Thursday, March 21, 2013

పారిజాతాపహరణం – నంది తిమ్మన ||***

కపిల రాంకు్మార్|| పారిజాతాపహరణం – నంది తిమ్మన ||***
(పేజి.16-17)
ఈ కావ్యమున
1-56 ” అళినీలాలక చూడనొప్పొసగె ప్రత్యాలీఢ పాదమ్ముతో”
1-48 ” వదలిన నీవి బంధముల్ వాడిన మోముల జారు కొప్పుల ”
అనే రెండు పద్యములలో రతి ప్రస్తారము వర్ణించబడినది.
” రతిశ్రమ స్వేదవినాశహేతు, ర్నవోదఖారానయసేచ హేతు:
నమారుతస్స్యాద్యది చారుగాత్రి, నమేఘకాలో మమ వల్లభ స్వాత్‌ ”
అంతే కాక
” ఏవం విధేషు ప్రియసంగమేషు, రతావసానే యదుపైతివాయు:
రతి శ్రమ స్వేదహర స్సుగంధి, స్తత: పరం కిం సుఖ మస్తి లోకే ”
మరియు
” ఉమాస్తనద్వంద్వ సమ్ర్పితానన, స్తయాసమాశ్లిష్యనిపీడితాధర:
ఖగాంబు విక్షాత చంద్ర శేఖర, స్తాంచాపి వీక్షన్‌ బహుళ స్తదా శివ:”
అని హరరి వంశములో వ్యాసుడు వర్ణించాడు కాబట్టే నంది (ముక్కు) తిమ్మన కూడ ఆవిధముగా చెప్పెనను ఉచితము కాదనిసమాధానము చెప్పనగును. కాని ఆ రెండు పద్యములు తప్ప మరెక్కడా యిట్టి రతి ప్రస్తావ లేకుండా కావ్యము రచించుట గమనించవచ్చును. పరీక్షించి చూచినచో అవియు రతి క్రీడా వర్ణనములు మాత్రము కావు. వీనిలో మొదటిది రతి ఉత్సాహ జనకమగునని, రెండవది రతి క్రీడానంతర కాలీన నారీ శరీర పరిదృశ్య్మాన లక్షణ్ములుగానే తిమ్మన వర్ణంచెను కాని కేవల రతి కృఈడా వర్ణనమెంత మాత్రము కాదు. ఇంత కంటే మరీ ఘోరమైన వర్ణనలు ఇతర కావ్యముల్లో పెక్కు ఉదాహరణ్లీయవచ్చును.
1. షసాంఖంపచ………………………3-116 …… మను చరిత్రము
2. నెలతగుత్తపు గుబ్బ…………………6-91 ………. వసు చరిత్రము
3. బెరు కెరుంగని…………………….3-38 ……….కళాపూర్ణోదయము
4. మరియు కపోలచుంబున………… ..5-44 ….ప్రభావతీ ప్రద్యుమ్నము
5. కరలతలందంద …………………..9-343 …కుమార సంభవం
6.తెమలించి కురులొయ్య …………..5-195) ఉత్తర హరింశము ..
ఇలా వెతికితే కృఢాభిరామము, శృంగార నైషిదము, రాధికాస్వాంతనము పెక్కింటిని యెత్తి చుపవచ్చును. అట్టి వర్ణనలు లేని కావ్యము ”పారిజాతాపహరణము ” అవి లేకపోవుటే గొప్ప సుగుణము.
సాధారణ్ముగా కావ్యముల్లో స్త్రీ విరహమును వ్రాయునపుడు విరహిణి చంద్ర మన్మథ మారితాద్యుపాలంభనము చేయునట్లు కవులు వర్ణిచుట పరిపాటి.
” త్రిపుర సంహార మొనరించు నపుడు హరుడు
బండిల్లుగ నీ మేను గండి జేసె
నదియు సెలవాణి తెగారవైతి చంద్ర
యకట రోహిణివలని పథ్యమునజేసి … అని మను చర్త్రము –ఆ.3
ఇట్టి ఉపాలంభములు స్వభావ విరుద్ధములై రసపుష్టికని వీనిని వ్ర్ణంచిననూ, ఓకటి రెండున్న చాలుననపeె కక్కు పద్యములు వ్రాసిన వెగటు పుటించు. ఈ కావ్యమునందు అట్టి ఉపాలంభనములకు కవి ప్రధాన్యత యీయలేదని తెలుస్తున్నది.
మరొక విశేషమేమనగా ఆంధ్ర పదములు,జాత్యములును, లోక వ్యవహార సిద్ధమిలైన తద్దయు, నుద్దులు కురియుచుండును. ఔలెమ్ము, అమ్మా యేమని చెప్పుదు, యెంతకులాడు, ముల్లోకమదానయేలుగతి , కన్నులు కప్పుకొనంగ,వారు ననుందలలె త్తిచూడగా, సన్నలజాయలంబలుకసైతున\e, ప్రాణ్ములేంత తీపొకొ, ఇంతగా నోచితి, పూసల్లో దారంబు మాడ్కి, అనగి పెనగి, కలసి మెలసి, కూడడిమాడి, దీని చంద మొక్యించుక చూచెద, లలలుకులదేనెలుట్టిపడ, కల్లదనంబు…….యెట్టియో మధురసములగు జాతీయములున్న ” పారిజాతాపహరణము” అందిర్ మనసులను చూరగొనును.
—————————————————
***శృంగార వర్ణనలో తనదైన ఔచిత్యము – శ్రీ నాగపూడి కుప్పుస్వామి వ్యాఖ్యానం||
అంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ 1978 ప్రథమ ముద్రణ రు. 15.00
—————————————————————-
మరొక మారు మరొక కావ్యము గురించి.
21.3.2013 సా. 6.08

No comments: