, బండారు రమేష్, షేక్ బషీర్ కవితలు చదివారు. రౌతురవి వందన సమర్పణ చేస్తూ మరల ఫిబ్రవరి నెల మూడవ ఆదివారం తిరిగి ఇదే అంశం కొనసాగుతుందని తెలిపారు..


24.1.2014 సాయంత్రం  2.50

26, జనవరి 2014, ఆదివారం

|| బివేర్ ఆఫ్ సచ్‌ ఫ్రెండ్స్‌ ||

కపిల రాంకుమార్ || బివేర్ ఆఫ్ సచ్‌ ఫ్రెండ్స్‌ ||

ఒకప్పటి మా ఫ్రెండ్ 
పాపం! వాడు పిచ్చి వాడో
మద బిచ్చగాడో తెలీదు 
అచ్చం చూడ్డానికలావుంటాడు...
కాని బాగా చదువుకున్నవాడు
విశ్వవిద్యాలయంలో ఆచార్యుడు కూడానట!
అదేమి పొయేకాలమో
పెడధోరణో....లేక
పెర్వర్టెడ్ ఇంటిల్‌జెన్‌సీయేమో  తెలియదు కాని
రాతలనీండా రోతలే
నోటితో ఉచ్చరించే మాటలన్నీ విషయించాలనే కూతలే
మత్తులోవుంటాడో? మదంతో వుంటాడో?
బోధపడడు.....వేషం ఆచార్య దేవునిది కదా!
ఏమీ అనలేము, ఏమీ అనకుండాను వుండలేము!
ప్రేలాపనలు చూస్తుంటే
ఒక సారి ఫ్రాయిడ్ సిద్ధాంతాలు గుర్తుకొస్తాయి!
ఒక సారి మరీ పైత్యం తలకెక్కి
కైపులో వుంటాడో
పక్కవాడికి కైపెక్కిస్తాడో కాని
ఒకపట్టానా అర్థం కాడు!
స్నేహితుడ్ని రెచ్చకొడతాడో, హేళన పట్టిస్తాడో
అంతరంగం పరీక్షించాలనుకుంటాదో కాని
'' మా శ్రీమతి అందంగా వుంటుంది!
అంత అందంగాను వంట చేస్తుంది!
మరి మై డియర్ గే నీకేమైనా కోరిక పుడుతోందా
ఓపిక చేస్తావా, నా బదులు షేర్ చేసుకో చూద్దాం! ''
అనే తలతిక్క మాటలకి
స్నేహితుడనేవాడు....నిజంగా స్నేహితుడైతే
స్నేహాన్ని వదులుకుంటాడు కాని
స్నేహితుని పైత్యపు కోరికకు ఊఁ కొట్టడు!
మీరేమంటారు?
26.1.2014 ..... 7.35 pm
_______________________________________
అలాంటివాడొకడు నాకు తారస పడితె లాగి చెంపమీదొకటిచ్చి, వాని భార్యతో చెప్పితే
ఆమె చాల బాధపడి....తన వెర్రి వేషాలు స్నేహితులమధ్యకు తెచ్చాడూ అంటూ
కలత చెంది, గత అనుభవాలను జత చేసి ....న్యాయస్థానం ద్వారా వానినుండి విడాకులు
తీసుకొని సజావుగా తన బతుకు గడుపుతోంది.
___________________________________

17, జనవరి 2014, శుక్రవారం

27, డిసెంబర్ 2013, శుక్రవారం

- ||అంకురం ||

కపిలరాంకుమార్ - ||అంకురం ||

'' ప్రణయాంకురం - మోదం ''
'' ప్రళయాంకురం - ప్రమాదం '' -

27.12.2013

22, నవంబర్ 2013, శుక్రవారం

కపిల రాంకుమార్||ఫిర్ మిలేంగే||

కపిల రాంకుమార్||ఫిర్ మిలేంగే||

ఆప్ కే కద్మోం మేఁ
షుక్రియా ఆదా కరతా హూఁ హుజూర్
మగర్ కభీభి నజర్
బేజార్ మత్‌కరో!
హజార్ బార్ విచార్‌కె బినా బాత్ మత్ కరో!
తంద్రుస్తు దిమాక్‌సే పైదా హోకర్
ఖుల్లా సఫర్‌మే క్యా ఫాయిదా?
అర్జ్‌ క్యా హైకీ బినా వాయిదా
కామ్‌ సఫల్‌ హుయేతో
సబ్ లోక్ హోతా ఫిదా!
యే మొహబత్ కా వజీర్
స్వీకార కరో హమారా షర్త్
చమక్‌తే రహో సితారా జైసే
హోషియార్‌సే జీత్ హాసిల్‌కరో!
అబ్‌ ఆవో మేరేపాస్
ముజేఁ లేజానేకిలియే
తబ్‌ తక్‌  ఇంతజార్ కరూంగా!
ఆదాబ్ ...జనాబ్‌ ...ఫిర్‌ మిలేంగే!

22.11.2013 సాయంత్రం 3.32

21, నవంబర్ 2013, గురువారం

కపిల రాంకుమార్|| మినీలు ||

కపిల రాంకుమార్|| మినీలు ||

మంచిని పేంచేలోగా - నీ
పంచన  చేరినవారే
వంచనతో
ముంచుతారు!          1

పొట్ట కొట్టే వారిపై
దట్టించి ఎదురుతిరగ
జట్టుకట్టేదెపుడో
పట్టుచిక్కేదెపుడో
పొట్టకూటిగాళ్ళ
గట్టి  సవాలప్పుడే!       2

ఎంతమంది చీ కొట్టినా
ఎంతమంది అభిశంసించినా
కుక్కతోక వంకర తీయలేం కాని
కత్తిరంచవచ్చుగా
ఉన్మాదులాగడాలు
ఆగాలంటే!                   3

10.11.2013 ఉదయం 9.45

15, నవంబర్ 2013, శుక్రవారం

కపిల రాంకుమార్|| మనచేతిలోనే - మన చేతల్లోనే ||

కపిల రాంకుమార్|| మనచేతిలోనే -  మన చేతల్లోనే ||

మంత్రాలర్థంకాకపోయినా
సూత్రాలకు తలవంచే మగువ
సూత్రబద్ధ సంసారంలో
తగు పాత్ర పోషణ చేయడంలో
చెలికాని సహకారముంటే
గృహమే స్వర్గసీమవుతుంది!
ప్రేమైతేనేమి, పునాది లేకపోతే
పురిటిలోనే సంధికొట్టి
పురికొస విడిపోదా!
స్పర్థలు మొలకెత్తి
సౌధం పగుళ్ళు వారితే
పగలే చీకటై
పొగలు, పగలు కమ్ముకోదా
ఒప్పందాలు రద్దై నడిరోడ్డున సంసారం పడదా?
విచ్చిన్నాలకాలవాలమై
కుండ పగిలినట్లు
గుండె పొగిలిపొగిలి విలపించదా!
తెగిన గాలిపటమై
అగమ్యగోచరమై
అభాసుపాలు కాకుండా కాపాడుకోకపోతే
కుక్కలు చింపిన విస్తరి కాదా జీవితం?
ఊకగా మారిన ఊసులకు
చేసుకున్న బాసలకు
కాపుదల లేకపోతే
వృక్షం కూలిపోదా!
వేరు పురుగు చేరి కుళ్ళిపోదా!
అటు యిటు తరాల
అంతరాలు - అంతరంగాలు
బేరీజువేసే కొలమానం లేకపోతే
పర్వవసానం యిదేగా!
సాప్తపదీనం, ఐరేని కుండలు,
మోటైనా, మాట కట్టుబడి
సంబంధాలను కొనసాగించలేకపోతే
కొసలు పురి వీడినట్టే
వివాహబంధం విడిపోదా?
వైవాహిక విధానం యేదైనా
జతగా అడుగులు కలిస్తేనే
సంసారపు మనుగడ
నవ యువ దంపతుల చేతిలోనే
చేతల్లోనే వుందనేది  
మాత్రం నిర్వివాదాంశం!

13.11.2013 సాయంత్రం  3.53

కపిల రాంకుమార్|| మొగ్గలు ||

కపిల రాంకుమార్|| మొగ్గలు ||
పిల్లి మొగ్గలు వేస్తుంటే సరదానే
కాని ( ఆడ) పిల్లకి మల్లె  మొగ్గలిస్తే
బుగ్గలు వాస్తాయిరోయ్!

పిల్లలూ అల్లరి వారు కాకండి
నలుగురిలో పేరు తెచ్చుకునే మెలగండీ!
చదువు, జ్ఞానం యిచ్చే వెలుగులో
పదుగురికి ఆదర్శంగా ఎదగండి!

**
అమ్మా నాన్న లేని అనాథలకు
ఆశ్రయం కల్పించే ఆశ్రమాల
నిర్వహణలో అలసత్వం వహిస్తే
జాతికి ద్రోహం చేసే వారవుతారు!

క్రమశిక్షణపేరుతో క్రమంగా
ప్రమాణాలు దిగజార్చకండి
నిబద్ధత, నిమగ్నత గాలికొదిలి
బిక్షగాళ్ళుగా, సోమరులుగా చేయకండీ

**

బతికే నైపుణ్యం నేర్పండి
బరువుల మోత తగ్గించండి
పరువుగా పేరు నిలిపేలే
పాదుచేసి, నీరుపోసి పెంచండి!

పోకిరీలుగా, దొంగలుగా
జూదరులుగా చేయకండి
అమ్మ, నాన్న, గురువు,
సమాజం ఉమ్మడి బాధ్యత!

**
పసిమొగ్గలను వికసించనివ్వండి
మసిబొగ్గులు కానివ్వకండి
నేటి బాలలే రేపటీ పౌరులు
ఉత్తమ ఉన్నత విలువలందించండి!

కుప్పతొట్టిపాలై
మురికి కూపపు స్నేహంతో
క్రూర నేర లోకంలోకి 
జరకుండా జారులు కాకూడదని కోరుకుందాం!

**( ఇదో పిచ్చి  కోరిక - నెరవేరాలని తపన )

14.1.12013 ఉదయం  10.30

కపిల రాంకుమార్|| చోటీసి బాతేఁ అర్జ్ కర్‌రహాహూఁ ||

కపిల రాంకుమార్|| చోటీసి బాతేఁ అర్జ్  కర్‌రహాహూఁ ||

చోటీసీ బాతేఁ అర్జ్ కర్‌రహాహూఁ
సునో తండా దిమాక్‌సే యే భాయ్!
గుస్సా మత్ కరో
మేరే యారో, జర సునో!

కిసీ పర్ న వజేసే ఉంగ్లీ మత్ ఉఠావో
ఆప్‌కో ఆప్ బేషర్త్  పరదా ఉఠావో!

ఆజ్‌ కల్‌ కీసీ పర్ ' దావా కర్నా '
బహుత్ ఆసాన్‌ హైఁ
మగర్ దియా హువా ' వాదా నిభానా '
బేషక్‌ న ఆసాన్‌ హైఁ

సోచేకె బినా గుస్సా మత్‌కరో
ములాఖత్‌ సే  ఆపస్‌మే సంజోతాకరో

మహబత్‌ కేల్నేకీ కిలోనా నహీఁ
మగర్ మజ్‌బూత్ కర్ నేమే దిల్‌కా తాఖత్ జరూరీహైఁ

ఆదాన్‌ ప్రదాన్‌సే జోడీ హమేషా కాయమ్‌ రఖో
నా మానేసే మజ్‌బూర్‌ హోకర్‌ టూట్‌ మత్ కరో!

గిరావుహా దిల్‌సే కిసీ కో ధోకా మత్‌కరో
పరంతు  ఫూలోంకి కుషుబూ తరహా సహమత్ సీఖో!

15.11.2013 ఉదయం 5.04

10, నవంబర్ 2013, ఆదివారం

కపిలరాంకుమార్|\ సేకరణ ||నజరానా ! (ఉర్దూ కవితలు)

కపిలరాంకుమార్|\ సేకరణ ||నజరానా ! (ఉర్దూ కవితలు)

*ఎంత పదిలంగా చూసుకున్నా
నా హృదయం నాది కాలేకపోయింది
ఒక్క నీ ఓర చూపు తోనే
అది నీ వశమైపోయింది .

-జిగర్ మురాదాబాదీ

*ఎదురు చూపులకైనా
ఓ హద్దంటూ ఉంటుంది
కడకు వెన్నెల కూడా
కరకుటెండలా మారుతోంది.

-బిస్మాల్ సయూదీ

*ఆమె నా ప్రేమ లేఖ చదివి
అది ఇచ్చిన వాడితో ఇలా అంది
'ఈ జాబుకు బదులివ్వక పోవడమే
నా జవాబ'ని చెప్పింది.

-అమీర్ మీనాయీ

*తనని చూడగోరే వారికి
తరుణం లభించింది
ఆమె తన మేలి ముసుగు
అర మోడ్పుగా తొలగించింది

-అర్ష్ మల్సియాని

*నా కెవరైనా ఎరుక పర్చండి
ఆమెకెందుకు జవాబు చెప్పాలని?
ఆమె నన్ను అడుగుతోంది
'తనని ఎందుకు కోరుకున్నాన'ని ?

- షకీల్ బదాయునీ

*వలపు దారిలో అలసి పోయి
ఎక్కడ నేను చతికిలబడ్డానో
అక్కడ నాకంటే ముందే వచ్చిన
బాటసారుల్ని చూశానెందరినో

- బహదూర్ షా జఫర్

అనువాదం : ఎండ్లూరి సుధాకర్
 http://sudhakaryendluri.blogspot.in/2009/01/2.html

shot

Kapila Ramkumar || short shoot shots||

Right
fight
lights.

read
feed
leads.

our
hour
honours.

Lead
Plead
Im-pleads.

Let
In let
Out lets.

Come
Become
Out comes.

Go
Forgo
Logos.

Air
Fair
Affairs.

Wind
Mind
Binds.

Brain
Rain
Drains.

short
shoot
shots.
........
(continued)
2/11/2013 ....6.29 am

shorts

Kapila Ramkumar || shorts ||
Leisure
assures
pleasure!    .1

Will avoids
pill and reduce
bill              . 2

We
at
her
Weather!     .3

At
ten
dance
Attendance!....4

***
9.11.2013 4.19 pm

కపిల రాంకుమార్|| మినీలు ||

కపిల రాంకుమార్|| మినీలు ||

మంచిని పేంచేలోగా - నీ
పంచన  చేరినవారే
వంచనతో
ముంచుతారు!          1

పొట్ట కొట్టే వారిపై
దట్టించి ఎదురుతిరగ
జట్టుకట్టేదెపుడో
పట్టుచిక్కేదెపుడో
పొట్టకూటిగాళ్ళ
గట్టి  సవాలప్పుడే!       2

ఎంతమంది చీ కొట్టినా
ఎంతమంది అభిశంసించినా
కుక్కతోక వంకర తీయలేం కాని
కత్తిరంచవచ్చుగా
ఉన్మాదులాగడాలు
ఆగాలంటే!                   3

10.11.2013 ఉదయం 9.45

5, నవంబర్ 2013, మంగళవారం

కపిల రాంకుమార్|| అలుపెరుగని ప్రస్థానం||

కపిల రాంకుమార్|| అలుపెరుగని ప్రస్థానం||

అలుపెరుగని ప్రస్థానం - వైఆర్కే ప్రయాణం
ఆదర్శం ఆకర్షణ నింపుకున్న మూర్తిమత్వం
రూపాయి వైద్యుడిగా పేరుపొందినాడు
ఖమ్మానికి వన్నెతెచ్చి ప్రజాసేవకుడైనాడు

నిబద్ధత నిపుణత మేళవింపు వ్యక్తిత్వం
రాజ్యసభలో ప్రజావాణి పాలకులు వణికేలా
సమస్యల జాబులు అందించిన నిగర్వి!
నాయకుడిగా నిలచిన దీటైన చిహ్నం!

సారస్వతం రాదంటూ సాహిత్యపు వేదికపై
సాహిత్యపు మూలాలను తడిమిన  దర్శకుడై
అసామాన్య వీక్షకుడిగా వాసిగాంచి
పదవులకే వన్నె తెచ్చిన ఉపన్యాసకుడు

వినమ్రంగానే ఒదిగిపోతూ - తీక్షణంగానే విమర్శిస్తూ
పాలకులపై రాజీలేని - సమర శీల యోధుడై
ఎందరికో మార్గాలను - సైద్ధాంతిక పాఠాలను
నిర్బంధాలకు వెరవక -అందించిన ఒజ్జయతడు 

నమ్మినదానికై నిలబడి - పౌరహక్కులకై శ్రమించి
శ్రామిక పక్షపాతిగానే సూచనలూ సలహాలిస్తూ
కడకంటా ఆకట్టుకునే ప్రాసంగీకుడిగా
మది దోచిన డా.వై.ఆర్.కే.స్మరణీయుడు

        ***
- కపిల రాంకుమార్
గ్రంథాలయ నిర్వాహకుడు
బి.వి.కె. ఖమ్మం 20.10.2013

కపిల రాంకుమార్|| సమస్యలుంటే సాకులు వెతుకుతుంటారా??||

కపిల రాంకుమార్|| సమస్యలుంటే సాకులు వెతుకుతుంటారా??||

పరిస్థితులను అంచనావేసి
పరిష్కరించే బదులు
మరింత జటిలపరచటంలో
రాజకీయులు బహు దిట్టలు!
ఒకరినిమించొకరు ఎత్తులు వేస్తూ
చిత్తు బొత్తులాటలాడుకుంటూ
కాలయపనచేసి
ఎవరికెంత లాభమో యోచనే తప్ప
అస్తవ్యస్థ వ్యవస్థను సరిదిద్దకపోగా
మరింత అధ్వాన్నంచేయటంలో
సిద్ధహస్తులు!
రాజకీయ ప్రత్యర్థులపై కక్షతో
అమాయక ప్రజలపై
తీసుకుంటారు!
అకాల వర్షాలైనా,
గృహ దహనాలైనా
కుమ్ములాటలైనా
కలహాలేవైనా
కులపంచనామా చేసేందుకు
పావులు కదుపుతారు
బలగాలను మోహరిస్తారు!
అందుకే వారు సమస్యలు పొంగుతుంటే
సాకులు వెతుకుంటారు!
ఎవరైనా నోరెత్తితే దానికో రంగు పూస్తారు
ఎవరితోనో రంకు అట్టకడతారు!
ఎవరైనా ఎదురు తిరిగితే
అట్టడుక్కు అదిమేయచూస్తారు
ఆ సమాధులపునాదులపై కట్టడాలు నిర్మిస్తారు!
ఎంతసేపు ఓట్లు, సీట్ల లెక్కల్లో
నోట్ల ఫీట్లల్లో పడరాని పాట్లు పడతారే తప్ప
జనసామాన్యపు పాట్లు చూడరు!
గోడమీద పిల్లిలా అదునుకోసం చూస్తారే తప్ప
ఎవరికి ఆసరా యివ్వరు పైగా అసహనం చూపుతారు!
నిన్న పొగిడి, నేడు తిట్టి, రేపు గుట్టుగా కౌగలించుకుంటారు
పైపై మరమతులుచేసి తమ గరిసెలు నింపుకుంటారేకాని
శాశ్వత నిర్మాణాలు చేయరు
గుత్తేదారు పదికాలాలు బాగుంటేనే కదా
తమ పబ్బం గడిచేది!
వితరణలో తస్కరణలు చేస్తూ
పారితోషకాలు బొక్కుతారు
ముక్కిన బియ్యం పంచి,
చేతులు దులుపుకుంటారు
జేబులు నింపుకుంటారు!
బక్కజనం యేమైనా వారికి పట్టదు
రాజకీయ అరాచకీయానికి భరత వాక్యం పలికేదెన్నడు?
జనం యోచనతో సొంత బుర్ర పెట్టి
వాళ్ళ బుర్ర రామకీర్తన పాడించేదెన్నడు?
అందుకు ప్రజల సంసిద్ధం చేసే బాధ్యత
కవుల కలాలదే -కళాకారుల గళాలదే!

30,10.2013 ఉదయం 10.30

short shoot shots

Kapila Ramkumar || short shoot shots||

Right
fight
lights.

read
feed
leads.

our
hour
honours.

Lead
Plead
Im-pleads.

Let
In let
Out lets.

Come
Become
Out comes.

Go
Forgo
Logos.

Air
Fair
Affairs.

Wind
Mind
Binds.

Brain
Rain
Drains.

short
shoot
shots.

........ (continued)
2/11/2013 ....6.29 am

26, అక్టోబర్ 2013, శనివారం

కపిల రాంకుమార్|| జుమేదార్ హం||

కపిల రాంకుమార్|| జుమేదార్ హం||
పర్సోం యా కల్
కల్ నహీ హైతో ఆజ్
క్యో అత్యాచార్ కీ కబర్
బార్ బార్ సున్‌నా పడ్‌తాహై?
యా దూర్‌దర్శన్‌ ఇసాఫ్‌సే దేఖ్‌నా పడ్‌తాహై?
క్యోం హమారా కానూనన్‌కా హాత్ బేకార్ హువా?
యా నిస్సార్‌హువా?
నైతో ఇన్‌సానియత్ మరాహువా?క్యా?
వజే క్యాహైకీభీ
ఇసీతరఫ్ ప్రతీదిన్‌ క్యో మ్‌ వ్యాకులతా పైదా హోరహాహై?
చలతారహతాహై!  జలతారహతాహై!
అంత్ కబ్ హోతా మాలూమ్‌ నహీ హై?
హమేషా కయీ దిన్‌ జారీ రహతాహై క్యా?
కౌన్‌ హై ఓ దోష్?
ఔరత్ యా మర్ద్ !
నహీఁ!
మేరే విచార్ సే దోషీకా మతలబ్ తక్‌దీర్ కభీ నహీఁ!
ఓ బాత్ చోఢ్‌ మగర్ మెరే బాత్ సునో
మాఁ, బాప్, గురూ ఔర్ సమాజ్ చారోఁ దోషీ మాన్‌తాహుఁ!
పరివర్తనశీలతా ఇదర్ ఘర్‌సే స్కూల్‌ తక్‌
స్కూల్‌సే సమాజ తక్ ఆధారిత్‌ హై!
ఇస్‌లీయే ఓ చార్ దోషీ మాన్‌తాహూఁ!
సహీ సమయ్ పర్ సహీ శిక్షణా న దేనేకే వాస్తే
బార్ బార్ వహీ దుర్ఘటనాయేఁ పునరావృత హోరహాహైఁ!
జర సోచ్‌ సమజ్‌కర్ ఆజ్‌ సే హమారా బచ్చోంకీ మన్‌మే
సద్బుద్ధిశీలతా పైదాకర్‌నా
హమరా ఫర్జ్‌ బన్‌తాహైఁ!
క్యోం కీ జుమేదార్ హమ్‌ హైఁ!

--25.10.2013. 5.00 am

19, అక్టోబర్ 2013, శనివారం

Poetic Flag

kapila Ramkumar || Poetic Flag||
**
Flow of noble thoughts
flourish in my poetry
Row of joyful plots
Filled in a confident pottery
Wakes up like a Sword
Swinging heart
Pours sweetly blend
Poetic expressions are
Pro-people aspirations
Lit to be a bright Light
Every steps move forward more
Not even looking back
Interest based emotions
Prepare boldness to Fight,
Like a hoisted Poetic Flag
***

19.10.2013 @11.20 am.

18, అక్టోబర్ 2013, శుక్రవారం

|| కరో యా మరో!||

కపిల రాంకుమార్|| కరో యా మరో!||
ఆజ్ కల్ - రోజ్ భర్
నిర్భర్ సే కామ్‌ కర్నేకి బాద్
పూరా పేఠ్ భర్నా
బహుత్ తక్ లీఫ్  హోరహాహైఁ !
ఇస్ కే వూపర్
కుటిల్ అంజానీమే
నేతోంసే నిభానాభీ
బహుత్ ముష్కిల్ హోరహాహైఁ!
గలే పర్ దబావ్ బడ్ జాతారహాహైఁ
గల్లీ పర్ భీ భీతర్
వహీ అసర్ ఇస్త్ మాల్ హోరహాహైఁ
అవాజ్ ఉఠానేకిలియే ఓ మనాకరతారహాహైఁ
జంగిల్, జమీన్‌, జల్ సే - అల్విదా కెహనాపడతారహాహైఁ
జర సోచో! యారో!
కిసీమోడ్ పర్ కదం కదం  మిల్కర్ చలనా హైనా?యా నహీ?
అంకుశ్ కే విరుద్ధ్  అవశ్య  లఢనా హైనా? యా నహీ?
క్యా హం సభీ  మద్దత్ దేనా హై? యా నహీ!
యా చుప్కర్  భైఠేంగీ?
నైతో దురంత్ ఆవాజ్ దేంగే! యా నహీ
సోచ్ సమజ్ కర్ హాత్ మిలాయియే
ఉస్ అన్యాయ్ పర్ లఢనే వాలోంసే!
నిర్ణయ ఆప్కా!..ఉస్కే ఫల్ భీ ఆప్కీ హోగీ!
కరో యా మరో - ఆజ్ నహీ ఇసీ వక్త్  ఫైసలా కరో!
____________________________
18.10.2013 - సాయంత్రం 4.37
_____________________________
చిరు ప్రయత్నం ....ఇందులో నాకు ఓనమాలు, సరిచేసే అవకాశం

హక్కును కవి మిత్రులకే దఖలు చేస్తున్నాను

16, అక్టోబర్ 2013, బుధవారం

ఆశంస

కపిల రాంకుమార్||ఆశంస ||

నా మది గదిలో
అక్షర గరిమలెన్నో
ఎద గుడిసెలో
ఊసుల సరిగమలెన్నో

పరదాల మాటున
సరదా మాటలెన్నో
ఒకరినొకరిని కలిపే
స్నేహానుభూతులెన్నో

పయోముఖ విష కుంభాలకు దూరంగా
అమృతమయ సావాసం నిలుపుకోవాలి!
సంయమనం అందుకో
సంస్కారం పెంచుకో!

కలతల కలల కలుషాల కాసారంలో
కలవరాలకు దూరంగా
కవి ' తల ' లోని కవితల సౌరభాన్ని చేరుకో
సాహిత్య సౌధాన్ని కలకాలం కాపాడుకో!

16.10.2013 ఉదయం 11.45.

6, అక్టోబర్ 2013, ఆదివారం

కపిల రాంకుమార్ || వితంతుపూజ -సంప్రదాయం||

కపిల రాంకుమార్ || వితంతుపూజ -సంప్రదాయం||
మొన్నమొన్నటి వరకు ఉత్తరాలు రాసేటప్పుడు పెద్దలను గౌరవసూచకంగా మహారాజశ్రీ,
బ్రహ్మశ్రీ వేదమూర్తులైన, అని మగవారిని సంబోధించి వ్రాయటం, అదే విధంగా ఒక వేళ
వితంతువులకు రాసేటప్పుడు గంగా భవానీ సమానురలైన అని పేర్కొనటం మనకు
తెలిసినదే. సాధారణంగా వితంతువులను కొంచెంహీన భావంతో చూడటం, చులకన చేయటం,
వారిచే చాకిరీ చేయించటం, కాస్త అంద విహీనంగ కనబడేలా శిరోముండనం చేయించడం,
పూలు, గాజులు, పసుపు, కుంకుమలకు, రంగు చీరలకు దూరంగావుంచడం ప్రాచీన సంప్రదాయం.
కేవలం తెల్ల ముతకచీర కట్టుకుని, కటికనేలమీద శయనించడం, ఎవరికి ఎదురు పడకుండటం లాంటి
ఆంక్షలు మెండుగావుండేవి. వాటిపై వీరేశలింగం వంటి వారు సంస్కరణ ఉద్యమాలు చేసారనేది,
యిప్పుడూ  ఆనిర్బంధాలు, ఆంక్షలు అంతగాలేవని తెలుసు. అటువంటి పూర్వసువాసినులకు

(వితంతవులకు) పూజర్హత కల్పించి, పూజించి, వారిచే దీవెనలు పొంది సంప్రదాయమొకటివుంది.
అదీ దక్షిణాది తమిళ దేశంలో మనకు కనపడుతుంది. వివరాలలోకి వెడితే ఉత్తరాదికి వచ్చిన స్థిరపడిన ఆర్యులు
కొంతకాలానికి వారిలో కొందరు దక్షిణ భారదేశానికి తరలివచ్చారనేందుకు చారిత్రాఢారాలునాయి.
అలా వచ్చిన వారు సుమారు ఎనిమిదివేలమందికిపైగా గుంపుగా తమిళనాడులో స్థిరపడ్డారు. వారిని
' అష్ట్ర సహర జాతీ అని పిలుస్తారని, అస్ట్రవస్త్రం అనే స్థానిక సంప్రదాయబ్రాహ్మణ వంశాలతో కలిసిపోయారని
తెలుస్తున్నది. కోయంబత్తూర్, ఈరోడ్, సత్యమంగళం ప్రాంతాలలో విస్తరించారని రూఢవుతున్నది.
 ' కౌండిన్యస '  గోత్రీకులైన బ్రాహ్మణ వంశాలలో జరిగే ప్రతీ శుభకార్యక్రమనిర్వహణాలకు ముందుగా
విధిగా వారు నిర్వహించే పూజా విధానమే మనం యిపుడు తెలుసుకొనబోతున్నాం. ప్రతీ శుభకార్యానికి
ముందు ముఖ్యంగా వివాహాది కార్యాలలో వితంతు పూజ తప్పనిసరిగా చేసికానిప్రారంభించరు.
కుటుంబ, లోక శాంతి సౌఖ్యాలకు అభివృద్ధికొరకు జరిపే ప్రార్థనలు సైతం వితంతు పూజలతో
ప్రారంబమవటం ఒక ప్రత్యేకత సంతరించుకున్న సంప్రదాయం. (గణపతి పూజ మాదిరి)
ఒక వితంతువు, ఆమెతో పాటు ఐదుగురు ముత్తైదవులు, ఒక బ్రహ్మచారి ( మొత్తం యేడుగురికి)
పూజలు నిర్వహిస్తారు. ఈ వితంతుపూజ తరువాత సుమంగళిపూజ జరుపుతారు. అందరికీ తాంబూలాలు,
ఫలాలు, సమర్పించి, అత్యంత భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించుతారు. ముఖ్య అతిథి గౌరవం ఆ వితంతువు
పందుతుంది. గౌరవంగా సంభావన, బహుమతి, దక్షిణ యివ్వటం పరిపాటి. అయితే పూజందుకునే
వితంతువు తప్పనిసరిగా కొన్ని నియమ నిబంధనలు పాటిస్తున్న వారినే యెంపికచేస్తారు.
సాత్వికాహారం తీసుకునేవ్యక్తి, నియబద్ధ జీవితం గడిపేది, పసుపు, కుంకుమ, రవిక లాంటివాటిని
విసర్జించినదైన వితంతువు మాత్రమే పూజార్హురాలు. ఆమెకు తొమ్మిది గజాల చీర ధరింపచేసి
దైవ పీఠంపై కూర్చుండ పెట్టి, ఆ రోజున జరిపే దుర్గా పరమేశ్వరి పూజలో దేవికి ప్రతినిధిగా పరిగణిస్తారు.
పురోహితులు కాని, యింటి పెద్దగాని, (మగ/ఆడ) ఈపూజా విధానాన్ని నిర్వహిస్తారు. తొమ్మిది గజాల
చీర యిచ్చేముందుకూడ పూజ చేస్తారు. ఆ చీరను పూర్తిగా తడిపి, యెండపెట్టి, ఆరిన తరువాత
మడతపెట్టి దేవతముందు పళ్ళెంలోవుంచిం ఆ చీరకు మాలిన్యం అంటకుండా పైన అరటి ఆకు
(దుమ్ము, ధూళి పడకుండ) కప్పి, అరటి ఆకుపైనే పసుపు, కుంకుమ, పూలతో పూజచేస్తారు. ఆ చీరని
ఆ వితంతువు అందిస్తారు. అపుడామె ఆ చీర ధరించి తిరిగి దైవ పీఠంపై కూర్చుంటుంది. ఆ రోజు
తయారు చేసిన పిండివంటలు ఆమెకే మొదట దేవతగా భావించి నైవేద్యం పెడతారు. తరువాత మహిళలందరు
ఆ దేవతతోపాటు కలిసి భోజనం చేస్తారు. భోజనానంతరం మొదట కుటుంబంలోని పురుషులు వచ్చి
ఆమెకు నమకరించి,ఆమె దీవెనలు తీసుకుంటారు. వివిధ బహుమతులు, రొఖ్ఖం, కానుకలు యిస్తారు.
అందరు అశీర్వచనాలు పొందిన తరువాత ఆమె తనకు యిచ్చిన కాఉకలు, దక్షిణ, కొంత భాగాన్ని తిరిగి
ఆ కుటుంబానికి అందిస్తుంది. అది మహా ప్రసాదంగా స్వీకరిస్తారు..
_______________________________________________.
--చాల సంవత్సరాల క్రితం ఒక పత్రికలో '' మోరపాకుల '' పేరుతో వ్యాసం ప్రచురణ జరిగింది. దానని
జీర్ణ దశలో కాస్త సంస్కరించి(కనపడని అక్షరాలను సరిచేసుకొని) అందరికి ఈ విషయం వ్యాప్తిచేయాలని
వితంతువులను గౌరవించడం ఒక సుసంప్రదాయమని తెలపాలని సేకరించాను. 
_________________________________________________
5.10.2013 సాయంత్రం 4.35

|ఉర్దూ భాషా సాహిత్యాలు||

కపిల రాంకుమార్||ఉర్దూ భాషా సాహిత్యాలు||

భాష: ఉర్దూ  భారతదేశంలో రూపొందిన భారతీయ భాష.ఇది విదేశీ భాష కాదు.ఏదో ఒక జాతికి,
ఒక మతానికి చెందినది కాదు.ఈ  భాషలో భారతీయ భాషా శబ్దాలతో పాటు,ఫార్సీ,అరబ్బీ,తుర్కీ
శబ్దాలు విరివిగా చేరివుంటాయి.దీని కవితా రీతులు, కవితా సామాగ్రి చాలవరకు ఫార్సినుంచి దిగుమతి
అయింది.ముసల్మానుల సంపర్కంవలన, ఆక్రమణలవలన, మనదేశ రాజకీయ సామజిక పరిస్థితుల్లో
విశేషపరివర్తన కలిగింది. ఉర్దూ అనే పదాంకికి తుర్కీ భాషలోని URDU అనే పదం మూలం. ఇంగ్లీషు
లోని HORDE అనే పదాని జన సమ్మర్థం, సైన్యం, సైనిక శిబిరం అనే అర్థాలున్నాయి. సైనిక
సమూహాల సాంకేతిక భాషగా ఉర్దూ ఆవిర్భవించటానికి అవకాశం యేర్పడింది, తప్ప ఇది విదేశీ భాష
యెంతమాత్రం కాదు.18 శతాబ్ది ఉత్తరార్థానికి పూర్వం దీనిని చరిత్రకారులు,సాహిత్యకారులు హిందీ,
హిందునీ, హిందుస్థానీ, జబానె-హిందుస్తాన్‌,ఉర్దూయె-మొఅల్లా, రేఖ్తా అని అనెక్ పేర్లతో చలామణి
అయ్యేది. అనేక భాషల సమ్మేళనం వలన రేఖ్తా అని పిలిచేవారు.

దక్కనులో ఉర్దూ: ఖిల్జీ ఆదుషా కాలంలో దండయాత్ర జరిగిన తర్వాత మొహ్మద్ బీన్‌తుగ్లక్ రాజధానిని
ఢిల్లీ నుండి దేవగిరికి, తదుపరి అది దౌలతాబద్ అయింది. మళ్ళి దౌలత్ బాద్ నుండి ఢిల్లీకి మారింది.
1347 లో దక్కనులో బహమనీ వంశస్థాపన జరగటం చారిత్రిక పరిణామం వలన, పరిణితి చెందిన భాషగా
ఉర్దూ గుజరాతు మీదుగా దక్కనులో వ్యాపించింది.గుజరాత్ పదాలను కూడ కలుపుకొని ' గుజరీ '
అయుందని పరిశీలకుల అభిప్రాయం.  

భాషా వ్యాప్తిలో సూఫీ పకీర్ల పాత్ర యెంతగానో వుంది, ఖ్వాజా మసూద్ సాద్ సల్మాన్‌ (1046-1121)
ఖ్వాజా మొయీనుద్దీన్‌ చిష్తీ (1140-1268) బాబా ఫరీద్ గంజ్ షక్కర్ (1173-1265)
నిజాముద్దీన్‌ ఔల్యా (1238-1325) అమీర్ ఖుస్రూ(1253-1325) ఖ్వాజా బందా నవాజ్
గేసూదరాజ్ (1321-1422) మొదలైన సూఫీ యోగులు ముఖ్యులుగా పేర్కొంటారు.

వలీ దక్కం అహ్మద్ ను ఆదికవి అంటారుిఉర్దూ గజళ్ళకు ఓరవడి దిద్ది,దక్కనీ శబ్దాలు తగ్గించి పారసి
శబ్దాలకు పట్టంకట్టాడని, మన నన్నయ్య చేసిన పనే ( సంస్కృత పదాలు చేర్చినట్టు) ఇతను పార్సీ సంప్రదాయాలను,
భావాలను అందలమెక్కించాడు.చారిత్రకంగా చూస్తే మొదటివాడు కాకపోయినా, భాషకు ,కవిత్వశైలికి
కొత్తరూపాన్నివ్వటం వలన ఆదికవిగా గుర్తింపు పొందాడు. అతనిని అనుసరిస్తూ సిరాజ్ ఔరంగాబాదీ,
1160 పంక్తుల బూస్తానె-ఖ్యాల్ మస్నవీని రెండు రో్జులలో రాసాడు. బహరీ అనే కవి మస్ననీ మన్‌లగన్‌ వ్రాశాడు.

18 వ శతాబ్దిలో  ఉత్తరారిద్లో ఉర్దూ కవిత: సిరాజుద్దీం ఆలీఖాన్‌, షాహిహతిం, సౌదా,మీర్,దర్ద్
మీర్ తఖీమీర్ (1722-1810) మీర్సోజ్,  టేక్చంద్ బహార్,నందరాం ముఖ్లిస్, భికారీలాల్
మొదలైనవారు పేర్కొనవచ్చును.అయోధ్య నవాబులు కూడ సారస్వత పోషణ బాగా చేసారు.షేక్ ఇమాం
బక్ష్ నాసిఖ్ ( 1771-1838) హైదరలీ ఆతిష్ ( 1778-1847)

మస్నవీ = ప్రబంధ కావ్యాలు , మర్సియా = స్మృతి కావ్యాలు, గా ప్రసిద్ధిచెందాయి.ప్రముఖులుగా కొంతమందిని
పరిచయం చేస్తాను.  కవిత్వమంటే ప్రణయ భావాల గజల్ రచనే కాదని, ఏదైనా కవిత్వానికి
అనర్హం కాదని ఆనాడే భావించిన కవిసత్తముడు నజీర్ అక్బరాదీ (1735-1830) అయితే సంప్రదాయ
చాదస్తపు సాహిత్యకారులు ఇతనిని కవిగా గుర్తించలేదు. కాని ఈ నాటి సాహిత్యకారులు, విమర్శకులు ,సాహిత్య
చరిత్రకారులు నజీర్ అక్బరాదీని మహాకవిగా  గుర్తిస్తారు.ఢిల్లీకి చెందిన  మిర్జా సదుల్లా బేగ్ ఖాన్‌ గాలిబ్
(1797-1969) మోమిన్‌ ఖాన్‌, ముస్తఫాఖాన్‌ షేఫ్తా, సర్ సయ్యద్ అహ్మద్ ఖాం(1817-98)
మౌలానా మొహమద్ హుసేన్‌ ఆజాద్ (1833-1910), ఖ్వాజా అల్తాఫ్ హుస్సేన్‌ హాలీ(1836-1914)

అభ్యుదయ రచనలు: కిషన్‌ చందర్, ఇస్మత్ చొగ్తాయ్, సాదత్ హసం మంటో, రాజేంద్రసింగ్ బేడీ,
రషీద్ జహా, రజియా సజాద్ జహీర్, జ్ఞానపీఠ పురస్కార గ్రహీత ఖురతుల్ ఐన్‌ హైదర్(1989)
షాయిర్ ఇంఖిలాబ్ గా పేరొందిన జోష్ మలీహాబాద్, ప్రొఫ్ఫెసర్ రఘుపతి సహాయ్ ,ఎహసాన్‌ దానిష్,
ఆదమ్‌, ఫైజ్ అహమద్ షైజ్,ఇస్రారుల్ హఖ్ మజాజ్, సికిందరలీ వజ్ద్, మఖ్దూమ్ మొహియుదీన్‌
సుల్తాంపూరి, కైఫీఅజ్మీ, నజీరలీ అదీల్,సామల సదాశివ, దామోదర్ జకీ, రాఘవేంద్రరావు జబ్జ్ ,
కాళోజీ రామేశ్వర రావు,

పాశ్చాత్య్ల కవులు: బెంజిమన్‌ షుల్జ్, జాన్‌గిల్ క్రయిస్ట్ (1759-1848) గిల్ క్రయిస్టు (లండన్‌)
రాబర్ట్ క్లార్క్, ఈ.హెచ్.ఎం.వాకర్, జోసఫ్ ఎవన్‌, మౌల్వీ ఇమాముద్దీన్‌, జె. అలీబక్ష్
......ఉర్దూ సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన వారెందరో మహానుభావులు అందరికీ వందనాలు.
_________________________________
భారత భారతి - గ్రంథం నుండి సేకరించినది. తెలుగు విశ్వవిద్యాలయ ప్రచురణ
__________________________________   
4.10.2013 సాయంత్రం 6.30 

1, అక్టోబర్ 2013, మంగళవారం

|| సోమసుందర్ -వజ్రాయుధం ||

కపిల రాంకుమార్|| సోమసుందర్ -వజ్రాయుధం ||
తొలికూర్పు (1949  విరోధి ఉగాది - మార్చి)
' ఒక వ్యక్తి యొక్క సాంఘిక జీవనమే అతని చైతన్యాన్ని నిర్ణయిస్తుంది '' అని చెప్పాడు కారల్ మార్క్స్
సోమసుందర్ కవిగా పాడటానికి గొంతు సవరించుకుంటూన్న రోజుల్లో చరిత్ర భూస్వామ్య వ్యవస్థ నశిస్తూ,
బూర్జువా వ్య్వస్థ పరిపాలనాధికారాన్ని ఆశిస్తూన్న కాలమని చెబూంది.  ఆనాటి కవిత్వం విరగబడి సనాతన
చైతన్యం తిరగబడి కొత్త కొత్త దారుల్ని త్రొక్కి త్రొక్కి విసిగి వేసారి చివరికి వెగటుగా, వికారంగా,విషాదంగా
ఆత్మఖండన వ్యాపారంగా తయారైంది.  బూర్జువా వర్గపు ఉనికికి అనుకూల వాతావరణాన్ని  వ్యక్తిగత
అహం కలిగిస్తుంది. కనుక ఆ రోజుల్లో కవితకదే నినాదమైంది. కవిత్వం పరిసర నగ్న వాస్తవికతను కళ్ళు
విప్పి చూడలేక నిరంజన కళకోసం ఆకాశపుదారులు పట్టి '' దిగిరాను గిగిరాను దివినుండిభువికి '' అంది.
దానితో ద్రష్ట అయిన  కవి భ్రష్టుదయ్యాడు. అతని అనుభూతి కూడ నశించింది.  దానితో అసంఖ్యాకమైన
ప్రజానీకం కవిత్వాన్నీ చదవటం మానేసింది. కవిత్వం తనకవసరమనే సంగతినే విస్మరించింది. కనీసం
దానిని అర్థం చేసుకోటానికి కూడ అది ప్రయత్నించలేదు. ఎందు చేతనంటే కవిత్వం జీవితానికి అంత
దూరమైపోయింది (అందనంత)కనుక. ఈ సత్యాన్ని కవిగా సోమసుందర్ గ్రహించాడు.
పెద్దాపురం తాలూకా శంఖవరం గ్రామంలో 1924 నవంబరు జన్మించి 1933 నుండి 1945 వరకు పిఠాపురం
రాజా హైస్కూల్ చదువు, కాకినాడ కాలేజి చదివాడు. 1944 నుంది రచనా వ్యాసంగం. అభ్యుదయ రచయితల
సంఘ ఉద్యమ ముఖ్య కార్యకర్తలలో ఒకడు. తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం స్థిర నివాసం.
అందుకే ఈ కవి '' తన చరిత్ర తనే పఠించి ఫక్కున నవ్వింది ధరణి, తన గాథను తనే స్మరించి భోరున
యేడ్చింది ధరణి ' అన్నాడు. అంతటితోనే అతను చెప్పదలచుకొన్నది పూర్తికాలేదు. యథార్థ జీవితాన్ని
సంగ్రహించి " బూర్జువా వర్గం " తమ దోపిడి, తమ పాలన, తమ వర్గస్వలాభాలను సుస్థిరంగా నిలపాలని
 సర్వజనానీకంపై యేలుబడిని సాగిస్తున్నదనే పరమ సత్యాన్ని అర్థం చేసుకున్నాడు. అంతేకాదు " రెండు ప్రపంచాల
మధ్య, రెండు స్వభావాల మధ్య, రెండే వర్గాల మధ్య సాగుతున్న సంఘర్షణ " ని గుర్తుపట్టి తన పాత్రను
పృచ్ఛించుకొన్నాడు. '' యుగధర్మం :చైతన్యం-జనహృదయం;పోరాటం '' అని తన అంతర్వాణి వినిపించింది.
'' ఉన్నదొక్క జీవితమే, మానవునిగ వీరునిగా బ్రతుకుము, నరుడా! చరిత్ర నీకోసం ప్రసవ బాధ పడుతున్నది;
భవిష్యత్తు నీ కోసం పడిగాపులు కాస్తున్నది, నీ త్యాగం వృధాకాదు.''..అని సంబోధించుకున్నాడు.దానితో
'' దినమంతా రక్తం ధారవోసి పరిశ్రమించే దీనుల ఒక్కటిగా సమీకరించుట  కోసం నిర్దయగా పరాన్న భుక్కుల
హతమార్చుటకోసం '' ఉద్యమించాడు. '' వర్గ రహిత స్వర్గమ్మును స్థాపించుట తనలోపలి కోరిక; తన తీరని
తపస్సు '' కనుకనే ఆవేశంతో ఎలుగెత్తి పిలుస్తున్నాడు ' కదలండి కదలండి -కదలి పోరండి స్వేచ్ఛకై;-
తుది వెలుగు మానవుడు  బ్రతుకు వీడిందాక! '' ముందుకురకమన్నాడు. తనకు ఆశ, నిరాశ లేదు కనుకనే
' ఒక వీరుడు మరణిస్తే వేలకొలది ప్రభవింతురు ...ఒక నెత్తురు బొట్టులోనే ప్రళయాగ్నులు ప్రజ్వరిల్లు '' నంటాడు.
అంతేకాదు '' ఈ యాగం ఫలిస్తుంది. రాక్షస సంహారోత్సవ మహా క్రతువు ఫలిస్తుంది. తెలుగు గడ్డ సుఖిస్తుంది.
నవ జీవనం సుమిస్తుంది!'' అంటాదు కవి. అవును తప్పదు!
'' రారాజు గాథలకు ఇదె స్వస్థి వాక్యం!
శత్రువుల చరితకిదె అంతిమస్కంధం!
కాల వాహినికిదే నూత్న ఘట్టం ''

'' కమ్యూనిస్తు కవిత్వం సంపూర్ణమైనది. మానవుడు తన ఆవసరాన్ని ఎంత చైతన్యంతో గుర్తిస్తాడో, అంత చైతన్యం
తోటే బాహ్య వాస్తవికతను గుర్తిస్తాడు కనక '' అంటాడి క్రిస్టోఫర్ కాడ్విల్ . ----రాంషా. (సామల్ కోట 2/1949)

1,సమధర్మం: (సమధర్మం, ధ్రువతార, ఖరార్ నామా, మౌనగోష, లోపలి కోరిక, భగత్సింగు, ఫ్యాక్టరీ,
బాడుగ గోడీలు, ఆకలి నాలుకలన్నీ ) 2.బానిసల దండయాత్ర, 3. మలయా ప్రభంజనం
వజ్రాయుధం - ఒక సమాలోచనం - మాదిరాజు రంగారావు విశ్లేషణ
లోపలి కోరిక ( తల్లి - కవి - సంభాషణ)
తల్లి:
నీ హృదయం / నెత్తురు చిందిన గెడ్డయి.తుఫానులో రాలిన/జీర్ణ పత్రమై/ఎగసి ఎగసి, పరితప్తమగుట
దేనికొరకు బిడ్డా?
కవి: నీ బిడ్డలు/దిక్కులేని పిట్టలవలె/చెట్టుకొకరుగా/చెల్లా చెదరీ/గూడులేక, కూడులేక/అల్లాడుట/
చూడలేక తల్లీ!
తల్లి: ఇంత భయోత్పాతంలో/గాఢ నిశాధ్వాంతంలో/ఏగెదవెలాగ బిడ్డా!
కవి: నలుబది కోట్లకు మించిన/సంతానం కన్న తల్లి/ నీ చల్లని దీవెనలో/పురోగమిస్తానమ్మా!
తల్లి: నాపై ప్రస్రించిన/ నీలోపలి కోరిక ఏదో/ చెపుతావా బిడ్డా!
కవి: అమ్మా, చెబుతా వినవమ్మా/ నీ చేతుల బంధించిన/సంకెళ్ళను త్రెంచాలని/నీ సంతతి స్వేచ్ఛలోన/
ఊపిరిపీల్చాలని/దినమంతా ర్క్తం ధారవోసి
పరిశ్రమీంచే దీనుల/ఒక్కటిగా.../సమీకరించుట కోసం తల్లీ!/నిర్దయగా పరాన్నభుక్కుల/హతమార్చుట
కోసం తల్లీ!/ వర్గ రహిత స్వర్గమ్మును/మిర్మించుటకోసం తల్లీ!/ఇది నా లోపలి కోరిక/ఇది నా తీరనీ
తపస్సు!
___________________________________________________
1.10.2013

  

|| గాయబ్ అవుతుంది!||

కపిల రాంకుమార్ || గాయబ్ అవుతుంది!||

తలపులు-తలుపులు
తెరిచినపుడు - వలపులు
తలపులతొ - జతగూడుతాయి

పలికిన - మరులుగ
కులుకులు - మరలుతాయి

పెళసరి - కబురులకు
దళసరి - విరుపులవుతాయి
మరులిక వెడలును
మరలి రావెపుడును!

విసురులు - ఉసురులగు
పరుషపదములగు
సరసము విరసమై
అలకల - ములుకుల
మొలకలగు

మరి అపసవ్యము - హాస్యమైన
చిరలాస్యము - కొరవగు!
చిలువలు - పలువలుగా
పుకారులు - షికారులు చేయ
పడిపోవును - తెగిపోవును!
బంధం యిక  - కనుమరుగై
విరహగీత - ప్రవాహమగు!

కాయమున - గాయము
పూతల మానును
ఎదకు  - గండిపడిన
ఎండినమానై కూలును!

చివురించాలని - అనుకున్నా
త్రుంచాలని  - అనుకున్నా
నీ పైనే ఆధారం
నిలుపుతావో? - నలుపుతావో?
నీ యిష్టం!
నిర్ణీత సమయంలోనే!
నిర్ధిష్ట పర్థిలోనే!
మించితే గాయబ్ అవుతుంది!
________________
30.9.2013 -----సాయంత్రం 5.45