Saturday, March 23, 2013

| కవితాబద్ధ హెచ్చరిక||

కపిల రాంకుమార్|| కవితాబద్ధ హెచ్చరిక||

పచ్చని సంసారాల్లో పచ్చకర్పూరం ఆహ్లాదమే
పచ్చ భాస్వరంతోనే ప్రమాదం!
నిప్పులు పోసేవాళ్ళు,
అప్పుడు, ఇప్పుడు, యెప్పుడు వుంటారు!
మేడిపండు మాదిరి వూరిస్తూ
పురుగులు పుట్టిస్తారు!
పచ్చని చెట్టు వాడకముందే
అప్రమత్తంగా ఉందాం!
రకరకాల పుష్పాలని, ఫలాలని అందిస్తుంటే
రుచులు ఆస్వాదించినవాళ్ళే కుళ్ళుకుంటూ
రాజకీయంచేయచూస్తుంటారు!
చాప కింద నీరులా ఆక్రమించ చూస్తుంటారు!
ప్రలోభాలు పెట్టి, ప్రమాదాలూ సృష్టిస్తుంటారు!

ఇక్కడ బావుకునేదేముందంటూ
అక్కడ బావురుమనిపిస్తుంటారు!
నివురుగప్పిన నిప్పులా చివుళ్ళు మాడ్చేస్తారు!

మనలో కట్టుబాటు, నిబద్ధత,నిమగ్నత
సడలనంత కాలం కవిసంగమాన్ని
యెవరూ విచ్చిన్నంచేయలేరు!
స్నేహం ముసుగులో
గూఢచర్యం కావిస్తూ
నిగూఢ వ్యాఖ్యానంచేస్తుంతారు!
అవసరాలకు వాడుకుంటూనే
అపసవ్యం చేయచూస్తారు!
మనలో మనకి చీలికలు, పోలికలు పెట్టి
రెండునాల్కల ధోరణితో
పీలికలనుచేయాలని చూస్తారు!

అసలే ఇది వేసవి - వడగాలి సోకకుండా
కవితమృతాన్ని నిత్యం క్షాళన చేస్తూ
వడగట్టుకుంటు ఆస్వాదిస్తూ
ప్రత్యక్ష, పరోక్ష పన్నాగుల కోరలు పీకి
మన పచ్చని కవిత వృక్షాన్ని
కాపాడుకుందా!
కవిత్వం కావాలి - నిత్య నూతన మానవత్వం!

(కవి క్రాంత దర్శకుడు - వాతావరణ హెచ్చరిక యిది)

16-3-2013 సాయంత్రం 2.25.
"

No comments: