Wednesday, March 20, 2013

||జ్ఞాపకాల సోది-8||

కపిల రాంకుమార్ ||జ్ఞాపకాల సోది-8||

తనకు మాలిన ధర్మం
మొదలు చెడ్డ బేరము
యెందుకన్నారో కాని
నాపాలిట నిజమైంది!

16 పళ్ళ దమ్ము నాగలితో
వద్దండి అబ్బాయిగారూ అన్నా
వినకుండా పక్క మడిలో
సాలిరవాలు దున్నుతున్న అరకనాపి
తగుదునమ్మా అని గొర్రు తోలాను
రెండుమూడు సాళ్ళు అయి

నాలుగో సాలొచ్చినప్పుడు
ఆదమరిచివున్నానేమొ
మేడి చివర నున్నపేడు కసుక్కున గుచ్చుకుంది
గొర్రు వదిలేసాను
ఎడ్లు దూసుకూంటూ వెళ్ళీ నారుమడి
నాశనంచేసాయి.
తిట్లు చీవాట్లు!

గుచ్చుకున్న పేడు ఊరికేలేదు
పంగ జట్టయింది!
యెత్తిన చేయి దింపే పనిలేదు
నిదురపోతూ చేతులెత్తే అసెంబ్లీలో ఎం.ఎల్.ఏలా!
ఒకటే సలుపు - వాపు
నాటు వైద్యం పేరుతో
శ్రావణంలో రుబ్బున గోరింటాకు
మరీ యిష్తంగా
దిట్టంగా పట్టించా తగ్గిపోతుందని చెబితే!
రెండురోజులయినా తగ్గలేదు
అరచేయి యెర్రగా పండిందిగాని
బాధ తట్టుకోలేక ఆరుమైళ్ళదూరములొనున్న
ఎర్రగుంట ఆసుపత్రికి పరుగెత్తుకెళ్ళా నాన్నతో
డాక్టరు తిట్టిన తిట్టు తిట్టకుండా
మొట్టికాయలేసినంత పనిచేసాడు
పదహారేళ్ళ కుర్రాడినేకదా!
మైదాకు వల్ల చర్మం మదమైంది
ముందు మాత్రలు వాడు
రెండో రోజుకు పాకానికొస్తుంది,
కోసి బాధ తీసేస్తానన్నాడు!
కిలో తూగింది చీము రసి
కళ్ళు తిగి బైర్లు కమ్మింది చూసినందుకు
దానికిమళ్ళి ఉపశమనాలు
అరగంటకి కాని తేరుకోలేదు!
మచ్చ మాత్రం ఇప్పటికిమిగిలే వుంది
నా నిర్వాకానికి గుర్తుగా!

20..03.2013 ఉ .4.35

No comments: