Monday, March 25, 2013

\ కావ్య పరిచయం|\ కుమార సంభవం|\ నన్నె చోడుడు|\


కపిల రాంకుమార్|\ కావ్య పరిచయం|\ కుమార సంభవం|\ నన్నె చోడుడు|\

ప్రకాశక విజ్ఞప్తి:-
(ఈ కావ్యము 1909 మానేపల్లి కావ్యము శ్రీ తో పారంభించి శ్రీ తో ముగించుట. రామకృష్ణ కవి చే ప్రకటితమైనప్పుడు 7 ఆశ్వాసములు మాత్రమే. తదుపరి 1914 లొ మిగిలిన ఆశ్వాసములతో రెండవ భాగము వచ్చినది. 1915 లో ప్రొ. గురజాడ వెంకట అప్పారావు గారు మద్రాసు యూనివర్సిటి సెనేటు మీటింగుకు వచ్చినప్పుడు ఈ కావ్యప్రతి చేతికిచ్చి, దీనిని తంజావురు శరభోజి గ్రంథాలయం ప్రతితో సరిచూచి ప్రచురించవలసినదిగా కోరినారు. అయితే 1921 మొదటి ప్రపంచ సంగ్రామము వలన పూర్తిచేయలేకపోయాము. ఆఖరుకు శ్రిఫాద లక్ష్మీపతిశాస్త్రి గారిని విశాఖలొ కలసి ప్రతిని ప్రచురణ దేయకోరితిమి. వారీ పనిని రెండు నెలల్ కాల్ములో పూర్తిచేసి 1934 లో మదరాసు యూనివర్సిట్ ఉపన్యాఅసకుల్కుగా నియమితులైన వెంటనే నాకందిచ్చినారు. యెంతకు మదరాసు యూనివర్సిటివారు వెలుగులోకి తేనందున శాస్త్రిగారు వావిళ్ళ నిగంటువు సంపాదకులైన పిదప చేపట్టితఇమి. ప్రచురణకు పూర్వమే వారు గతించినారు. దీనిని రెండవ ప్రచురణ వేదము లక్ష్మీ నారాయణ శాస్త్రి గారి సహాయమున వెలువరించితిమి.)

కవి: నన్నె చోడుడు. కాశ్యప గోత్రుడగు క్షత్రియుడు. కవిరాజ శిఖామణి,టేంకణాదిత్యుడని బబిరుదములు. రాజైనను తన గ్రంథమును చారిత్రక అంశములను తెలుపకపోవుటచేత యితని కాలము  తెలుసుకొనుట వివాదమైనది.క్రీ.శ. 940 ప్రాంతము వాడని, నన్నయకు సమకాలికుడని, 1130-50 ప్రాంతము వాడని, తిక్కనకు తరువాతి వాడని 1275-1350 మొత్తానికి యీతడు 1130-50 ప్రాంతము వాడు అనునది ఆమోదయోగ్యమైనది.

కావ్యము: కుమారస్వామి పుట్టుకను, తారకాసురునిపై విజయము ఇందు మూలాంశక ఇతివృత్తము. 12 ఆశ్వాసములు, 2006 గద్య, పద్యములు.
కావ్యము శ్రీ తో ప్రాంభమై శ్రీ తో ముగుయును. ఆశ్వాసాంతమున ఐదేసి పద్యములుండును.ఇందు ప్రబంధ లక్షణములు 18. శ్లేష, ఉపమ, రూపకము మొదలగు అంకారములు,కలవు. బంధ కవిత్వము ( నాగ, చక్ర, మురజ బంధము) చతుర్విధ బంధములు, చిత్ర కవితా రీతులును కలవు. శబ్ద పుష్టి, అర్థ పుష్టి, రసవృష్టి కల కావ్యము. ఈ గ్రంథము తెనుగు భాషా సరస్వతికి కిరీటము వంటిది..

......సం.|| వావిళ్ళ వేంకటేశ్వర్లు , తండయార్ పేట, చెన్నపురి 1053..

ఇందు జాను తెనుగును ఉపయోగించిన మొదటి కవి నన్నె చోడుడు., దేశ, మార్గ పద్ధతులు, దేశీయములు చేర్చి మహాకావ్య లక్షణములను తెలిపి, ఆంద్ర వాజ్గ్మయమున ప్రత్యేఅక విశిష్టత , ప్రబంధ వాజ్మ యమునకు శ్రీకారము చుట్టినకవి రాజ శిఖామణి నన్నేచోడుడు.....ష ష్ఠ్యంత రచనను తిక్కన మొదలగు ప్రబంధకవులందరును నియతముగా అనుసరించినవారే. భాస్కర రామాయణ కర్త భాస్కరుడు, అరణ్య కాండము,దశకుమార చరిత్ర కర్త కేతన, నిర్వచోత్తర రామాయణంలో తిక్కన, కేయూర బాహు చరిత్ర కర్త మంచన, సింహాసనద్వాత్రింశిక కర్త కొరవి గోపరాజు,కావ్యాలంకారచూడామణీ కర్త విన్నకోట పెద్దన, ప్రభావతీ ప్రద్యుమ్న కర్త పింగళి సూరన్న, శబ్ద లక్షణసంగ్రహ కర్త పరవస్తు చిన్నయ సూరి ...

.సం\\ నిడదవోలు వెంకటరావు.....
__________________________________________________
చదువతగిన కావ్యము......వ్యాస విస్తరణ గమనములో వుంచుకొని సంక్షిప్తపరచితిని.
__________________________________________________
25-3-2013  ఉ .10.19

No comments: