కపిల రాంకుమార్ || చిత్రాన్ని చిద్రంకానీకు||
తొలి చూపులో వలపు పుట్టింది?
అది బులపాటమా, కోరికా, ప్రేమేనా?
కొన్నాళ్ళు పట్టుగా్, రస పట్టుగా
యే అడ్డంకి లేక పెళ్ళైంది!
సికార్లకి సరదాలకి
కాలం + జేబు ఖర్చు!
పరీక్షకు తట్టుకుని
ఒక నలుసు చేరి
కుటుంబం అయింది!
అసలు రంగులు
వెలవటం మొదలు!
బిడ్డ పాలకి, బలానికి మందులా
పెళ్ళానికి పూలమాలలా?
సమస్యల అంకం ప్రారంభం!
ఆగవలసిన సమయమంతా
సంయమనం పాటించడమ్లో
నిబద్ధతలు వూగిసలాడకుండా వుండాలి
లేకపోతే,
సంఫాదన చాలకనో,
సర్దుబాటు కాలేదనో,
సముదాయింపులు!
మోజు తీరిందనో,
పొరుగు రుచి తగిలందనో
అనుమానాలు!
కొద్ది కొద్దిగా
చెదల్లా మనసుల మధ్య
మనుష్యుల మధ్య
శిథిలత పెరిగి
దూరం జరగటం సాగి
సంసార వృక్షానికి
వేరుపురుగులా
తొలచడం ఆపకపోతే
మూలమే మోసానికి గురౌతుంది!
మాటమీద కోటలు
చేటలతో చెరుగుళ్ళూ
చేయెత్తడాలు
చీదరించుకోడాలు
ముక్కుచీదడాలు
అలగటాలు - చిన్నచిన్న గలాటాలు
పుట్టింటికి-మెట్టినింటికి
రాయబారుల రక పోకలు
వీలైనన్నిసార్లు సంధి సమావేశాలు!
సంధి జరిగితే సజావు కాపురమే!
సంధి తగిలితే , సందు దొరికినట్టే
విడి పడకలు దాటి విడాకులకే పీట!
సామ, దాన, బేధ, దండోపాయాలు
పద్ధతి అచ్చిరాకో, బుద్ధులు వక్రీకరణ చెందో
అంతమొందించడాలు
చట్టాన్ని చుట్టం చేసుకొని
మళ్ళీ రెండో షాట్ (వేషానికి)
రంగమెక్కి కోరినంత పొందొచ్చు
యిలా వికృత రూపం దాలుస్తున్న సంసార బంధం!
ప్రేమైనా, పెద్దలు కుదిర్చినదైనా
సంసారం తెల్లగా వున్నంతవరకే!
చల్లగా వున్నంతవరకే!
మాపు మొదలైందా
బంధాలు సమసిపోయినట్లే
యేం చేద్దామో అలోచించండి
చిద్రాలు కాకుండా కాపాడుకుందాం రండి!
14.3/2013 ఉదయం 5.30
(అకారణంగా, అలోచనలేకుండా చిద్రమౌతున్న సంసారాలను చూసి స్పందన)
No comments:
Post a Comment