Sunday, March 10, 2013

|| కెమేరా కన్ను||

కపిల రాంకుమార్|| కెమేరా కన్ను||

కెమేరా కన్ను - పెన్ను కన్న
గన్నుకన్న - మిన్న!
చురుకైంది కాబట్టే
రాజకీయ లంచాలను,
పడకింటి మంచాలను
బుల్లితెరపై
పంచనామా చేస్తోంది!
అతి (రతి ) రహస్యం
బట్టబయలు చేసి
అవినీతి పచ్చిక బయళ్ళు చూపి
ఏ సమాజానికి
ప్రతీకలో నిర్థారణ చేయమంది!

కాలుష్య నియంత్రణకు
మార్గాలను వెతకమంది!
క్షాళనకు క్షారాలు కావాలో
క్షీరాలు కావాలో
క్షవరాలు కావాలో తేల్చుకోమంది!

శిక్షించే రాజ్యాంగాని తట్టి లేపుతోంది!
భక్షక భటుల కర్కశత్వమెన్నాళ్ళని
కంటి చూపుతోనే నినదిస్తున్నది!

సామాజిక లక్ష్యంతో
ఒకచో ప్రాణాలను
ఫణమొడ్డి
ప్రమాణాలకోసం
పరిణామాలను
విహంగ, సొరంగ,
అంతరంగ వీక్షణం
కావిస్తున్నది

నైతిక మద్దతు కోరుకుంటున్నది
ఆదరిద్దాం, ఆలంబనౌదాం!

10.3.2013 ఉ.5.26

No comments: