డాక్టర్ శ్రీపాద పినాకపాణి
మీ తల్లిదండ్రులు, బాల్యం, విద్యాభ్యాసం గురించి వివరిస్తారా?
శ్రీకాకుళం జిల్లాలో ప్రియ అగ్రహర వాసులు శ్రీపాద కామేశ్వరరావు, జోగమ్మ దంపతులు నా తల్లి దండ్రులు. నా బాల్యమంతా తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలోనే గడిచింది. రాజమండ్రిలో గున్నేశ్వరరావు, నాగేశ్వరరావుల నేతృత్వంలోని రెండునాటక సమాజాలు ప్రతివారమూ నాట కాలు ప్రదర్శించేవారు. అప్పుడప్పుడు కాకినాడ, ఏలూరు, మచిలీపట్నం, తెనాలి పట్టణాల నుండి జొన్న విత్తుల శేషగిరి రావు, కపిలవాయి రామనాథశాస్త్రి, తుంగల చలపతిరావు, అద్దంకి శ్రీరామమూర్తి, డివి సుబ్బారావు, పప్పులూరి సంజీ వరావు, సిఎస్‌ఆర్ ఆంజనేయులు వంటి ప్రసిద్ధ నటులు రాజ మండ్రికి వచ్చి నాటకాలు వేసేవారు. ఆ నాటకాలు చూడ టానికి వెళ్లేటప్పుడు మా నాన్న నన్ను కూ డా వెంటపెట్టుకుని వెళ్లేవాడు. వీళ్లలో ఎక్కువ మంది శాస్త్రీయ రాగాలలో పద్యాలు, పాటలు చక్కగా పాడేవారు. తరచూ నాటకాలు చూడడం వల్ల ఆ ప్రసిద్ధ కళాకారులు పాడిన పాటలు, పద్యాల ను, మోహన, శంకరాభరణం, భైర వి మొదలైన రాగాల్లో పాడటం నాకు అలవాటైంది. అలా సంగీతంపై చిన్నతనం నుంచే ఆసక్తి ఏర్పడింది. ఇక విద్యావిషయానికి వస్తే రాజమండ్రిలోనె హైస్కూల్, కాలేజీ విద్య పూర్తిచేశాను. 1938లో ఎంబిబిఎస్, 1945లో విశాఖ పట్టణంలోని ఆంధ్రమెడికల్ కళాశాలలో ఎండి, జనరల్ మెడిసి న్ పట్టా పొందాను. ఆంధ్ర వైద్యశాఖలో 21 సంవత్సరాలు పనిచేశాను. కర్నూలు మెడికల్ కళాశాలలో మెడిక ల్ ప్రొఫెసర్‌గా, కర్నూలు జిల్లా ఆసుపత్రి సూపరింటెండె ంట్‌గా పనిచేసి, 1968లో ఉద్యోగ విరమణ చేశాను.
సంగీత కళ లో ప్రవేశం ఎలా జరిగింది?
నాటకాలు చూడటం, అందులోని నటులు రాగయుక్తంగా పద్యాలు, పాటలు పాడటం నాకు సంగీతంపై ఆసక్తిని కల్పించాయి. ఆ తరువాత నా 12వ ఏట మా అక్క గురువు మైసూరు బిఎస్ లక్ష్మణరావు గారి వద్ద నేను చేరాను. అలా సంగీత శిక్షణ ప్రారంభమైంది . నాలో ఉన్న ఆసక్తిని గమనించి మా నాన్నగారు, గురువులు మంచిగా ప్రోత్సహించారు. ఆ తర్వాత ద్వారం వెంకటస్వామినాయుడు, ఆర్ రంగ రామానుజ అయ్యంగార్ దగ్గర సంగీతం లో మంచి ప్రావీణ్యం సాధించాను. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఢిల్లిd, బెంగళూరు, బాంబే తదితర ప్రాంతాలలో కచేరీలు నిర్వహించాను.
మీ వద్ద సంగీతం నేర్చుకున్న కొందరి పేర్లు చెబుతారా?
ఆ రోజుల్లో సంగీతం నేర్చుకోవాలన్న అభిలాష చాలామందిలో కనిపించేది. ఏంతో ఆసక్తిగా సంగీతసాధన చేసే వారు. నా వద్ద సంగీతం నేర్చుకున్నవారిలో ఓలేటి వెంకటేశ్వర్లు, నేదునూరి కృష్ణమూర్తి, నూకల చినసత్యనారాయణ, శ్రీరంగం, గోపాలరత్నం కట్టమూరి సుబ్బలక్ష్మి తదితరులు మంచి పేరు ప్రతిష్టలు సాధించారు.
వైద్యునిగా, సంగీత విద్వాంసుడుగా ఎలా రాణించారు ?
వృత్తిరీత్యా నేను వైద్యుడను. కాని భగవద్దత్త మైన సంగీతం పుర్వజన్మసుకృతం గా అబ్బి నా అభిమాన విద్యగా, ప్రవృత్తి గా మారింది. సమాజ సేవ కోసం వైద్యవృత్తిని అభ్యసిస్తే, శాస్త్రీయకళారంగాల అభివృద్ధి కోసం సంగీ తాన్ని అభ్యసించాను. చిన్నతనంలోనే కర్ణాటక సంగీత విద్యాంసులు కోనేరి రాజపురం వైద్యనాథ అయ్యరు, రామ్నాడ్ శ్రీనివాస అయ్యంగారు, మధుర పుష్పవనం మొదలైనవారి గానము తరచుగా వినడం వల్ల మానా న్నగారికి శాస్త్రీయ సంగీతముపై అభిరుచి పెరుగుతూ వచ్చింది. రాజమండ్రిలో ప్రఖ్యాత సంగీత గురువులు మైసూరు బి. ఎస్ లక్ష్మణరావు గారి వద్ద మా అక్కగారు నేర్చుకునే సంగీత పాఠాలన్నీ నా చెవి కెక్కినవి. అలానా 12వ ఏటా ఆయన వద్దనే సంగీత శిక్షణ ప్రారంభించాను. నా కు సంగీతం నేర్పిన ఆది గురువులు బి.ఎస్. లక్ష్మణరావు. దక్షిణ భార త దేశములోని ప్రతిభాశాలురైన సంగీత విద్వాంసుల సంగీతము పదే పదే వినడంతో తం జా వూరు సంగీత బాణి అర్థం చేసుకునే అవ కాశం దొరికింది. ఆ విద్వాంసులను వినయ పూర్వకముగా అర్థించి ఎన్నో కృతులు రాసుకుని, వారి సమక్షం లో నేర్చుకున్నాను. అలా మెరుగైన దక్షిణాది సంగీతపు బాణీ అర్థం చేసుకోగలిగాను. గ్రామ్‌ఫోను రికార్డుల లో పూర్వపు, ఆధునిక ప్రసిద్ద విద్వాంసులు పాడిన కృతులు, జావళీలు, పదములు అన్నీ కంఠస్థం చేశాను. ఈ విధంగా గాత్ర సంపదను అన్ని విధాలుగా అభివృద్ది చేసుకున్నాను.
మొదటి సారిగా నేర్చుకున్న కీర్తన ? మీరు నేర్చుకునే రోజుల్లో సంగీతం ఎలా ఉండేది ?
నేను నేర్చుకున్నమొట్టమొదటి కీర్తన గజానన యనుచు సదా భజన సేయ రాదా. మొదటి కృతిలోనే నాకు స్వరకల్పన నేర్పడం ప్రారంభించారు. ఆ రోజులలో వినబడేది శాస్త్రీయ సంగీతం ఒక్కటే. సినిమాలు లేవు. మరే విధమైన సంగీతం సామాన్యుడిని చేరలేక పోయింది. దక్షిణాది సంగీత విద్యాంసుల స్వచ్చమైన బాణీ ఆంధ్ర విద్వాంసులలో కనిపించలేదు. వారు పాడే ప్రసిద్ధ కృతులలో ఉన్న విలక్షణమైన సంగీత స్వరూపము, కూర్పు, రక్తి, ఆంధ్రుల పాటలో నాకు వినబడలేదు. కృతి లోని సంపూర్ణత, రాగాలాపనలో రాగ భావపూరితమైన సంగతు లు దక్షిణాది సంగీతంలో విశేషంగా వినపడేవి. అటువంటి బాణీ ఆంధ్రదేశములోనికి దిగుమతి చేయాలన్న లక్ష్యంతో విద్వాంసులను ఆశ్రయించి నిండుగా, రాగ భావముతో పొంగిపొరలే కృతుల పాఠాంతరములను సేకరించాను. ప్రసిద్ధ గాయకుల రాగాలాపనలోని సుందర తరమైన సంగతులను స్వరపరచి, రాసుకుని వాటిని సంప్రదాయ బాణీ లో పాడుతూ ఎన్నో కచేరీలు చేశాను. నెను నేర్చుకున్న కృతులన్నింటినీ అనుస్వర, గమక సహితముగా స్వరపరచి గ్రంథ రూపముగా వెలువరించాను. 80కి పైగా కృతులను క్యాసెట్‌ల రూపంలో భద్రపరిచాను.
మీరు అందుకున్న అవార్డులు, పొందిన పురస్కారాలు?
నేను చేసిన కచేరీలకు అనేక పుర స్కారాలు, పతకాలు, అవార్డులు లభించాయి. వాటిలో అత్యంత ముఖ్యమైం ది భారత ప్రభుత్వం అందజేసిన పద్మభూషణ్. ఆ అవార్డు ప్రకటించిన రోజు కర్నూలు జిల్లా కలెక్టర్ నన్ను వా రింటికి రమ్మని కబురు పంపించారు. భారత ప్రభుత్వం ఈ సంవత్సరం మీకు పద్మభూషణ్ బిరుదునిస్తే మీరు స్వీకరిస్తారా ? అని అడి గారు. సంగీతరంగంలో నా సేవలను గుర్తిం చి భారత ప్రభుత్వమే ఇంతటి గౌరవాన్ని అందిస్తామంటే అది కళా రంగానికి వచ్చి న గుర్తింపు అన్నాను. నా సమ్మతాన్ని కలెక్టర్ కేంద్రానికి తెలి యచేయడంతో 1984 మార్చి లో అప్పటి రాష్ట్రపతి జ్ఞాని జైల్ సింగ్ నన్ను పద్మభూషణ్ బిరుదుతో సత్కరించారు. ఇది మరిచిపోలేని అనుభూతి. సంగీత కళాకా రుని గా నాకు లభించిన అరుదైన గౌరవం.
మీరు చేసిన విదేశీయాత్రలు?
భారత ప్రభుత్వం సాంస్కృతిక మార్పిడి కార్యక్రమం సందర్భంగా 1985లో అయిదు గురు కళాకారుల బృందాన్ని చైనా పర్యటనకు పంపించారు. ఆ బృందంలో నేనూ వెళ్లాను. సంగీత నాటక అకాడమీ (ఢిల్లిd) అధ్యక్షుడు నారాయణ మినన్ ఆ బృందానికి నాయక త్వం వహించారు. ఇరు దేశాల సం స్కృతిని, కళల ను అర్థం చేసుకోవడానికి ఆ యాత్ర ఎంత గా నో ఉపకరించింది.
మీరు ఏమైన గ్రంధరచనలు చేశారా ?
మనో ధర్మసంగీతం( 1992లో తెలుగు, 1995లో తమిళంలో ), 1999వెయ్యి కీర్తనలతో సంగీత సౌరభవం(తెలుగు), పల్లవి గాన సుధ, మేఘరాగమాలిక తదితర పుస్తకాలు రచించాను.
మీరు అందుకున్న పతకాలన్నీ సీతమ్మవారికి నగలు చేయించారట నిజమేనా?
నిజమే.. పద్మభూషణ్ పతకం మినహా మిగిలిన పతకాలతో భద్రాచలం సీతమ్మ వారి కి వడ్డాణం చేయించాను. భగవంతుని దయ వల్లనే నాకు సంగీత జ్ఞానం అబ్బింది. అందుకు కృతజ్ఞతగా ఈ చిన్నపని చేసాను.
ఈ రోజుల్లో సంగీతానికి ఆదరణ ఎలా ఉంది ?
నా చిన్న తనం నుంచే మన రాష్ట్రంలో నాణ్యమైన, శుద్ధమైన దక్షిణాది సంప్రదాయ సంగీతం విన బడటం లేదనే అభిప్రాయం ఉంది. దక్షిణాది సంగీత విద్వాంసులకుండే స్థాయిలో ఆదరణ తెలుగు నాడులో స్థిరనివాసం ఏర్పాటుచేసుకున్న వారికి లేదేమో అనిపించింది. ఇందుకు బలమైన కారణం లేకపోలేదు. తంజావూరు ప్రాంతంలో చిన్నా పెద్దా సంస్థానాధిపతులు సంగీత ప్రియులు కావడమూ, సంగీత త్రిమూర్తులు ఒకే యుగం లో తిరువానూరులో జన్మించి అత్యద్భుత సంగీత రచనలు సృష్టించి, శిష్య ప్రశిష్యుల ద్వారా ప్రచారం చేయడం. సంగీత నిధి తమిళనాడులో నిక్షిప్తమవ్వడానికి కారణ మైంది. దేశంలో మహారాజులు, సంస్థానాధిపతులు ఆంధ్రభాషా సాహిత్యం, కవిత్వాల మీద చూపిన శ్రద్ద సంగీతంపై చూపలేదు. మహారాజ పోషణ లేని విద్య అభివృద్ది కావడం దుర్లభం.
ఇప్పటి తరం సంగీత కళాకారులకు మీరిచ్చే సలహా?
స,రి, గ , మ, ప, ద, ని- అనే సప్త స్వరాలను సరైన గమకములతో గానం చేసే పద్దతి భారతీయ సంగీతం ప్రత్యేకత. ప్రాపంచిక సంగీత సంప్రదాయములలో మరెక్కడా ఈ పద్ధతి లేదు. గమకములతోనూ, రాగ భావాలతోనూ పాకం పట్టి స్వర కల్పన చెడకుండా పాడితే సంగీత రస ప్రదర్శనానికేమీ లోటుం డదు. స్వరగానమునకు, జతిస్వరగానమునకు, మృదంగంలో వాయించే శబ్దములకు గొప్ప సాన్నిత్యం, ఏకీభావం ఉన్నవి. మనకు రాని కృతి, నేర్పి తీరవలసిన కృతి నేర్చుకోడానికి అవకాశం లభిస్తే బద్దకించకుండా నేర్చుకొని తీరవలసిందే. కొత్తకృతి ప్రశస్తమైన వైతే సంగీత సాధకుల అదృష్ట మ. గురువు నేర్పినది ఉన్నది ఉన్నట్లుగా పాడితే రక్తిగా ఉంటుంది. ఒక వేళ నేర్చుకున్న కొత్త స్వర ర చనలో అక్కడక్కడా బాగాలేదని తేస్తే వినికిడి జ్ఞానంతోనో, ఇదివరలో చాలా కృతులు పాడిన అను భంతోనో ఆ బాగాలేని చోట్ల సరిచేసుకుని పాఠం చేయవచ్చు. దొరికిన చిట్టా ఎలాగున్నా, నేర్చుకోడానికి బద్దకించకూడదు. శ్రద్ధగా నేర్చుకుంటేనే ఏ విద్య అయినా సంపూర్ణంగా వస్తుంది. సంగీతం అంతే.. సాధన ఎక్కువగా ఉన్నప్పుడే పరిపూర్ణత సాధ్యం అవు తుంది... అంటూ తన సంగీత కళారంగ అనుభవాల్ని ఎంతో ఓపికగా వివరించారు.
సంగీత కళాశిఖామణి (చెన్నై ఫైన్ ఆర్ట్ ్స), సంగీత కళానిధి( చెన్నై, సంగీత అకాడమి), 1966లో ఎపి సంగీత నాటక అకాడమీ అవార్డు, 1982లో ఎపి సంగీత అకాడమీ ఫెలోషిప్, 1973లో టిటిడి ఆస్థాన విద్వాన్ లభించాయి. కళాప్రపూర్ణ అవార్డును అప్పటి రాష్ట్ర పతి నీలం సంజీవరెడ్డి ప్రదానంచశారు. 1977లో నేషనల్ సంగీత నాటక్ అకాడమీ అవార్డు, 1993లో గుప్త పౌండేషన్ అవార్డు, 2003లో గాడి చర్ల ఫౌండేషన్ లైఫ్‌టైమ్ అవార్డు, 2005లో డాక్టర్ జంధ్యాల దక్షిణమూర్తి ఫౌండేషన్ అవార్డు, 2008లో కళాసాగర్ అవార్డు, 1984లో సంగీత కళానిధి బిరుదు కేంద్ర సంగీత నాటక అకాడమి అవార్డు.
No comments:
Post a Comment