కపిల రాంకుమార్| (జ్ఞాపకాల సోది 10 )|| సినిమా పిచ్చి!|
చిన్నప్పుడు సినిా వేషాలంటే
తెగ పిచ్చి!
ప్రాథమిక స్కూల్లో
వేసిన నాటికల మెచ్చుకోళ్ళు
హైస్కూల్ స్థాయికి ముదిరింది
దానికోసం అప్పుడేం చేసానో యిప్పుడు
గుర్తుకొచ్చినప్పుడు చచ్చేంత సిగ్గవుతోంది!
బాధ నలుపుతోంది!
చేసిన పాపం చె ప్పితే
కొంత ఉపశమనం కదా!
ఇంట్లోంచి వంద కాగితానికి
రెక్కలు పెట్టాను
యెవరికి చెప్పకుండా,
స్కూలుకు డుమ్మాకొట్టి
రైలెక్కేసాను!
రాజమండ్రి నుండి రైలెక్కి
బెజవాడ దిగాను!
ఇక్కడ చదువు సాగదని
అప్పట్లో నన్ను అక్కడవుంచారు
చదువు బాగా వస్తుందని!
బిక్కుమంటూనే రాగిణి పిక్చర్స్
కాళేశ్వరావు మార్కెట్ లో
ఎవరైనా చూస్తారేమోనని ఠక్కున దూరి,
ఓ పది రూపాయలకు ఫారoకొని పూర్తిచేసి,
స్టేషనకకు తిరిగొచ్చి,
ప్లాట్ ఫారం మీద ' హమ్మయ్య '
అని కూలబడ్డా..
అప్పుడే హీరో నైనంత సంబడంతో
ఆ సంబరం రెండు నిమిషాలే!
గ్రహచారం బావుండకపోతే.......యేదో అన్నట్లు
ఇంకోడెవడో యిల్లొదిలి పారిపోతే
ఉరుమురుమి మంగళం మీద పడ్డట్టు
అనుమానం నామీదకొచ్చి పడ్డది!
అప్పుడే వచ్చిన రైలు యెక్కుతున్నానో లేదో
యెవరో బలంగా నా జబ్బపట్ట్కు కిందకు
లాగారు - తీరా చూద్దునుకదా
రైల్వే పోలీససు - ఇక లాకప్పు
ఓ కప్పు టీ - చిన్న లాఠీ మేకప్
షరా మామూలేగా! వేరే చెప్పాలా!
***
యెంతో ప్రేమతో యింటికి తీసుకెళ్ళాడు
నా మట్టిబుర్రకి అందితేకదా
పోలీసోడి యెత్తు!
యింత తిండి పెట్టి - పడుకో
పొద్దున్నే రైలెక్కిస్తా!
అన్నాడు కదా యెంత మంచోడో అనుకున్నాను
అర్థంకాని బాల్యం కదా!
పగలంతా నిలబడి సొక్కి పోయానేమో
కుక్కి మంచంలో కూలబడ్డాను.
వల్లంతా దెబ్బలకి పులిసిందేమో నిద్రముంచింది!
**
రాత్రివేళ యేదో పక్కన చేరుతున్న
యేదో చేస్తున్ం భావన
కళ్ళు తెరిచే సరికి జరగవలసినదంతా
రాక్షసుడిలా నన్ను చెరిచిన సలపరింత
పెళ్ళాం లేని యెదవ ఆ (ప్ర)తాపమంతా
నా మీద చూపాడు! యెవరికి చెప్పలేను!
యేం జరిగిందో అప్పుడు తెలియదు!
**
బహుశ: రాక్షస రతి అంటదే కామోసు
నరకం చూపింఛాడు
వారించలేని బాలుడ్ని - బలహీనుడ్ని!
నోరెత్తలేనివాడ్ని- తెల్లవారుతుండగా
మళ్ళీ యెక్కడ మీద కొస్తాడేమో నని
స్టేషను వైపు పరుగు లంకించుకున్నాను
ఆ సంఘటన నా చదువును నాశననం చేసింది
ఒక పీడకలగా,
పెద్ద చేదు అనుభవంగా మిగిలింది
సినిమా వేషం తీరక పోయినా
నాటకాల సరదా తీరింది !!!
28.3.2013 రాత్రి. 7.57
No comments:
Post a Comment