Tuesday, March 5, 2013

| అతిథి - అభ్యాగతుడు ||నిఘంటు వివరణలు|

కపిల రాంకుమార్|| అతిథి - అభ్యాగతుడు ||నిఘంటు వివరణలు||

అతిథి = సం.వి.ఇ.పుం. 1 తిథ్యాది నిమిత్తములేకుండ క్షుత్పిపాసానివారణార్థము ( ఆకలి (కోరికని) బాధను తీర్చుకొనటానికి వచ్చినవాడు., భోజన సమయానకి వచ్చినవాడు, ఆగంతకుడు.
శ్లో : తిథిపర్వోత్సవాస్సర్వే త్యక్తాయేన మహాత్మ్నా, సో2 తిథి స్సర్వభూతానాం శేషానభ్యాగతాన్. విదు: -మన్వాదియుగాది ప్రభృతిషు తిథివిశేషు ద్రవ్యలాభముద్దిశ్య యే అభ్యాగతచ్చంతి తే2భ్యాగతా:, తాదృశం తిథి విశేష మనపేక్ష్య యదాకచిత్ క్షుతాష్ణాదిపరిపీడ యోగపగతో2తిథి: పరా.1. ఆ. 42. శ్లో.వ్యాఖ్య.
2.ఉగ్రకోపము
3. కుశుని కొడుకు, రాముని మనుమడు.
(సూర్యరాయంధ్ర నిఘంటువు)

అతిథి= one who comes un-expectedly; a guest, a stranger పరగృహాగతుడు, ( C.P. Brown)

అభ్యాగతుడు: సం. విణ్ (అ. ఆ.అ.) వచ్చిన వాడు. వి.అ.పుం. తిథి పర్వము ఉత్సవము మొదల్గు సందర్భములందు ద్రవ్యాపేక్షతో వచ్చినవాడు (చూ. అతిథి)
కాని కవులు : అతిథి, అభ్యాగతుడు అను రెండు పదములు అభేదముగా వాడినారు)
(సూర్యరాయంధ్ర నిఘంటువు)

అభ్యాగతుడు: అతిథి :A guest, a visitor, one who drops in at at Dinner (C.P.Brown)
కవి మిత్రుల సమాచారము కొరకు...ఇంతకంటె మెరుగైన సమాచారము దొరికిన తెలుపగలరు.

No comments: