Saturday, March 23, 2013

నరబలి- సి.వి.


కపిల రాంకుమార్|| నరబలి- సి.వి. ఎనిమిదవ ముద్రణలో ప్రకాశకుల మనవి నుండి:కొంత భాగం|| ” సాంస్కృతిక విప్లవ మహాకవి
మార్క్సిస్ట్ మేథాసంపన్నుడు,
పీడితకుల జన పక్ష పాతి
నాస్తిక హేతువాద సిద్ధాంతకర్త
అనితర సాధ్యమైన రీతిలో
కవిత్వాన్నే ఖడ్గంగా మలచి
కులసర్పాన్నీ – మతరక్కసినీ
ఖండఖండాలుగా చీల్చిన
మహోన్నత శక్తి సంపన్నుడు,
విజ్ఞాన క్రాంతి దాతయిన
వర్తమాన మహాకవి సి.వి.
గూర్చి రాయబూనటం
అత్యంత సాహసోపేతమైన చర్య ”
” ఈనాడు యెవరవునన్నా, కాదన్నా
అగ్రకుల హిందూ ఉన్మాదులకు
నాలుగు వేదాలు యెంత ప్రామాణికమో
పీడిత ప్ర్రజానీకానికి
సత్యకామ జాబాలి – నరబలి
సాంస్కృతిక పునరుజ్జీవనం – ” వర్ణ వ్యవస్థ ”
అంతే ప్రామాణికాలు ”
” దిగంబర సాహిత్యానికి నీ కవిత్వం
ప్రేరణ మాత్రమే అయితే
దళిత సాహిత్యోద్యమానికి
నీ కవిత్వం వూపిరి అయ్యింది.
నీ సాహితీ వెలుగు బాటలో
దళిత సాహితీ సాంస్కృతికోద్యమం
అజరామరంగా భాసిల్లుతోంది ”
” సాంస్కృతిక విప్లవంపై నీవు సాగించిన చర్చ
పీడిత కులాలకు తాత్విక సిద్ధాంతమయింది
అవునయ్యా, అవును
మార్క్సిజాన్ని ఇండియనైజ్‌ చేయాలని
యేనాటినుండో నీవంటున్న వాస్త్వం
వర్తమాన సమకాలీన ప్రజావుద్యమాల
సంక్షోభానికి అద్దం పడుతుంది ”
కులమత విష సర్పాలు బతికున్నంత కాలం
దళితులచేతిలో నీ సాహిత్యం
ఆయుధంగా పదును తేలుతూనేవుంటుందొ!
ఓ సి.వి.మహా కవీ!
సాంస్కృతిక విప్లవ కవి!
నిజమెప్పుడు అణిగిపోదు
నీ కవితకు చావులేదు “
(పోయేదేమీ లేనోళ్ళం – కవితా సంకలనం – దళితుల చేతిలో ఆయుధం -రచం – శంబుక) నరబలి – వెలువడిన నాటినుండి నేటి వరకు, ఈ కావ్యం అశేష సామాన్య ప్రజల్లోకి దూసుకుకపోవడానికి ఆంధ్ర పాఠకుల నాలికలే అత్యంత శక్తిమంతమైన ప్రచార సాధనాలుగా పనిచేసాయి. ఈ సందర్భంగా వారిని మరో సారి మేము హృదయపూర్వకంగా అభినందిస్తున్నాము. ” నరబలి ”
ప్రాచీన భారతంలొని చార్వాకులు చేసిన ప్రళయ భీకరమైన సింహనాదం!
***
భారత దేశంలో చార్వాకులు భౌతిక వాదాన్ని క్రీ.పూ 600 లోప్రచారంలోకి తెచ్చారు. వారి సిద్ధాంతాలను తెలుసుకోటానికి ప్రధానంగా తోడ్పడే గ్రంథం ” సర్వ దర్శన సంగ్రహం ” చార్వాక సిద్ధాంత బీజాలు, ఉపనిషత్తులులో బృహస్పతి రాసిం సూక్తా ల్లోనే వున్నట్లు ” సర్వ దర్శన సంగ్రహ్ ” కర్త వర్ణించాడు. చార్వాక తాత్విక ధోరణికి యీయన మూలపురుషుడైనట్లు మహాభారతంలో
ఒక కథ వున్నది.
***
భారత యుద్ధం పరిసమాప్తమినపిమ్మట హస్తినాపుర ప్రవేశం చేస్తున్నపుడు చార్వాకుడనే బ్రాహ్మణుడు ధ్ర్మరాజుకెదురెళ్ళి ” నీ పేరు ధర్మ రాజైనా, నువ్వు చేసిందంతా అధర్మమే ” అని నిలదీయగా వేలాది జనులు ఆశ్చర్యంచెందగా, రాజభటులు అతనిని బంధించి రాక్షడుగా తీర్మానించి చంపివేయాలన్న ఒఉరీహితులుం మంత్రులు తీర్పు చెప్పిన తీర్మానం ప్రకారం ధర్మ రాజు గంగిరెద్దులా తలూపి, ఒక్కవేటుకే నరికేశారు.
***
దీనిని బట్టి, పాలకవర్గాల్లొ, సామా్న్య ప్రజల్లో ‘ చార్వాక ‘ పదం నీతికి, నిర్భీతికి, తిరుగుబాటుకి, విప్లవానికి,మార్పుకి, పర్యాయపదంగా వ్యవహరింపబడేదని అర్థం చేసుకోవచ్చును. చార్వాక సిద్ధాంత ప్రచారకుల్లో ఈ కొద్ది మంది మాత్రమే చరితకు యెక్కారు.
1. అసిత్ కేశ కంబళ్, 2. మక్కలి ఘోషాల్, 3. పూర్ణ కాశ్యప, 4. ప్రకృథ కాత్స్యాయన్‌.(పదార్థం అంతా అణువులతో కూడివిన్నదని, యీ అణువులు చలనం లేని అఖండ సుక్ష్మాంశాలని యితడు బోధించాడు. వీరే కాక నిఘంటునాథ,సంజయ, సత్యకామజాబాలి లాంటివారు కూడ భౌతిక వాదాన్ని ప్రచారంచేశారు.
** ఈ కావ్యం (నరబలి) లోని చింత నిప్పుల శెగకు తట్టుకోగలిగిన చావ, దమ్ము,ధైర్యం వుంటేనే దీన్ని తెరవండి, చదవండి. లేదా తిరుపతికి ..టికెట్ కొనుక్కండి.
–ప్రచురణ కర్తలు. ప్రగతి సాహితి సమితి, విజయవాడ, (8 వ ముద్రణ 1993 నవంబర్.)**
** మొదటి ముద్రణ 1970 డిసెంబర్
_______________________________________________
” ప్రగతి బుక్ హౌస్, మ్యూజియం రోడ్, గవర్నర్ పేట, విజయవాడ.2 ___________________________________________________
” మానవ మస్తిష్కంలో హేతువాద జ్వాలని రగిల్చి, భీకర చిత్ర హింసలకి గురిచేయబడిన బారతీయ చార్వాకులకి, దేశ దేశాల నాస్తికులకి అంకితం ”
– సి.వి.
_(చిత్తజల్లు వరవరరావు)___________________________________________________
23-03-2013 సాయంత్రం 4.35.

No comments: