Friday, March 15, 2013

కొండపల్లి లక్ష్మీ నరసింహారావు – ఖమ్మం జిల్లా ఇల్లెందు ద్విస్వభ్య శాసన సభానియోజకవర్గం నుండి 3 సార్లు ఎన్నికై, ప్రజాసేవ చేసిన స్వాతంత్ర్యసమర యోధుడు. తెలంగాణా సాయుధపోరాట వీరుడు. వారి వర్థంతి 16 మార్చి.



కామ్రేడ్.కెఎల్‌ నరసింహారావు

ఉన్నత కుటుంబంలో పుట్టి పేదలతో మమేకమై నిస్వార్ధంగా పని చేసిన కమ్యూనిస్టు యోధుడు కెఎల్‌ నరసింహారావు అని అయన సమకాలీకులు పేర్కొన్నారు. ఆయన ఇచ్చిన స్ఫూర్తి, నేర్పిన క్రమశిక్షణ మరువలేనిదని, కులాల, మతాలు పట్టింపు లేకుండా అందరినీ అప్యాయంగా పలుకరించే కెఎల్‌ ఇక లేడు అనే వాస్తవాన్ని జీర్ణించుకోలేక పోతున్నామని తెలిపారు. ఉక్కు క్రమశిక్షణతో నిర్మించిన పార్టీ పునాదులు నేటికీ చెక్కుచెదలేదంటే ఆయన ప్రభావం ఎంతో అర్థమవుతుంది. కెఎల్‌తో మెలిగిన కొంతమందిని గతంలోప్రజాశక్తి పలుకరించింది. ఆయన పేదలతో మమేకమై పని చేశారని కొండపల్లి రాములు అన్నారు. బీద, సాదా భేదం కెఎల్‌కు లేదని, అందరితో మమేకమై పని చేశారని చిన్ననాటి స్నేహితుడు కొండపల్లి రాములు తన గత స్మృతులను గుర్తు చేసుకున్నాడు. కులాలు వేరైనప్పటికీ మా ఇరువురి ఇంటి పేర్లు ఒకటే కావటంతో వారి ఇంటిలోనే తన జీవితం గడిచిందన్నారు. భూస్వాములు పేదలను అణగదొక్కటానికి పోలీస్‌ స్టేషన్‌లో కేసులు పెడితే వారిని విడిపించే వరకు పట్టువీడేవారు కాదన్నారు. తనపై ఒక భూస్వామి కేసు పెడితే తనపై ఈగ వాలకుండా ఇంటి తీసుకవచ్చారని పేర్కొన్నారు.
''అరె...అని అప్యాయంగా పిలిచే వారు'' : నిజాముద్దీన్‌
మనసులో కల్మషం లేకుండా మాట్లాడి వ్యక్తి కెఎల్‌ అని, అందరిని అరే అని అప్యాయంగా పిలిచేవారని మాజీ పటేల్‌ ఎస్‌కె. నిజా ముద్దిన్‌ పేర్కొన్నారు. 50 సంవత్సరాల పరిచయంలో ఆయన ముక్కుసూటిగా మాట్లాడే యాదార్ధవాదన్నారు. తమ పార్టీలు వేరైనా వాటిని పక్కన పెట్టి ఆయన ఎవరి పేరు చెపితే వారికే ముస్లింలు అందరం మసీదులో చర్చించుకోని ఓటు వేసేవారమన్నారు.
ఆత్మబంధువు వంటి వారు : తలారి దేవప్రకాశ్‌
తమకు కెఎల్‌ నరసింహరావు ఆత్మబంధువు వంటి వారని మాజీ ఎంపిటిసి తలారి దేవప్రకాశ్‌ అన్నారు. తమ కుటుంబంలో ఏ సమస్య వచ్చినా వెంటనే వారి ఇంటికి వెళ్ళేవాళ్లమన్నారు. ఆయన తప్పుడు విధానాలను సహించరని ఏ తీర్పు చెప్పినా అదే అంతిమంగా ఉండేదన్నారు. గ్రామంలో వాసిరెడ్డి అప్పారావు, కెఎల్‌ నరసింహారావులు మాలాంటి వారిని పార్టీలోకి తీసుకవచ్చి వార్డు సభ్యులుగా, ఎంపిటిసిలుగా గెలిపించడంలో వారి పాత్ర కీలకంగా ఉందన్నారు. వారిచ్చిన స్ఫూర్తితో ఈనాడు మండల కార్యదర్శివర్గ సభ్యుల పాత్రను పోషిస్తున్నానన్నారు.
పోరాటాల్లో వెనుకడుగు వేయద్దనేవారు : చీమలదారి సత్యనారాయణ
మనం తీసుకునే నిర్ణయం నిర్ధిష్టంగా మంచి ఉండటంతో పాటు చేసే పోరాటాల్లో వెనకడుగు వేయవద్దని కెఎల్‌ గారు నిత్యం అంటుండేవారని పార్టీ సీనియర్‌ సభ్యులు చీమలదారి సత్యనారాయణ అన్నారు. నిర్ణయం తీసుకున్న తరువాత తప్పక దానిని చేసి తీరాలని చెప్పి చేసి చూపించే మొండి మనిషన్నారు.
ఆయన క్రమశిక్షణతోనే నేటికి పార్టీ పయనం : కె.నాగేశ్వరరావు
కెఎల్‌ నరసింహారావు సూచించిన మార్గం, క్రమశిక్షణతోనే నేటికీ మండలంలో పార్టీ పయనం సాగిస్తోందని సిపిఎం మండల కార్యదర్శి కె.నాగేశ్వర రావు అన్నారు. అన్ని తరాలకు నాయకుడని, పార్టీపై క్రమశిక్షణ రూపంలో చెరగని ముద్ర వేసుకున్నారన్నారు. జిల్లాలో ఉద్యమ రీత్య బలమైన మండలంగా ఉన్న కారేపల్లిలో ప్రతి అందోళన, పోరాటాల్లో ఆయన భాగస్వామ్యం ఉండేదన్నారు. ఉద్యమ కేంద్రంలో పార్టీ కార్యాలయం ఉండాలనే ఉద్ధేశంతో కెఎల్‌తో శంకుస్థాపన, ప్రారంభోత్సవాలను జరిపించుకున్నామన్నారు.
సిపిఎం జిల్లా కార్యదర్శి పోతినేఁ సుదర్శనరావు
వర్గపోరాటాలే ఊపిరిగా తుదిశ్వాస విడిచేవరకూ బతికిన వ్యక్తి కెఎల్‌ నర్సింహారావు అఁ సిపిఎం జిల్లా కార్యదర్శి పోతినేఁ సుదర్శనరావు సిపిఎం జిల్లా ప్లీనంలో పేర్కొన్నారు. ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా, కష్టకాలాల్లో సైతం మొక్కవోఁ ధైర్యంతో పార్టీఁ, శ్రేణులను సిద్ధాంతం వైపు ఁలబెట్టడంలో కీలక పాత్ర పోషించారన్నారు.
బండారు రవికఁమార్‌ అధ్యక్షతన జరిగిన పార్టీ ప్లీనంలో ఆయన ప్రసంగించారు. కెఎల్‌ తన కఁటుంబీకఁలు భార్య దుర్గాదేవి, కఁమారులు ఉత్తమ్‌, పావన్‌లను కూడా ప్రజాతంత్ర ఉద్యమం వైపు నడిపించారన్నారు. మొత్తం కఁటుంబాఁ్న పేదప్రజల కోసం అంకితమయ్యే విధంగా తయారు చేసిన త్యాగశీలి అఁ కొఁయాడారు. 2007లో భూపోరాటం సందర్భంగా వైఎస్‌ ప్రభుత్వ దమనకాండకఁ గురైన పేదల తరుపున కెఎల్‌ కఁమారుడు ఉత్తమ్‌ న్యాయవాదిగా హాజరై వాధించడం ఆ కఁటుంబాఁకి పేదల పట్ల ఉన్న శ్రద్ధను తెలియజేస్తుందన్నారు. జిల్లా కమ్యూఁస్టు ఉద్యమ ఁర్మాణంలో ఒకరైన కెఎల్‌ చదువుకఁనే రోజుల్లో జాతీయ జెండాను పాఠశాలపై ఎగురవేశారఁ, ఆయన చేసింది తప్పు, లెటర్‌ రాసి ఇవ్వాలఁ స్కూల్‌ యాజమాన్యం అంటే కఁదరదఁ చెప్పారఁ వివరించారు. పాఠశాల నుండి పంపివేసినా మంచిదే, జాతీయ ఉద్యమంలో భాగంగా తాను చేసిందే కరెక్ట్‌ అఁ అక్కడ చదవడం మానేసి తన త్యాగఁరతిఁ చాటుకఁన్నారన్నారు. ఏ విషయంలోనైనా వర్గ ప్రయోజనాలు ముఖ్యమఁ ఆలోచించి అడుగులు వేసిన కెఎల్‌ జీవితం అందరికీ ఆదర్శమఁ తెలిపారు. ఆయన ఆశయ సాధన కోసం ప్రతిఒక్కరూ పునరంకితం కావాలని కోరారు.

ఎందరికో స్పూర్తిని కలిగించారు. మాకు బంధువు. అంతకంటే మన కవి యాకూబ్ కు ఆత్మ బంధువు, మార్గదర్శి . కామ్రేడ్ కె.ఎల్.కు ఘనమైన నివాళీ. గతంలో వారి సంస్మరణ అనుభవాలు ప్రజాశక్తినుంది గ్రహించి ఇక్కడ పొందుపరచనైనది.

No comments: