Tuesday, March 5, 2013

|| షార్ప్ షాక్ || (మినీలు)

కపిల రాంకుమార్|| షార్ప్ షాక్ || (మినీలు)

ధనానికి, ఋణానికి
అవినాభావ సంబంధం!
జనానికి విమోచనే
అనివార్య అనుబంధం!

**
సర్కారీ సెకలేమొ
పొగరాని సెగలాయె
చాపకింద నీరులాగ
తడికూడ తెలియదాయె!

**

దుబారాలనరికట్టలేక
అవసరాల కడ్డుకట్ట!
ఆపన్నులాదుకోలేక
పన్నులు బాదుడాయె!

**

కనపడే దోమ పైకి దాడి
దొడ్డిదారి యేనుగునిదిలేసి
ధరలేమొ ధరకు యెగిసె
ఆదరువులు యెండమావులే్!

**

ఉత్పత్తికి మార్గాలున్నా గమనించరు
పట్టిన కుందేటికి మూడు కాళ్ళంటరు!
యెవరైనా ప్రశ్నిస్తే యెదురు దాడి చేస్తరు
చేదస్తపు మగనిలా చెబితే అసలు వినరు!

**

వినలేని వారికి వీణానాదం రుచించదు
అమ్మ పెట్టదు ఆదుక్కోనివ్వదులా
ఆ మాదిరి చేష్టలతో ఆదమరిపిస్తరు
ఆచరణ నోచుకోని విధులు రుద్దుతారు!

**

నష్టాలు పూడ్చాలని విద్యుత్ రేట్లు పెంచి
కాష్టాల పయనాలకు తలుపు తెరిచి
అసమర్థతకు సర్దుబాటను ముద్దుపేరెట్టి
మర్థించుటలో వారి తీరే సెపరేటు!

**

అడ్డుకోక పోతే ఈ గడ్డుకాలం మారదు
బడ్డులా కూచుంటే గొడ్డు యాతన తప్పదు

ఐనా

ఇన్నాళ్ళు నోరెత్తని తప్పంతా మనదే
కాలయాపన చే్స్తే కాపురాలు కూలేది
వాస్తవం యికనైనా మేలుకో
నీ ధికార స్వరం పెంచి షార్ప్ షాక్ కొట్టు!

------------------రన్నింగ్ బర్నింగ్ ...
------------------ వార్నింగ్ సైరన్!

5.3.2013 ఉదయం 5.03

No comments: