కపిల రాంకుమార్|| బూడిద - శీలా వీర్రాజు కవిత|| **
_______________
ఎందుకొచ్చిన దండగ
ఇలా వేలకొద్దీ రూపాయలని తగలెయ్యడం/
యజ్ఞయాగాలకీ
సహస్ర కుంభాభిషేకాలకి,లక్ష బిళ్వార్చనలకీ
ఎందుకిలా బూడిద చెయ్యడం?
శాస్త్ర విజ్ఞాన వహికల మీద
దూరదూర ప్రాంతాలనుంచి వచ్చి
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కట్టిన
ఆలయ ఆవరణ్లో మైకుల్ని పెట్టుకుని
మనసులో
దారి ఖర్చుల కిట్టుబాటు లెక్కల్ని
మననం చేసుకుంటూ
బైటికి వేద మంత్రాలని వల్లిస్తూ
మానవ సంక్షేమం పేరుతోనో
గ్రహణ దోష నివారణకనో
లేక మరింకే పేరుతోనో జరిపే
ఈ అశాస్త్రీయ చర్యలకు
ఇంత డబ్బు తగలెయ్యడమెందుకు?
దీనికన్న ఏ శాస్త్రజ్ఞుడికో డబ్బిస్తే మేలు!
యెర్రని యెండలోంచి విద్యుత్తును పండించి
మురికివాడల చీకటి గూళ్ళల్లో
వేలాడేసిన వెలుగు మొగ్గలని వెలిగించి
కాంతి పరిమళాల్ని వెదజల్లే ప్రయత్నానికో
సూర్య కిరణాల్ని వడకట్టి
కిందకు దిగిన చంద్రకాంతి చల్లదనాన్ని
మైదానాల్లోకి మళ్ళించే కృషికో
అది దోహదం చేస్తుంది!
ఆ ప్రయత్నంలో అతను విఫలుడైనా గానీ
ఆ డబ్బు బూడిదలో పోసిన పన్నీరైన గానీ
అది మాత్రం మంటలో పోసిన నెయ్యి కాకూంటే మేలు!
** కిటికీ కన్ను - కవితా సంకలనం 1980 ప్రథమ ముద్రణ వెల రు.15/-
_______________
ఎందుకొచ్చిన దండగ
ఇలా వేలకొద్దీ రూపాయలని తగలెయ్యడం/
యజ్ఞయాగాలకీ
సహస్ర కుంభాభిషేకాలకి,లక్ష బిళ్వార్చనలకీ
ఎందుకిలా బూడిద చెయ్యడం?
శాస్త్ర విజ్ఞాన వహికల మీద
దూరదూర ప్రాంతాలనుంచి వచ్చి
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కట్టిన
ఆలయ ఆవరణ్లో మైకుల్ని పెట్టుకుని
మనసులో
దారి ఖర్చుల కిట్టుబాటు లెక్కల్ని
మననం చేసుకుంటూ
బైటికి వేద మంత్రాలని వల్లిస్తూ
మానవ సంక్షేమం పేరుతోనో
గ్రహణ దోష నివారణకనో
లేక మరింకే పేరుతోనో జరిపే
ఈ అశాస్త్రీయ చర్యలకు
ఇంత డబ్బు తగలెయ్యడమెందుకు?
దీనికన్న ఏ శాస్త్రజ్ఞుడికో డబ్బిస్తే మేలు!
యెర్రని యెండలోంచి విద్యుత్తును పండించి
మురికివాడల చీకటి గూళ్ళల్లో
వేలాడేసిన వెలుగు మొగ్గలని వెలిగించి
కాంతి పరిమళాల్ని వెదజల్లే ప్రయత్నానికో
సూర్య కిరణాల్ని వడకట్టి
కిందకు దిగిన చంద్రకాంతి చల్లదనాన్ని
మైదానాల్లోకి మళ్ళించే కృషికో
అది దోహదం చేస్తుంది!
ఆ ప్రయత్నంలో అతను విఫలుడైనా గానీ
ఆ డబ్బు బూడిదలో పోసిన పన్నీరైన గానీ
అది మాత్రం మంటలో పోసిన నెయ్యి కాకూంటే మేలు!
** కిటికీ కన్ను - కవితా సంకలనం 1980 ప్రథమ ముద్రణ వెల రు.15/-
No comments:
Post a Comment