Thursday, March 14, 2013

'' ఎర్రెర్ర దండాలు ''

కపిల రాంకుమార్ ||'' ఎర్రెర్ర దండాలు ''||

బడుగు రాజ్యాల బెదిరించు
' అ.స.రా ' కట్టడులనెదిరించి
తనదైన రీతిలో పోరుసాగించి
జనావళి గుండెలో స్థిరపడి
సామ్రాజ్యవాదుల నిదుర దోచి
పంచదార గిన్నెకాప్తుడై నిలచి
లాటినమెరికా బలాన్ని పెంచి
పతనమైపోయిందని చంకగుద్దుకునే వాళ్ళ
కళ్ళు కుట్టేలా బొలివేరియన్ స్ఫూర్తితో
మార్క్సిజమజేయమని చాటి
ఒకసారి మరణాన్ని పరామర్శించి
సంక్షేమ నాయకునిగా పీఠమెక్కేలోగ 
మహమ్మారి రాచపుండు మన రాజునే బలిగొనె
చరితలోన ధృవతార - ఇంకెవ్వడు?
సామ్యవాద అగ్ని శిఖ!
ైతన్య పతాక!
ప్రత్యామ్నాయ శక్తుల ఆశాజ్యోతి!
తలబడి, నిలబడిన ఎర్రెర్రని కుర్రాడు!
వీరుడా, శూరుడా - చావేజ్ నీకివే 
ఎర్రెర్ర దండాలు!

No comments: