Monday, March 25, 2013

||సూఫీ కవిత్వం || పరిచయం

కపిల రాంకుమార్ ||సూఫీ కవిత్వం || పరిచయం
అనువాదం దీవి సుబ్బారావు

అరబ్బీ భాషలో '' సుఫ్ ' అంటే ముతకవున్ని అని అర్థంట!.
సూఫీ అంటే దానితో నేసిన బట్ట కట్టుకునేవాడు. ఆడంబరాల్కు దూరంగా
పవిత్రంగా జీవితాన్ని గడిపేవాడు. సూఫీ గూఢార్థం. అరబ్బీలో సూఫీ తత్వాన్ని
' తసవ్వుఫ్ ' అంటారు. సూఫీ కవిత్వాన్ని చదివితేనే సూఫీతత్వమూ తెలుస్తుంది.

రూమీ ఆఫ్ఘనిస్తాన్‌ లో 1207 - 1273 మధ్య పారసీ భాషలో కవిత్వం చెప్పీ సూఫీ కవుల్లో
అగ్రగణ్యుడు. ' మస్నవీ ' కావ్యం గొప్ప పేరు ప్రఖ్యాతులు ఆర్జించింది.

రబియా ఆయన కంటే చాల ముందు కాలం 710-780. ఈమె ఇరాక్ లోని బస్రా నగరానికి
చెందినది. అరబ్బీ భాషలో ఈ అమ్మ చెప్పిన కవితలు యెక్కూవగా లేవు గాని, చెప్పినంత
వరకు గొప్పవిగానే కీ్ర్తింపబడినాయి.

హఫీజ్ 14 వ శతాబ్దపు మెదట్లో ఇరాన్‌ దేశంలో పుట్టి అదే శతాబ్దం చివరిలో కాలంచేసాడు.
పారసీ లో రచనలు చే్సాడు. రూమీ అంత పేరు పొందాడు. భగవంతుని కోసం పడే ఆరాటమే,
తపనే ఆయన కవిత్వం దాన్నే ప్రతీకలుగ చెపుతాడు. ప్రేయసి భగవంతుడు. మధువు భగవంతుడి
మీద వుండే ప్రేమ. మధువు సేవించి మత్తిల్లటం అంటే భగవత్భక్తిపారవశ్యమ్లో మైమర్చివుండటం.
మధు పాత్ర హృదయానికి గుర్తు. మధువు అందించేవాడు భగవంతుడు
కావచ్చు లెదా గురువు కావచ్చు. హఫీజ్ కవిత్వాన్ని ఇలా అన్వయించుకోవాలి.

***
(1) మౌలనా జలాలుద్దిన్‌ రూమి -'' వీధిలోకి ''

ఈ వీధిలోకి
సుగంధాన్ని వెంట తీసుకురా
ఈ నదిలోకి
పట్టుపంచెలు విడిచేసిరా!

ఇక్కడి మర్గాలన్నీ అక్కడికి
దారితీస్తవిగాని
ఇక్కడికీ యెక్కణ్ణించో రావు
ఇవాళ మనం
యే ఆచ్చాదన లేకుండా
బ్రతకాల్సిన సమయమొచ్చింది!

**
(2) రబియా : ''వేరు చేయకు ''

దేవుడా! నిన్ను నేను నరకానికి భయపడి
ప్రార్థిస్తుంటే
నరకంలో పడేసి కాల్చు!

స్వర్గం మీది ఆశతో
ప్రార్థిస్తుంటే
స్వర్గం నుంచి నన్ను దూరంగా నెట్టు!

అలా కాకుండా, నిన్ను నేను నీకోసమే ప్రార్థిస్తుంటే
నీ అనంతమైన సౌందర్యాన్నుండి నన్ను వేరు చేయకు!

***

(3) హఫీజ్ - '' నిజంగా సిగ్గుచేటు ''

వైద్యుడికి దగ్గరికి వెయ్యి మైళ్ళు ప్రయాణం చేసి వెళ్ళాను
నా జబ్బేమిటో తెలుసుకుందామని
నెలలు తరబడి పరీక్షలు చేసినా అసలు కారణం దొరకలేదు

కాస్త అర్థం అయ్యేట్టు అతను చె్ప్పిందేమంటే
నా చేతికున్న ఉంగరం రాయి నీలంగా వుందని

తామంతా సవ్యంగా ఆలోచిస్తామనుకునే వాళ్ళలొ
ఇంత అజ్`నానం వుండటం నిజంగా సిగ్గుచేటు.

****
డీవి సుబ్బా రావు
143, వాసవి కాలనీ, హైదరాబాద్ 500 035
040-24035238
మొదటి ముద్రణ 2004

నవోదయ బుక్ హౌస్ , ఆర్య సమాజ్ ఎదురు వీధి
కాచిగూడ, హైదరాబాద్ -27
వెల: రు.125/-
___
25.3.2013 సాయంత్రం 5.45

No comments: