కపిల రాంకుమార్ ||జనాన్ని చంపను!! ||
సాహితీ సంద్రంలో నేనో జాలరిని
అక్షరాలు బురదమట్టలా
చేతికందకుండా ారిపోతున్నయి!
పదాలను పేరుద్దామనుకుంటే
జల్ల చేపలా గుచ్చిపోతున్నాయి
కాని వల్లో పడటమ్లేదు
సముదాయించడం నా వల్ల కావడంలేదు!
వాడెవడో అమృత భాండంలో
చిన్న విషబిందువు చేరi
చిన్నాభిన్ని చేసింది కాబోలు
ఒకదానికటి పొంతనలేక
తెగి యెగిసి పడిన
విగతాక్షరాైనాయి!
ఆలోచనలెక్కడో
ఆవలితీరంవైపున్నపుడు
యిక్కడి నిత్యకృత్య సత్యాలను
చిత్రీకరించలేని మమసక
కటకమైంది మనసు!
నాకు తెలీక ఆదుగుతా
అంకుశంతో పొడిస్తే
నడవటానికి కవిత్వమేమైనా ఏనుగా?
ఆశ్వుగా కవిత్వం రావాలికాని!
బలవంతపు బ్రాహ్మణార్థమైతే
పెళ్ళికి చావుకీ ఒకేమంత్రమెలా పనికొస్తుంది?
అపశృతులు- అపసవ్యాలు దొరలి
నలుగురు నవ్వేలా మసలటం అవసరమా!
కార్య కారణ సంబంధాలకు
కర్మ సిద్ధాంతమాపాదించటం కాదు!
కర్త, కర్మ, క్రియలేని
శబ్దాలంకార పద చిత్రాల నిర్మాణం చేసి
జనాలను ఘోరంగా చంపలేను!!
ప్రశాంతంగా నన్ను అధ్యయనం చేసుకోనీ!
నేను అక్షర బ్రహ్మ కానక్కరలేదు కాని
అక్షరాలను నాశనం చేయకుంటే చాలు!
29.03.2013 ఉ. 10.39
No comments:
Post a Comment